Satya Sai Baba Suprabhatam in Telugu

Sri Satya Sai Baba Suprabhatam Lyrics in Telugu Visit www.stotraveda.com

Sri Satya Sai Baba Suprabhatam Lyrics in Telugu

Sri Satya Sai Baba Suprabhatam Lyrics in Telugu:

భగవాన్ శ్రీ సత్యసాయి సుప్రభాతము

ఈశ్వరాంబా సుత శ్రీమన్ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ సత్యసాయీశ కర్తవ్యం దైవమాహ్నికం
ఉత్తిష్ఠోత్తిష్ఠ పర్తీశ-ఉత్తిష్ఠ జగతీపతే
ఉత్తిష్ఠ కరుణాపూర్ణ-లోకమంగళ సిద్ధయే

చిత్రావతీ తట విశాల సుశాంత సౌధే
తిష్ఠంతి సేవక జనాస్తవ దర్శనార్థం
ఆదిత్యకాంతి రనుభాతి సమస్త లోకాన్
శ్రీ సత్యసాయి భగవన్ తవసుప్రభాతం

త్వన్నామ కీర్తన రతాస్తవ దివ్యనామ
గాయన్తి భక్తిరసపాన ప్రహృష్ట చిత్తాః
ధాతుం కృపా సహిత దర్శన మాశుతేభ్యః
శ్రీ సత్యసాయి భగవన్ తవసుప్రభాతం

ఆదాయ దివ్య కుసుమాని మనోహరాణి
శ్రీపాద పూజన విధిం భవ దంఘ్రిమూలే
కర్తుం మహోత్సుకతయా ప్రవిశన్తి భక్తాః
శ్రీ సత్యసాయి భగవన్ తవసుప్రభాతం

దేశాంతరాగత బుధాస్తవ దివ్యమూర్తిం
సందర్శనాభిరతి సంయుత చిత్తవృత్యా
వేదోక్త మంత్ర పఠనేన లసంత్య జస్త్రం
శ్రీ సత్యసాయి భగవన్ తవసుప్రభాతం

శ్రుత్వా తవాద్భుత చరిత్ర మఖండ కీర్తిం
వ్యాప్తాం దిగంతర విశాల ధరాతలేస్మిన్
జిజ్ఞాసులోక ముపతిష్ఠతి చాస్రమేస్మిన్
శ్రీ సత్యసాయి భగవన్ తవసుప్రభాతం

సీతాసతీ సమవిశుద్ధ హృదంబు జాతాః
బహ్వంగనాః కరగృహీత సుపుష్ప హారాః
స్తున్వన్తి దివ్య నుతిభిః ఫణిభూషణంత్వాం
శ్రీ సత్యసాయి భగవన్ తవసుప్రభాతం

సుప్రభాతమిదం పుణ్యం యేపఠంతి దినేదినే
తే విశంతి పరంధామా జ్ఞానవిజ్ఞాన శోభితాః

మంగళం గురుదేవాయ-మంగళం ఙ్ఞానదాయినే
మంగళం పర్తివాసాయ-మంగళం సత్యసాయినే

సత్య సాయి బాబా:

సత్య సాయి బాబా భారతీయ ఆధ్యాత్మికవేత్త. ఇతనిని ‘గురువు’ అని, ‘వేదాంతి’ అని, ‘భగవంతుని అవతారం’ అని, షిరిడీ సాయిబాబాయే మరల సత్య సాయిబాబాగా అవతరించాడని పలువురు విశ్వసిస్తారు.సత్య సాయి బాబా మహిమల పట్ల చాలామందికి అపారమైన విశ్వాసం ఉంది.

సత్యసాయి బాబా, సత్యనారాయణ రాజుగా, 1926 నవంబరు 23న పెద్ద వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతులకి, ఓ నిరుపేద వ్యవసాయ భట్టు రాజుల కుటుంబం లో, అనంతపురం జిల్లా లోని, పుట్టపర్తి అనే కుగ్రామంలో జన్మించాడు. 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మతగురువు సత్యనారాయణ వ్రతం తరువాత పుట్టిన సంతానం కనుక పిల్లవాడికి అలా పేరు పెట్టారు. బిడ్డ పుట్టిన సందర్భంలో ఇంట్లో సంగీత వాద్యాలు వాటంతట అవే మోగాయి అని చెప్పుకుంటారు