Arunachala Aksharamanamalai in Telugu

Arunachala Aksharamanamalai in Telugu Visit www.stotraveda.com
Arunachala Aksharamanamalai in Telugu

Arunachala Aksharamanamalai in Telugu with Meaning Pdf:

శ్రీ అరుణాచల అక్షర మణమాల-Arunachala Aksharamanamalai in Telugu

Check Also Arunachala Aksharamanamalai in English Click here 

భగవాన్ శ్రీ రమణ మహర్షి శ్రీ సుబ్రమణ్యస్యామి అవతారము. కలియుగ మానవులకు సనాతన మహర్షుల జ్ఞాన మార్గమును వ్యక్తము చేయడానికి మహాదేవుడైన, భోళాశంకరుడి తనయుడైన కుమారస్వామి మానవ రూపాన్ని ధరించిన దివ్య తేజోమయ సుందర మూర్తియే భగవాన్ శ్రీ రమణ మహర్షి. భగవాన్ శ్రీ రమణ మహర్షి వారి మార్గము జ్ఞాన మార్గము. “నీవెవరో విచారించు” అన్నదే మహర్షి వారి సందేశం. 16 సంవత్సరాల వయస్సులో అరుణాచలేశ్వరుని దివ్య సన్నిధిలో శివసాక్షత్కారము పొందిన మహనీయుడు భగవాన్ శ్రీ రమణ మహర్షి వారు. శ్రీ మహర్షి వారు ప్రపంచ వ్యాప్తముగా ఎంతోమంది తనను ఆశ్రయించిన శిష్యులను సత్య జ్ఞాన మార్గములో నడిపించారు.

బ్రహ్మజ్ఞాన సాధకులకు బ్రహ్మజ్ఞాన ప్రాప్తికై, శివసాక్షాత్కార మహా ప్రాప్తికై భగవాన్ శ్రీ రమణ మహర్షి వారు అనుగ్రహించిన మహాప్రసాదం “అరుణాచల అక్షరమణ మాల”. ఎన్నో సంవత్సరాలుమౌనం వహించి నిర్వికల్ప సమాధిలో విజయాన్ని సాధించి, తన హృదయాంతరంగాన్ని, పరమశివుడిపై గల అనురాగాన్ని, దివ్య ప్రేమ విరహాన్ని భగవాన్ శ్రీ రమణమహర్షి వారు 108 ద్విపద పద్యాలలో విరచించిన అపురూప రచనయే “అరుణాచల అక్షరమణ మాల”.

భగవంతుడిపై పై తనకున్న అనురాగాన్ని, దివ్యప్రేమ ప్రదర్శనను చూపడమే నిజమైన భక్తుడి లక్షణం. భగవాన్ శ్రీ రమణ మహర్షి నిర్వికల్పసమాధిలో నిరంతరం అరుణాచల శివుడితో సాంగత్యాన్ని కలిగిఉన్న మహితాత్ముడు. ఏ విధముగా ఒక పూలదండను వరుడి మెడలో వధువు సమర్పిస్తుందో ఆ విధముగా రమణ మహర్షి వారు ఆ పరమశివుడిపై తనకు గల ప్రేమానురాగాలను, పరితాపాన్ని దివ్య ప్రేమ విరహాన్ని 108 ద్విపదపద్యాలలో రచించి సమర్పించిన ప్రేమమాల “అరుణాచల అక్షరమణమాల”.

దివ్యానుభూతి పొందిన సిద్ధగురువు యొక్క హృదయము మరియు వారి బోధలు మరొక సిద్ధగురువుకే అవగతమవుతాయి. వారు మాత్రమే ఆ సిద్ధగురు బోధలను యధాతధముగా లోకానికి అందించగలరు. అటువంటి మహితాత్ముడైన సిద్ధగురువే శ్రీ రమణానంద మహర్షి వారు. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు రమణ మహర్షి వారు రచించిన అరుణాచల అక్షరమణమాల పద్యాలలోని మహర్షి వారి ఆంతర్యాన్ని సులభముగా అర్ధమయ్యే విధముగా దేశ విదేశాలలో లక్షలాదిమంది భక్తులకు తన ప్రవచనాల ద్వారా అందించారు. రమణ మహర్షి వారికి అరుణాచలశివుడి పై గల ప్రేమానురాగాలు, దివ్యప్రేమ విరహము మరియు ఎన్నో రహస్యాలు ఈ ప్రవచనాలద్వారా తెలుస్తాయి.

అరుణాచల అక్షర మణమాల తమిళంలో:

తరుణారుణమణి కిరణావలినిహర్‍ , తరుమా క్షరమణ మహిళ్-మాలై
తెరుణాటియతిరు వటియార్‍ తెరుమరళ్‍, తెళియాప్పరవుటల్‍ పొరుళాహ

కరుణాకరముని రమణారియనువ, హైయినార్‍ సొలియటు గతియాహ
అరుణాచలమెన అహమేయఱివొట్, మళ్వార్‍ శివనుళహాల్‍వరే

అరుణాచలవరర్‍క్కేఱ్ఱ్ర అక్షరమణమాలై శాఱ్ఱ్ర
కరుణాకర గణపతియే కరమరుళిక్కాప్పాయే

అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల!
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల!

1. అరుణాచల మెన అకమే నినైప్పవర్‍,
అహతై వేరఱుప్పాయ్ అరుణాచల

2. అళకు సున్దరం పోల్‍ అకముం నీయుము-
ఱ్ఱ్రభిన్నమాయ్ ఇరుప్పోం అరుణాచల

3. అహం పుకున్తీర్‍త్తున్‍ అకగుకై శిఱయాయ్
అమర్‍విత్తతెన్‍ కొళ్‍ అరుణాచల

4. ఆరుక్కా ఎనై ఆణ్టెనై అకఱ్ఱిటిల్‍
అకిలం పళిత్తిటుం అరుణాచల

5. ఇప్పళి తప్పునై ఏన్‍ నినైప్పిత్తాయ్
ఇనియార్‍ విటువార్‍ అరుణాచల

6. ఈన్ఱిటుం అన్నయిర్‍ పెరితరుళ్‍ పురివోయ్,
ఇతువొ ఉనతరుళ్‍ అరుణాచల

7. ఉనయే మాఱ్ఱ్రి ఓటాతుళత్తిన్మేల్‍ ఉఱుతియాయ్
ఇరుప్పాయ్ అరుణాచల

8. ఊర్‍ శుఱ్ఱ్రుళం విటాతునైక్కణ్టటఙ్కిట
ఉన్నళకైక్కాట్టరుణాచల

9. ఎనెయళిత్తిప్పోతెనైక్కలవావిటిల్‍
ఇతువో ఆణ్‍మై అరుణాచల

10. ఏనిన్త ఉఱక్కం ఎనైప్పిఱరిళుక్క
ఇతువునక్కళకో అరుణాచల

11. ఐమ్పులక్కళ్‍వర్‍ అకత్తినిల్‍ పుకుమ్పో
తకత్తిల్‍ నీ ఇల్లయో అరుణాచల

12. ఒరువనాం ఉన్నై ఒళిత్తెవర్‍ వరువార్‍
ఉన్‍ శూతేయిత్ అరుణాచల

అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల!
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల!

13. ఓఙ్కారప్పొరుళ్‍ ఒప్పుయర్‍విల్లోయ్
ఉనైయారఱివార్‍ అరుణాచల

14. ఔవ్వైపోల్‍ ఎనక్క్ ఉన్‍ అరుళై తన్తెనై
ఆళువతున్‍ కటన్‍ అరుణాచల

15. కణ్ణుక్కు కణ్ణాయ్ కణ్ణిన్‍డ్రి కాణునై
కాణువతెవర్‍ పార్‍ అరుణాచల

16. కాన్తమిరుమ్పుపోల్‍ కవర్‍న్తెనై విటామల్‍
కలన్తెనోటిరుప్పాయ్ అరుణాచల

17. గిరివురువాకియ కిఱుపైక్కటలే (కృపైక్కటలే)
కృపైకూర్‍న్తరుళువాయ్ అరుణాచల

18. కీళ్మేలెఙ్కుం కిళరొళిమణియెన్‍
కీళ్మెయెయ్ పాళ్ శెయ్యరుణాచల

19. కుఱ్ఱ్రముఱ్ఱ్రఱుత్తెనై గుణమాయ్ పణిత్తాళ్‍
గురువురువాయొళిర్‍ అరునాచాల

20. కూర్‍వాట్ కణ్ణియర్‍ కొటుమయిల్‍ పటాతరుళ్‍
కూర్‍న్తెనై శేర్‍న్తరుళ్‍ అరుణాచల

21. కెఞ్చియుం వఞ్చియాయ్ కొఞ్చముం ఇఱన్‍కిలై
అఞ్చలెన్‍డ్రేయరుళ్‍ అరుణాచల

22. కేళాతళిక్కుమున్‍ కేటిల్‍ పుకళై
కేటుశెయ్యాతరుళ్‍ అరుణాచల

23. కయ్యినిర్‍ కనియున్‍ మెయ్రసం కొణ్టు (ఉ)
వగై వెఱికొళవరుళ్‍ అరుణాచల

24. కొటియిట్టటియరై కొల్లునైక్కట్టి
కొణ్టెన్‍కన్‍ వాళే്వన్‍ అరుణాచల

అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల!
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల!

25. కోపమిల్‍ గుణత్తోయ్ కుఱియాయెనైక్కొళ
కుఱయెన్‍ శెయ్తేన్‍ అరుణాచల

26. గౌతమర్‍ పోఱ్ఱ్రుం కరుణైమా మలైయే
కటైక్కణిత్తాళ్‍వాయరుణాచల

27. సకలముం విళుఙ్కుం కతిరొళియినమన
జలజమలర్‍త్తీటరుణాచల

28. శాప్పాటున్నై శార్‍న్తుణవాయాన్‍
శాన్తమాయ్ప్పోవెన్నరుణాచాల

29. చిత్తం కుళిర కతిర్‍ అస్తంవైతత్తముతవా
యైత్తిఱ అరుళ్‍మతియరుణాచల

30. శీఱైయళిత్త్ నిర్‍వాణమాయ్ శెయ్తరుళ్‍
శీఱైయళిత్తరుళ్‍ అరుణాచల

31. సుఖక్కటల్‍ పొఙ్క చొల్లుణర్‍వటఙ్క
చుమ్మాపొరున్తిటన్‍గరుణాచల

32. శూతుశెయ్ తెన్నై శోదియాదినియున్‍
జోతియురుక్కాట్టరుణాచల

33. చెప్పటి విద్ధైక్కట్రిప్పటి మయక్కువి
ట్టురుప్పటు విద్ధైక్కాట్టరుణాచల

34. శేరాయెనిన్‍మెయ్ నీరాయురుకి
కణ్ణీరాఱ్ఱ్రళివేన్‍ అరుణాచల

35. చైయ్యనత్తళ్ళిర్‍ చెయ్వినై శుటుమలాల్‍
ఉయ్వగై ఏతుఱై అరుణాచల

36. చొల్లాతు చొల్లి నీ చొల్లఱ నిల్లెన్‍డ్రు
చుమ్మావిరున్తాయ్ అరుణాచల

అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల!
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల!

37. శోమ్పియాయ్ చుమ్మా సుఖముణ్టుఱఙ్కిటిల్‍
చొల్‍ వేఱెన్‍ గతి అరుణాచల

38. శౌరియం కాట్టినై శళక్కఱ్ఱ్రతెన్‍డ్రే
చలియాతిరున్తాయ్ అరుణాచల

39. ఞమలియిర్‍ కేటా నానెన్నుఱుతియాల్‍
నాటినిన్నుఱువేన్‍ అరుణాచల

40. ఞానమిల్లాతువున్‍ ఆసయాల్‍ తళర్‍వఱ
జ్ఞానం తెఱిత్తరుళ్‍ అరుణాచల

41. తత్తువం తెరియాతత్తనైయుఱ్ఱ్రాయ్
తత్తువం ఇతువెన్‍ అరుణాచల

42. తానే తానే తతువం ఇతనై
తానే కాట్టువాయ్ అరుణాచల

43. తిరుమ్పి అహంతనై దినమక కణ్‍కాణ్‍
తెరియుమెన్‍డ్రనైనెన్‍ అరుణాచల

44. ధీరమిల్లకత్తిల్‍ తేటియున్తనయాన్‍
తిరుమ్పవుఱ్ఱ్రేన్‍ అరుళ్‍ అరుణాచల

45. తుప్పఱివిల్లాతిప్పిఱప్పెన్‍ పయన్‍
ఒప్పిట వాయేన్‍ అరుణాచల

46. తూయ్ మన మొళియర్‍ తోయుమున్‍ మెయ్ అకం
తోయవేయరుళెన్‍ అరుణాచల

47. దైవమెన్‌డ్రున్నై చారవేయెన్నై
చేరయొళిత్తాయ్ అరుణాచల

48. తేటాతుఱ్ఱ్రనల్‍ తిరువరుళ్‍ నిధియక
తియక్కం తీర్‍త్తరుళ్‍ అరుణాచల

అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల!
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల!

49. ధైరియమోటుమున్‍ మెయ్యకనాటయాన్‍
తట్టళిన్తేన్‍ అరుళ్‍ అరుణాచల

50. తొట్టరుళ్‍ కైమెయ్ కట్టిటాయెనిలియాన్‍
నష్టమావేనరుళ్‍ అరుణాచల

51. తోటమిల్‍ నీయకతోటొన్‍డ్రి యెన్‍డ్రూం
సన్తోటమొన్‍డ్రిటవరుళ్‍ అరుణాచల

52. నకైక్కిట మిలైనిన్‍ నాటియయెనై అరుళ్‍
నకైయిట్టూపార్‍ నీ అరుణాచల

53. నాణిలై నాటిట నానాయొన్‌డ్రిని
స్తాణువాయ్ నిన్‍డ్రెనై అరుణాచల

54. నిన్నెరి ఎరిత్తెనై నీరాక్కిటుమున్‍
నిన్నరుళ్‍ మళైపొళి అరుణాచల

55. నీ నానఱప్పులి నితఙ్కళిమయమాయ్
నిన్‌డ్రిటుం నిలైయరుళ్‍ అరుణాచల

56. నున్నుఱువుణైయాన్‍ విణ్ణుఱునణ్ణిట
ఎణ్ణలై ఇరుమెన్‌డ్రరుణాచల

57. నూలఱివఱియా పేదయనెన్‌డ్రన్‍
మాలఱివఱుత్తరుళ్‍ అరుణాచల

58. నెక్కునెక్కురుకియాన్‍ పూక్కిట ఉనై పుగ
నక్కనా నిన్‌డ్రనై అరుణాచల

59. నేసమిల్‍ ఎనక్కు ఉన్‍ ఆసయైక్కాట్టి
నీ మోసం చెయ్యాతరుళ్‍ అరుణాచల

60. నైన్తళిక్కనియా నలనిలై పదత్తిల్‍
నాటియుత్ కొళ్‍ నలం అరుణాచల

అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల!
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల!

61. నొన్తిటాతున్తనై తన్తెనైకొణ్టిలై
అన్తకన్‍ నియెనరుణాచాల

62. నోక్కియేక్కరుతిమెయ్ తాక్కియే పక్కువ
మాక్కి నీ ఆణ్టరుళ్‍ అరుణాచల

63. పఱ్ఱ్రిమాల్‍ విటన్తలై ఉఱ్ఱ్రిటుమునమరుళ్‍
పఱ్ఱ్రిట అరుళ్‍ పురి అరుణాచల

64. పార్‍త్తరుళ్‍ మాలఱ పార్‍త్తిలైయెనినరుళ్‍
పారునక్కార్‍ శొల్‍వర్‍ అరుణాచల

65. పిత్తువిట్టునై నేర్‍ పిత్తనాక్కినైయరుళ్‍
పిత్తం తెళిమరున్తరుణాచల

66. భీతియిల్‍ ఉనైశార్‍ భీతియిలెనైశేర్‍
భీతియు‍డ్రెనక్కేన్‍ అరుణాచల

67. పుల్లఱివేతుఱై నల్లఱివేతుఱై
పుల్లిటవేయరుళ్‍ అరుణాచల

68. పూమణమామనం పూరణమనం కొళ
పూరణమణమరుళ్‍ అరుణాచల

69. పెయర్‍నినైత్తిటవే పిటిత్తిళుత్తనెయున్‍
పెరుమై యారఱివార్‍ అరుణాచల

70. పేయ్త్తనం విట విటాపేయాయ్ పిటిత్తెనై
పేయనాక్కినెయెన్‍ అరుణాచల

71. పైఙ్కొటియానాన్‍ పఱ్ఱ్రిన్‌డ్రి వాటామల్‍
పఱ్ఱ్రుక్కొటాయ్క్కావరుణాచల

72. పొటియాన్‍ మయక్కి యెన్‍ బోధత్తైప్పఱిత్త్
ఉన్‍ బోధత్తైక్కాట్టినై అరుణాచల

అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల!
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల!

