హోరా సమయాల్లో ఎలాంటి పనులు చేయాలి?
హోరా అనగా రాశి లో సగభాగం అని అర్థం ఉన్నది కానీ బేసి రాశిలో మొదటిది సూర్య హోరా అని రెండోది చంద్రహోర అనియు సమ రాశుల్లో మొదటిది చంద్రహోర రెండవది సూర్య హోరా నీవు తెలియవలెను. ప్రతి పంచాంగం లో ఈ దినము హోరా చక్రం ఉంటుంది అయితే దీనిని ఎలా చూడాలి ఎలా సరిత పొందాలి అంటే ప్రతిరోజు ఏ వారం అవుతుందో ఆ వారం తోనే హోర చక్రము ప్రారంభమవుతుంది అనగా ఆదివారం ఉదయం సూర్య హోరతో ప్రారంభమవుతుంది ఇవి పగలు గంట చొప్పున 12 గంటలు రాత్రి గంట చొప్పున 12 గంటలు ఉంటుంది.
ఈ హోరా సమయంలో తారాబలం కలిసినప్పుడు మిగిలిన తిధులు యోగాలు కలవ నప్పుడు అప్పుడు తారాబలం అనుసరించి ఏ పని కావాలో ఆ కారకత్వం ఒక గ్రహాన్ని ఆ సమయంలో ఆ పని చేసుకోవచ్చు, దీనికి దుర్ముహూర్తాలు రాహుకాలం యమగండం ఉన్నప్పుడు ఈ హోరా సమయాన్ని చెప్పకూడదు కావున కారకత్వాలు బాగా తెలిస్తే యజమాని యొక్క పనిని బట్టి ఆ హోరా సమయంలో వారు చాలా బలాన్ని బట్టి వారికి చెప్పవచ్చు.
ప్రతిరోజూ సూర్యోదయంతో ఆ రోజుకు అధిపతి అయిన గ్రహ హోరా ప్రారంభం అవుతుంది. ఉదాహరణకు ఆదివారం రవి హోరాతో మొదలవుతుంది. సోమవారం చంద్ర హోరాతో మొదలవుతుంది. గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణ చంద్రుడి హోరాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. రవి, కుజ, శని హోరాలు కొన్ని విషయాల్లో ప్రతికూల ఫలితాలు ఇస్తాయి.
వారం ఏర్పడడానికి హొరాక్రమం ఉంటుంది. ఆకాశంలో గ్రహాల వరుసల్లాగా ఉంటాయి. శని, గురు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్ర హొ రలు. వరుసగా ప్రతిరోజూ అవే మళ్ళీ మళ్ళీ పునరావృత్తమౌతాయి.
ప్రతి రోజు సూర్యోదయము నుండి మొదలుకొని గంటకు ఒక హోర చొప్పున ఉంటుంది .
ఉదాహరణకు ఈ రోజు శుక్ర వారం . సూర్యోదయము ఉదయము 06 : 02 నిమిషములకు జరిగింది . సూర్యోదయము నుండి ఒక గంట వరకు శుక్ర హోర ఉంటుంది . ఏ రోజు ఏ సమయమునకు ఏ హోర ఉంటుంది అనే విషయమును హోరా చక్రములో చూడగలరు .
ఈ దిగువ తెలుపబడిన హూరను అనుసరించి నిత్యము చేయు పనులలో గానీ , కొత్తగా ప్రారంభించబోయే పనులను గానీ హోర ప్రకారము చేయడం వలన జయము కలుగుతుంది.
ఏ హోరలో ఎలాంటి పనులను చేయాలి . అనే సందేహము చాలా మందికి కలుగుతుంది .
ఉదాహరణకు ఉద్యోగము కొరకు దరఖాస్తు చెయ్యాలి అనుకొన్నప్పుడు రవి హోరలో చెయ్యాలి .
విద్య కొరకు కొత్తగా కాలేజీలో అప్లికేషన్ పెట్టాలని అనుకొన్నప్పుడు గురు హోరలో చెయ్యాలి.
ఆభరణములు , లేక వస్త్రములు లేక విలువైన వస్తువులు కొనాలని అనుకొన్నప్పుడు శుక్ర హూరాలో మొదలు పెట్టాలి . బంగారము మొదలగు వస్తువులు వాడాలని అనుకొన్నప్పుడు శుక్ర హోరలో చెయ్యాలి .
రాజకీయ సంబంధిత వ్యవహారములు , ప్రభుత్వ కార్యాలయాల లో , అధికారుల దర్శనము మొదలగు వ్యవహారములు రవి హోరలో చెయ్యాలి . గృహము లో గ్యాసు స్టవ్ మొదలగు వస్తువులు , హీటర్స్ మొదలగు అగ్ని సంబంధ వస్తువులను మొదట వాడేటప్పుడు కుజ హోరలో చెయ్యాలి . కోర్టు కేసులు , పోలీసు స్టేషన్ సంబంధిత వ్యవహారములను కుజ హోర లో ప్రారంభించాలి .
మాంసపు దుకాణాలు , ఎలక్ట్రానిక్ వస్తువులు మొదలగునవి కుజ హూరలోనే వాడాలి .
శీతల పానీయాలకు సంబంధించిన వస్తువులుకు సంబంధించిన ప్రిజ్ , రిఫ్రిజ్రిటర్ , కూలర్స్ మొదలగునవి చంద్ర హోరలో వాడాలి .
బ్యాంకింగ్ లావాదేవీలు , భూమి రిజిస్ట్రేషన్ , పిక్సిడ్ డిపాజిట్ మొదలగు ఆర్ధిక సంబంధ వ్యవహారములను బుధ హోరలో చెయ్యాలి .
అన్నింటిని మించి శని హోర కొంత ఆలస్య ఫలితములను కష్ట నష్టములను కలిగించును
రవి హోరా: అధికారులను సంప్రదించడం, రాజకీయ, ఉద్యోగ వ్యవహారాలు, వైద్యం, క్రయవిక్రయాలు, కోర్టు లావాదేవీలు, సాహసంతో కూడుకున్న పనులు, విద్యాభ్యాసం, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, రాజకీయ చర్చలకు అనుకూలం.
శుక్ర హోరా: శుభకార్యాలు, వాహన కొనుగోళ్లు, సంగీతం-నాట్య అభ్యాసం, తీర్థయాత్రలు, పరిమళ ద్రవ్యం, బంగారం, వెండి, ఇతర విలాస వస్తువుల కొనుగోళ్లు, పెండ్లిచూపులు తదితర పనులకు అనుకూలం.
బుధ హోరా: వ్యాకరణం, గణితం, శిల్ప, వాస్తు తదితర శాస్త్ర అభ్యాసం, జాతక పరిశీలన, న్యాయ వ్యవహారాలు, రాసే పనులు, వ్యాపార ప్రారంభం, పరిశోధనలు, సాంకేతిక విషయాలు, మధ్యవర్తిత్వాలకు బుధ హోరా అనుకూలమైనది.
చంద్ర హోరా: భోజనం, సముద్ర ప్రయాణాలు, నూతన దుస్తులు, నగలు ధరించడం, ఆలయ సందర్శన, దేవతార్చన, స్థల మార్పు, రాజీ ప్రయత్నాలు, ధాన్యం, పంట ఉత్పత్తులు, దుస్తులు కొనడం, మాతృ సంబంధ వ్యవహారాలకు చంద్ర హోరా అనుకూలం.
శని హోరా: శుభకార్యాలకు శని హోరా అనుకూలం కాదు. మినుములు, ఇనుము, నువ్వులు, తైలం, యంత్రపరికరాల కొనుగోలు, శ్రమతో కూడుకున్న పనులకు, పరామర్శలకు, వాహనాల మరమ్మతులకు శని హోరా అనుకూలం.
గురు హోరా: ఆర్థిక వ్యవహారాలకు ఇది అనుకూల సమయం. శుభకార్యాల నిర్వహణ, పెండ్లి చూపులు, వివాహ నిర్ణయం, పుస్తక పఠనం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, భాషాధ్యయనం, బ్యాంకు లావాదేవీలు, నూతన వస్ర్తాభరణాల కొనుగోలు, తీర్థయాత్రలు, ధార్మిక విషయాలకు గురు హోరా అనుకూలం.
కుజ హోరా: కొన్ని విషయాలకు మాత్రమే కుజ హోరా అనుకూలంగా ఉంటుంది. భూ వ్యవహారాలు, రియల్ఎస్టేట్, ఎలక్ట్రికల్, పోలీసులను సంప్రదించడం, భూ సేకరణ, గృహ నిర్మాణ భూకొలతలు, శస్త్ర చికిత్స విషయంలో వైద్యులను సంప్రదించడం తదితర పనులకు కుజ హోరా అనుకూలం.
బుధ, గురు, శుక్ర హోరలు శుభప్రదం. శుద్ధ పంచమి నుంచి బహుళ దశమి వరకు చంద్ర హోరా యోగిస్తుంది. ప్రయాణ సమయాల్లో హోరా పాటించడం మంచిది. ప్రతి పనుల్లోనూ హోరా కాలాన్ని తప్పకుండా పాటించాలన్న నియమం లేదు. శుభ హోరా సమయంలో దుర్ముహూర్తం, వర్జ్యం ఉన్నా సమస్యలు ఎదురుకావని శాస్త్ర వచనం.
హోరా చక్ర విశ్లేషణ:
జాతకచక్రంలో కేవలం రాశి చక్రాన్నే కాకుండా భావచక్రాన్ని, నవాంశ చక్రాన్ని, షోడశ వర్గ చక్రాలను కూడా పరిశీలించాలి.
జాతకచక్ర పరిశీలన చేసేటప్పుడు షోడశ వర్గ చక్రాలను కూడ జాతకచక్రంలో పరిశీలించాలి.
ఈ షోడశవర్గుల పరిశీలన వలన జాతకచక్రంలోని రహస్యమైన అంశములను తెలుసుకొనుటకు అవకాశము కలదు.
ఈ షోడశవర్గులే కాక జైమిని పద్దతిలోనూ, తాజక పద్దతి యందు..
పంచమాంశ,షష్ఠాంశ,అష్ఠమాంశ,లాభాంశ లేక రుద్రాంశ అను నాలుగు వర్గులను సూచించినారు.
పంచమాంశ పూర్వపుణ్యబలం, మంత్రం,సిద్దించునా లేదా తెలుసుకోవచ్చు. షష్టాంశ అనారోగ్యం అమంతర్గతంగా ఉందా లేదా బహిర్గతమంగా ఉందో తెలుపును. అష్టమాంశ ప్రమాదాలు, దీర్ఘకాలిక వ్యాధులు, యాక్సిండెంట్స్, వైద్యపరంగా యాక్సిడెంట్ ద్వారా అవయవాన్ని తొలిగించుట. యాసిడ్ దాడులు తెలుసుకోవచ్చు.
లాభాంశ(రుద్రాంశ) :
ఆర్ధికపరమైన లాభాలు,వృషభరాశి ఏలగ్నంగాని, గ్రహంగాని రాదు.వృషభరాశి శివుడికి సంబంధించిన రాశి కాబట్టిఈ రాశిలో ఏగ్రహం ఉండదు.
లగ్న కుండలి :
లగ్న కుండలి జాతకానికి సంబంధించిన అన్ని అంశాలను తెలియ జేస్తుంది. మనిషి మనస్తత్త్వం, శారీరక స్థితి, గుణగణాలు, జీవన విధానం మొదలైన అనేక విషయాలు లగ్నకుండలి ద్వారా తెలుసుకొవచ్చు.
నవాంశ కుండలి(D9):
రాశి చక్రమందు యోగం ఉండి నవాంశ యందు గ్రహాల స్ధితి యుతులలో అవయోగ మేర్పడిన రాశి యందలి ఫలితమునకు విఘాతం కలుగును.రాశిచక్రం జన్మమైతే నవాంశ ప్రాణం. నవాంశ కుండలి మనిషి భాగ్యాన్ని, వైవాహిక జీవితాన్ని తెలియ జేస్తుంది. ఒక మనిషి అదృష్టవంతుడా, కాదా, అదృష్టం దేని ద్వారా వస్తుంది.
తదితర విషయాలు వివాహానికి సంబంధించి వివాహ యోగం ఉన్నదా, లేదా, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది మొదలైన విషయాలు నవాంశ కుండలి ద్వారా తెలుస్తాయి.
హోరా(D2) కుండలి:
హోరా కుండలి ఆర్థిక స్తితిని గురించి తెలియ జేస్తుంది. అలాగే మనలో ఉండే వివిధ అంశాల సంతులతను సూచిస్తుంది.
రవిహోర(సింహరాశి)లో ఎక్కువ గ్రహలు ఉన్నట్లయితే కృషితో ఎక్కువ సంపాదన ఉంటుంది. సింహం మనలో ఉండే బహిర్గత అంశాలను, కర్కాటకం అంతర్గత అంశాలను సూచిస్తుంది.
ద్రేక్కాణ(D3) కుండలి :
వైద్య జ్యోతిష్యంలో ద్రేక్కాణం ద్వారా ఏ శరీర భాగానికి అనారోగ్యం కలుగుతుందో తెలుసుకోవచ్చును.
ద్రేక్కాణం శరీర భాగాలు, ఆరోగ్య సమస్యల గురించి చెబుతుంది. ఇది లగ్న కుండలిలో 3 వ భావం, సోదరీమణులు, స్నేహితులు మరియు భాగస్వామ్యాలు గురించి చెబుతుంది. ఇది మన సామర్థ్యాన్ని పని, లేదా ఒక సమూహం లో, కొన్ని లక్ష్యాన్ని సాధించడాన్ని సూచిస్తుంది. శక్తి, ఆసక్తి, ధైర్యం, పరాక్రమం. మొదలైనవి ద్రేక్కాణ కుండలి ద్వారా తెలుసుకోవచ్చు విశ్లేషణ కొరకు లగ్న కుండలి మరియు కుజుడి స్థితి మరియు 3 వ భావాన్ని తనిఖీ చెయ్యాలి.
చతుర్థాంశ(D4) కుండలి :
చతుర్థాంశ మనకు కలిగే సౌకర్యాలు,గృహ వాహనాది యోగాలు,మన జీవితం కష్టాలతో కూడినదా లేకసుఖాలతో కూడినదా,తదితర అంశాల గురించి చెపుతుంది.
సప్తాంశ(D7) కుండలి :
సప్తాంశ సంతానం గురించి అలాగే మనలో ఉండే సృజనాత్మక శక్తి గురించి చెపుతుంది.
సంతానం,వంశోన్నతి,వంశాభివృద్ధి చూడవచ్చు
దశమాంశ(D10) కుండలి :
దశమాంశ ఉద్యోగము మరియు కీర్తి ప్రతిష్టల గురించి తెలియ జేస్తుంది.
కర్మలు,వాటి ఫలితాలు, ఉద్యోగం,గౌరవాలు,కీర్తిప్రతిష్ఠలు, వృత్తిలో ఒడిదుడుకులు తెలుసుకోవచ్చు.
ద్వాదశాంశ(D12) కుండలి :
ద్వాదశాంశ మన అదృష్టం గురించి, పూర్వ జన్మలో మనం చేసిన కర్మ ఫలితాలను గురించి తెలియజేస్తుంది.అలాగే వంశ సంబంధ దోషాలను గురించి కూడా తెలియ జేస్తుంది. తల్లిదండ్రులతో అనుబంధాలు,వారి నుండి వచ్చే అనారోగ్యాలు,ఎవరి నుండి ఎవరికి సుఖం ఉన్నదో తెలుసుకోవచ్చును.
షోడశాంశ(D16) కుండలి :
షోడశాంశ మనకు గల గృహ, వాహనాది సౌఖ్యాలను గురించి తెలియజేస్తుంది.అలాగే ఒక వ్యక్తి అంతర్గంతంగా ఎలాంటివాడో తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది.వాహనసౌఖ్యం,వాహనాలతో చేసే వృత్తి వ్యాపారాలు లాభిస్తాయో లేదో తెలుసుకోవచ్చును.వాహనానికి ఏరంగు మంచిదో తెలుసుకోవచ్చును.
వింశాంశ(D20) కుండలి:
వింశాంశ మనం చేసే దైవారాధన, అనుకూల దైవం, గురూపదేశం తదితర ఆధ్యాత్మిక అంశాలను
తెలియ జేస్తుంది.మనం ఏ దేవున్ని ఉపాసన చేయాలి అనేది దీని ద్వారా కనుక్కోవచ్చు. మంత్రోచ్చారణ ,దేవుడిని పూజించేటప్పుడు అడ్డంకులు వస్తాయో లేదో తెలుసుకోవచ్చును. వింశాంశలో శుక్రుడు బలహీనంగా ఉండాలి.బలహీనంగా ఉంటేనే సన్యాసియోగం వస్తుంది. అప్పుడే దైవచింతన చేయగలడు.
చతుర్వింశాంశ(D24) కుండలి :
చతుర్వింశాంశ మన విద్యను గురించి ఆధ్యాత్మికతను గురించి తెలియజేస్తుంది.
ఉన్నతవిద్య,విదేశి విద్య,
విద్యలో ఆటంకాలు గురించి తెలుసుకోవచ్చు.
సప్తవింశాంశ(D27) కుండలి :
సప్తవింశాంశ మన శారీరక, మానసిక శక్తియుక్తుల గురించి తెలియజేస్తుంది.
అలాగే మన జీవితానికి సంబందించిన అంశాల సూక్ష్మపరిశీలనకు లగ్న కుండలితో పాటు దీన్ని కూడా పరిశీలించాలి.
జాతకుడిలో ఉండే బలాలు, బలహీనతలు తెలుసుకోవచ్చును.
త్రింశాంశ కుండలి(D30):
త్రింశాంశ మన కష్ట, నష్టాలను గురించి,అనుకోకుండా వచ్చే ఆపదల గురించి, ప్రమాదాల గురించి తెలియజేస్తుంది. స్త్రీ పురుషుల శీలం,వ్యక్తి యొక్క అంతర్గత ఆలోచనలు,అరిష్టాలు తెలుసుకోవచ్చును.
ఖవేదాంశ(D40)కుండలి :
ఖవేదాంశ జాతకాన్ని మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయటానికి, జాతకంలో కల శుభాశుభ అంశాలను తెలుసుకోవటానికి అలాగే మనకు కల అలవాట్లను, భావోద్వేగాలను అంచనా వేయటానికి ఉపయోగపడుతుంది. మాతృవంశం నుండి వచ్చే శుభ కర్మ,అశుభ కర్మ ఫలితాలను తెలుసుకోవచ్చును.
అక్షవేదాంశ కుండలి(D45):
అక్షవేదాంశ మనకుండే నైతిక విలువలను గురించి, జాతకానికి సంబంధించిన అంశాలను సూక్ష్మ పరిశీలన చేయటానికి ఉపయోగ పడుతుంది. తండ్రివంశం నుండి వచ్చే శుభ కర్మ,అశుభ కర్మ ఫలితాలను తెలుసుకోవచ్చును.
షష్ట్యంశ కుండలి (D60):
షష్ట్యంశ జాతకానికి సంబంధించి సూక్ష్మ పరిశీలనకు అలాగే కవలల జాతకాల పరిశీలన విషయంలో ఇది ఉపయోగపడుతుంది. పూర్వజన్మ విషయాలు,కవలల విశ్లేషణకు,ముహూర్తమునకు, ముహూర్త లగ్నం షష్ట్యంశలో మంచిగా ఉండాలి.
Hora Kundalini వర్గులు:
దశవర్గులు:
1.క్షేత్రము,2.హార,3.ద్రేక్కాణము,4.సప్తాంశ,5.నవాంశ,6.దశాంశ,7.ద్వాదంశాంశ,8.షోడశాంశ,9.త్రింశాంశ,10.షష్ట్యంశ యనునవి దశవర్గులు.ఇవి జీవులకు వ్యయదురితచయ శ్రీలనుగలుగ జేయును.
షోడశవర్గులు:
1.క్షేత్రము లేక రాశి, 2.హోర, 3.ద్రేక్కాణము,4.చతుర్ధాంశ,5.సప్తమాంశ,6.నవమాంశ,7.దశమాంశ,8.ద్వాదశాంశ,9.షోడశాంశ,10.వింశాంశ,11.శిద్ధాంశ,12.భాంశ,13.త్రింశాంశ,14.ఖవేదాంశ,15.అక్షవేదాంశ,16.షష్ట్యంశ.
1.క్షేత్రము-30 భాగలు.
2.హోర-రాశిని రెండు సమభాగములు చేయగా ఒక్కొక్క భాగము 15భాగల ప్రమాణమగును.బేసి రాశియందు మెుదటి సగభాగము రవిహోర,రెండవ సగభాగము చంద్రహోర.సమరాశియందుమెుదటి సమభాగము చంద్రహోర.రెండవ సగభాగము రవిహోర.
3.ద్రేక్కాణము-రాశిని 3 సమ భాగములు చేయగా ఒక్కాక్క భాగము10 బాగల ప్రమాణమగును.మెుదటి భాగమునకు ఆ రాశ్యాధిపతియే ద్రేక్కాణధిపతి.రెండవ భాగమునకు ఆ రాశికి పంచమ రాశ్యాధిపతి ద్రేక్కాణాధిపతి.మూడవ భాగమునకు ఆ రాశికి నవమ రాశ్యాధిపతి ద్రేక్కాణాధిపతియగును.
4.చతుర్థాంశ లేక తుర్యాంశ-రాశిని నాలుగు సమ భాగములుచేయగా ఒక్కొక్క భాగము7 భాగల 30 లిప్తలు లేక నిమిషములు అగును.మెుదటి భాగమునకు ఆరాశ్యాధిపతియు, రెండవ భాగమునకు ఆరాశికి చతుర్థాధిపతియు,మూడవ భాగమునకు ఆరాశికి సప్తమాధిపతియు,నాల్గవ భాగమునకు ఆ రాశికి దశమాధిపతియు అధిపతులగుదురు.
5.సప్తమాంశ- రాశిని 7 సమభాగములు చేయగా సంప్తమాంశయగును.ఒక్కొక్కభాగము 4భాగలు 17 1/7 లిప్తలగును.మేషమునకు కుజునితో ప్రారంభింప వలెను.వృషభమునకు వృశ్చిక కుజునితో ప్రారంభింపవలెను. మిథునమునకు మిథున బుధునితోను,కర్కాటకమునకు మకర శనితోను,సింహమునకు రవితోను,కన్యకు మీన గురునితోను,తులకు తులా శుక్రునితోను,వృశ్చికమునకు వృశభ శుక్రునితోను,ధనస్సునకు ధనస్సు గురునితోను, మకరమునకు చంద్రునితోను,కుంభమునకు కుంభ శనితోను,మీనమునకు కన్యాబుధునితోను ప్రారంభించవలెను.ఆ క్రమమున ఆయాగ్రహములు అధిపతులగుదురు.
6.నవమాంశ-రాశిని తొమ్మిది భాగములు చేయగా నవమాంశ యగును.ఒక్కొకక్క భాగము 3 భాగల 20 లిప్తలు.మష ,సింహ,ధనస్సులకు మేషాదిగను; కర్కాట,వృశ్చిక,మీనములకు కర్కాటకాదిగను;వృషభ,కన్య,మకరములకు మకరదిగను; మిథున,తుల,కుంభములకు తులాదిగను నవాంశలను గుణించవలెను.మేష ,సంహ,ధనుస్సుల యెక్కనవాంశలకు మేషము మెుదలుకొని తొమ్మిది రాశుల యెక్కయధిపతులే యెక్కొక్క నవాంశమునకు అధిపతులనియును,కర్కాటక , వృశ్చిక,మీనములకు కర్కాటకాదిగను నవరాశుల అధిపతులు నవరాశుల అధిపతులు నవాంశాధి పతులనియును;వృషభ,కన్య,మకరములకు మకరాదిగ నవరాశ్యాధిపతులు నవాంశధి పతులనియును;మిథున,తుల ,కుంభములకు తులాదిగా నవరాశ్యధిపతులు నవాంశాధిపతులనియును గ్రహించవలెను.
7.దశాంశ-రాశిని 10 సమభాగములు చేేయగా దశాంశ ప్రాప్తించును.ఇది యెుక్కొక్క భాగము 3 భాగలగును మేష మెుదటి దశాంశ మేష కుజునితో ప్రారంభ మై మకర శనితో అంతమగును.వృషభ మెుదటిదశాంశ మకర శనితో ప్రారంభమై తులశుక్రునితో అంతమగును.ఓజరాశులకు ఆ రాశిమెుదలు,యుగ్మరాశులకు ఆ రాశికి తొమ్మిదవ రాశిమెదలు దశాంశ రాశులగును.ఆయా రాశ్యాధిపతులే ఆంశాధిపతులగుదురు.
8.ద్వాదశాంశ–రాశిని 12సమ భాగములు చేయగా ద్వాదశాంశయగును.ఇది 2 భాగల 30 లిప్తల ప్రమాణము గలది.ఈ అంశలకు అధిపతులు ఆయా రాశ్యాధిపతుల నుండి క్రమముగానుండును.
9.షోడశాంశ- రాశిని 16 సమ భాగములు చేయగా షోడశాశయగును.ఒక్కొక్కభాగము 1భాగ 52 లిప్తల 30 విలిప్తలు,మేష,కర్కట,తుల,మకరములకు మేష కుజాది చంద్రుని వరకు;కర్కట,సింహ,వృశ్చిక,కుంభములకు రవ్యాది వృశ్చిక,కుజునివరకు;మిథున,కన్య,ధనుర్మీనములకు,ధనస్సుగురు మెుదలు మీన గురుని వరకు అధిపతులు.
10.వింశాంశ-రాశిని 20 సమ భాగములు చేయగా ఒక్కొక్కభాగము1భాగ 30 లిప్తలగును.చరరాశులకు మేష కుజునితోను, స్ఠిరరాశులకు ధనుస్సు గురునితోను,ద్విస్వభావ రాశులకు రవితోను అధిపతులు ప్రారంభమదురు.
సిద్ధాంశ-రాశిని 24 సమభాగములు చేయగా ఒక్కొక్క భాగము1 భాగ 15 లిప్తలగును. బేసి రాశులకురవ్యాదిగను,సమ రాశులకు చంద్రాదిగను గ్రహములు అధిపతులగుదురు.
12.భాంశ- రాశిని 27 సమభాగములు చేయగాఒక్కొక్క భాగము1 భాగ 6లిప్తల 40 విలిప్తల ప్రమాణమగును.ప్రతిరాశికి ఆ రాశినాధునితో ప్రారంభమై క్రమముగా 27 గ్రహములు భాంశనాధులగుదురు.
13.త్రింశాంశ-రాశిని 30 సమభాగములు చేయగా ఒక్కొక్క భాగము 1భాగ ప్రమాణమగును.ఓజరాశులందు మెదటి 5 భాగలకు కుజుడు.5నుండి 10 వరకు శని,10నుండి 18 వరకు గురుడు, 18 నుండి 25 వరకు బుధుడు 25 నుండి 30 వరకు శుక్రుడు అధిపతులు. సమరాశులకు మెదటి 5 భాగలకు శుక్రుడు, 5 నుండి 12 వరకు బుధుడు,12 నుండి 20 వరకు గురుడు,20 నుండి 25 వరకు శని,25 నుండి 30 వరకు కుజుడు అధిపతులు.
14.ఖవేదాంశ-రాశిని 40 సమభాగములు చేయగా ఒక్కొక్క భాగమునకు 45లిప్తల ప్రామాణము ప్రాప్తించును.బేసి రాశులకు మేష కుజాదిగను,సమ రాశులకు తుల శుక్రాదిగను అంశనాధులగుచున్నారు.
15.అక్ష వేదాంశ-రాశిని 45 సమ భాగములు చేయగా ఒక్కొక్కభాగమునకు 40 లిప్తల ప్రమాణము ప్రాప్తించును.చర రాశులకు మేషాదిగను,స్ఠిర రాశులకు సింహదిగను,ద్విస్వభావ రాశులకుధనురాదిగను గ్రహములు అధిపతులగుదురు.
16.షష్ట్యంశ-రాశిని 60 భాగములు చేయగా ఒక్కొక్క భాగము 30 లిప్తల ప్రమాణమగును.బేసి రాశులందు మెుదటి రెండుపాప షష్ట్యంశలు.3 నుండి 6 వరకుశుభము 7నుండి 12వరకు పాపము.13-14 శుభము15.పాపము 16 నుండి 20 వరకు శుభము.27 పాపము.28-29 శుభము.30 నుండి 36 వరకు పాపము 37 నుండి39 వరకు శుభము 40-14 పాపము 42 శుభము 43-44 పాపము 45 నుండి 48 వరకు శుభము.49-50 పాపము 51 శుభము 52 పాపము 53 నుండి 58 వరకు శుభము 59 పాపము 60 శుభము.సమ రాశులు 1 శుభము. 2 పాపము.3 నుండి 8 వరకు శుభము 9 పాపము.10 శుభము.11-12 పాపము.13 నుండి 16 వరకు శుభము.17-18 పాపము.19 శుభము.20-21 పాపము 22 నుండి 24 వరకు శుభము.25 నుండి 31 వరకు పాపము.32-33 శుభము. 34 పాపము. 35 నుండి 45 వరకు శుభము.46 పాపము.47-48 శుభము 49 నుండి 54 వరకు పాపము.55 నుండి 58 వరకు శుభము!.59-60 పాపము.
జోతిష్యంలో వర్గ చక్రాల్లో ఒక శుభ గ్రహం ఉంటె:
ఏదేని ఒక గ్రహము శుభ స్థానంలో 2 వర్గచక్రాలలో ఉన్న భేధక అంటారు
ఏదేని ఒక గ్రహము శుభ స్థానంలో 3 వర్గచక్రాలలో ఉన్న కుసుమ అంటారు
ఏదేని ఒక గ్రహము శుభ స్థానంలో నాలుగు వర్గచక్రాలలో ఉన్న నాగపుష్ప అంటారు
ఏదేని ఒక గ్రహము శుభ స్థానంలో 5 వర్గచక్రాలలో ఉన్న కందూక అంటారు
ఏదేని ఒక గ్రహము శుభ స్థానంలో ఆరు వర్గచక్రాలలో ఉన్న కీరల అంటారు
ఏదేని ఒక గ్రహము శుభ స్థానంలో ఏడు వర్గచక్రాలలో ఉన్న కల్పవృక్ష అంటారు
ఏదేని ఒక గ్రహము శుభ స్థానంలో 8 వర్గచక్రాలలో ఉన్న చంద వన అంటారు
ఏదేని ఒక గ్రహము శుభ స్థానంలో తొమ్మిది వర్గచక్రాలలో ఉన్న పూర్ణచంద్ర అంటారు
ఏదేని ఒక గ్రహము శుభ స్థానంలో 10 వర్గచక్రాలలో ఉన్న ఉచ్చసేవర అంటారు
ఏదేని ఒక గ్రహము శుభ స్థానంలో 11 వర్గచక్రాలలో ఉన్న ధన్వంతరి అంటారు
ఏదేని ఒక గ్రహము శుభ స్థానంలో 12 వర్గచక్రాలలో ఉన్న సూర్యకాంత అంటారు
ఏదేని ఒక గ్రహము శుభ స్థానంలో 13 వర్గచక్రాలలో ఉన్న విదురం అంటారు
ఏదేని ఒక గ్రహము శుభ స్థానంలో 14 వర్గచక్రాలలో ఉన్న ఇంద్రాసన అంటారు
ఏదేని ఒక గ్రహము శుభ స్థానంలో పదిహేను వర్గచక్రాలలో ఉన్న గానలోక అంటారు
ఏదేని ఒక గ్రహము శుభ స్థానంలో పదహారు వర్గచక్రాలలో ఉన్న శ్రీ వల్లభ అంటారు.ఓం శనైశ్చరాయనమః
వారాల పేర్ల వెనుక దాగున్న శాస్త్రీయ నిబద్ధత :
ఆది వారము, సోమ వారము, మంగళ వారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శని వారము. ఇలా ఈ ఏడు రోజులకు ఏడు పేర్లు ఎందుకు పెట్టారు. ఆ పేర్ల నిర్ణయానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి వుంది. నిర్ధిష్టమైన పద్ధతిలో పూర్వ కాలంలో భారత మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారు.
భారత కాలమానంలో హోరా అనగా ఒక గంట అని అర్థం. దీని నుండి పుట్టినదే ఇంగ్లీషు హోఊఋ.
ఒక రోజుకు 24 గంటలుంటాయి, అంటే 24 హోరాలు. ఒక రోజులో ఉన్న 24 గంటలు (24 హోరాలు) కూడా ఏడు హోరాల చక్రం లో తిరుగుతాయి.. ఆ 7 హోరాలకి ఏడు పేర్లున్నాయి. అవి వరుసగా… (ఈ వరుసలోనే) శని, గురుడు, కుజుడు, రవి, శుక్ర, బుధ, చంద్ర హోరాలు ప్రతి రోజు వుంటాయి.
ఈ 7 హోరాలే ప్రతి రోజు 24 గంటల్లో ఉంటాయి.. 7 గంటల కొకసారి ఈ 7 హోరాలు పూర్తీ అయ్యాక మళ్ళీ మొదటి హోరాకి వస్తుంది.. అంటే శని హోరా నుండి చంద్ర హోరాకి మళ్ళీ శని హోరాకి..ఉదాహరణకు ఆది వారము రవి హోరాతో ప్రారంభం అయి మూడు సార్లు పూర్తికాగా (3 సార్లు 7 హోరాలు 3క్ష్7 = 21 హోరాలు) 22 వ హోరాపేరు మళ్ళీ రవి హోరా వస్తుంది. 23 వ హోరా పేరు ఆ వరుసలో శుక్ర హోరా అవుతుంది. 24 వ హోరా బుధ హోర అవుతుంది. దాంతో ఒక రోజు పూర్తవుతుంది.
ఆతర్వాత హోరా 25వ హోరా. అనగా తరువాతి రోజు మొదటి హోరా దాని పేరు చంద్ర హోరా. అనగా సోమవారము. అనగా చంద్ర హోరాతొ ప్రారంభ మౌతుంది. ఏరోజు ఏ హోరాతో ప్రారంభ మవుతుందో ఆ రోజుకు ఆ హోరా పేరున దానికి ఆ పేరు వుంటుంది.
చంద్ర హోరాతో ప్రారంభమైనది కాబట్టి అది సోమ వారము. ఈ విధంగానే మిగిలిన రోజులు కూడా ఆయా హోరాల పేరన పేర్లు ఏర్పడతాయి.
రవి (సూర్యుడు) హోరాతో ప్రారంభం = రవివారం, (ఆదిత్య అన్న కూడా సూర్యుడు పేరే) ఆదివారం, భానుడు అన్న కూడా సూర్యుడే భానువారం (కర్ణాటక, తమిళనాడు లో భానువారం వాడుతారు) ఇలా ఆయా హోరాలు బట్టి రోజుల పేర్లు వచ్చాయి.
ఉదాహరణకు ఆదివారం తరవాత సోమవారం ఎందుకు రావాలి? మంగళ వారమ్ రాకూడదా??
రాదు…ఏందుకంటే ఆదివారం రవి హోరా ప్రారంభం అయ్యింది, తరువాత రోజు అంటే సోమవారం చంద్ర హోరా తో ప్రారంభం అయ్యింది కాబట్టి.