Sankata Nasana Ganesha Vratham
Sankashti Ganesh Chaturthi Vrat/Sankatahara Chaturthi Vinayaka Vratham -సంకట నాశన గణేష వ్రతం:
గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి (Sankashti Chaturthi). అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం (Sankatahara Chaturthi Vratham) అంటారు. ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.
ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి (Angarika Chaturthi) నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి.
ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు(సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి.
Sankatahara Chaturthi Vratham-Pooja Vidhanam/Procedure and Vratha Katha:
సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి.
ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి.
వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే శిరస్సున స్నానం చేసి, తరువాత గణపతిని పూజించాలి.
అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని
పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి.
మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు
ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.
సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను.
ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి.
తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి.
శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును.
సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కడపరాదు.
సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి.
నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి.
Sankashtahara Ganesh Vratha Katha:
సంకట హర చతుర్ధి వ్రత కథ:
ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుం డగా ఘర్‌సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించ సాగాడు.అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు… ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా!అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని!! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.
అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్ర్తీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్ర్తీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ‘నిన్నంతా ఈ స్ర్తీ ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది’ అని చెప్పాడు.
అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేషుని దూతని అపుడు సైనికు లు ఎంతో బ్రతిమాలారు. ఆ స్ర్తీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.
ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.
Sankatahara Chaturthi Vratham Puja Procedure:
ఇంటిలో ఈశాన్యమూల స్థలమును శుద్ది చేసి అలికి,బియ్యపుపిండితోగాని, రంగుల చూర్ణములతోగాని ముగ్గులు పెట్టి దైవస్థపన నిమిత్తమై ఒక పీటను వేయాలి.పీట మరీ ఎత్తుగా గాని,మరీ మట్టుగా గాని ఉండకూడదు.పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి,కుంకుమతో బొట్టు పెట్టి, వరిపిండితో చక్కగా ముగ్గు వేయాలి.సాదారణంగా అష్టదళపద్మాన్నే వేస్తారు.పూజచేసేవారు తూర్పుముఖంగా కూర్చోవాలి.ఏ దైవాన్ని పూజించబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమనుగాని,చిత్రపటమునుగాని ఆ పీటపై ఉంచాలి.ముందుగా పసుపుతో గణపతిని తయారుచేసుకోవాలి.ఆ గణపతికి కుంకుమబొట్టు పెట్టాలి.పిదప ఒకపళ్ళెరంలో బియ్యంపోసి,దానిపై ఒక తమలపాకునుంచి, పసుపు గణపతిని ఆ తమలపాకుపై ఉంచాలి.పీటమీద నైఋతి దిశలో దీపారాధన చేసి,అగరువత్తులు వెలిగించి,ముందుగా యజమానులు(పూజచేసేవారు) ఈ దిగువ కేశవనామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి
Sankashti Ganesh Chaturthi Vratham – Start with Ganapati Prardhana
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే!!
Gananayaka Ashtakam:
గణనాయకాష్టకం
ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతమ్
బాలేందుశకలం మౌళీ, వందేహం గణ నాయకమ్చిత్రరత్నవిచిత్రాంగం, చిత్రమాలా విభూషితమ్
కామరూపధరం దేవం, వందేహం గణనాయకమ్
గజవక్త్రం సురశ్రేష్ఠం, కర్ణచామర భూషితమ్
పాశాంకుశధరం దేవం వందేహం గణ నాయకమ్
మూషికోత్తమ మారుహ్య దేవాసురమహాహవే
యోద్ధుకామం మహావీరం వందేహం గణ నాయకమ్
యక్షకిన్నెర గంధర్వ, సిద్ధ విద్యాధరైస్సదా
స్తూయమానం మహాబాహుం వందేహం గణ నాయకమ్
అంబికాహృదయానందం, మాతృభి: పరివేష్టితమ్
భక్తిప్రియం మదోన్మత్తం, వందేహం గణ నాయకమ్
సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితమ్
సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణ నాయకమ్
గణాష్టకమిదం పుణ్యం, యః పఠేత్ సతతం నరః
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్
ఇతి శ్రీ గణనాయకాష్టకం
కేశవనామాలు-ఆచమనం:
కుడి చేతి చూపుడు వ్రేలుకు,నడిమి వ్రేలుకు మద్యన బొటన వ్రేలుంచి,చూపుడువేలును బొటన వ్రేలుపైకి మడిచి తక్కిన మూడు వ్రేళ్ళూ చాపి,అరచేతిని దోనెలా మలచి ఉద్దరిణెడు ఉదకాన్ని యెడమచేతితో తీసుకుని కుడిచేతిలో పోసుకుని,ముందుగా
1. “ఓం కేశవాయస్వాహ” అని చెప్పుకుని లోనికి తీసుకోవాలి,ఆనీరు కడుపులో బొడ్డువరకు దిగిన తరువాత మరల పైవిధంగానే
2. “ఓం నారాయణాయ స్వాహ” అనుకుని ఒకసారీ,
3. “ఒం మాధవాయస్వాహ” అనుకుని ఒకసారి జలం పుచ్చుకోవలెను.అట్లు చేసి
4. “ఓం గోవిందాయనమః” అని చేతులు కడుగుకోవాలి.పిదప
5. “విష్ణవేనమః” అనుకుంతూ నీళ్ళు తాకి,మధ్యవ్రేలు,బొటనవ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి.పిదప
6. “ఓం మధుసూదనాయనమః”,పై పెదవిని కుడినించి ఎడమకి నిమురుకోవాలి.
7. ఓం త్రివిక్రమాయనమః క్రింద పెదవిని కుడినించి ఎడమకి నిమురుకోవాలి.
8,9.ఓం వామనాయనమః,ఓం శ్రీధరాయనమః , ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లుకోవాలి.
10.ఓం హృషీకేశాయనమః ఎడమ చేతితో నీళ్ళు చల్లలి.
11. ఓం పద్మనాభాయనమః పాదాలపై ఒక్కొక్క చుక్కనీరు చల్లుకోవాలి.
12. ఓం దామోదరాయనమః శిరస్సుపై జలమును ప్రొక్షించుకోవలెను.
13.ఓం సంకర్షణాయనమః చేతివ్రేళ్ళు గిన్నెలా వుంచి గెడ్డము తుడుచుకోవలెను.
14. ఓం వాసుదేవాయనమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకోవలెను.
15,16. ఓం ప్రద్యుమ్నాయనమః, ఓం అనిరుద్దాయనమః నేత్రాలు తాకవలెను.
17,18. ఓం పురుషొత్తమాయనమః , ఓం అధోక్షజాయనమః రెండు చెవులూ తాకవలెను.
19,20. ఓం నారసిం హాయనమః,ఓం అచ్యుతాయనమః బొడ్డును స్పౄశించుకోవలెను.
21.ఓం జనార్ధనాయనమః చేతివ్రేళ్ళతో వక్షస్థలం,హృదయం తాకవలెను22. ఓం ఉపేంద్రాయనమః-చేతికొనతో శిరస్సు తాకవలెను.
23,24. ఓం హరయేనమః,ఓం శ్రీకృష్ణాయనమః-కుడి మూపురమును ఎడమ చేతితోను,ఎడమ మూపురమును కుడిచేతితోను తాకవలెను.
Sankashti Ganesh Chaturthi Vratham గణపతి ప్రార్ధన:
ఏకాహారతి వెలిగించాలి:
ఏకాహారతి వెలిగించి దానికి పసుపు, కుంకుమ, అక్షంతలు & పూల తో అలంకరించవలెను.
దీపారాధన వెలిగించేటప్పుడు శ్లోకం:
యీ క్రింది మంత్రమును చెప్పుతూ దీపమును ఏకాహారతి తోటి దీపం వెలిగించాలి
దీపతయవాం బ్రహ్మరూపో సి జ్యాతిషాం ప్రభురరవాః
సౌభాగ్యం దేహి పుత్రాంశచ సర్వవన్ క్మాంాంశచ దేహిమ
షొడశోపచార పూజావిధి:
(మన ఇంటికి వచ్చిన పెద్దలని ఏవిధంగా ఆహ్వనించి మర్యాద చేస్తామో అదేవిధంగా మన ఇష్టదైవాన్ని కూడా పూజాపరంగా మర్యాద చేయడమే షోడశ(పదహారు) ఉపచారాల విధానం. ఈ విధానం ప్ర దేవతా పూజలోనూ పాటించి తీరాలి)
1.ఆవహనము: మన్స్పూర్తిగా మన ఇంట్లోకి స్వాగతం పలకడం.
2.ఆసనము: వచ్చినవాళ్ళు కూర్చునేందుకు ఏర్పాటు చేయడం.
3.పాద్యము: కాళ్ళు కడుగుకునేందుకు నీళ్ళను ఇవ్వడం.
4.అర్ఘ్యము: చేతులు పరిశుబ్రపరచడం.
5.ఆచమనీయము: దాహము(మంచినీళ్ళు) ఇచ్చుట.
6.స్నానము: ప్రయాణాలసట తొలగే నిమిత్తం.
7.వస్త్రము: స్నానంతరం ఫొ(మ)డి వస్త్రము లనివ్వడము.
8.యజ్ఞోపవీతం: మార్గమధ్యమంలో మైలపడిన యజ్ఞోపవీతాన్ని మార్చడం.
9.గంధం: శరీరం మీద సుగంధాన్ని చిలకడం.
10.పుష్పం: వాళ్ళు కూడా సుగంధాన్ని ఆస్వాదించే ఏర్పాటు
11.ధుపము: సుగంధమయ వాతావరణాన్ని కల్పించడం
12.దీపము: పరస్పరం పరిచయానికి అనుకూలతకోసం
13.నైవేద్యము: తన స్థాఇననుసరించి తనకై సాధించిన దానినే ఇష్టదైవానికి కూడా ఇవ్వడం.
14.తాంబూలము: మనం భక్తితోఇచ్చిన పదార్దాలవల్ల వారి ఇష్టాఇష్టాలకి(రుచులకి)కలిగే లోపాన్ని తొలగించడం. 15.నమస్కారము: గౌరవించడానికి సూచన
16.ప్రదక్షిణము: ముమ్మూర్తులా వారి గొప్పదనాన్ని అంగీకరించడం
ప్రాణాయామం: ఓం భూః | ఓం భువః | ఓగ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్ సత్యం |
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||
||ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్||
(ఎవరి కుడిచేతితో వారు తమ ముక్కును పట్టుకుని ఈ దిగువ మంత్రము చెప్పుకోవలెను) ఓం భూః ఓం భువః-ఓ గ్ ం సువః- ఓం మహః-ఓం జనః-ఓం తపః-ఓ గ్ ం సత్యం-ఓం_తత్ సవితుర్ వరేణ్యేం-భర్గోదేవస్య ధీమహీ-ధియో యోనః ప్రచోదయాత్- ఓం అపోజ్యొతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సురోం. (పిమ్మట ఇట్లు సంకల్పం చెప్పుకోవలెను)
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా
యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః ||
(అని నాలుగు దిక్కులా ఉద్ధరని తో నీళ్ళు చల్లవలెను. సుద్ధి చేసినట్టుగా.)
సంకల్పం:
Do sankalpa given details in this link Check here for Sankalpam Mantra
కలశారాధన:
అదౌ నిర్విఘ్న పరి సమాప్త్యర్ధం శ్రీ మహాగణపతి పూజార్ధం తదంగ కలశారాధనం కరిష్యే.
అటు పిమ్మట ఒక పాత్రకు (చెంబువంతిడానికి-లేదా గ్లాసుకు)పసుపు పూసి, గంధం, కుంకుమబొట్టు పెట్టి ఆ జలపాత్రలో ఒక పువ్వును కాని, పత్రినికాని ఉంచి యజమానులు(ఒకరైతే ఒకరు ,దంపతులైతే ఇద్దరూను) ఆ కలశాన్ని కుడిచేతితో మూసి ఉంచి- ఇలా అనుకోవాలి
శ్లో: కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితాః
మూలే తత్రస్థితో బ్రహ్మా-మధ్యే మాతృగణాస్మృతాః
కుక్షౌతుసాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేద స్సా మవేదోహ్యధర్వణః
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
అత్ర తిష్ఠంతు సావిత్రీ-గాయత్రీ చ సరస్వతీ
స్కందోగణపతిశ్చైవ శాంతిః పుష్ఠ్కరీ తధా-
శ్లో: గంగే చ యమునేచైవ గోదావరీ సరస్వతీ
నర్మదా సింధూ కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు
అయాంతుం దేవపూజార్ధం -మమ దురితక్షయ కారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మనాం చ సంప్రోక్ష్యహః
ఆ కలశమందలి నీరును పువ్వుతోగాని ఆకుతోగాని ఈదిగువ మంత్రం చదువుతూ-దేవతలపైనా,పూజాద్రవ్యాలపైనా,తమపైనా చిలకరించుకోవలెను.
(శిరస్సు పైన పూజా ద్రవ్యముల పైన నీరు చల్లవలెను)
ఆత్మానం సంప్రోక్ష్య, పూజ ద్రవ్యాణి సంప్రోక్ష్య.
మార్జనము:
ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపివా
య స్మరేత్పుండరీకాక్షం స బాహ్యంభ్యంతరశ్శుచిః.
పిదప కాసిని అక్షతలు,పసుపు,గణప్తిపై వేసి,ఆయనను తాకి నమస్కరించి ప్రాణప్రతిష్ఠ చేవలెను.
శ్రీ మహగణాధిపతయే నమః ప్రాణ ప్రతిస్ఠాపన ముహుర్తస్సు -తధాస్తు.తరువాత దిగువ విధంగా చదువుతూ పసుపు వినాయకునకు నమస్కరించాలి.
సుముఖ శ్చై కదంతశ్చ కపిలో గజకర్ణః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః
ధూమకేతు ర్గణాద్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబో స్కందపూర్వజః
షోడశైతాని నామాని యఃపఠేచ్చుఋణుయా దపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే
ఓం శ్రీ మహగణాధిపతియే నమః ధ్యాయామి-(అని కాసిని అక్షతలు పసుపు గణపతిపై వేయవలెను.)
Sankashti Ganesh Chaturthi Vratham షొడశోపచార పూజ:
ధ్యానం:
శ్లో: భవసంచిత పాపఘ విద్వంసన విచక్షణం
విఘ్నాంధకార భాసత్వం విఘ్న రాజ మహం భజే
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పశాంకుశధరం దేవం ధ్యే త్సిద్దివినాయకం
శ్లో: ద్యాయే ద్గజాననం దేవం తప్త కాంచన సన్నిభం
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం
ఓం శ్రీ మహగణాదిపతయే నమః ధ్యానం సమర్పయామి
ఆవాహనం:
అత్రాగచ్చ జగద్వంద్వ -సురరా జి ర్చితేశ్వర
అనాధనాధ సర్వజ్ఞ-గౌరీగర్భసముద్భవ
ఓం శ్రీ మహగణాధిపతయే నమః-ఆవాహయామి
ఆసనం:
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నై ర్విరాజితం
రత్నసిమ్హాసనం చారుప్రీత్యర్ధం ప్రతిగ్రుహ్యతాం
ఓం శ్రీ మహాగణపదిపతయేనమః – సిం హాసనార్ధం అక్షతాన్ సమర్పయామి- అని చెప్పుకుని అక్షతలు వేయవలెను.
అర్ఘ్యం:
గౌరిపుత్ర నమస్తేస్తు శంకర్స్య ప్రియనందనగృహాణార్ఘ్యం మయాదత్తం గృహాణ ద్విరదానన
ఓం శ్రీ మహగణాదిపతయేనమః అర్ఘ్యం సమర్పయామి-పువ్వుతో నీరు చల్లవలెను.
పాద్యం:
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన
ఓం శ్రీ మహాగణాదిపతయే నమః-పాద్యం సమర్పయామి అని పువ్వుతో నీరు చల్లవలెను.
ఆచమనీయం:
అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయాప్రభో
ఓం శ్రీ మహగణాధిపతయేనమః_ఆచమనీయం సమ్ర్పయామి
మధుపర్కం:
దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్వేన సమన్వితం
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః -మధుపర్కం సమర్పయామి
పంచామృతస్నానం:
స్నానం పంచామృతైర్ధేవ గృహాణ గణనాయక
అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణగణ పూజిత
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః-పంచామృతస్నానం సమర్పయామి. (ఆవుపాలు,ఆవుపెరుగు,ఆవునెయ్యి,తేనె,పంచదార అనే ఆయిదింటినీ కలిపి పంచామృతములంటారు.
శుద్దోదకస్నానం:
గంగాది సర్వతీర్ధ్యేభ్యై రాహ్రుతైరమలైర్జలైః
స్నానం కురుష్వ భగవన్నుమాపుత్రనమౌస్తుతే
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః-శుద్దోదకస్నానం సమర్పయామి.
వస్త్రయుగ్మం:
రక్తవస్త్రద్వయం చారుదేవయోగ్యంచ మంగళం
శుభప్రదం గృహాణ త్వం లంబోదర హరాత్మజః
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః-వుపవీతం సమర్పయామి.