73. పోక్కుంవరవుమిల్‍ పొతువెళియినిల్‍ అరుళ్‍
పోరాట్టం కాట్టరుణాచల

74. భౌతికమాముటల్‍ పఱ్ఱ్రఱ్ఱ్రూనాళుమున్‍
భవిశుకణ్టుఱవరుళ్‍ అరుణాచల

75. మలైమఱున్తిటని మలైత్తిటవోవరుళ్‍
మలైమఱున్తాయొళిర్‍ అరుణాచల

76. మానంకొణ్టుఱుపవర్‍ మానత్తైయళి
త్తభిమానమిల్లాతొళిర్‍ అరుణాచల

77. మిఞ్చిటిల్‍ కెఞ్చిటున్‍ కొఞ్చవఱివనియాన్‍
వఞ్చియాతరుళెనై అరుణాచల

78. మీకామనిల్లామన్‍ మాకాఱ్ఱ్రాలైకలం
ఆకామల్‍ కాత్తరుళ్‍ అరుణాచల

79. ముటియటికాణా ముటివిటుత్తనైనేర్‍
ముటివిట కటనిలై అరుణాచల

80. మూక్కిలన్‍ మున్‍కాట్టు ముకురమాకాతెనై
తూక్కియణైన్తరుళ్‍ అరుణాచల

81. మెయ్యకత్తిన్మనమెన్మలరణయిల్‍ నాం
మెయ్ కలన్తిటవరుళ్‍ అరుణాచల

82. మేన్మేల్‍ తాళ్న్తిటుం మెల్లియర్‍ చేర్‍న్తునీ
మేన్మయుఱ్ఱ్రానైయెన్‍ అరుణాచల

83. మైమయనీత్తరుళ్‍ మైయ్యినాలునతుణ్‍
మైవసమాక్కినేన్‍ అరుణాచల

84. మొట్టయటిత్తెనై వెట్టవెళియినీ
నట్టమాటినైయెన్‍ అరుణాచల

అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల!
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల!

85. మోకంతవిర్‍త్తున్‍ మోకమా వైత్తుమెన్‍
మోకంతీరాయెన్‍ అరుణాచల

86. మౌనియాయ్ కల్‍ పోల్‍ మలరాతిరున్తాల్‍
మౌనమితామో అరుణాచల

87. యెవనెన్‍ వాయిల్‍ మణ్ణినైయఱ్ఱ్రి
ఎన్‍పిళైపొళిత్తతరుణాచల

88. యారుమఱియాతెన్‍ మతియినై మరుట్టి
యెవర్‍ కొళై కొణ్టతరుణాచల

89. రమణనెన్‍ ఱురైత్తేన్‍ రోషం కొళ్ళతెనై
రమిత్తిట చెయ్యవా అరుణాచల

90. రాప్పకలిల్లా వెఱువెళివీట్టిల్‍
రమిత్తిటువోం వా అరుణాచల

91. లక్షియం వైత్తరుళస్తిరం విట్టెనై
భక్షిత్తాయ్ ప్రాణనోటరుణాచల

92. లాభనీయిహపర లాభమిలెనైయుఱ్ఱ్రు
లాభమెన్నుఱ్ఱ్రనై అరుణాచల

93. వరుంపటి శొల్లిలై వన్తెన్‍పటియళ
వరున్తిటుం తలైవిధియరుణాచల

94. వావెన్ఱ్రకంపుక్కున్‍ వాళ్వరుళన్‍ఱేయెన్‍
వాళ్విళన్తేనరుళరుణాచల

95. విట్టిటిల్‍ కష్టమాం విట్టిటాతునైయుయిర్‍
విట్టిట అరుళ్‍పురియరుణాచల

96. వీటువిట్టీర్‍త్తుళ వీటుపుక్కుప్పైయ్యవున్‍
వీటుకాట్టినైయరుళ్‍ అరుణాచల

అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల!
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల!

97. వెళివిట్టేనున్‍ శెయల్‍ వెఱుత్తిటాతున్నరుళ్‍
వెళివిట్టెనైక్కా అరుణాచల

98. వేదాన్తత్తై వేరఱవిళఙ్కుం
వేదప్పొరుళరుళ్‍ అరుణాచల

99. వైతలై వాళ్త్తా వైత్తరుళ్‍ కుటియా
వైత్తెనై విటాతరుళ్‍ అరుణాచల

100. అమ్పువిలాళిపోల్‍ అన్‍పురువునిలెనై
అన్‍పా కరైత్తరుళ్‍ అరుణాచల

101. అరుణయెన్ఱణ్ణయాన్‍ అరుళ్‍ కణ్ణిపట్టేనున్‍
అరుళ్‍వలై తప్పుమో అరుణాచల

102. చిన్తిత్తరుళ్‍పట చిలన్తిపోల్‍ కట్టి
చిఱయిట్టుణ్‍ణ్టనై అరుణాచల

103. చిన్తిత్తరుళ్‍పట చిలన్తిపోల్‍ కట్టి
చిఱయిట్టుణ్‍ణ్టనై అరుణాచల

104. అన్‍పోటున్‍ నామం కేళ్‍ అన్‍పర్‍తం అన్‍పర్
క్కన్‍పనాయిటవరుళ్‍ అరుణాచల

105. ఎన్‍పోలుం దీనరై ఇన్‍పుఱ కాత్తునీ
ఎన్నాళుం వాళ్న్తరుళ్‍ అరుణాచల

106. ఎన్‍పురుక్కన్‍పర్‍తం ఇన్‍శొర్‍కొళ్‍
శెవియుమెన్‍ పున్మొళి కొళవరుళరుణాచల

107. పొరుమయాం భూతర పున్‍శొలై నన్‍శొలా
పొరుత్తరుళిష్టం పిన్నరుణాచల

108. మాలయళిత్తరుణాచల రమణవెన్‍
మాలయణిన్తరుళ్‍ అరుణాచల

అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల!
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల!

అరుణాచల అక్షర మణమాల తెలుగులో భావముతో:

అరుణాచల అక్షరమణమాల

అరుణాచలశివ-అరుణాచలశివ-అరుణాచలశివ-అరుణాచలా!
అరుణాచలశివ-అరుణాచలశివ-అరుణాచలశివ-అరుణాచలా!

శ్లోకము 1:

అరుణాచలమనుచు స్మరియించిన వారల యహము నిర్మూలింపుమరునాచలా!

భావము:

అరుణాచలమును తమ అంతరంగమున స్మరించు భక్తుల అహంకారమును వేర్లతోసహా పెళ్ళగించి నాశనముచేయుము అరుణాచలా!

శ్లోకము 2:
అళగు సుందరముల వలే చేరి నేను నీవు అభిన్నమై వుందామరుణాచలా

భావము:

అందము,సుందరము అను పదములు వేరైనా అర్థము ఒకటి అగునట్లు, నీవు నేను అన్న ఉపాధులు వేరుగాతోచినా పరమార్ధము ఒకటే అరుణాచలా!

శ్లోకము.3:
లో దూరి లాగి నీ లోగుహను చేరగా అనుసరించి తేముకో అరుణాచలా

భావము:

నా మనసు అను ఇంటిలో దూరి, నన్ను బలవంతంగా లాగి నీ హృదయమను ఇంటిలో ప్రేమతోబంధించినావు. నీ చిత్రమైన అనుగ్రహమును ఏమని చెప్పుదును అరుణాచలా

శ్లోకము.4:
ఎవరివిగా నన్ను యేలితివి,విడిచిన అఖిలము నిందించు అరుణాచలా
ఎవరికొరకు నీవు నన్ను ఏలుకొంటివి.

భావము:

ఏలుకున్న నీవే ఇప్పుడు నన్ను వదలి వేసిన లోకము నిన్ను నిందించును కదా అరుణాచలా

శ్లోకము.5:
ఈ నింద తప్పు నిన్నేటికి దలపించి తిక వీడు వారేవరురా అరుణాచలా!

భావము:

అకారణమైనటువంటి ఈ నింద నుండి నిన్ను నువ్వు కాపాడుకో ! నిన్నే స్మరించునట్లు నన్ను ఎందుకు చేశావు? ఇక నిన్ను వదిలిదెలా అరుణాచలా?

శ్లోకము.6:
కనిన జనని కన్నా ఘనదయదాయక ఇదియా అనుగ్రహం అరుణాచలా?

భావము:

కని పెంచు తల్లి ప్రేమ కన్నా మిన్నగా భక్తులను ఆదరముతో అనుగ్రహించుచున్నావే ! నీ అనుగ్రహము యొక్కగొప్పతనము ఇదియా
అరుణాచలా?

శ్లోకము.7:
నిన్నే మార్చి యరుగనిక యుల్లము పైని ఉఱుదిగా ఉండుమా అరుణాచలా!

భావము:

ప్రాణనాధుడైన నిన్ను ఏమార్చి విషయముల వెంట పరుగెత్తకుండా ఉండేటట్లు చలింపకుండా నా మనసుననీవు దృఢముగా ఉండుము అరుణాచలా!

శ్లోకము.8:
ఊరూరు తిరుగక ఉల్లము నిను గన అణగని ధృతి జూపు ఘన అరుణాచలా!

భావము:
ప్రపంచమును పట్టుకొని తిరుగు నా మనసుకు నీ సుందరమగు స్వరూపమును చూపి, అందే నా మనస్సును అణగివుండునట్లు అనుగ్రహింపుము అరుణాచలా!

శ్లోకము.9:
నన్ను చెఱచి ఇప్పుడు నన్ను నను గలియక వీడు టిది మగతనమొక్కో అరుణాచలా!

భావము:
పక్వమైన నా అహంకారమును ఇప్పుడే నాశనము చేసి , అభిన్నమైన నాతో కలవకుండా ఉండడం పురుషోత్తముడవైన నీ పౌరుషము ఇదేనా అరుణాచలా!

శ్లోకము.10:
ఏటికి నిదుర నన్నితరులు లాగగ ఇది నీకు న్యాయమా అరుణాచలా!

భావము:
నీకే అర్పితమైన నన్ను పరులు లాక్కుని పోవుచుండగా చూసి కూడా నిదురించినట్లు ఉండుట నీకు న్యాయమా! అరుణాచలా!అరుణాచల అక్షరమణమాల అరుణాచలశివ-అరుణాచలశివ-అరుణాచలశివ-అరుణాచలా!

శ్లోకము 11:
పంచేంద్రియఖలులు మదిలోన దూరుచో
మదిని నీవు ఉండవో అరుణాచలా!

భావము:
పంచేంద్రియములు అనే దొంగలు నా హృదయమున దూరినప్పుడు , అండగా నా హృదయమునందు నీవు ఉండవోఅరుణాచలా

శ్లోకము 12:
ఒకడవౌ నిను మాయ మొనరించి వచ్చు వారెవరిది నీ జాలము అరుణాచలా!

భావము:
ఒక్కడివై ఏకాత్మగా ఉన్న నిన్ను మరుగు పరచగల వారెవరు? ఇది అంతా నీ మాయయే కదా అరుణాచలా

శ్లోకము 13:
ఓంకార వాక్యార్ధ ఉత్తమ సమహీన నిన్నెవ రెరుగువారు అరుణాచలా!

భావము:
ఓంకార తత్వమైన నీకు సమము ఎవ్వరూ లేనివాడవై ఉన్నటువంటి నిన్నెవరు తెలుసుకోగలరు ? ఓ అరుణాచలా!

శ్లోకము 14:
అవ్వ బోలె యొసఁగి నాకు నీ కరుణ నన్నేలుట నీ భారము అరుణాచలా!

భావము:
అవ్వయ్యార్ (తమిళ భక్తురాలు 63 మంది నాయనార్ల లో ఒకరు )వలె నిన్ను ఆశ్రయించిన నన్ను ఏలుకొనుట నీ భారమేకదా అరుణాచలా!

శ్లోకము 15:
కన్నుకు గన్నయి కన్ను లేక నిను కనువారెవరు గను ము ఆరుణాచలా!

భావము:
కంటికి వెలుగైన కన్నువై నా కన్నుకు కన్నువై , కన్నులేకనే సకలము చూడగలిగిన నిన్ను చూడగలవారెవరు ?  నన్ను నీ కంటితో కనిపెట్టుకొనిచూడుము ఆరుణాచలా !

శ్లోకము 16:
ఇనుము అయస్కాంతము వలే గవిసి నను విడువక కలసి నాతో నుండుము అరుణాచలా!

భావము:
అయస్కాంతము ఇనుమును ఆకర్షించినట్లు ,నన్ను నీవు విడువక నాతో ఏకమై ఉండుము అరుణాచలా!

శ్లోకము 17:
గిరి రూపమైనట్టి కరుణ సముద్రమా కృప చేసి నన్నేలు మరుణాచలా!

భావము:
గిరి రూపములో ఉన్న ఓ కరుణాసముద్రమా, కృపతో నన్ను ఏలుకొనుము అరుణాచలా!

శ్లోకము 18:
క్రింద మీదటను జేన్నుందు కిరణమణి నా క్రిందు గతి మాపు అరుణాచలా!

భావము:

ఎక్కువ తక్కువ అను భేదము లేక వెలిగే జ్ఞాన భాస్కరా! నా అజ్ఞానమును రూపుమాపుము అరుణాచలా!

శ్లోకము 19:
కుట్రయంతను గోసి గుణముగ బాలించు గురు రూపమై వెలుగరుణాచలా !

భావము:
గురు రూపమైనట్టి అరుణాచలా! నా దోషములను సమూలంగా నాశనం చేసి నన్ను గుణవంతునిగా మార్చి కాపాడుముఅరుణాచలా !

శ్లోకము 20:
కూచి వాల్గనుల కొతబడక కృప చేసి నన్ను చేరి కావుo అరుణాచలా !

భావము:
వంచకుల వలలో పడి నశించి పోకుండా కృపతో నన్ను అనుగ్రహించి నాతో కలసి ఉండుము అరుణాచలా!

శ్లోకము 21:
వంచాకా వేడియున్ గొంచెమున్ గరుగవే అభయమిచ్చి యేలుమరుణాచలా!

భావము:
ఎంతగా వేడినను వంచకుని వలె కరగని కొండలా వున్న ఓ అరుణాచలా! కరుణతో అభయమిచ్చి నన్ను కాపాడుముఅరుణాచలా!

శ్లోకము 22:
అడుగకిచ్చెడు నీదు నకళంక మగుకీర్తి హాని సేయక బ్రోవుమరుణాచలా !

భావము:
భక్తులు అడగక పోయినా అన్ని ఇచ్చే వాడివి అనే కళంకము లేని నీ కీర్తికి,మచ్చ రానీయకుండా,నన్ను అనుగ్రహింపుముఅరుణాచలా!

శ్లోకము 23:
హస్తామలక నీదు సద్రసమున సుఖోన్మాద మొందంగా యేలుమరుణాచలా

భావము:
అరచేతి అమృతఫలం (ఉసిరి) వలె వున్న నీ స్వత్
స్వరూప దర్శన భాగ్యమనే రసమును అనుభవించి( త్రాగించి) సుఖోన్మాదమున మైమరిచి ఉండునట్లు నన్నుఅనుగ్రహింపుము అరుణాచలా!
హస్తామలకము
హస్త = అరచెయ్యి
ఆమ్లకము= ఉసిరి

శ్లోకము 24:
వలనుంచి భక్తుల పరిమార్పు నిను గట్టు
కొనియెట్లు జీవింతు నరుణాచలా!

