Vasanta Navratri, also known as Chaitra Navratri or Spring Navratri or Basant Navratri, begins on April 2, 2022. This festival of nine nights in Hinduism is dedicated to Goddess Durga, Lakshmi, and Saraswati. As this Navratra coincides with Ram Navami, it is also referred to as Ram Navratri.
Vasanta Navratri is observed in the Hindu month of Chaitra (March – April). It is believed that Goddess Durga was originally worshipped (Durga Puja) in the Chaitra month and was also referred to as Basanti Puja. It was Lord Ram who changed the period of Durga Puja.
Chaitra Navratri 2022 is a nine-day-long festival that is celebrated with full frevour and excitement in India. The auspicious festival of Navratri is celebrated four times every year. Those are Shardiya Navratri, Chaitra Navratri, Magha Gupt Navratri, Asadha Gupt Navratri.
Shardiya Navratri:
Among all Navratri, Shardiya Navratri is the most popular and significant. Shardiya (Sharada) means autumn and forms a major part of crop harvesting time. Shardiya Navratri falls during the months of September-October. This Navratri is also known as Maha Navratri and Sharada Navratri. The entire mythological connection behind Navratri lies with the defeat of Mahishasura from Nava Durga. Shardiya Navratri is also celebrated as mythology says that Ramachandra had killed Ravana during this period. Gods are said to sleep during the period of Ashwin month (falls between September and October). Lord Ram had awakened Goddess Durga in the Tithi of Shasthi during the evening.
Chaitra Navratri:
It is the second most famous Navratri whose name represents spring. It is observed during Chaitra month that is during March and April. This nine days long festival starts from the first day (pratipada) of the first month of the Hindu Lunar calendar “Chaitra”. This year the festival will commence on April 2nd and will continue till April 11. It is also known as Vasant Navratri and Rama Navratri. Rama Navami, the birthday of Lord Rama usually falls on the ninth day during Chaitra Navratri. Most of the rituals and customs are the same as followed during the ‘Shardiya Navratri’. All nine days during Navratri are dedicated to nine forms of Goddess Shakti.
For More details check here Vasantha Navarathri|Chaitra Navratri
Magha Navratri:
This is the Navratri which falls on the winter season. It is more popularly known to people as Vasant Panchami. This falls during January and February.For more details check here Magha Gupta Navratri or Shyamala Navratri.
Ashada Navratri:
This falls in the month of June and July and comes during the hail of monsoon. For more details check here Ashada Gupta Navaratri and Mantra.
Vasanta Navratri/Chaitra Navratri is also mentioned before as Rama Navratri in some parts of northern India. Rama Navami, the birthday of Lord Rama, falls on the ninth day during Navratri festival. The Hindu lunar calendar represents the celebrations in the month of Chaitra, which is also defined as marking the New Year. Chaitra Navratri begins with Gudi Padwa in Maharashtra, and the festival begins with Ugadi in Andhra Pradesh and Telangana.
Vasanta Navratri 2022 dates/Chaitra Navratri 2022: Important Dates
April 2 Day 1-Partipada
April 3 Day 2 – Dwitiya
April 4 Day 3 – Tritiya
April 5 Day 4- Chaturthi
April 6 Day 5- Panchami
April 7 Day 6 – Shashti
April 8 Day 7- Saptami
April 9 Day 8 – Ashtami
April 10 Day 9 – Navami
April 11 Day 10 – Dashami
Mythology of Chaitra Navratri/Vasantha Navaratri:
Navratri is a mix blend of various culture and shares a common meaning, i.e. the victory of good over evil. In Chaitra Navratri, Demon Mahishasura, who had defeated all the gods and the devas, was ultimately killed by Goddess Durga. After the Gods were defeated, they approached Brahma (Hindu creator god), Vishnu (preserver god), and Mahesh (the destroyer), whose collective energy gave rise to the supreme deity, Goddess Durga.
In Chaitra Navratri, the 9th day is celebrated as Ram Navami (Spring Hindu festival), the day Lord Rama was born. In the Sharad Navratri, the 10th day is celebrated as Vijayadashami or Dusshera, the day Lord Rama killed the demon king Ravana.
Chaitra Navratri 2022 Shubh Muhurat:
The muhurat of Chaitra Navratri is from 6.10 a.m. to 8.31 a.m. on Saturday, April 2, 2022.
One of the prominent rituals done at the beginning of this season is Ghatasthapna, which is the invocation of Goddess Shakti. The muhurta or auspicious period for Ghatasthapana falls on Pratipada Tithi. The ritual can be done between 06.10 am – 08:31 am.
Nine Avatars of Goddess Durga:
Shailputri
Brahmacharini
Chandraghanta
Kushmanda
Skandmata
Katyayani
Kaalratri
Mahagauri
Siddhidatri
Puja Samagri and Vidhi:
The essentials for the puja are a clay pot, clean soil, seeds of seven different grains, a clay/brass pitcher, Ganagajal, sacred thread, betel nuts, some coins, five leaves of Ashoka or mango tree, raw/unbroken rice, unpeeled coconut, flowers, durva grass, some red cloth to wrap the coconut, and a lid to cover the clay pot. Grains are sown in tvasanth navratri pooja vidhi in teluguvasanth navratri pooja vidhi in teluguhe clay pot and the rest of the ingredients are added to it. The sacred thread is tied around the neck of the pot and after wrapping the red cloth around the coconut, the thread is used to fasten the wrap. The coconut is then placed in the center of the pot. After this, the Panchopachara Puja or shodashopachara pooja is done to invoke the goddess, which starts with the lamp offering and later, dhoop sticks are offered to the kalash, succeeded by incense and flowers.Chant Lalitha Sahasranaman or Lalitha ashtottarashatanamavali later give Lalitha Haarathi.
Foods for Navratri Fasting:
During the fast of Navratras, foods like Sabudana Vada (Sago Vada), Sabudana khichadi (Sago Khichadi), Singhare Ka Halwa (Water Chestnut Flour Halwa), Kuttu Ki Poori (Grass Seed Flour or Buckwheat poori), and Singhare Ke Pakore are preferred for eating.
The science behind Navratri Celebration:
When climate changes, the body is affected and it gets more prone to different kinds of bacteria. This leads to various mental disorders as well as health problems. To prevent these unwanted situations ancestors had created the system of Navratri. Scientifically when climate changes, the negative impacts affect female brains the most. Females become psychologically more weak and reactive. The ones who already have mental disorders face major problems during Saptami. To eradicate these problems ancestors had invented the process of Navratri where fasting is the major requirement. Our ancient solutions say that mental disorders happen due to problem indigestion or food habits.
Hence, it is advised to consider keeping fast or eating in small quantities, throughout the period of Navratri. It is better if you can follow the process of fasting or minimal eating in the four Navratri’s as it will keep you extremely fit and attract positive energies towards you.
Significance and Importance of Chaitra Navaratri 2022:
The festival is celebrated to mark the victory of good over evil. Chaitra Navratri 2022 is also celebrated to mark the day when the world came into existence. During this period, devotees observe fast for nine days and stay awake at night for bhajans and kirtans dedicated to Goddess Durga. The first day of Chaitra Navratri falls during the full moon phase, which is known as the Shukla Paksha phase. Different states recognise the festival with different names. In Maharashtra, the first day of Chaitra Navratri is known as Gudi Padwa, while in Kashmir, the Chaitra Navratri is known as Navreh.
Vasanth Navratri Pooja Vidhi in Telugu:
మామూలు రోజుల మాదిరిగా కాకుండా వసంత, (చైత్రపాడ్యమి మొదలు నవమి వరకు) శరన్నవ రాత్రులలో (ఆశ్వయుజ పాడ్యమి మొదలు నవమి వరకు) ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజావిధి నిర్వర్తించాలి. వాటిలో ముఖ్యమైనది ఉపవాస దీక్ష. చేయగల్గిన వాళ్ళు ఆ తొమ్మిది రోజులు పండ్లు, పాలు మాత్రం సేవించి, పూజావిధి నిర్వర్తించవచ్చును. లేదా ఏకభుక్తం (పగలు పూజానంతరం భుజించడం)గానీ, నక్షం (రాత్రి భుజించడం) గానీ చేయవచ్చును. ‘ఉపవాసేవ నక్తేన చైవ ఏక భుక్తేన వాపునః
పూజాస్థలం:
దేవీపూజకి ఇంట్లో ఎక్కడపడితే అక్కడ కాకుండా పూజాగృహంలోగానీ లేక ఇంట్లో తూర్పు దిక్కుగా వుండేట్లు సమప్రదేశం చూసుకుని, అక్కడ కడిగి పసుపునీళ్ళతో శుద్ధిచేసి ఆ భాగాన్ని పూజాస్థలంగా నిర్దేశించుకోవాలి. ఆ ప్రదేశం పదహారు హస్తాల మానము, ఏడు హస్తాల వెడల్పు, తొమ్మిది హస్తాల పొడుగు వుండటం మంచిదని పురాణోక్తి. ఆ ప్రదేశం మధ్యలో ఒక హస్తం వెడల్పు, నాలుగు హస్తాలు పొడుగు వుండేలా వేదికనమర్చి పూలమాలలతో, మామిడాకులతో తోరణాలతో అలంకరించాలి.
దేవి విగ్రహ ప్రతిష్ట:
అమావాస్య రాత్రి ఉపవాసం వుండి మరునాడు (పాడ్యమి తిథి) వేద బ్రాహ్మణుల సహాయంతో వేదికపై దేవి ప్రతిమను విద్యుక్తంగా ప్రతిష్టించాలి. ఎక్కువగా అష్టాదశ భుజాలలో వివిధాయుధాలు ధరించి, మహిషాసురుని త్రిశూలం గుచ్చి వధిస్తున్న దేవీమాత ప్రతిమను దేవీ నవరాత్రోత్సవాలలో ప్రతిష్టించి పూజించడం పరిపాటి. నాలుగు భుజాల ప్రతిమను కూడా ప్రతిష్టించవచ్చు. సింహవాహనారూడురాలైన దేవీమాత విగ్రహం నిండుగా, కన్నుల పండుగ చేస్తూ వెలిగిపోతుంది. ప్రతిమ లేకపోతే దేవీ మంత్రం ‘ఐం హ్రీం క్లీం చాముందాయై విచ్చే’ అనేది రాగి రేకుమీద లిఖించబడినది వుంచి యంత్రాన్ని పూజించవచ్చును.
‘వాగ్భావం (ఐం) శంభువనితా (హ్రీం) కామబీజం (క్లీం) తతః పరం!
చాముండాయై పదం పశ్చాద్విచ్చే ఇత్యక్షర ద్వయం’
దేవీమాతలోనుండి వాగ్దేవి (ఐం), శంభువనిత పార్వతి (హ్రీం) కామబీజం.. లక్ష్మీదేవి (క్లీం) ముగ్గురు దేవేరులు ప్రకటితమై త్రిమూర్తులకు శక్తిప్రదానం చేస్తూ సృష్టిస్థితి లయకారిణులై విలసిల్లుతున్నారు. అందుకే దేవి నవరాత్రోత్సవాలలో అమ్మవారిని రోజుకొక దేవి అలంకరణలో ఉత్సవమూర్తిని పూజించడం జరుగుతుంది దేవీమందిరాలలో, ప్రతిరోజూ దీక్ష గైకొన్న బ్రాహ్మణోత్తములు చండీయాగం నిర్వహిస్తూ ఉంటారు. మూలా నక్షత్రంతో కూడిన ఆరోజు సరస్వతీదేవి అలంకారంలో శ్వేతాంబర ధారిణిగా, వీణాపాణియై నేత్రపర్వం గావిస్తుంది. దేవీమాత, ఆరోజు సరస్వతీ పూజ చేసి ఐం బీజోపాసన గావించడం వాళ్ళ సర్వవిద్యలు కరతలామలకమౌతాయి.
పూజా విధానం:
పాడ్యమినాడు వేదోక్తంగా ప్రతిష్టించిన ప్రతిమ ముందు కలశంపై కొబ్బరికాయ వుంచి, నూతన వస్త్రం కప్పి దేవీమాతను దానిపై ఆవాహన చేసి షోపశోపచార పూజా విధులతో విద్యుక్తంగా వేద బ్రాహ్మణుల సహాయంతో పూజ నిర్వర్తించాలి. దేవీ సహస్రనామపారాయణ అష్టోత్తర శత నామావళి, త్రిశతి మొదలైనవి చదువుతూ పుష్పాలతో పూజించడం పరిపాటి. బంతి, చేమంతి, జాజి, కనకాంబరం, అన్ని రకాల పుష్పాలు దేవీమాతకు ప్రీతికరమైనవే!
పూజానంతరం నైవేద్యంగా పులగం, పొంగలి, పాయసం, చిత్రాన్నం, గారెలు మొదలైన వివిధ భక్ష్యాలు శక్త్యానుసారం సమర్పించాలి. పశుబలి నిషిద్దం, బియ్యప్పిండి, నెయ్యి వంటి వాటితో చేసిన సాత్వికాహారమే సమర్పించడం ప్రీతికరం. అసుర నాశనానికై ఆవిర్భవించిన కాళీమాత (చండముండులు, శంభనిశుంభ మర్థిని) ఉగ్రమూర్తిని శాంతపరచడానికి పశుబలి కావించడం సముచితమే నన్న అభిప్రాయం కొందరిదైనా సాత్విక యజ్ఞమే భుక్తిముక్తి ప్రదమైనది, సర్వులూ ఆచరించదగినది. పూజావిధి సమాప్తమైన తరువాత నవరాత్రులలో నృత్య గీతాలలో సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వర్తించడం కూడా ఆరాధనలో బాగమే. ఇక నవరాత్రుల దీక్షాకాలంలో భూమిమీద శయనించడం, బ్రహ్మచర్యం పాటించడం తప్పకుండా ఆచరించాలి.
‘యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా!
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః
ఇంద్రాది దేవతలు, త్రిమూర్తులు, నారదాది మునులు, ఊర్ద్యలోకవాసులు తమ ప్రార్థనలకు ప్రసన్నురాలై ఎదుట సాక్షాత్కరించిన దేవీమాతకు ప్రణామాలు అర్పించారు. దేవీమాత మణిద్వీపవాసిని వాళ్ళవైపు ప్రసన్నంగా చూసింది.
‘హే జగన్మాతా! రంభాసురుని పుత్రుడు మహిషాసురుడు బ్రహ్మవల్ల స్త్రీచేత తప్ప ఇతరులెవరివల్లా మరణం రాకుండా వరంపొంది, ఆ వరప్రభావంతో మూడు లోకాలను తన వశం చేసుకుని నిరంకుశంగా సాధుహింస చేస్తూ పాలన సాగిస్తున్నాడు. అతడిని వధించి లోకాలకు శాంతి చేకూర్చు మాతా!’ అంటూ ప్రార్ధించారు.
‘దేవతలారా! విచారించకండి. ఆ మహిషాసురుని దురాత్ములైన అతని అనుచరులను హతమార్చి, అధర్మం అంతరించేలా చేస్తాను’ అంటూ కరునార్ద్ర్హ వీక్షణాలతో వాళ్ళకు ధైర్యం చెప్పి అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా అష్టాదశ భుజాలతో (పదునెనిమిది) సంహవాహనరూఢురాలై గగనతలాన నిలిచింది. దేవి దివ్య శక్తులు, తేజం విలీనమైనాయి. శంకరుని తేజం దేవి ముఖ పంకజాన్ని చేరింది. శ్వేత పద్మంలా ప్రకాశించింది. ముఖమండలం, నల్లనైన కేశపాశంలో యముని తేజం నిక్షిప్తమై యమపాశంలా గోచరించింది. ఆమె మూడు నేత్రాలు అగ్ని జ్వాలలు విరజిమ్ముతున్నాయి. అగ్ని తేజంతో, వాయువు తేజం శ్రవణాలలో, సంధ్యా తేజం కనుబొమలలో ఒదిగాయి. నాసికలో కుబేరుని తేజం విలసిల్లగా, సూర్యుని తేజంతో అధరం విప్పారింది. ప్రజాపతి తేజం దంతపంక్తిలో, మహావిష్ణువు తేజం బాహువులలో, పశువుల తేజం అంగుళంలో కేంద్రీకృతమయ్యాయి. చంద్రుని తేజం వక్షస్థలంలో, ఇంద్రుని తేజం నడుములో, పృద్వితేజం నితంబాలలో నిక్షిప్తమయ్యయి. ఆయా దివ్య తేజస్సులు దేవీమాత అవయవాలను చేరడంతో కోటి విద్యుల్లతల కాంతితో ఆమె దేహం ప్రకాశించింది.
సర్వాభరణ భూషితయై నిలిచిన ఆమె బాహువులలో వరుసగా మహావిష్ణువు చక్రం, శంకరుని త్రిశూలం, వరుణుని శంఖం, అగ్ని శతఘ్ని సంకాశమనే శక్తి వాయుదేవుని అక్షయ తూణీరాలు, ధనువు ఇంద్రుని వజ్రాయుధం, యముని దండం, విశ్వకర్మ పరశువు, ఖడ్గం, ముసలం, గద, పరిఘ, భుశుండి, శిరము, పాశం, చాపం,అంకుశం మొదలైన ఆయుధాలు ధరించి, సింహ వాహినియై మహిషాసురుని మహిప్యతీపుర బాహ్యంలో నిలిచి భయంకరంగా శంఖం పూరించింది. ఆ నాదానికి దిక్కులు పిక్కటిల్లాయి, భూమి కంపించింది. కుల పర్వతాలు గడగడలాడాయి, సముద్రంలో తరంగాలు ఉవ్వెత్తున ఎగిరిపడసాగాయి. ప్రళయ వాయువులు భీకరంగా వీచసాగాయి.
దేవీమాత శంఖం నాదానికి అదిరిపడి ఆశ్చర్యంతో కారణం తెలుసుకురమ్మని పంపాడు మహిషాసురుడు తన అనుచరులను, వాళ్ళు తెచ్చిన వార్త మరింత ఆశ్చర్య చకితుడిని చేసిందతడిని. ‘ఎవరో దివ్యాంగన, అష్టాదశభుజాలలో వివిధాయుధాలు ధరించి సింహంపై ఆసీనురాలై తనతో యుద్ధభిక్ష కొరుతున్నదట. ఈ మహిషాసురుడు మాయా యుద్ధ ప్రవీణుడని, త్రిమూర్తులు, దేవతలు కూడా తన ధాటికి తాళలేకపోయారని తెలియక అంతటి సాహసం చేసి వుంటుంది. ఆమె బలశౌర్యాలేపాటివో తెలుసుకోవలసిందే’ అనుకుంటూ ముందుగా తన సేనాధిపతులైన బష్కల దుర్ముఖులను ఆమెను జయించి తీసుకురావసిందిగా ఆజ్ఞ ఇచ్చి పంపాడు మహిషాసురుడు.
బాష్కల దుర్ముఖులు, ఆపైన అసిలోమ బిడాలాఖ్యులు, చిక్షుతతామ్రాక్షుల వంటి ఉగ్రదానవులందరూ ఆమెను జయించవచ్చి ఆమె చేతుల్లో చిత్తుగా ఓడి మరణించారు. ఆఖరుకు మహిషాసురుడు కదనానికి కదలక తప్పలేదు. దేవీమాత విశ్వమోహన రూపంతో కానవచ్చింది అతని కన్నులకు. ఆ సౌందర్యాన్ని చూస్తూ వివశుడై తనను వివాహం చేసుకుని, అసుర సామ్రాజ్యరాణివై సుఖించమని వేడుకుంటాడు.అతని మాటలకు ఫక్కున నవ్వి ‘దానవుడా! రూపం లేని నేను నీకోసం ఈ రూపు దాల్చి రావడం దేవతలను రక్షించడానికే సుమా, నీకు ప్రాణాలమీద ఆశవుంటే దేవ, మర్త్యలోకాలను విడిచి పాతాళానికి వెళ్ళి సుఖించు. కాని పక్షంలో యుద్ధానికి సిద్ధపడు మూర్ఖప్రలాపాలు మాని’ అంటూ శంఖం పూరించింది దేవీమాత.
మహిషాసురుడు మాయను ఆశ్రయించి జంతు రూపాలు ధరిస్తూ యుద్ధం సాగించాడు కొంతసేపు లీలగా అతనితో పోరాడి సూటిగా త్రిశూలంతో వక్షస్థలాన్ని చీల్చి యమనదనానికి పంపివేసినది దేవీమాత. మహిషాసురుడు మరణంతో లోకాలు శాంతించాయి. దేవతలు ఆనందంతో పుష్ప వృష్టి కురిపించి ‘మహిషాసురమర్ధినికి జయము జయము’ అంటూ జయ జయ ధ్వానాలు చేసారు. వాళ్ళవైపు ప్రసన్నంగా చూస్తూ అంతర్ధానం చెందింది మహిషాసురమర్ధిని చరతం శరన్నవరాత్రులలో పఠించడంవల్ల దేవీమాత అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. రోజూ వీలుకాకపోయినా శరన్నవరాత్రుల పర్వదినాలలో దేవీ మహత్యాన్ని వివరించే దేవీ భాగవత పారాయణం అనంతమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. నవ అంటే నూతనమైన, రాత్రులంటే జ్ఞానాన్ని ప్రసాదించేవి కనుక ఆశ్వయుజ మాసం శుక్ల పాడ్యమి మొదలు తొమ్మిది రోజులు దేవీమాతను విశేష పూజలతో అర్చించడంవల్ల ఒక్క సంవత్సరకాలంలో చేసే పూజాఫలం లభిస్తుందని పురాణాలు తెలుపుతున్నాయి.
ఆ తొమ్మిది రోజులలో అష్టమినాడు మహిషాసురుని వధించడమే గాక, శంభనిశంభులు, చందముండులు, రక్తభీజుడు, దుర్గమాసురుడు మొదలైన ఉగ్రదానవులెందరినో వధించి లోకాలలో శాంతిభద్రతలు, ధర్మం సుస్థిరం కావించింది దేవీమాత. అందుకే ఆ జగదంబ అనుగ్రహం సిద్ధించడానికి, ఈతిబాధలు, అతివృష్టి అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలకు గురికాకుండా వుండటానికి, యమదంష్ట్రికులైన (అంటే మరణాలు ముఖ్యంగా రోగాల వల్ల) శరధ్వంత ఋతువుల్లో ప్రజలు అకాలమృత్యువు వాతపడకుండా వుండటానికి భూలోకంలో అనాదికాలం కృతయుగం నుండి నేటివరకు దేవీనవరాత్రోత్సవాలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతున్నాయి.