గంధం:
చందనాగరు కర్పూరం కస్తూరీ కుంకుమాన్వితం
విలేపనం సుర శ్రేష్ఠ ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతాం
శ్రీ మహాగణాధిపతయేనమః గంధం సమర్పయామి.
అక్షతలు:
ఆక్షతాన్ దవళాన్ దివ్యాన్ శాలియాన్ స్తండులాన్ శుభాన్
గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే
ఓం శ్రీమహాగణాధిపతయేనమః అక్షతాన్ సమర్పయామి.
పుష్పములు:
సుగంధాని సుపుష్పాణి,జాజికుంద ముఖానిచ
ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః-పుష్పం సమర్పయామి.
అధాంగ పూజా:
శ్రీమహాగణాధిపతయేనమః-పాదౌ పూజయామి
ఏకదంతాయనమః-గుల్భౌపూజయామి
శూర్పకర్ణాయనమః-జానునీ పూజయామి
విఘ్నరాజేనమః-జంఘే పూజయామి
అఖువాహనాయనమః-ఊరుం పూజయామి
హేరంభాయనమః-కటిం పూజయామి
లంబోదరాయనమః-ఉదరం పూజయామి
గణనాదాయనమః-నాభిం పూజయామి
గణేశాయనమః-హృదయం పూజయామి
స్థూలకంఠాయనమః-కంఠం పూజయామి
స్కంధాగ్రజాయనమః-స్కంధౌ పూజయామి
పాశహస్తాయనమః-హస్తౌ పూజయామి
గజవక్త్రాయనమఃవక్త్రం పూజయామి
విఘ్నహంత్రేనమః-నేత్రౌ పూజయామి
శూర్పకర్ణాయనమః-కర్ణౌపూజయామి
ఫాలచంద్రాయనమః-లలాటం పూజయామి
ఓం శ్రీమహాగణాధిపతయేనమః సర్వాణ్యంగాణి పూజయామి,
శ్రీ గణేశ్వురానుగ్రహసిద్ద్యర్ధం -పత్రం సమర్పయామి.అని చెప్పుకుని వినాయకునిపై పత్రియుంచవలెను.
ముఖ్య గమనిక: వినాయక చవితి నాడు తప్ప ఇంకెప్పుడూనూ గణేశుని తెలసి దళములతో పూజించరాదని పెద్దల వాక్కు.
అనంతరం ఓం గజననాయనమః,ఓం గజవక్త్రాయనమః మొదలగు 108 పేర్లతో వినాయకుని పూజించవలెను. అంత ఓపిక లేనివారు ఈ దిగువ 16 పేర్లూ జపిస్తూ పత్రితో,పుష్పములతో, అక్షతలు వగైరాలతో పూజించవలెను.
1. ఓం సుముఖాయనమః-పత్రం సమర్పయామి
2. ఓం ఏకదంతాయనమః-పుష్పం సమర్పయామి
3. ఓం కపిలాయనమః-అక్షతాన్ సమర్పయామి
4. ఓం గజకర్ణాయనమః-గంధం సమర్పయామి
5. ఓం వికటాయనమః-పత్రం సమర్పయామి
6. ఓం విఘ్నరాజాయనమః-పుష్పం సమర్పయామి
7. ఓం గణాదిపాయనమః-అక్షతాన్ సమర్పయామి
8. ఓం ధూమకేతవే నమః-గంధం సమర్పయామి
9. ఓం గణాద్యక్షాయనమః-పత్రం సమర్పయామి
10. ఓం ఫలచంద్రాయనమః-పుష్పం సమర్పయామి
11. ఓం గజాననాయనమః-అక్షతాన్ సమర్పయామి
12. ఓం వక్రతుండాయనమః-గంధం సమర్పయామి
13. ఓం శూర్పకర్ణాయనమః-పత్రం సమర్పయామి
14. ఓం హేరంభాయనమః-పుష్పం సమర్పయామి
15. ఓం స్కందపూర్వజాయనమః-అక్షతాన్ సమర్పయామి
16. ఓం సర్వసిద్ది ప్రదాయకాయనమః-గంధం సమర్పయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః-నానావిధ-పరిమళ పత్రపుష్ప శ్రీ గంధాక్షత పూజాం సమ్ర్పయామి.
పిదప అగరువత్తి వెలిగించి
శ్లో: దశాంగం గగ్గులోపేతం సుగంధం సుమనోహరం
ధూపం గృహాణ దేవెశ విఘ్నరాజ నమోస్తుతే
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః ధూపం సమర్పయామి- అనుకుంటూ గణపతికి చూపించవలెను.పిమ్మట దీపం వెలిగించి-స్వామికి చూపించుతూ
శ్లో: భక్త్యా దీపం ప్రయచ్చామి-దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్ ఘొరాత్ దివ్యజ్యొతిర్నమోస్తుతే
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః సాక్షాత్ దీపం దర్శయామి. అటు తరువాత ఒక బెల్లం ముక్కను పసుపు గణపతి వద్దనుంచి దానిపై పువ్వుతో నీళ్ళు చల్లుతూ “ఓం శ్రీ మహాగణాధిపతయేనమః- గుడశకల నైవేద్యం సమర్పయామి.ఓం పాణాయస్వాహ,ఓం సమానాయస్వాహ, ఓం శ్రీ మహాగణాధిపతయేనమః”-అంటూ ఆరుమార్లు చేతితో స్వామికి నివేదనం చూపించాలి.పిదప “ఓం శ్రీమహాగణాధిపతయేనమః” నైవేద్యనంతరం-“హస్తౌ ప్రక్ష్యాళయామి”అని పువ్వుతోఒకసారి నీరు చిలకాలి “పాదౌ ప్రక్ష్యాళయామి” అని మరోసారి నీరు చిలకాలి. “పునః శుద్దచమనీయం సమర్పయామి” అని ఇంకొక పర్యాయం నీరు చిలకాలి.తదనంతరం
శ్లో: పూగీఫల సమాఉక్తం నాగవల్లీ దళైర్యుతం
ముక్తాచూర్ణసమాయుక్తం-తాంబూలంప్రతిగృహ్యతాం
అని చెబుతూ మూడు తమలపాకులు,ఒక పోక చెక్క స్వామి వద్ద ఉంచాలి.శుద్దాచమనీయం సమర్పయామి అనుకోవాలి.
కర్పూరం వెలిగించి–ఓం శ్రీమహాగణాధిపతయేనమః-కర్పూర నీరాజనం సమర్పయామి. అని ప్రదక్షిణగా తిప్పుతూ చిన్నగా ఘంట వాయించవలెను.అనంతరం మళ్ళా పువ్వుతో నీరు చిలుకుతూ “కర్పూర నీరాజానంతరం-శుద్దచమనీయం సమర్పయామి”అనుకోవాలి.
మంత్రపుష్పము:
అక్షతలు,పువ్వులు,చిల్లర డబ్బులు చేతితో పట్టుకొని
మం: ఓం -హిరణ్య గర్భస్థం-హేమబీజం విభావసో
అనంతంపుణ్యఫలదం-అ(ం)త శ్శాంతింప్రయచ్చమే
“ఓం శ్రీ మహాగణాధిపతయేనమః-ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.పిమ్మట స్వామికి సాష్టాంగ దండప్రమాణాలాచరించి మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ-
శ్లో: ఆయుర్దేహి యసోదేహి-శ్రియంసౌఖ్యంచ దేహిమే
పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహిమే గణనాయక
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః-ప్రార్ధన నమస్కారాన్ సమర్పయామి అని ప్రార్ధించుకోవాలి.
అటుపైన పురుషుడు తన చేతితో అక్షతలు తీసుకుని,భార్యచేత అందులో ఉదకం పొయించుకొని–
“అవయా ధ్యానావాహనాది షొడశోపచార పూజయాచ-భగవాన్-సర్వాత్మకః-శ్రీ మహాగణాధిపతి స్సుప్రీతో సుప్రసన్నో వరదోభూత్వా-ఉత్తరేశుభకర్మ ణ్యవిఘ్నమస్తితి భవంతో బ్రువంతు-ఉత్తరేశుభకర్మ ణ్యవిఘ్నమస్తు–తధాస్తు.
“శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసాగృహ్ణామి” అనుకొని స్వామి వద్ద అక్షతలు తీసుకొని తమ తలపై వెసుకోవలెను.ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి యెత్తి- తిరిగి క్రింద ఉంచి,పళ్ళెరములో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీఠముపై నుంచవలెను.
శ్లో: గచ్చ -గచ్చ-గణాధ్యక్ష్య స్వస్థానం పార్వతీసుత
యత్ర మహేస్వరోదేవ స్తత్రగచ్చ గణాధిప
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః-యధాస్థానం ప్రవేసయామి.శోభనార్ధం పునరాగమనాయచ.ఇతి శ్రీ హరిద్రాగణపతీ(పసుపు గణపతి) పూజా సమాప్తః
అధ సంకటహర గణపతి దేవతా పూజా ప్రారంభః
Again do sankalpa for Sankatahara Ganapati and do shodashopachara puja for Sankashti Ganesh.
ధూపం: మం: అపస్రజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే నిచ దేవీం మాతరం శ్రీ యం వాసయమే
శ్లో: దశాంగం గగ్గులోపేతం సుగంధం సుమనోహరం కపిలాఘృత సముక్తం ధూపోయం
శ్రీ సంకటహర గణపతినమః-ధూపమాఘ్రాపయామి అని సాంబ్రాణి ధూపం వేయవలెను.
అన్యా ధ్యాన్ ఆవాహ్నాది షోడశోపచర పూజయా చ శ్రీ సంకష్టహ్ర గణపతి దేవతా సుప్రసన్న సుప్రీతో వరదో భవతు.
ఉద్వాసన:
Do Next Day:
న్మసేత విఘన ర్వజాః న్మసేత విఘననాశన్
బ్రాహ్మణేభోాభానుజాోతా గ్ఛ్చదేవ ఃధ్య సుఖాం
శ్రీ సాంకష్టహ్ర గ్ణేశవర్వః న్మ ఃధ్యస్వైన్ాం ఉదావసయామి;
పున్ర్వగ్మనాఃచ
Sankashti Ganesh Chaturthi Vratham Stotram- Sankatahara Ganapati Stotram in Telugu:
సంకటహర గణపతి స్తోత్రం
నారదౌవాచ :
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాసం స్మరేన్నిత్యమాయు: కామార్ధ సిద్ధయే
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం
లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకం
నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్
ద్వాదశైతావి నామాని త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం
నచవిఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో
విద్యార్దీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనం
పుత్రార్దీ లభతే పుత్రాన్ మోక్షార్ధీ లభతే గతిమ్
జపేత్ గణపతిస్తోత్రం చతుర్మాసై: ఫలం లభత్
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః
Sankashti Ganesh Chaturthi Vratham- Vighneswara Namaskara Stotram in Telugu:
విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం
జయ విఘ్నేశ్వర! నమో నమో, జగద్రక్షకా! నమో నమో
జయకర! శుభకర! సర్వపరాత్పర! జగదుద్ధారా! నమో నమో
మూషిక వాహన! నమోనమో, మునిజనవందిత! నమో నమో
మాయా రాక్షస మదాపహరణా! మన్మధారిసుత! నమో నమో
విద్యాదాయక! నమో నమో, విఘ్నవిదారక, నమో నమో
విశ్వసృష్టి లయ కారణ శంభో! విమల చరిత్రా! నమో నమో!
గౌరీప్రియ సుత నమో నమో గంగానందన నమో నమో
అధర్వాద్భుతగానవినోదా! గణపతిదేవా! నమోనమో!
నిత్యానంద! నమో నమో, నిజఫలదాయక! నమో నమో
నిర్మలపురవర! నిత్యమహోత్సవ! రామనాథ సుత నమో నమో
Sankashti Ganesh Chaturthi Vratham Ashtottaram / Sankashtahara Ganesha Ashtottaram:
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నారాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్త్వెమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః (10)
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః (20)
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళ స్వరాయ నమః
ఓం ప్రమధాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః (30)
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రిత వత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః (40)
ఓం బలోత్థితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణ పురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః (50)
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వ కర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః
ఓం సర్వ సిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః (60)
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసుర భంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థవనప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః (70)
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం జిష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్త జీవితాయ నమః
ఓం జిత మన్మథాయ నమః
ఓం ఐశ్వర్య కారణాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షకిన్నెర సేవితాయ నమః
ఓం గంగా సుతాయ నమః
ఓం గణాధీశాయ నమః (80)
ఓం గంభీర నినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్ట వరదాయినే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్త నిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం మంగళ ప్రదాయ నమః
ఓం అవ్వక్తాయ నమః
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః (90)
ఓం సఖయే నమః
ఓం సరసాంబు నిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖాలాయ నమః
ఓం సమస్తదేవతా మూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాత కారిణే నమః
ఓం విశ్వగ్దృశే నమః (100)
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణ గురవే నమః
ఓం ఉన్మత్త వేషాయ నమః
ఓం అపరాజితే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్త్వెశ్వర్యప్రదాయ నమః
ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః (108)