భావము:
భక్తుల జీవత్వమును నశింపచేయడమే ధ్వజంగా గల నిన్ను నాయకునిగా ఎంచి, నేను ఎలా బ్రతుకుదును అరుణాచలా!

శ్లోకము 25:
కోపరహితగుణ గురిగాగ నను గొను
కొర యేమి చేసితి నరుణాచలా

భావము:
కోపరహిత గుణ స్వభావుడా! ఇంతమంది భక్తులలో గురి చూసి నన్ను గ్రహించుటకు, నేనేమి లోటు చేసితిని అరుణాచలా!

శ్లోకము 26:
“గౌతమపూజిత కరుణా ఘననగమా
కడగంట నేలుమా యరుణాచలా”

భావము:
గౌతమ ఋషి పూజించు కృపా ఘననఘమా! కడగంటి చూపుతో నన్ను ఏలుము అరుణాచలా !

శ్లోకము 27:
సకలము కబళించు కరకాంతియిన మనో
జలజ మలర్పుమా అరుణాచలా”

భావము:
జ్ఞాన కిరణములతో సకలమును కబళించు ఓ అరుణాచలా! నా మనోజలజము ( మనస్సు అనే పద్మము లేకకమలము)ను వికసింప చేయుము అరుణాచలా!

శ్లోకము 28:
తిండిని నిన్జేరితిని తిన నా నేను
శాంతమై పోవుదు నరుణాచలా”

భావము:
నీవు ఆహారం అనుకొని, తినుటకు నీ దరిచేరాను. కానీ, నీవు నన్ను కబళించడం వలన నేను పూర్తిగా నశించి, శాంతుడను అయ్యాను అరుణాచలా!

శ్లోకము 29:
మది చల్లపడ భద్రకర ముంచి యమృతనోర్
తెరు మనుగ్రహచంద్ర యరుణాచలా”

భావము:
మది చల్లబడునట్లు (శాంతించునట్లు )నీ అమృత హస్తమునుంచి, అనుగ్రహమనే అమృతంతో (కరుణతో)మూయబడిన నా నోరు (హృదయకవాటము )
ను తెరిచి నింపుము (అనుగ్రహింపుము)అరుణాచలా !

శ్లోకము 30:
వన్నెను జెఱిచి నిర్వాణ మొనర్చి కృపావన్నె నిడి బ్రోవు మరుణచలా !

భావము:
నా వన్నెను (అంటే ఇక్కడ మనస్సుకు ఆవరించిన వివిధ ఆలోచనలను అని అర్థం)నాశనము చేసి కరుణతో నాలో నీ కృపఅనే వన్నెను ప్రసరింపచేసి నన్ను కాపాడుము అరుణాచలా!

శ్లోకము 31:
సుఖ సముద్రము పొంగ వాఙ్మనము లడంగ
నూరక నమరు మం దరుణాచలా!

భావము:

హృదయం సుఖ సముద్రమై పొంగి; వాక్కు, మనస్సులు అణగునట్లు, అందులో నీవు ఊరక ,స్థిరముగా ఉండుము అరుణాచలా !

శ్లోకము 32:
వంచింతు వేల నన్ శోధింప కిక నీదు
జ్యోతిరూపము జూపు మరుణాచలా”

భావము:
వంచన చేసి, ఇంక నన్ను శోధించకుండా నీ జ్యోతి స్వరూపమును చూపుము అరుణాచలా !

శ్లోకము 33:
పదవిద్య గరిపి ఈ భూమి మైకము వీడి రూపగు విద్య జూపుమరుణాచలా!

భావము:
మాయజాల ప్రపంచ విషయ వ్యామోహంలో పడి ఉన్న నాకు తరింప చేయు ఆత్మజ్ఞానమనే విద్యను ప్రసాదింపుముఅరుణాచలా!

శ్లోకము 34:
చేరకున్నను మేను నీరుగ గరఁగి కన్నీటేరయి నశింతు నరుణాచలా!

భావము:
నీవు నన్ను చేరకుంటే ఆవేదనతో ఈ శరీరం కన్నీటి ఏరై కరిగి కరిగి క్రుంగి కృశించి నశించి పోవును అరుణాచలా!

శ్లోకము35:
“ఛీ యని ద్రోసిన జేయుకర్మ తపన
గా కేది మనుమార్గ మరుణాచలా”

భావము:
నీవు నన్ను ‘ఛీ’ అని త్రోసివేస్తే, చేసిన కర్మతాపం నన్ను దహించివేయును. తరించు మార్గం ఏది? చెప్పుము అరుణాచలా!

శ్లోకము36:
చెప్పక చెపి నీవు మౌనత నుం డని
యూరక యుందువే యరుణాచలా

భావము:
మాటతో చెప్పకనే మౌనముగా ఉండమని చెప్పి , నీవేమో ఊరక వుంటివి నీకిది తగునా అరుణాచలా

శ్లోకము 37:
సోమరి నైతిని మిన్నని సుఖనిద్ర
కన్న వే రెది గతి యరుణాచలా”

భావము:
నిర్విషయానందం అనుభవించి సోమరిని అయ్యాను. దీనికి మించిన వేరే గతి ఉందా? తెలుపుము అరుణాచాలా!

శ్లోకము 38:
శౌర్యము జూపితి శమియించె నని మాయ
జలియింప కున్నావు అరుణాచలా!

భావము:
నీ శౌర్యం చూపావు. నా అహంకారం అణగింది, నేను శాంతించాను. నీవు అచలుడవు అయ్యావు అరుణాచాలా!

శ్లోకము 39:
కుక్కకు న్నీచమే, నే నేగురుతుగొని
వెదకి నిన్జేరుదు నరుణాచలా”

భావము:
కుక్కకన్నా నీచమైన నేను , విశ్వాసంచేత నిన్ను వెదకి చేరగలను అరుణాచాలా!

శ్లోకము 40:
జ్ఞానము లేక నీయాస దైన్యము బాప
జ్ఞానము దెల్చి బ్రో వరుణాచలా”

భావము:
జ్ఞానం లేకుండానే ‘నిన్ను చేరాలి’ అనే ఆశ వలన కలిగిన ఆయాసం తీరునట్లు, జ్ఞానమును తెలిపి అనుగ్రహింపుముఅరుణాచాలా!

శ్లోకము 41:
తేటివలెను నీవు వికసింపలేదని ఎదుట నిలుతువేల అరుణాచలా!

భావము:
జ్ఞానసూర్యుడ వయిన నీవు నా హృదయ కమలము వికసింపలేదని, తేనెటీగ వలే నా ఎదుట నిలబడితివి! ఇదేమిచిత్రము ఆరుణాచలా!

శ్లోకము 42:
తత్వ మెరుగ జాల నంతయై నిలుతువే యిది ఏమి తత్వఅరుణాచల తత్వమో అరుణాచలా!

భావము:
తత్వము ఎరుగకయే బ్రహ్మ తత్వమును పొందితిని. ఆ తత్వము ఇదియే అని స్థిరపరచి నన్ను నీదరి చేర్చుకొనుము అరుణాచలా!

శ్లోకము 43:
తా నేను దా నను తత్వ మీదానిని తానుగా జూపింతు అరుణాచలా!

భావము:
‘తాను’ అనే తానే తత్వార్ధము.దీనిని తానే అయిన నీవు చూపించుము అరుణాచలా!

శ్లోకము 44:
త్రిప్పి యహంతను నెప్పుడు లో దృష్టి గన దెలియు నను నదే యరుణాచలా!

భావము:
మనసును అంతర్ముఖము చేసి , లోపల విచారించిన, తానుగా తెలియునని చెప్పితివి, ఇదేమి చిత్రము అరుణాచలా!

శ్లోకము 45:
తీర మందని యెద వెతికియు నిన్ను నే తిరిగి పొందితి బ్రోవు మరుణాచలా!

భావము:
తీరము లేని హృదయమున వెతికి నిన్ను నేను పొందలేక తిరిగి వచ్చితిని కరుణింపుము అరుణాచలా!

శ్లోకము 46:
సత్య జ్ఞానము లేని యీ జన్మ ఫలమేమి యొప్పగారావేల అరుణాచలా!

భావము:

శాశ్వతమైనది ,సత్యమైనది అయిన ఆత్మ గురించిన ఎరుక లేని, “అసలు నేనెవడను?” అనే చింతన లేని జన్మ ఫలితంఏమిటో చెప్పగలవా అరుణాచలా!

శ్లోకము 47:
శుద్ధ వాజ్ఞనయుతులo దోచు నీ నిజా హంత గల్పి నను బ్రోవు మరుణచలా!

భావము:
స్వచ్ఛమైన మాట మనస్సు గలవారికి తెలియబడు నీ దివ్య తేజము (ఆత్మ) నందు
మునిగేడి నన్ను అనుగ్రహించి నీలో లీనము చేసుకొనుము అరుణాచలా!

శ్లోకము 48:
దైవమనుచు నిన్ను దరి చేరగా నన్ను పూర్ణ నాశ
మొనర్చి తరుణాచలా!

భావము:
కరుణతో అనుగ్రహించు దైవమని నిన్ను శరణు జొచ్చితే నా (అహం)అనేది ఏమీ లేకుండా నా సర్వమును హరించితివాఅరుణాచలా!

శ్లోకము 49:
వేడుకక గనిన సచ్చియనుగ్రనిధీ మది తెగుల్
తీర్చి బ్రోవరుణాచలా!

భావము:
నిన్ను వెదుకకముందే నాకు ఎదురై నన్ను అనుగ్రహించిన ఓ దయానిధి నా మనస్సునంటిన భవరోగములను తొలగించినను కృపజూపి కాపాడుము ఆరుణాచలా!

శ్లోకము 50:
ధైర్యము పరుగిడు నీనిజాహ మరయ
నే నాశ మైతి బ్రోవరుణాచలా !

భావము:
ధైర్యముతో నీ సత్య రూపము తెలుసుకొనగా “నేను “అనే అహం అనేది లేకుండా అణగారి పోయినది.ఇప్పటికైనా నన్నుఅనుగ్రహించుము అరుణాచలా!

శ్లోకము 51:
తాకి కృపాకరము నను కలియకున్న నిజము నశింతు బ్రోవరుణాచలా !

భావము:
కరుణతో నీ మృదు హస్తములను చాచి నన్ను నీదరికి చేర్చుకొనకున్న కృంగి కృశించి పోవుదును అరుణాచలా!

శ్లోకము 52:
దోష రహిత నీవు నాతో నైక్యమయి నిత్యానంద మయ మొనర్పరుణాచలా !

భావము:
ఓ తేజ స్వరూప మమేకమై నీవు,నాలో శాశ్వతమైన సచ్చిదానందమును అనుగ్రహించుము అరుణాచలా !

శ్లోకము 53:
నగకు యెడముకాదు నిన్వెదకిన నన్నుగను కృపా నగవేసి యరుణాచలా!భావము:

పిచ్చి వానిలా పరితపిస్తూ నీకై అన్వేషిస్తున్న నన్ను దూరము పెట్టి వేడుక చూడక,కరుణతో నన్ను కాపాడవయాఅరుణాచలా!

శ్లోకము 54:
నాన లేదే వెదుక నేనయి నీ వొంటి స్థాణువై నిలిచితి వరుణాచలా !

భావము:
నీకై వెతకి వెతకి నేను నీ దరి చేరితే ఏమాత్రం చలనం లేని ఒక కొండలా ఉండిపోతావే?అభిమానంగా లేదా నీకు! అరుణాచలా!

శ్లోకము 55:
నీ జ్వాల గాల్చినన్ నీఱుసేసేడు మున్నె నీ కృప వర్షింపు మరుణాచలా !

భావము:
నీ జ్ఞానాగ్ని (తేజస్సు)నందు నే కలిసి ఆవిరై పోకముందే నీ చల్లని కరుణా దృష్టి నాపై జూపుము అరుణాచలా!

శ్లోకము 56:
నీవు నే నణుగ నిత్యానంద మయముగా నిలుచు స్థితి కరుణింప రుణాచలా!

భావము:
‘నే’ననే (అహం) భావన నశించి, నీవే నేనై పోయే (నీలో లీనమై )నిశ్చల ఆనంద స్థితి లో ఉండే భాగ్యాన్నిఅనుగ్రహించుము అరుణాచలా!

శ్లోకము 57:
అణురూప నిన్ను నే మిన్ను రూపం జేర భావోర్ము లెపుడాగు నరుణాచలా !

భావము:
అణువు మొదలు బ్రహ్మాండం అంతా వ్యాపించిన ఓ చైతన్య మూర్తి నాకు అడ్డుగా నిలిచిన భావనాతరంగాలు ఎప్పుడుఅణుగునో అరుణాచలా !

శ్లోకము 58:
సూత్రజ్ఞానము లేని పామరు నా మాయ జ్ఞానము
గోసి కావరుణాచలా !

భావము:
నీ పరతత్వము తెలిపే ఏ శాస్త్రములు పరిచయము లేని సామాన్యుడిని.నా అజ్ఞానము తొలగించి,నిన్ను పొందే జ్ఞానంఇచ్చి కాపాడవయ్యా అరుణాచలా !

శ్లోకము 59:
మక్కి మక్కి కరిగి నేనిన్ను శరణంద
నగ్నుడవై నిల్చి తరుణాచలా !

భావము:
నాది అనేది ఏమీ లేదు, నా సర్వస్వం నీవే అని శరణు జొచ్చిన నాకు నీ దివ్య దర్శనమొసగితివా అరుణాచలా!

శ్లోకము 60:
నేస్తముండని నాకు నీ యాస జూపినన్
మోసగింపక బ్రోవు మరుణాచలా!

భావము:
నా శ్రేయస్సును కోరు సన్నిహితుడవని తలచి నీ దరి చేరితిని.నమ్మకము వమ్ము చేయకుమా అరుణాచలా !

శ్లోకము 61:

నవిసి చెడు ఫలము నందేమి ఫలమేరి పక్వత లోగోను అరుణాచలా !

భావము:

మిగుల పండిన పండును స్వీకరించి లాభం ఏమున్నది ? దోరగా ఉన్నప్పుడే ఆ ఫలాన్ని స్వీకరించిన దాని మాధుర్యముతెలియును అవునా ?అరుణాచలా!

శ్లోకము 62:
నొవ్వగింపక నిన్ను నొసగి నన్ గొనలేదే యంతకుఁడవు నాకు నరుణాచలా!

భావము:
ఏమాత్రము శ్రమ పడకుండా నీకుగా నాకు వశమైనట్లు చూపుతూ,నేను అనేది లేకుండా నా సర్వము నీ స్వాధీనంచేసుకున్నావు. ఇది ఏమి మాయ?అరుణాచలా!

శ్లోకము 63:
చూచి చింతించి మేనుం దాకించి పక్వము చేసి నీ వేలి ప్రో వరుణాచలా

భావము:
మనసా ,వాచా ,కర్మణా పరిశీలించి పరిశోధించి నీకు అనుగుణంగా మలుచుకొని నన్ను నీ దాసుని గా చేసుకునిఏలుకోవయ్యా అరుణాచలా!

శ్లోకము 64:
మాయ విషము పట్టి తలకెక్కి చెడుమున్నె కరుణపట్టొసగి బ్రోవరుణాచలా!

భావము:
అజ్ఞానముతో ఆశాపాశములను తగిలించుకున్న నే నందు మరింత నశించి పోకముందే అనుగ్రహస్తములతో బంధములుతుంచి నాన్నదుకో అరుణాచలా!

శ్లోకము 65:
గనుకృపన్ మాయాంతముగ కృప గన నేని గను
నీ కెవరు చెప్పుటరుణాచలా!

భావము:
నీ కృపా వీక్షములచే చే మాయా మోహములను నశింపజేసే నీ కరుణ ఎటువంటిదో నేనే కాదు,మరి ఎవరు చెప్పగలరు ?అరుణాచలా!

శ్లోకము 66:
పిచ్చి వీడ నిను బోల్ పిచ్చి జెసితే దయన్ పిచ్చిని మాన్పు మం దరుణాచలా!

భావము:
ప్రాపంచిక విషయములనే పిచ్చిని వదలించి నిన్ను పొందవలెనన్న పిచ్చిని పెంచితివి.ఆ పిచ్చిని కూడా పోగొట్టు మందునుఅనుగ్రహింపుము అరుణాచలా !

