Shirdi Sai Baba Suprabhatam Lyrics in Telugu–
శ్రీ సాయి సుప్రభాతం-శ్రీ సాయిబాబా సుప్రభాతం
శ్రీరామకృష్ణ శివమామరుతి ప్రభృతిరూప
ఆలోకమాత్ర పరిఖండిత భాక్తపాప
సర్వేశ సర్వజనరక్షణ సత్కలాప
శ్రీసాయినాథమీడే తవ సుప్రభాతం 1
ఉత్తిష్టోతిష్ట సాయీశ – ఉత్తిష్ఠ షిరిడీపతే
ఉత్తిష్ఠ ద్వారకావాసా ఉత్తిష్ఠ మంగళాకృతే 2
వందారు భక్తమందార సమప్రభాయ
ఘోరఘశైల పరిఖండన వజ్రభాయ
దుర్వార దుష్టగణ తిమిరలతాలవిత్ర
శ్రీసాయినాథమీడే తవ సుప్రభాతం 3
శ్రితలోక రోగజ్వరతాప సద్వ్రతాయ
శ్రితలోక రోగాజ్వరతాప విదారణాయ
సాధు స్వరూప సకలేష్ట విభూతిదాయ
శ్రీసాయినాథమీడే తవ సుప్రభాతం 4
కామాది శత్రుషడ్వర్గ వివర్జితాయ
మాయాంధలోక భవబంధ వినాశకాయ
తాపత్రయాది భయభంజన పాపనాంఘ్రే
శ్రీసాయినాథమీడే తవ సుప్రభాతం 5
జన్మప్రయాస వినివర మహాప్రభావ
సంసారపాశ భయహారక సాయిదేవ
భక్తస్యసేవన మహాద్బాహుట స్వస్వభావ
శ్రీసాయినాథమీడే తవ సుప్రభాతం 6
అపన్నలోక సంరక్షణ సుదీక్షితాయ
వైరాగ్యరాజ్యవైభోగ్య సుప్రదర్శకాయ
సర్వజ్ఞ శర్వ, త్రైకాలిక విషయజ్ఞాయ
శ్రీసాయినాథమీడే తవ సుప్రభాతం 7
ఐశ్వర్యదయ అనుదైనిక భిక్షుకాయ
వైరాగ్యభోగ జితమన్మథ సుందరయ
రాగాదిద్వేష పరివర్జిత మల్లరాయ
శ్రీసాయినాథమీడే తవ సుప్రభాతం 8
భక్తావనార్థ సంజాత సమర్థమూర్తే
సంస్మరణమాత్ర సంతోషితదత్తస్ఫూర్త్రే
దీనస్యదుఃఖ సర్వస్వ సమూల హర్త్రే
శ్రీసాయినాథమీడే తవ సుప్రభాతం 9
ఆద్యంతరహిత మంలానిత మధుర చరితం
ఆపాత పరమ బ్రహ్మాభ మానంద భరితం
అతిలోక యోగ నిర్వహణ మహాప్రభావం
శ్రీసాయినాథమీడే తవ సుప్రభాతం 10
వాజ్మాత్ర నిరోధిత మహాప్రళయ
కాలంతతుల్య వర్షుక జృంభణాయ
అతిలోక యోగప్రదర్శన సాంద్రకీర్తే
శ్రీసాయినాథమీడే తవ సుప్రభాతం 11
అవాగ్ని పతిత కుంభార కుమారాత్రాత్రే
జీవవసాన మరుప్రాంత సంజేవవాప్తే
బహుకాల పూర్వసుదూర విషయజ్ఞాత్రే
శ్రీసాయినాథమీడే తవ సుప్రభాతం 12
విఙృంభమాణ మత మౌడ్య కులాదికానాం
ప్రాజ్వల్య స్వార్థ ధనదాహ మహాగ్ని వేళాం
జాతీయ భావసద్బీజసుశాంతి స్తాపనార్థం
శ్రీసాయినాథమీడే తవ సుప్రభాతం 13
షిర్డీ సాయిబాబా:
షిర్డీ సాయిబాబా భారతదేశానికి చెందిన ఒక మార్మికుడు, సాధువు, యోగి. సాయిబాబా అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంభించి, సహాయోగము కుదర్చడానికి ప్రయత్నించాడు. సాయిబాబా మసీదులో నివసించాడు, గుడిలో సమాధి అయ్యాడు.
రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించాడు. ఈయన రెండు సంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించాడు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైనది “అందరికి ప్రభువు ఒక్కడే” (అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్). ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందిన భక్తులు సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు.
సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు సాయిబాబా బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి.