Bathukamma Songs Lyrics in Telugu
Bathukamma Songs Telugu:
ఒక్కేసి పువ్వేసి చందమామా… ఒక్క జాము ఆయె చందమామా
ఒక్కేసి పువ్వేసి చందమామా… ఒక్క జాము ఆయె చందమామా
పైన మఠం కట్టి చందమామా… కింద ఇల్లు కట్టి చందమామా
మఠంలో ఉన్న చందమామా… మాయదారి శివుడు చందమామా
శివపూజ వేళాయె చందమామా… శివుడు రాకపాయె చందమామా
గౌరి గద్దెల మీద చందమామా… జంగమయ్య ఉన్నాడె చందమామా
రెండేసి పూలేసి చందమామా… రెండు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా… శివుడు రాకపాయె చందమామా
మూడేసి పూలేసి చందమామా… మూడు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా… శివుడు రాకపాయె చందమామా
నాలుగేసి పూలేసి చందమామా… నాలుగు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా… శివుడు రాకపాయె చందమామా
ఐదేసి పూలేసి చందమామా… ఐదు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా… శివుడు రాకపాయె చందమామా
ఆరేసి పూలేసి చందమామా… ఆరు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా… శివుడు రాకపాయె చందమామా
ఏడేసి పూలేసి చందమామా… ఏడు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా… శివుడు రాకపాయె చందమామా
ఎనిమిదేసి పూలేసి చందమామా… ఎనిమిది జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా… శివుడు రాకపాయె చందమామా
తొమ్మిదేసి పూలేసి చందమామా… తొమ్మిది జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా… శివుడు రాకపాయె చందమామా
తంగేడు వనములకు చందమామా… తాళ్ళు కట్టాబోయె చందమామా
గుమ్మాడి వనమునకు చందమామా… గుళ్ళు కట్టాబోయె చందమామా
రుద్రాక్ష వనములకు చందమామా… నిద్ర చేయబాయె చందమామా
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన
రాగిబింద తీసుక రమణి నీళ్లకు వోతే
రాములోరు ఎదురయ్యే నమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన
వెండి బింద తీసుక వెలది నీళ్లకు వోతే
వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన
బంగారు బింద తీసుక బామ్మా నీళ్లకు వోతే
భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన
పగిడి బింద తీసుక పడతి నీళ్లకు వోతే
పరమేశు డెదురాయే నమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన
ముత్యాల బింద తీసుక ముదిత నీళ్లకు వోతే
ముద్దుకృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన
ఈ వాడ వాడవాడల్లోన బతుకుమ్మ సమయంలో మార్మోమ్రోగుతుంది.
ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో..ఒక్కఊరికిస్తె ఉయ్యాలో
ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో..ఒక్కఊరికిస్తె ఉయ్యాలో
ఒక్కడే మాయన్న ఉయ్యాలో..ఒచ్చెన పొయెన ఉయ్యాలో
ఎట్లొత్తు చెల్లెలా ఉయ్యాలో..ఏరడ్డమాయె ఉయ్యాలో
ఏరుకు ఎంపల్లె ఉయ్యాలో..తలుపులడ్డమాయె ఉయ్యాలో
తలుపు తాళాలు ఉయ్యాలో..వెండివే చీలలు ఉయ్యాలో
వెండి చీలకింది ఉయ్యాలో..వెలపత్తి చెట్టు ఉయ్యాలో
వెలపత్తి చెట్టుకి ఉయ్యాలో..ఏడువిళ్ళపత్తి ఉయ్యాలో
ఏడువిళ్ళపత్తి ఉయ్యాలో..తక్కెడెపత్తి ఉయ్యాలో
ఏడుగింజల పత్తి ఉయ్యాలో..ఎళ్లెనె ఆపత్తి ఉయ్యాలో
ఆప్తి తీసుకొని ఉయ్యాలో..ఏడికిపొయిరి ఉయ్యాలో
పాల పాలపత్తి ఉయ్యాలో..పావురాయి పత్తి ఉయ్యాలో
పాల పాలపత్తి ఉయ్యాలో..బంగారు పత్తి ఉయ్యాలో..!!
ఊరికి ఉత్తరానా.. వలలో
ఊరికి ఉత్తరానా.. వలలో
ఊ రికి ఉత్తరానా … వలలో
ఊడాలా మర్రీ … వలలో
ఊడల మర్రి కిందా … వలలో
ఉత్తముడీ చవికే … వలలో
ఉత్తముని చవికేలో … వలలో
రత్నాల పందీరీ … వలలో
రత్తాల పందిట్లో … వలలో
ముత్యాలా కొలిమీ … వలలో
గిద్దెడు ముత్యాలా … వలలో
గిలకాలా కొలిమీ … వలలో
అరసోల ముత్యాలా … వలలో
అమరీనా కొలిమీ … వలలో
సోలెడు ముత్యాలా … వలలో
చోద్యంపూ కొలిమీ … వలలో
తూమెడు ముత్యాలా … వలలో
తూగేనే కొలిమీ … వలలో
చద్దన్నమూ తీనీ … వలలో
సాగించూ కొలిమీ … వలలో
పాలన్నము తీనీ … వలలో
పట్టేనే కొలిమీ … వలలో
బతుకమ్మను పేర్చే పాట
తొమ్మిదీ రోజులు ఉయ్యాలో
నమ్మికా తోడుత ఉయ్యాలో
అలరి గుమ్మడి పూలు ఉయ్యాలో
అరుగులూ వేయించిరి ఉయ్యాలో
గోరంట పూలతో ఉయ్యాలో
గోడలు కట్టించి ఉయ్యాలో
తామరపూలతో ఉయ్యాలో
ద్వారాలు వేయించి ఉయ్యాలో
మొగిలి పూలతోని ఉయ్యాలో
మొగరాలు వేయించి ఉయ్యాలో
వాయిలీ పూలతో ఉయ్యాలో
వాసాలు వేయించి ఉయ్యాలో
పొన్నపూలతోటి ఉయ్యాలో
యిల్లనూ కప్పించి ఉయ్యాలో
దోసపూలతోని ఉయ్యాలో
తోరణాలు కట్టించి ఉయ్యాలో
పసుపుముద్దను చేసి ఉయ్యాలో
గౌరమ్మను నిలిపిరి ఉయ్యాలో
చేమంతి పూలతోని ఉయ్యాలో
చెలియను పూజించిర ఉయ్యాలో
సుందరాంగులెల్ల ఉయ్యాలో
సుట్టూత తిరిగిరి ఉయ్యాలో
ఆటలు ఆడిరి ఉయ్యాలో
పాటలు పాడిరి ఉయ్యాలో
గౌరమ్మ వరమిచ్చె ఉయ్యాలో
కాంతాలందరికి ఉయ్యాలో
పాడినా వారికి ఉయ్యాలో
పాడి పంటలు కల్గు ఉయ్యాలో
ఆడినా వారికి ఉయ్యాలో
ఆరోగ్యము కల్గు ఉయ్యాలో
విన్నట్టి వారికి ఉయ్యాలో
విష్ణుపథము కల్గు ఉయ్యాలో
Bathukamma Songs Telugu:
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ…
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ…
ఏ మేమి కాయొప్పునే గౌరమ్మ
గుమ్మాడి పువ్వొప్పునే గౌరమ్మ…
గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ
గు మ్మాడి చెట్టుకింద గౌరమ్మ…
ఆట చిలుకాలార గౌరమ్మ
పాట చిలుకాలార గౌరమ్మ…
బమ్మశ్రీమాడలూ గౌరమ్మ
కందొమ్మ గడ్డలూ గౌరమ్మ…
ఎనుగూల కట్టెలూ గౌరమ్మ
తారు గోరంటాలు గౌరమ్మ…
ఎర్రొద్దురాక్షలు గౌరమ్మ
పోను తంగేడుపూలు గౌరమ్మ…
రాను తంగేడుపూలు గౌరమ్మ
ఘనమైన పొన్నపూలే గౌరమ్మ…
గజ్జాల వడ్డాణమే గౌరమ్మ
తంగేడు చెట్టుకింద గౌరమ్మ…
ఆట చిలుకాలార గౌరమ్మ
పాట చిలుకాలార గౌరమ్మ…
బమ్మశ్రీమాడలూ గౌరమ్మ
కందొమ్మ గడ్డలు ఎనుగూల కట్టెలు గౌరమ్మ
తారు గోరంటాలు ఎర్రొద్దురాక్షలు
పోను తంగేడుపూలురాను తంగేడుపూలు
ఘనమైన పొన్నపూలేగజ్జాల వడ్డాణమే
కాకర చెట్టుకింద ఆట చిలుకాలార
పాట చిలుకాలార బమ్మశ్రీమడలూ
తారు గోరంటాలు ఎర్రొద్దురాక్షలు
పోను తంగేడుపూలురాను తంగేడుపూలు
ఘనమైన పొన్నపూలే గజ్జాల వడ్డాణమే
రుద్రాక్ష చెట్టుకింద ఆట చిలుకాలార
పాట చిలుకాలార కలికి చిలుకాలార
కందొమ్మ గడ్డలూ బమ్మశ్రీమాడలూ
తారు గోరంటాలు తీరు గోరంటాలు
ఎనుగూల కట్టె ఎర్రొద్దురాక్షలు
రాను తంగెడు పువ్వు పోను తంగెడు పువ్వు
ఘనమైన పొన్నపూలే గజ్జాల వడ్డాణమే
ఆ పూలు తెప్పించి పొందుగా పేరిచి
గంధములు పూయించి పసుపు కుంకుమలు పెట్టి
నీ నోము నీకిత్తునే గౌరమ్మ
నా నోము నాకియ్యవే గౌరమ్మ
ఆట మధ్యలో వానొస్తే పాడుకునే పాట:
చినుకు చినుకు వాన ఉయ్యాలో
చిత్తడివాన ఉయ్యాలో
పోదాము చిత్తారి ఉయ్యాలో
మూడు బాటల కాడికి ఉయ్యాలో
బాలలు బతుకమ్మ ఉయ్యాలో
పండుగా నడిగిరి ఉయ్యాలో
పెద్దలకు వచ్చింది ఉయ్యాలో
పెత్తరమావాస్య ఉయ్యాలో
వజ్రాల వాకిట్లో ఉయ్యాలో
ముత్యాల ముగ్గులు ఉయ్యాలో
చిన్నంగ సన్నంగ ఉయ్యాలో
జల్లూ కురువంగ ఉయ్యాలో
ఏ రాజు కురిపించె ఉయ్యాలో
ఏడు ఘడియల్లు ఉయ్యాలో
బంగారు వానలు ఉయ్యాలో
బాలాద్రి మీద ఉయ్యాలో
అచ్చమల్లెలు కురిసె ఉయ్యాలో
ఆలాద్రి మీద ఉయ్యాలో
సన్న మల్లెలు కురిసె ఉయ్యాలో
చిన్నయ్య మీద ఉయ్యాలో
బొడ్డు మల్లెలు కురిసె ఉయ్యాలో
బోనగిరి మీద ఉయ్యాలో
బంతిపూలతోడ ఉయ్యాలో
బతుకమ్మ పేర్చిరి ఉయ్యాలో
తంగేడు పూవుల్ల ఉయ్యాలో
తల్లి నిన్ను పేర్చి ఉయ్యాలో
కట్లాయి పువ్వుల్ల ఉయ్యాలో
కన్నెలంతా కూడి ఉయ్యాలో
పడచులంతా కూడి ఉయ్యాలో
పసిడి బతుకమ్మను ఉయ్యాలో
చిన్నారులంత కూడి ఉయ్యాలో
చిట్టి బతుకమ్మను ఉయ్యాలో
భక్తితో పేర్చిరి ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
ఆడబిడ్డాలంత ఉయ్యాలో
అత్తరూ పన్నీరు ఉయ్యాలో
అత్తా కోడండ్లు ఉయ్యాలో
గద్వాల చీరలు ఉయ్యాలో
తల్లి బిడ్డలంత ఉయ్యాలో
సన్నంచు చీరలు ఉయ్యాలో
బయలెల్లినారు ఉయ్యాలో
భామలంతాకూడి ఉయ్యాలో
ఆటలు ఆడిపాడ ఉయ్యాలో
అంతలోనె చూడు ఉయ్యాలో
ఆఘమేఘాల మీద ఉయ్యాలో
వానదేవుడొచ్చె ఉయ్యాలో
అక్కడీ భామలు ఉయ్యాలో
కచ్చీర్ల చేరిరి ఉయ్యాలో
సాగనంపే పాట
తంగేడు పూవుల్ల చందమామ… బతుకమ్మ పోతుంది చందమామ
పోతె పోతివిగాని చందమామ… మల్లెన్నడొస్తావు చందమామ
యాడాదికోసారి చందమామ… నువ్వొచ్చిపోవమ్మ చందమామ
బీరాయి పూవుల్ల చందమామ… బతుకమ్మ పోతుంది చందమామ
పోతె పోతివిగాని చందమామ… మల్లెన్నడొస్తావు చందమామ
యాడాదికోసారి చందమామ… నువ్వొచ్చి పోవమ్మచందమామ
గునిగీయ పూవుల్ల చందమామ… బతుకమ్మ పోతుంది చందమామ
పోతే పోతివిగాని చందమామ… మల్లెన్నడొస్తావు చందమామ
యాడాదికోపారి చందమామ… నువ్వొచ్చిపోవమ్మ చందమామ
కాకర పూవుల్ల చందమామ… బతుకమ్మ పోతుంది చందమామ
పోతె పోతివిగాని చందమామ… మల్లెన్నడొస్తావు చందమామ
యాడాదికోసారి చందమామ… నువ్వొచ్చి పోవమ్మ చందమామ
కట్లాయి పూవుల్ల చందమామ… బతుకమ్మ పోతుంది చందమామ
పోతె పోతివిగాని చందమామ… మల్లెన్నడొస్తావు చందమామ
యాడాదికోసారి చందమామ… నువ్వొచ్చి పోవమ్మ చందమామ
రుద్రాక్ష పూవుల్ల చందమామ… బతుకమ్మ పోతుంది చందమామ
పోతె పోతివిగాని చందమామ… మల్లెన్నడొస్తావు చందమామ
యాడాదికోసారి చందమామ… నువ్వొచ్చి పోవమ్మ చందమామ
గుమ్మడి పూవుల్ల చందమామ… బతుకమ్మ పోతుంది చందమామ
పోతె పోతివిగాని చందమామ… మల్లెన్నడొస్తావు చందమామ
యాడాదికోసారి చందమామ… నువ్వొచ్చి పోవమ్మ చందమామ
అన్నలొచ్చిన వేళ
కలవారి కోడలు ఉయ్యాలో… కనక మహాలక్ష్మి ఉయ్యాలో
కడుగుతున్నది పప్పు ఉయ్యాలో… కడవల్లోనబోసి ఉయ్యాలో
అప్పుడే వచ్చెను ఉయ్యాలో… ఆమె పెద్దన్న ఉయ్యాలో
కాళ్లకు నీళ్లిచ్చి ఉయ్యాలో… కన్నీళ్లు తీసింది ఉయ్యాలో
ఎందుకు చెల్లెల్లా ఉయ్యాలో… ఏమి కష్టాలమ్మ ఉయ్యాలో
తుడుచుకో కన్నీళ్లు ఉయ్యాలో… ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో
ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో … వెళ్లి వద్దామమ్మ ఉయ్యాలో
చేరి నీవారితో ఉయ్యాలో… చెప్పిరాపోవమ్ము ఉయ్యాలో
పట్టెమంచం మీద ఉయ్యాలో… పవళించిన మామ ఉయ్యాలో
మాయన్నలొచ్చిరి ఉయ్యాలో… మమ్ముబంపుతార ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో… మీ అత్తనడుగు ఉయ్యాలో
అరుగుల్ల గూసున్న ఉయ్యాలో… ఓ అత్తగారు ఉయ్యాలో
మా అన్నలొచ్చిరి ఉయ్యాలో… మమ్ముబంపుతార ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో… మీ బావనడుగు ఉయ్యాలో
భారతం సదివేటి ఉయ్యాలో… బావ పెద్ద బావ ఉయ్యాలో
మా అన్నలొచ్చిరి ఉయ్యాలో… మమ్ముబంపుతార ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో… మీ అక్కనడుగు ఉయ్యాలో
వంటశాలలో ఉన్న ఉయ్యాలో… ఓ అక్కగారు ఉయ్యాలో
మా అన్నలొచ్చిరి ఉయ్యాలో… మమ్ముబంపుతార ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో… మీ భర్తనే అడుగు ఉయ్యాలో
రచ్చలో గూర్చున్న ఉయ్యాలో… రాజేంద్ర భోగి ఉయ్యాలో
మా అన్నలొచ్చిరి ఉయ్యాలో… మమ్ముబంపుతార ఉయ్యాలో
కట్టుకో చీరలు ఉయ్యాలో… పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో
ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో… వెళ్లిరా ఊరికి ఉయ్యాలో
ఆనాటి కాలాన ఉయ్యాలో… దర్మాంగుడను రాజు ఉయ్యాలో..
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
ఆనాటి కాలాన ఉయ్యాలో… దర్మాంగుడను రాజు ఉయ్యాలో..
ఆనాటి కాలాన ఉయ్యాలో… దర్మాంగుడను రాజు ఉయ్యాలో..
ఆ రాజు భార్యయు ఉయ్యాలో… అతి సత్యవతి యండ్రు ఉయ్యాలో..
ఆ రాజు భార్యయు ఉయ్యాలో… అతి సత్యవతి యండ్రు ఉయ్యాలో…
నూరు నోములు నోమి ఉయ్యాలో… నూరు మందిని కాంచె ఉయ్యాలో..
నూరు నోములు నోమి ఉయ్యాలో… నూరు మందిని కాంచె ఉయ్యాలో..
వారు సూరులై ఉయ్యాలో… వైరులచే హతమయిరి ఉయ్యాలో..
వారు సూరులై ఉయ్యాలో… వైరులచే హతమయిరి ఉయ్యాలో..
తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో… తరగని సోకమున ఉయ్యాలో..
తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో… తరగని సోకమున ఉయ్యాలో..
ధన ధాన్యములను బాసి ఉయ్యాలో… దాయదులను బాసి ఉయ్యాలో..
ధన ధాన్యములను బాసి ఉయ్యాలో… దాయదులను బాసి ఉయ్యాలో..
వనితతో ఆ రాజు ఉయ్యాలో… వనమందు నివసించే ఉయ్యాలో..
వనితతో ఆ రాజు ఉయ్యాలో… వనమందు నివసించే ఉయ్యాలో..
కలికి లక్ష్మిని కూర్చి ఉయ్యాలో… ఘనత పొందిరింక ఉయ్యాలో..
కలికి లక్ష్మిని కూర్చి ఉయ్యాలో… ఘనత పొందిరింక ఉయ్యాలో..
ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో… పలికి వరమడగమనే ఉయ్యాలో..
ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో… పలికి వరమడగమనే ఉయ్యాలో..
వినిపించి వెడదిని ఉయ్యాలో… వెలది తన గర్భమున ఉయ్యాలో..
వినిపించి వెడదిని ఉయ్యాలో… వెలది తన గర్భమున ఉయ్యాలో..
పుట్టుమని వేడగా ఉయ్యాలో… పూబోణి మది మెచ్చి ఉయ్యాలో..
పుట్టుమని వేడగా ఉయ్యాలో… పూబోణి మది మెచ్చి ఉయ్యాలో..
సత్యవతి గర్భమున ఉయ్యాలో… జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో..
సత్యవతి గర్భమున ఉయ్యాలో… జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో..
అంతలో మునులును ఉయ్యాలో… అక్కడికి వచ్చిరి ఉయ్యాలో..
అంతలో మునులును ఉయ్యాలో… అక్కడికి వచ్చిరి ఉయ్యాలో..
కపిల గాలములు ఉయ్యాలో… కష్యపాంగ ఋషులు ఉయ్యాలో..
కపిల గాలములు ఉయ్యాలో… కష్యపాంగ ఋషులు ఉయ్యాలో..
అత్రి వశిష్టులు ఉయ్యాలో… ఆగండ్రి నను చూచి ఉయ్యాలో..
అత్రి వశిష్టులు ఉయ్యాలో… ఆగండ్రి నను చూచి ఉయ్యాలో..
బ్రతుకగనే ఈ తల్లి ఉయ్యాలో… బతుకమ్మ యనిరంత ఉయ్యాలో..
బ్రతుకగనే ఈ తల్లి ఉయ్యాలో… బతుకమ్మ యనిరంత ఉయ్యాలో..
పిలువుగా అతివలు ఉయ్యాలో… ప్రియముగా తల్లిదండ్రులు ఉయ్యాలో..
పిలువుగా అతివలు ఉయ్యాలో… ప్రియముగా తల్లిదండ్రులు ఉయ్యాలో..
బతుకమ్మ యనుపేరు ఉయ్యాలో… ప్రజలంత అందురు ఉయ్యాలో..
బతుకమ్మ యనుపేరు ఉయ్యాలో… ప్రజలంత అందురు ఉయ్యాలో..
తానూ ధన్యుడంచు ఉయ్యాలో… తన బిడ్డతో రారాజు ఉయ్యాలో..
తానూ ధన్యుడంచు ఉయ్యాలో… తన బిడ్డతో రారాజు ఉయ్యాలో..
నిజ పట్నముకేగి ఉయ్యాలో… నేల పాలించగా ఉయ్యాలో..
నిజ పట్నముకేగి ఉయ్యాలో… నేల పాలించగా ఉయ్యాలో..
శ్రీ మహా విష్ణుండు ఉయ్యాలో… చక్రాంగుడను పేర ఉయ్యాలో..
శ్రీ మహా విష్ణుండు ఉయ్యాలో… చక్రాంగుడను పేర ఉయ్యాలో..
రాజు వేషమున ఉయ్యాలో… రాజు ఇంటికి వచ్చి ఉయ్యాలో..
రాజు వేషమున ఉయ్యాలో… రాజు ఇంటికి వచ్చి ఉయ్యాలో..
ఇల్లింట మనియుండి ఉయ్యాలో… అతివ బతుకమ్మను ఉయ్యాలో..
ఇల్లింట మనియుండి ఉయ్యాలో… అతివ బతుకమ్మను ఉయ్యాలో..
పెండ్లాడి కొడుకుల ఉయ్యాలో… పెక్కు మందిని కాంచె ఉయ్యాలో..
పెండ్లాడి కొడుకుల ఉయ్యాలో… పెక్కు మందిని కాంచె ఉయ్యాలో…
ఆరు వేల మంది ఉయ్యాలో… అతి సుందరాంగులు ఉయ్యాలో..
ఆరు వేల మంది ఉయ్యాలో… అతి సుందరాంగులు ఉయ్యాలో..
ధర్మంగుడను రాజు ఉయ్యాలో… తన భార్య సత్యవతి ఉయ్యాలో..
ధర్మంగుడను రాజు ఉయ్యాలో… తన భార్య సత్యవతి ఉయ్యాలో..
సిరిలేని సిరులతో ఉయ్యాలో… సంతోషమొందిరి ఉయ్యాలో..
సిరిలేని సిరులతో ఉయ్యాలో… సంతోషమొందిరి ఉయ్యాలో..
జగతిపై బతుకమ్మ ఉయ్యాలో… శాస్వతమ్ముగా వెలిసే ఉయ్యాలో..
జగతిపై బతుకమ్మ ఉయ్యాలో… శాస్వతమ్ముగా వెలిసే ఉయ్యాలో..
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
బ తుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
బతుకమ్మ పాటమ్మ ఉయ్యాలో
Bathukamma Songs Telugu:
నేసెనే శాలోడు ఉయ్యాలో
నేసెనే శాలోడు ఉయ్యాలో
నే సెనే శాలోడు ఉయ్యాలో
నెలకొక్క పోగు ఉయ్యాలో
మొదటనా నేసిండు ఉయ్యాలో
మొగ్గలా తోని ఉయ్యాలో
అంచునా నేసిండు ఉయ్యాలో
ఆకులు కొమ్మలూ ఉయ్యాలో
నడుమనా నేసిండు ఉయ్యాలో
నాగాభరణము ఉయ్యాలో
చెంగునా నేసిండు ఉయ్యాలో
చామంతి వనము ఉయ్యాలో
చల్లదనమిచ్చే ఉయ్యాలో
చంద్రునీ నేసెను ఉయ్యాలో
ఆటపాటల రెండు ఉయ్యాలో
హంసలా నేసెను ఉయ్యాలో
భారియ్య మేడలది ఉయ్యాలో
భవనంబు నేసెను ఉయ్యాలో
కొంగునా నేసిండు ఉయ్యాలో
గోరింట వనము ఉయ్యాలో
మల్లెపువ్వుల్లోన ఉయ్యాలో
మడుతా పెట్టుకొని ఉయ్యాలో
జాజిపూలతోని ఉయ్యాలో
సంకనా పెట్టుకొని ఉయ్యాలో
దొరలున్న చోటన ఉయ్యాలో
దొరకకా పాయెను ఉయ్యాలో
రాజులున్నా చోట ఉయ్యాలో
రాకనే పాయెను ఉయ్యాలో
ముందు చూసినవారు ఉయ్యాలో
మూడు వేలనిరి ఉయ్యాలో
అంచు చూసినవారు ఉయ్యాలో
ఐదు వేలనిరి ఉయ్యాలో
ఈ చీరకు మీరు ఉయ్యాలో
వెలతీర్చి చెప్పండి ఉయ్యాలో
సాలె బోగము దానికి ఉయ్యాలో
సరసముతొ నేసెను
నాగమల్లేలో.. తీగమల్లేలో
నాగమల్లేలో.. తీగమల్లేలో
నా గమల్లేలో.. తీగమల్లేలో
పల్లెల్లో బతుకమ్మ నాగమల్లేలో
పువ్వయి పూసింది తీగమల్లేలో
పట్నంల బతుకమ్మ నాగమల్లేలో
పండూగ చేసింది తీగమల్లేలో
బాధల్ల బతుకమ్మ నాగమల్లేలో
బంధువై నిలిచింది తీగమల్లేలో
కష్టాల్లొ బతుకమ్మ నాగమల్లేలో
కన్నీరు తుడిచింది తీగమల్లేలో
తంగేడు పువ్వుల్లొ నాగమల్లేలో
తల్లి నిను కొలిచెదము తీగమల్లేలో
Bathukamma Songs Telugu:
రామ రామ ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో
రామ రామ రామ ఉయ్యాలో
రామనే శ్రీరామ ఉయ్యాలో
హరి హరి ఓ రామ ఉయ్యాలో
హరియ బ్రహ్మదేవ ఉయ్యాలో
నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో
నెలవన్నెకాడ ఉయ్యాలో
పాపట్ల చంద్రుడా ఉయ్యాలో
బాల కోమారుడా ఉయ్యాలో
ముందుగా నినుదల్తు ఉయ్యాలో
ముక్కోటి పోశవ్వ ఉయ్యాలో
అటెన్క నినుదల్తు ఉయ్యాలో
అమ్మ పార్వతమ్మ ఉయ్యాలో
భక్తితో నినుదల్తు ఉయ్యాలో
బాసర సరస్వతీ ఉయ్యాలో
ఘనంగాను కొల్తు ఉయ్యాలో
గణపతయ్య నిన్ను ఉయ్యాలో
ధర్మపురి నరసింహ ఉయ్యాలో
దయతోడ మముజూడు ఉయ్యాలో
కాళేశ్వరం శివ ఉయ్యాలో
కరుణతోడ జూడు ఉయ్యాలో
సమ్మక్క సారక్క ఉయ్యాలో
సక్కంగ మముజూడు ఉయ్యాలో
భద్రాద్రి రామన్న ఉయ్యాలో
భవిత మనకు జెప్పు ఉయ్యాలో
యాదితో నినుదల్తు ఉయ్యాలో
యాదగిరి నర్సన్న ఉయ్యాలో
కోటిలింగాలకు ఉయ్యాలో
కోటి దండాలురా ఉయ్యాలో
కోర్కెతో నినుదల్తు ఉయ్యాలో
కొంరెల్లి మల్లన్న ఉయ్యాలో
కొండగట్టంజన్న ఉయ్యాలో
కోటి దండాలురా ఉయ్యాలో
కోర్కెమీర దల్తు ఉయ్యాలో
కొత్తకొండీరన్న ఉయ్యాలో
ఎరుకతో నినుదల్తు ఉయ్యాలో
ఎములాడ రాజన్న ఉయ్యాలో
ఓర్పుతో నినుదల్తు ఉయ్యాలో
ఓదెలా మల్లన్న ఉయ్యాలో
ఐలేని మల్లన్న ఉయ్యాలో
ఐకమత్య మియ్యి ఉయ్యాలో
మన తల్లి బతుకమ్మ ఉయ్యాలో
మన మేలుకోరు ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
Bathukamma Songs Telugu:
శుక్రవారమునాడు ఉయ్యాలో చన్నీటి జలకాలు ఉయ్యాలో
శుక్రవారమునాడు ఉయ్యాలో
చన్నీటి జలకాలు ఉయ్యాలో
ముత్యమంత పసుపు ఉయ్యాలో
పగడమంత పసుపు ఉయ్యాలో
చింతాకుపట్టుచీర ఉయ్యాలో
మైదాకు పట్టుచీరు ఉయ్యాలో
పచ్చపట్టుచీరు ఉయ్యాలో
ఎర్రపట్టుచీర ఉయ్యాలో
కురుసబొమ్మల నడుమ ఉయ్యాలో
భారీ బొమ్మల నడుమ ఉయ్యాలో
గోరంట పువ్వుల ఉయ్యాలో
బీరాయిపువ్వుల ఉయ్యాలో
రావెరావె గౌరమ్మ ఉయ్యాలో
లేచెనే గౌరమ్మ ఉయ్యాలో
అడెనే గౌరమ్మ ఉయ్యాలో
ముఖమంత పూసింది ఉయ్యాలో
పాదమంత పూసింది ఉయ్యాలో
చింగులు మెరియంగ ఉయ్యాలో
మడిమల్లు మెరియంగ ఉయ్యాలో
పక్కలు మెరియంగ ఉయ్యాలో
ఎముకలు మెరియంగ ఉయ్యాలో
కుంకుమబొట్టు ఉయ్యాలో
బంగారు బొట్టు ఉయ్యాలో
కొడుకు నెత్తుకోని ఉయ్యాలో
బిడ్డ నెత్తుకోని ఉయ్యాలో
మా యింటి దనుక ఉయ్యాలో
ఇద్దరక్క చెళ్ళెల్లు ఉయ్యాలో
ఇద్దరక్క చెళ్ళెల్లు ఉయ్యాలో
ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో
ఒక్కడే మాయన్న ఉయ్యాలో
వచ్చన్నాపోడు ఉయ్యాలో
ఎట్లొత్తు చెళ్ళెలా ఉయ్యాలో
ఏరడ్డామాయె ఉయ్యాలో
ఏరుకు ఎంపల్లి ఉయ్యాలో
తోటడ్డామాయె ఉయ్యాలో
తోటకు తొంబాయి ఉయ్యాలో
తలుపులడ్డామాయె ఉయ్యాలో
తలుపులకు తాలాలు ఉయ్యాలో
వెండి శీలాలు ఉయ్యాలో
వెండి శీలాలనడుమ ఉయ్యాలో
ఎలపత్తి చెట్టు ఉయ్యాలో
ఎలపత్తి చెట్టుకు ఉయ్యాలో
ఏడే మొగ్గలు ఉయ్యాలో
ఏడే మొగ్గల పత్తి ఉయ్యాలో
ఆ పత్తి ఈ పత్తి ఉయ్యాలో
కలరాసి పోసి ఉయ్యాలో
నెసెనే ఆ చీర ఉయ్యాలో
నెలకొక్క పోగు ఉయ్యాలో
దించెనే ఆ చీర ఉయ్యాలో
దివిటీలమీద ఉయ్యాలో
ఆ చీర కట్టుకోని ఉయ్యాలో
కొంగలా బావికి ఉయ్యాలో
కొంగలా బావికీ ఉయ్యాలో
నీళ్ళకాని పోతే ఉయ్యాలో
కొంగలన్ని గూడి ఉయ్యాలో
కొంగంతా చూసే ఉయ్యాలో
ఆ చీర కట్టుకోని ఉయ్యాలో
హంసలా బావికి ఉయ్యాలో
హంసలా బావికీ ఉయ్యాలో
నీళ్ళకాని పోతే ఉయ్యాలో
హంసల్లన్ని గూడి ఉయ్యాలో
అంచంతా చూసే ఉయ్యాలో
ఆ చీర కట్టుకోని ఉయ్యాలో
చిలకలా బావికి ఉయ్యాలో
చిలకలా బావికీ ఉయ్యాలో
నీళ్ళకాని పోతే ఉయ్యాలో
చిలకలన్నీ గూడి ఉయ్యాలో
చీరంతా చూసే ఉయ్యాలో
ఆ చీర కట్టుకోని ఉయ్యాలో
పట్నంకు పోతె ఉయ్యాలో
పట్నంలో ఆడోల్లు ఉయ్యాలో
మాకొక్కటానిరీ ఉయ్యాలో
Bathukamma Songs Telugu:
వచ్చెను బతుకమ్మ పండుగ
వచ్చెను బతుకమ్మ పండుగ
అప్పుడే వచ్చెను ఉయ్యాలో
బతుకమ్మ పండుగ ఉయ్యాలో
బంగారు నగలు ఉయ్యాలో
బంగారు గాజులు ఉయ్యాలో
గుమ్మడీ పూలు ఉయ్యాలో
గునుగూ పూలు ఉయ్యాలో
వరుస వరుసలతోటి ఉయ్యాలో
వరుసగా పేర్వగా ఉయ్యాలో
అప్పుడే వచ్చిరి ఉయ్యాలో
మా ఆడబిడ్డలు ఉయ్యాలో
ఆటలు ఆడంగ ఉయ్యాలో
పాటలు పాడంగ ఉయ్యాలో
పుసుపూ కుంకుమలు ఉయ్యాలో
సత్తూ సద్దులు ఉయ్యాలో
గౌరీ శంకరులు ఉయ్యాలో
గంగశివులతోటి ఉయ్యాలో
మెప్పులు పొందంగ ఉయ్యాలో
ఆటలు ఆడంగ ఉయ్యాలో
బతుకమ్మ పాటలు ఉయ్యాలో
కలకాలం పాడెదము ఉయ్యాలో
బతుకమ్మ ఆటలు ఉయ్యాలో
కలకాలం ఆడెదము ఉయ్యాలో
బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్
బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్
బొ డ్డెమ్మ బొడ్డెమ్మా కోల్..
బిడ్డ పేరేమి కోల్
నాబిడ్డ నీలగౌరు కోల్..
నిచ్చెమల్లె చెట్టేసి కోల్
చెట్టూకు చెంబేడు కోల్..
నీళ్లనూ పోసి కోల్
కాయల్లు పిందేలు కోల్..
గనమై కాసెను కోల్
అందుట్ల ఒక పిందే కోల్..
ఢిల్లీకె పాయెనూ కోల్
ఢిల్లీలో తిప్పరాజు కోల్..
మేడా కట్టించె కోల్
మేడాలొ ఉన్నదమ్మా కోల్..
మేలిమ్మి గౌరి కోల్
మేలిమ్మి గౌరికి కోల్..
మీది బుగిడీలు కోల్
అనుపకాయ కొయ్యండ్రి కోల్..
అమరా గంటీలు కోల్
చిక్కుడు కాయ కొయ్యండ్రి కోల్..
చిత్రాల వడ్డాణం కోల్
నుగ్గాయ కొయ్యండ్రి కోల్..
నూటొక్కా సొమ్ము కోల్
అన్ని సొమ్ముల పెట్టి కోల్..
అద్దంలో చూసె కోల్
అద్దంలో గౌరమ్మ కోల్..
నీ మొగుడెవరమ్మా కోల్
దేవస్థానం బోయిండు కోల్..
దేవూడయ్యిండు కోల్
శివలోకం బోయిండు కోల్..
శివుడే అయ్యిండు కోల్
యమలోకం బోయిండు కోల్..
యముడే అయ్యిండు కోల్
Bathukamma Songs Telugu:
కోసలాధీశుండు ఉయ్యాలో
కోసలాధీశుండు ఉయ్యాలో
కో సలాధీశుండు ఉయ్యాలో
దశరథ నాముండు ఉయ్యాలో
కొండ కోనలు దాటి ఉయ్యాలో
వేటకే బోయెను ఉయ్యాలో
అడవిలో దిరిగెను ఉయ్యాలో
అటు ఇటు జూచెను ఉయ్యాలో
చెట్టు గుబురుల చాటు ఉయ్యాలో
చెరువొకటి కనిపించె ఉయ్యాలో
శబ్దమేదొ వినెను ఉయ్యాలో
శరమును సంధించె ఉయ్యాలో
జంతువేదొ జచ్చె ఉయ్యాలో
అనుకొని సాగెను ఉయ్యాలో
చెంతకు చేరగా ఉయ్యాలో
చిత్తమే కుంగెను ఉయ్యాలో
కుండలో నీళ్ళను ఉయ్యాలో
కొనిపో వచ్చిన ఉయ్యాలో
బాలుని గుండెలో ఉయ్యాలో
బాణమే గుచ్చెను ఉయ్యాలో
ఎవ్వరు నువ్వనె ఉయ్యాలో
ఏడ్పుతో దశరథుడు ఉయ్యాలో
శ్రవణుడు నేననె ఉయ్యాలో
చచ్చేటి బాలుడు ఉయ్యాలో
తప్పు జరిగెనంచు ఉయ్యాలో
తపియించెను రాజు ఉయ్యాలో
చావు బతుకుల బాలుడుయ్యాలో
సాయమే కోరెను ఉయ్యాలో
నా తల్లిదండ్రులు ఉయ్యాలో
దాహంతో ఉండిరి ఉయ్యాలో
ఈ నీళ్ళు గొనిపోయి ఉయ్యాలో
ఇచ్చి రమ్మనెను ఉయ్యాలో
ఆ నీళ్ళతో రాజు ఉయ్యాలో
అడవంతా వెదికె ఉయ్యాలో
ఒకచోట జూచెను ఉయ్యాలో
ఒణికేటి దంపతుల ఉయ్యాలో
కళ్లయిన లేవాయె ఉయ్యాలో
కాళ్లయినకదలవు ఉయ్యాలో
వృద్ధ దంపతుల జేరి ఉయ్యాలో
వేదన చెందుతూ ఉయ్యాలో
సాష్టాంగ పడె రాజు ఉయ్యాలో
సంగతి జెప్పెను ఉయ్యాలో
పలుకు విన్నంతనే ఉయ్యాలో
పాపమా వృద్ధులు ఉయ్యాలో
శాపాలు బెట్టిరి ఉయ్యాలో
చాలించిరి తనువులు ఉయ్యాలో
శాపమే ఫలియించి ఉయ్యాలో
జరిగె రామాయణం ఉయ్యాలో
లోక కల్యాణమాయె ఉయ్యాలో లోకమే మెచ్చెను ఉయ్యాలో
బతుకమ్మ ప్రసాదాలు:
తొమ్మిది రోజులు – తీరొక్క ప్రసాదాలు
బతుకమ్మను తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో పూజించి రకరకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు. మొదటిరోజు చాలా ప్రాంతాలలో సత్తుపిండి (పంచదార లేదా బెల్లం కలిపిన మొక్కజొన్న, గోధుమపిండి), కొన్ని ప్రాంతాలలో పప్పు-బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. రెండవరోజు శనగ లేదా పెసర పప్పు, బెల్లం, మూడవరోజు బెల్లం వేసి ఉడికించిన శనగపప్పు సమర్పిస్తారు. నాలుగోరోజు బెల్లం కలిపిన పాలలో నానబెట్టిన బియ్యం, ఐదోరోజు అట్లు ప్రసాదంగా నివేదిస్తారు. ఆరోరోజు బతుకమ్మను పేర్చడం, ఆడటం చేయరు. కొన్ని ప్రాంతాలలో బతుకమ్మను పేర్చినా, ఆడకుండానే నిమజ్జం చేస్తారు. ఆ రోజు బతుకమ్మ అలిగిందని విశ్వసిస్తారు. ఏడోరోజు ప్రసాదంగా మళ్లీ పప్పు బెల్లం, ఎనిమిదోరోజు నువ్వులు, బెల్లం కలిపిన ముద్దలను ప్రసాదంగా తయారుచేసి పంచుకుంటారు.( కరీంనగర్లో మాత్రం ఏడోరోజున వేపకాయల బతుకమ్మ అని సకినాల పిండితో వంటలు), ఎనిమిదోరోజున వెన్నముద్దల బతుకమ్మ అని నువ్వులు, వెన్న, బెల్లం నేతి ప్రసాదంగా నివేదిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఎనిమిదో రోజునా బతుకమ్మను ఆడరు. తొమ్మిదివ రోజున బతుకమ్మను పేర్చి ప్రసాదాలు చేసి, వాయినాలు ఇచ్చుకుంటున్నారు. కానీ, చాలా ప్రాంతాలో మొదటి రోజు, తొమ్మిదోరోజు బతుకమ్మను పేరుస్తుంటారు. కొన్ని చోట్ల అమావాస్యకు ముందు రోజునుంచే బతుకమ్మ సంబురాలను మొదలు పెడుతారు.