శ్లోకము 67:
నిర్భీతి నిను జేరు నిర్భీతు నను జేర భీతి నీకేలోకో యరుణాచలా!

భావము:
భయానికే భయంకరుడు అయిన నిన్ను చేరుటకు నిర్భయంగా వచ్చిన నన్ను చేరుటకు నీవు కరుణింపుము

శ్లోకము 68:
అల్పజ్ఞాన మ దేది సుజ్ఞాన మెదయా ఐక్య మంద
కరుణిం పరుణాచలా !

భావము:
అజ్ఞానం ఏదో,సుజ్ఞానం ఏదో ,తెలియని నాకు సత్య జ్ఞానమును బోధించి కరుణింపుము అరుణాచలా !

శ్లోకము 69:
భూగంద మగు మది పూర్న గంధము గోన
బూర్ణగంధ మొసంగు మరుణాచలా !

భావము:
విషయవాసనలతో మలినమైన నన్ను
వాసనా రహితుని గావించి సద్వాసన లొసఁగి కావుము అరుణాచలా !

శ్లోకము 70:
పేరు దలవగనే పట్టిలాగితివి నీ మహిమ కనుదు రెవ రరుణాచలా!

భావము:
నీ నామ స్మరణ చేసినంత మాత్రమున నన్ను నీ దరికి చేర్చుకొంటివి. ఎవరు ఎరుగుదురు నీ దయ ఎటువంటిదోఅరుణాచలా!

శ్లోకము 71:
పోగ భూతముపోనీ భూతమై పట్టి నన్ భూత గ్రస్తుని జేసి తరుణాచలా!

భావము:
భూతనాథుడవైన నీవు నేను, నాది అనే అహంకార భావనల పిశాచాన్ని వదిలించి, నీ బంధీగా చేసితివే అరుణాచలా!

శ్లోకము 72:
మృదులతన్ నే ప్రాపు లేక వాడగనీక
పట్టుకొమ్మయి కావు మరుణచలా!

భావము:
ఏ ఆధారమూ లేని లేలేత తీగ వంటి నన్ను విషయ వాసనలు అనే ధూళిలో పడి వాడి పోకముందే నీ దృఢమైన అభయహస్తమును అందించి నన్ను ఆదుకోవయ్యా అరుణాచలా!

శ్లోకము 73:
పొడిచే మయిక పర్చి నాబోధ హరించి నీ బోధ గనుపించి తరుణాచలా!

భావము:
నన్ను నీయందు మైమరపించి, మత్తుని కావించి నేను నాది అనే ఎఱుకను అంతటిని తొలగించి కరుణతో నీ యొక్క దివ్యజ్ఞానాన్ని నాకు ప్రసాదించితివా అరుణాచలా!

శ్లోకము 74:
రాకపోకలు లేని సమరంగదివి జూపు మా కృపా పోరాట మరుణచలా!

భావము:

చావు పుట్టుకలు లేని సహజస్థితికి చేరటానికై నాలోని అజ్ఞానాన్ని కరుణతో జీవాత్మ పరమాత్మతో కలియు జ్ఞానాన్నిఅనుగ్రహించు మరుణచలా!

శ్లోకము 75:
భౌతికమౌ మేని పట్టార్చి యెపుడు నీ మహిమ గన కరుణింప రుణచలా!

భావము:
పంచభూతాత్మికమైన ఈ శరీరమే నేను అనే భావము నశింపజేసి శాశ్వతమౌ నీ సచ్చితానంద రూపమునందునేనైక్యమయిపోవ ఆగ్రహింపు మరుణాచలా!

శ్లోకము 76:
మలమందు నీవియ్య మలగుటయో కృప మలమందు వై వెలుగరుణాచలా!

భావము:
‘అరుణ’ చల మనే ఔషధమొసగి నేను నాదను భ్రాంతిని తొలగించిన ఓ కరుణగిరి! నీ అమృత కిరణములతో నాహృదయకుహరమును ప్రకాశింప జేయుము అరుణాచలా!

శ్లోకము 77:
మానము చేరు వారి మానము బాపి నిరభిమానత వెలుగ రుణాచలా!

భావము:
తమను తాము చూచుకుని దురభిమానము చందు వారి అహంకారాన్ని తొలగించి నిజ తత్వము ప్రకటించినతేజోమూర్తి! నిర్మలుడవై ప్రకాశించు మరుణాచలా!

శ్లోకము 78:
మించగా వేడెడు కించజ్ఞుడను నను వంచింపక బ్రోవు మరుణాచలా !

భావము:
ఆపదలు కలిగినప్పుడు మాత్రమే నిన్ను తలుచుకునే అజ్ఞానిని అని తెలిసుండి నన్ను నిరాదరింపక కరుణతో నీఅనుగ్రహము నాయందు జూపుమారుణాచలా!

శ్లోకము 79:
నావి కుడుండక పెనుగాలి నలయు
నా వనుగాక కాచి బ్రోవరుణాచలా!

భావము:
సంసార సాగరమనే విషయ వాసనలు సుడిగాలిలో చిక్కి దిక్కులేని నావలా అల్లాడిపోతున్న నన్ను కరుణతో నీదరికిచేర్చుకో అరుణాచలా!

శ్లోకము 80:
ముడి మూలముల్ గాన మునుకొంటిని సరిగ ముగియ భారము లేదో అరుణాచలా!

భావము:
నా అజ్ఞానగ్రంధికి ఆది అంతములు తెలియకున్నవి. దానిని త్రుంచుట నాకు అసాధ్యము. తల్లివలె నీవు ఆ ఛిజ్జడగ్రంథిని తొలగించు బాధ్యతలు స్వీకరించుమా అరుణాచలా!

శ్లోకము 81:
ముక్కిడి మునుజూపు ముకురముగాక నన్ హెచ్చించి కౌగలిం పరుణాచలా!

భావము:
మలినమైన వాసనలతో వికారమైన నన్ను నా మనసు లోని లోపములు జూపి దూరము పెట్టక, నాకు సద్వాసనలుకలుగచేసి నీదరిచేర్చుకొను మరుణాచలా

శ్లోకము 82:
సత్యాహమను మనో మృదుపుష్ప శయ్యపై మేనఁగలయ కరుణిం పరుణాచలా!

భావము:

హృదయమందిరమున స్వచ్ఛమైన , సున్నితమైన మనస్సనే పుష్ప శయ్యపై పరమాత్మ వైన నీలో జీవాత్మ నైన నేనుఏకమయ్యేలా అనుగ్రహించుము
అరుణాచలా

శ్లోకము 83:
మీదు మీదుగ మ్రొక్కు భక్కులజేరినీ వంది
తే మేలిమి యరుణాచలా

భావము:
ఆర్తి తో నిన్ను శరణు జొచ్చిన వారిని ఆదరించి అనుగ్రహించు దైవమని ఘన
కీర్తిని గడించితివి అరుణాచలా!

శ్లోకము 84:
మైమైదణచి కృపాంజమున నీ సత్య వశ మొనరించితి అరుణాచలా!

భావము:
కనులకు కమ్మిన మమకారపు పొరలను తొలగించి , నీ నిజస్వరూపమును జూపి నన్ను నీ దాసునిగాచేసుకున్నావారుణాచలా !

శ్లోకము 85:
మొగ్గ పఱిపి నను బట్టబయట నీవు నట్టాడు టేలకో యరుణాచలా !

భావము:
నాకు గల దేహాభిమానాన్ని తొలగించి , నను నిర్లజ్జునిగా చేసి , ఏమి ఎరుగని వానివలె నా ముందు ఈ నటనలెందుకో నీకుఅరుణాచలా !

శ్లోకము 86:
మోహము దప్పి నీ మోహ మొనర్చి నా మోహము తీరదా యరుణాచలా!

భావము:భాహ్య విషయముల పట్ల నన్ను విరక్తుని జెసి నీపట్ల అనురక్తుని జేసావు.నీపై నాకు కలిగిన ఈ వ్యామోహమనే తృష్ణఎలా తీరునో అరుణాచలా!

శ్లోకము 87:
మౌనియై రాయిగా నలరక నున్నచో మౌన మిదియగునో అరుణాచలా !

భావము:
మాటలాడక జడుడిలా,నిశ్చలంగా, స్థిరంగా అలా ఉండుటయే మౌనమని అందురా అరుణాచలా!

శ్లోకము 88:
ఎవరు నా నోటిలో మన్నును గొట్టి నా బ్రతుకు హరియించిన దరుణాచలా!

భావము:
నేను (ఆత్మ)పొందవలసిన పరిపూర్ణ ఆనందానికి అడ్డుపడి నా జీవితాన్ని కబళించి వేస్తున్నది ఎవరు అరుణాచలా!

శ్లోకము 89:
ఎవరు గనక నాదు మదిని మైకపరచి కొల్లగొనిన దెవరరుణాచలా !

భావము:
నా మనస్సునుదగ్గరవారు కూడా గ్రహించ నంతగా నా మదిని వశపరుచుకొని నా అనేది ఏమి లేకుండా దోచుకొంటివి గదాఅరుణాచాలా!

శ్లోకము 90:
రమణుడనుచు నంటి రోషము గొనక నన్ రమియింప జేయర మ్మరుణాచలా!

భావము:
నా నాధుడవని ప్రేమతో నిన్ను రమణుడని పేరుతో పిలిచితిని. రోషము చెందక నను రమియింపజేయుము అరుణాచాలా

శ్లోకము 91:
రేయింబవలు లేని బట్టబయటి ఇంట
రమియింపగా రమ్ము అరుణాచలా !

భావము:
రాత్రి పగలు లేని బట్ట బయట ఇంటిలో మనము కలిసి రమియించెదము రమ్ము అరుణాచలా !

శ్లోకము 92:
లక్ష ముంచి యనుగ్రహస్తము వైచి నన్
బగళించి తుసురుతో నరుణాచలా !

భావము:
నాపై గురి చూచి అనుగ్రహస్తమును సంధించి , నన్ను ప్రాణములతోనే కబళించితివి కదా ఆరుణాచలా!

శ్లోకము 93:
లాభమీ నిహపరలాభహీనుని జేరి లాభ మే
మందితీ వరుణాచలా!

భావము:
నువ్వు నాకు లభించడం నాకు లాభమే కానీ ఇహపరములయందు దేనికి కొరగాని నన్ను స్వీకరించి నీవేం లాభమునొందితివి ఆరుణాచలా !

శ్లోకము 94:
రమ్మని యనలేదే వచ్చి నావం తివ్వ వెఱకు నీ తల విధి యరుణాచలా!

భావము:
నన్ను చేర రమ్మనలేదా? నను చేరినందువల్ల నా యోగ క్షేమములను భరించడం నీ తల విధి అరుణాచలా!

శ్లోకము 95:
రమ్మని లో దూరి నీ జీవ మిడునాడే నా జీవమును బాసితరుణాచలా!

భావము:
రమ్మని నను పిలిచి నా హృదయమున దూరి నీ స్వరూపమును ప్రసాదించినప్పుడే , నా జీవితము ముగిసినది.ఇకకరుణింపుము అరుణాచలా!

శ్లోకము 96:
విడిచిన గష్టమౌ విడక నిన్ను సురును విడువ ననుగ్రహింపరుణాచలా!

భావము:
నిను మరచి నే ప్రాణములు విడిచినచో , మరల జన్మ దుఃఖము అనుభవింపవలెను. కావున నా ప్రాణములుపోవునప్పుడు నీ స్మరణ మరువకుండునట్లు అనుగ్రహింపుము అరుణాచలా!

శ్లోకము 97:
ఇల్లు విడువ లాగి లోనింటిలో జొచ్చి యొగి
నీదు నిలుజూపి తరుణాచలా!

భావము:
నా ఇంటి నుండి లాగి,నన్ను హృదయమను ఇంటిలో దూర్చి , మెల్లమెల్లగా కైవల్య పదమగు
నీ ఇంటిని చూపితివి అరుణాచలా !

శ్లోకము 98:
వెలిపుచ్చితి న్నిదు సేత కినియక నీ
కృప వెలిబుచ్చి కావుమరుణాచలా!

భావము:
నీవు చేసిన చేతలను బహిరంగ పరిచానని రోషము చెందక నాపై నీకున్న అనుగ్రహము బయలు పరిచి నన్నుఅనుగ్రహింపుము అరుణాచలా!

శ్లోకము 99:
వేదాంతమున వేఱు లేక వెలింగెడు
వేదపదమ ప్రోవు మరుణాచలా!

భావము:
వేదాంతములయందు ఆభేదమై వెలుగు నీ
వేదస్వరూపమును నాకు అనుగ్రహింపుము అరుణాచలా!

శ్లోకము 100:
నింద నాశిస్సుగా గొనిన్ దయాపాత్రుగ
జెసి వీడక కావు మరుణాచలా!

భావము:
నా నిందలను స్తుతులుగా భావించి నీ దయా పాత్రునిగా చేసి వదలక కాపాడుము ఆరుణాచలా!

శ్లోకము 101:
నీట హిమముగా ప్రేమకారు నీలో నన్ ప్రేమగా కరగి బ్రో వరుణాచలా!

భావము:

మంచుముక్క నీటిలో కరుగునట్లు ప్రేమ స్వరూపుడవైన నీలో ప్రేమనై కరిగిపోయేలా నన్ను అనుగ్రహింపుము ఆరుణాచలా!

శ్లోకము 102:
అరుణాద్రి యన నే కృపావల బడితి దప్పునే
నీ కృపావల యరుణాచలా!

భావము:
అరుణాచలమని తలచినంత మాత్రముననే నీ అనుగ్రహ మనే వలలో చిక్కుకొంటిని.ఆ నీ కృప యనెడి వల నుండి నేతప్పించుకొని సాధ్యమా ఆరుణాచలా !

శ్లోకము 103:
చింతింప కృపపడ సాలీడు వలె
గట్టి చెర పెట్టి భక్షించి తరుణాచలా !

భావము:
నీ కృపను నాపై అమితముగా ప్రసరింపచేసి సాలీడు వలె వలను గట్టి నను అందు బందించి భక్షించితివే ఆరుణాచలా !

శ్లోకము 104:
ప్రేమతో నీ నామ మాలించు భక్త భక్తుల భక్తుగా
బ్రోవు మరుణాచలా !

భావము:
ప్రేమతో నీ నామమును ఆలకించు భక్తుల యొక్క
భక్తులకు దాసుడగునట్లు నన్ను కరుణింపుము ఆరుణాచలా !

శ్లోకము 105:
ననుబోలు దీనుల నిం పొంద కాచుచు
జీరంజీవివై బ్రోవు మరుణాచలా !

భావము:
నా వంటి దీనార్తులను ఆనంద మయులుగా చేసి కలకాలము మమ్ములను కాపాడుము ఆరుణాచలా!

శ్లోకము 106:
ఎముక లరుఁగు దాసు మృదువాక్కు వినుచెవిన్
గొనుమ నా యల్పొక్తు లరుణాచలా!

భావము:
ఎముకలు కూడా కరుగు విధముగా నీ భక్తులు పాడిన పాటలను విని ఆనందించిన నీ చెవులతో , నా అల్ప వాక్కులనుకూడా గ్రహించి కరుణింపుము అరుణాచలా!

శ్లోకము 107:
క్షమగల గిరి , యల్ప వాక్కు సద్వాక్కుగ గొని కావు
మఱి నీ ఇష్ట మరుణాచలా!

భావము:
క్షమయే మూర్తీభవించిన ఓ గిరిరాజమా! నా అజ్ఞానముతో పల్కిన పల్కులను గొప్పవిగా
భావించి ,మన్నించి కాపాడుము ,తరువాత నీ ఇష్టము ఆరుణాచలా!

శ్లోకము 108:
మాలను దయచేసి యరుణాచలరమణ
నా మాల దాల్చి బ్రోవరుణాచలా!

భావము:
నీ మీద తీవ్ర ప్రేమ అను మాలను అనుగ్రహించుము అరుణాచల రమణా !
నేను ప్రేమతో కూర్చిన అక్షరమణామాలను నీవు
ధరించి నన్ను బ్రోవుము ఆరుణాచలా!

Arunachala Aksharamanamalai in Telugu without Meaning pdf:

Arunachala Aksharamanamalai in Telugu Check here 

Arunachala Aksharamanamalai in Telugu with Meaning Pdf: