Etla Ninnu Ethukundunamma Song Lyrics

Etla Ninnu Ethukundunamma Song Lyrics

Etla Ninnu Ethukundunamma Song Lyrics www.stotraveda.com
Etla Ninnu Ethukundunamma Song Lyrics

Etla Ninnu Ethukundunamma Song Lyrics in English:

Etla ninnettu kondunamma Varalakshmi Talli
Etla ninnettu kondunamma (2)

Etla ninnettu kondumu aatlaade balavu neevu
Itla rammanuchu pilichi kotladhana michche talli

Etla ninnettu kondunamma Varalakshmi Talli
Etla ninnettu kondunamma

Pasibalavaite yettukondu Varalakshmi Talli
Pasidi buggala palavelli
Poovulu pandlu toranamulato
Palavelli kattina vedikapai kalahamsa nadakalatoti
Ghallu ghallu mani nadiche talli

Etla ninnettu kondunamma
Varalakshmi Talli etla ninnettu kondunamma

Etla ninnettu kondu aatlaade balavuneevu
Etla rammanuchu pilichi kotladhana michche talli

Veyi Namaala Kalpavalli
Vemaru Mapai Karuninchi Sayamu Undumu Talli
Saamraajya Janani Maapai Vemaru Karunakaligi
Aayurvruddhi Ashtaishwaryamu Aidavatanamulichche Talli

Etla Ninnu …….

Navarathnala Nee Nagumome Talli Varalakshmi Talli
Kanakarasula Kalyani
Kusuma komala Soundarya raasi Lokapavani Sri Varalakshmi
Sravana Poornima Poorvaardha, Sukravaramu Jagatilo Velige Talli

Etla Ninnu…….

Kalalanni kannula kalige vela
Ee lokaalu rammani piliche vela
Tallivi neevai paapanu nenai
Nee vodilo ne niddura pova
Ee janmaku aa varamu chaalada

Etla ninnettu kondunamma
Varalakshmi Talli etla ninnettu kondunamma

Etla ninnettu kondumu aatlaade balavu neevu
Etla rammanuchu pilichi kotladhana michche talli

Etla Ninnu Ethukundunamma Song Lyrics in Telugu:

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ

ఎట్లా నిన్నెత్తు కొందుము ఆట్లాడే బాలవు నీవు
ఎట్లా రమ్మనుచు పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ

పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మీ తల్లి
పసిడి బుగ్గల పాలవెల్లి పువ్వులు పండ్లు తోరణములతో
పాలవెల్లి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి
ఘల్లు ఘల్లు మని నడిచే తల్లి

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ

ఎట్లా నిన్నెత్తు కొందుము ఆట్లాడే బాలవు నీవు
ఎట్లా రమ్మనుచు పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి

వెయ్యి నామాల కల్పవల్లి
వేమారు మాపై కరుణించి సాయము ఉందుము తల్లి
సామ్రాజ్య జననీ మాపై వేమరు కరుణాకలిగి
ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము ఐదవతనములిచ్చే తల్లి

నవరత్నాల నీ నగుమోము తల్లి వరలక్ష్మీ తల్లి
కనకరాసుల కళ్యాణి
కుసుమ కోమల సౌందర్య రాశీ లోకపావని శ్రీ వరలక్ష్మీ
శ్రావణ పోర్ర్ణిమ పూర్వార్థ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి

ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ …..

కలలన్ని కన్నుల కలిగే వేళ ఈ లోకాలు రమ్మని పిలిచే వేళ
తల్లివి నీవై పాపను నేనై నీ వొడిలో నే నిదుర పోవ
ఈ జన్మకు ఆ వరము చాలదా
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ
ఎట్లా నిన్నెత్తు కొందుము ఆట్లాడే బాలవు నీవు
ఎట్లా రమ్మనుచు పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి