Home

  • Karthika Puranam Day20 Adhyayam

    Karthika Puranam 20th Day Parayanam Visit www.stotraveda.com
    Karthika Puranam 20th Day Parayanam

    Karthika Puranam Day20 Adhyayam Story

    ఇరవయ్యోరోజు పారాయణం-కార్తీక పురాణం 20వ అధ్యాయం

    Karthika Puranam 20th Day Parayanam-Karthika Puranam Day20 Adhyayam

    కార్తీకపురాణం – 20వ రోజు పారాయణము

    పురంజయుడు దురాచారుడగుట

    జనక మహారాజు, చతుర్మాస్య వ్రతప్రభావము వినిన పిమ్మట వశిష్టునితో “గురువర్యా! కార్తీకమాస మహాత్మ్యమును యింకను వినవలయుననెడి కోరిక కల్గుచున్నది. ఈ వ్రత మహాత్మ్యమునందింకను విశేషములు గలవా! యను సంశయము గూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని వుదాహరణములు వినిపించి నన్ను కృతార్దునిగాజేయు”డనెను. అ మాటలకు వశిష్టుల వారు మందహాసముతో “ఓ రాజా! కార్తీకమాస మహాత్మ్యము గురించి అగస్త్య మహామునికి, అత్రిమునికి జరిగిన ప్రసంగ మొకటి కలదు. దానిని వివరించెదరు ఆలకించు”మని అ కథా విధానమును యిట్లు వివరించిరి.

    పూర్వ మొకప్పుడు అగస్త్య మహర్షి అత్రిమహర్షిని గాంచి, “ఓ అత్రిమహామునీ! నీవు విష్ణువు అంశయందు బుట్టినావు. కార్తీకమాస మహాత్మ్యమును నీకు ఆములాగ్రమున తెలియును, కాన దానిని నాకు వివరింపుము” అని కోరెను. అంత అత్రిమహముని “కుంభసంభవా! నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రితికరముగుటచే నుత్తమమయినది. కార్తీక మాసముతో సమానమగు మాసము. వేదముతో సమానమగు శాస్త్రము. ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటె వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము. ఇందుకొక యితిహాసము వినుము.

    త్రేతాయుగమున పురంజయుడను సూర్య వంశపురాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగ రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి యాపదలు రాకుండ పాలించుచుండెను. అట్లుండ కొంత కాలమునకు పురంజయుడు అమిత ధనాశచేతును, రాజ్యాధికార గర్వముచేతను జ్ఞానహీనుడై దుష్టబుద్దిగలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహణ మాన్యములు లాగుకొని, పరమలోభియై, చొరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసికోనుచు ప్రజలను భీతావహులను చేయుచుండెను. ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈవార్త కాంభోజ, కొంకణ, కళింగాది రాజుల చెవులబడినది. వారు తమలో తామాలోచించుకొని కాంభోజరాజును నాయకునిగా చేసుకోని రధ, గజ, తురగ, పదాతి సైన్య బలాన్వితులై రహస్యమార్గము వెంట వచ్చి అయోధ్యానగరమును ముట్టడించి, నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్భ౦ధముచేసి యుద్దమునకు సిద్దపడిరి.

    అయోధ్యా నగరమును ముట్టడి౦చిన సంగతిని చారులవలన తెలిసికోనిన పురంజయుడు తానుకూడా సర్వసన్నద్దుడై యుండెను. అయినను యెదుటి పక్షము వారధికబలాన్వితులుగా నుండుటయి తాను బలహినుడుగా నుండుటయు విచారించి యే మాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి, చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్దసన్నద్దుడై – నవారిని యెదుర్కొన భేరి మ్రోగించి, సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హు౦కరించి శత్రుసైన్యములుపై బడెను.

    స్కాంద పురాణాతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమహత్మ్యమందలి వింశాద్యాయము – ఇరవయ్యోరోజు పారాయణము సమాప్తము

  • Karthika Puranam Day19 Adhyayam

    Karthika Puranam 19th Day Parayanam Visit www.stotraveda.com
    Karthika Puranam 19th Day Parayanam

    Karthika Puranam Day19 Adhyayam Story

    పందోమ్మిదోరోజు పారాయణం- కార్తీక పురాణం 19 వ అధ్యాయం

    Karthika Puranam 19th Day Parayanam- Karthika Puranam Day19 Adhyayam

    కార్తీకపురాణం – 19వ రోజు పారాయణము

    చతుర్మాస్య వ్రత ప్రభావనిరూపణ

    ఈ విధముగా నైమిశారణ్యమందున్న మహా మునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్దుడను ఒక మహాయోగి “ఓ దీనబాంధవా! వేద వేద్యుడవని, వేద వ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గల వాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుడవని, నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవా! నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధార భూతుడవగు ఓ నందనందనా! మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యమువలన మేము మాఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయా! మేమీ సంసార బంధము నుండి బైట పడలేకుంటిమి, మమ్ముద్దరింపుము. మానవుడెన్నిపురాణములు చదివినా, యెన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గో చరుడవగుడువు. ఓ గజేంద్రరక్షకా! ఉపేంద్రా! శ్రీధరా! హృషీకేశా! నన్ను కాపాడుము” అని మైమరచి స్తోత్రము చేయగా, శ్రీ హరి చిరునవ్వు నవ్వి “జ్ఞానసిద్దా! నీ సోత్రవచనమునకు నేనెంతయు సంతసించితిని. నీ కిష్ట మొచ్చిన వరమును కోరుకొనుము” అని పలికెను. అంత జ్ఞానసిద్దుడు “ప్రద్యుమ్నా! నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన యీగవలె కొట్టుకోనుచున్నాను. కనుక, నీ పాద పద్మముల పైనా ధ్యానముండుటనటుల అనుగ్రహింపుము. మరేదియు నాకక్కరలేదు” అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు “ఓ జ్ఞానసిద్దుడా! నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చితిని. అదియునుగాక, మరొక వరము కూడా కోరుకొనుము యిచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్దిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. అ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము.

    నేను ఆషాడ శుద్ద దశమిరోజున లక్ష్మిదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్దద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈకాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతముచేయు వారలకు సకల పాపములు నశించి, నా సన్నీధికి వత్తురు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయనివారు నరకకూపమున బడుదురు. ఇతరులచేత కూడా ఆచరింప చేయవలయును. దీని మహాత్మ్యమును తెలిసియుండియు, వ్రతము చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును. వ్రతము చేసినవారికి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాడశుద్ద దశమి మొదలు శాకములును, శ్రవణశుద్ద దశమి మొదలు పప్పుదినుసులను విసర్జించవలయును. నా యందు భక్తి గలవారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును. ఇప్పుడు నీ వోసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తిశ్రద్దలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగ వత్తురు.” అని శ్రీమన్నారాయణుడు మునులకు బోదించి శ్రీమహాలక్ష్మితో గూడి పాలసముద్రమును కేగి శేషపానుపు మీద పవ్వళించెను.

    వశిష్టుడు జనకమహారాజుతో “రాజా! ఈ విధముగా విష్ణుమూర్తి, జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్మ్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోభునకు తెలియచేసెను. నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతులవారును చేయవచ్చును. శ్రీ మన్నారయణుని ఉపదేశము ప్రకారము ముని పుంగవులందరు యీ చాతుర్మాస్య వ్రత మాచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి.

    స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనవింశోధ్యాయము పందోమ్మిదోరోజు పారాయణము సమాప్తము.

  • Karthika Puranam Day 14 Adhyayam

    Karthika Puranam Day 14 Adhyayam Visit www.stotraveda.com
    Karthika Puranam Day 14 Adhyayam

    Karthika Puranam Day 14 Adhyayam Story

    పద్నాలుగో రోజు పారాయణం- కార్తీక పురాణం 14వ అధ్యాయం

    Karthika Puranam 14th Day Parayanam- Karthika Puranam Day 14 Adhyayam

    కార్తీకపురాణం – 14వ రోజు పారాయణము

    ఆబోతుకు అచ్చువేసి వదులుట

    మళ్లీ వశిష్టమహాముని కార్తీక మాస మహత్యాలను గురించి తనకు తెలిసిన అన్ని విషయాలను జనకుడికి చెప్పాలనే కుతూహలంతో ఇలా చెబుతున్నారు… ”ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సవం చేయడం, శివలింగ సాలగ్రామాలను దానం చేయడం, ఉసిరికాయల్ని దక్షణతో దానం చేయడం మొదలగు పుణ్యకార్యాలు చేయడం వల్ల వెనకటి జన్మల్లో చేసిన సమస్త పాపాలు తొలగిపోతాయి. అలా చేసేవారికి కోటి యాగాల ఫలితం దక్కుతుంది. వారి వంశానికి చెందిన పితృదేవతలు పైలోకాల నుంచి ఎవరు ఆబోతుకు అచ్చువేసి వదులుతారో? అని చూస్తుంటారు. ప్రతిసంవత్సరం కార్తీక మాసంలో శక్తికొలదీ దానం చేసి, నిష్టతో వ్రతమాచరించి, శివకేశవులకు ఆలయంలో దీపారాధన చేసి, పూజరోజున రాత్రంతా జాగారం ఉండి, మర్నాడు శక్తికొలదీ బ్రాహ్మణులు, సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహ, పర లోకాల్లో సర్వసుఖాలను పొందగలరు” అని వివరించారు.
    కార్తీకమాసంలో చేయాల్సిన పనులను చెప్పిన వశిష్టుడు మరికొన్ని నిత్యాచరణ విధులతోపాటు, చేయకూడనివేవో ఇలా చెబుతున్నాడు… ”ఓ రాజా! పరమ పవిత్రమైన ఈ నెలలో పరాన్న భక్షణ చేయరాదు. ఇతరుల ఎంగిలి ముట్టుకోకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనం చేయకూడదు. నీరుల్లి తినకూడదు. తిలాదానం తగదు. శివార్చన, సంధ్యావందనం, విష్ణుపూజ చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారాల్లో సూర్యచంద్ర గ్రహణం రోజుల్లో భోజనం చేయరాదు. కార్తీక మాసంలో నెలరోజులూ రాత్రుళ్లు భోజనం చేయకూడదు. ఈ నెలలో విధవ వండింది తినకూడదు. ఏకాదశి, ద్వాదశి వ్రతాలు చేసేవారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం చేయాలి. ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలి. ఈ నెలో ఒంటికి నూనె రాసుకుని స్నానం చేయకూడదు. పురాణాలను విమర్శించరాదు. కార్తీక మాసంలో వేడినీటితో స్నానం కల్తుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి, వేడినీటి స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యం ఉంది, ఎలాగైనా విడవకుండా కార్తీకమాస వ్రతం చేయాలనే కుతూహలం ఉన్నవారు మాత్రమే వేడినీటి స్నానం చేయొచ్చు. అలా చేసేవారు గంగా, గోదావరి, సరస్వతీ, యమునా నదుల పేర్లను మనస్సులో స్మరించి స్నానం చేయాలి. తనకు దగ్గరగా ఉన్న నదిలో ప్రాత్ణకాలంలో పూజ చేయాలి. నదులు అందుబాటులో లేని సమయంలో నూతిలోగానీ, చెరువులో గానీ స్నానం చేయవచ్చు. ఆ సమయంలో కింది శ్లోకాన్ని స్మరించుకోవాలి…

    శ్లో|| గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
    నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిదింకురు||


    ”కార్తీక మాస వ్రతం చేసేవారు పగలు పురాణ పఠనం, శ్రవణం, హరికథా కాలక్షేపంతో కాలం గడపాలి. సాయంకాలంలో సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తిచేసుకుని, శివుడిని కల్పోక్తంగా పూజించాలి” అని వివరించారు. అనంతరం కార్తీకమాస శివపూజాకల్పాన్ని గురించి వివరించారు.

    కార్తీక మాస శివ పూజ కల్పము:
    1 ఓం శివాయ నమ్ణ ధ్యానం సమర్పయామి
    2 ఓం పరమేశ్వరాయ నమ్ణ అవాహం సమర్పయామి
    3 ఓం కైలసవాసయ నమ్ణ నవరత్న సంహాసనం సమర్పయామి
    4 ఓం గౌరీ నాథాయ నమ్ణ పాద్యం సమర్పయామి
    5 ఓం లోకేశ్వరాయ నమ్ణ అర్ఘ్యం సమర్పయామి
    6 ఓం వృషభ వాహనాయ నమ్ణ స్నానం సమర్పయామి
    7 ఓం దిగంబరాయ నమ్ణ వస్త్రం సమర్పయామి
    8 ఓం జగన్నాథాయ నమ్ణ యజ్ఞో పవితం సమర్పయామి
    9 ఓం కపాల ధారిణే నమ్ణ గంధం సమర్పయామి
    10 ఓం సంపూర్ణ గుణాయ నమ్ణ పుష్పం సమర్పయామి
    11 ఓం మహేశ్వరాయ నమ్ణ అక్షతాన్ సమర్పయామి
    12 ఓం పార్వతీ నాథాయ నమ్ణ దుపం సమర్పయామి
    13 ఓం తేజో రూపాయ నమ్ణ దీపం సమర్పయామి
    14 ఓం లోక రక్షాయ నమ్ణ నైవైధ్యం సమర్పయామి
    15 ఓం త్రిలోచనాయ నమ్ణ కర్పూర నీరాజనం సమర్పయామి
    16 ఓం శంకరాయ నమ్ణ సవర్ణ మంత్ర పుష్పం సమర్పయని
    17 ఓం భావయ నమ్ణ ప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి

    ఈ ప్రకారం కార్తీకమాసమంతా పూజలు నిర్వహించాలి. శివసన్నిధిలో దీపారాధన చేయాలి. ఈ విధంగా శివపూజ చేసినవారు ధన్యులవుతారు. పూజ తర్వాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమర్థన చేసి, దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. ఇలా చేసినట్లయితే.. నూరు అశ్వమేథాలు, వేయి వాజపేయి యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో నెలరోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షం లభిస్తుంది. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమాచరించనివారు వంద జన్మలు నానాయోనులయందు జన్మించి, ఆ తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలనెత్తుతారు. ఈ వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఆచరించేవారు పదిహేను జన్మల పూర్వజ్ఞానాన్ని పొందుతారు. వ్రతం చేసినా, పురాణం చదివినా, విన్నా అట్టివారు సకలైశ్వర్యాలను పొందుతారు. అంత్యమున మోక్షాన్ని పొందెదరు”.ఇట్లు స్కాందపురాణాంతర్గతమందలి వశిష్టుడు బోధించిన కార్తీక మహత్యం… పద్నాలుగో అధ్యాయం సమాప్తంపద్నాలుగో రోజు పారాయణం సమాప్తం

    Karthika Puranam Day 14 Adhyayam Slokas Format:

    కార్తీక పురాణం పదునాల్గవ అధ్యాయం
    అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే చతుర్దశోధ్యాయః

    శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం పదునాల్గవ అధ్యాయం

    వసిష్ఠఉవాచ
    పౌర్ణమ్యాంకార్తికేమాసి వృషోత్సర్గం కరోతియః
    తస్యపాపాని నశ్యమ్తి జన్మాంతరకృతానిచ!!

    తాత్పర్యం:

    వసిష్ఠుడు చెప్పుచున్నాడు, కార్తీకపౌర్ణమిని వృషోత్సర్జనము చెయుటవలన జన్మాంతర పాపములు నశించును. (వృషోత్సర్జనము అనగా ఆంబోతును వదులుట)యఃకార్తికేవృషోత్సర్గం పౌర్ణమ్యాంపితృతృప్తయే
    సంకుర్యాద్విధినా రాజన్ తస్యపుణ్యఫలంశ్రుణు!!
    గయాశ్రాద్ధంకృతంతేన కోటివారంనసంశయః
    పుణ్యదం మానుషేలోకే దుర్లభం కార్తికవ్రతమ్!!

    తాత్పర్యం:

    కార్తీకమాస వ్రతము ఈ మనుష్యలోకంలో దుర్లభము, అనగా సులభముగా ముక్తిమార్గమునిచ్చునని భావము, కార్తీకపున్నమి నాడు పితృప్రీతిగా వృషోత్సర్జనమును చేయువానికి కోటిరెట్లు గయాశ్రాద్ధఫలము చెందుతుంది.యఃకోవాస్మత్కులేజాతః పౌర్ణమాస్యాంతు కార్తికే
    ఉత్సృజేద్వృషభంనీలం తేనతృప్తావయంత్వితి
    కాంక్షఁతినృపశార్దూల పుణ్యలోకస్థితా అపి!!
    పౌర్ణమ్యాం కార్తికేమాసి ఆఢ్యో వాప్యధమోపివా
    నోత్సృజేద్వృషభంలోభా త్సయాత్యంధతమోయమాత్!!
    పిండదానాద్గయా శ్రాద్ధా త్ప్రత్యబ్దం ప్రతివత్సరే
    పుణ్యతీర్థాసంగమనా త్తర్పణాచ్చమహాలయాత్
    కార్తికేపౌర్ణిమాస్యాంతు వృషోత్సర్గం వినాగతిః!!
    గయాశ్రాద్ధం వృషోత్సర్గం సమమాహుర్మనీషిణః
    ప్రశస్తమూర్జెపౌర్ణమ్యాం వృషోత్సర్గస్సుఖప్రదః!!

    తాత్పర్యం:

    స్వర్గమందున్న పితరులు మనవంశమందు ఎవరైనా కార్తీకపున్నమినాడు నల్లని గిత్తను విడుచునా? ఆ విధముగ ఎవరైనా వృషోత్సర్జనము చేసిన తృప్తిపొందెదము అని కోరుకుంటూంటారు. ధనవంతుడుగానీ, దరిద్రుడుగానీ, కార్తీకపున్నమినాడు లోభమువల్ల వృషోత్సర్గమను ఆంబోతునువిడుచుక్రియను చేయనివాడు యమలోకమున అంధతమిస్రమను నరకమును పొందెదరు. కార్తీకపున్నమి రోజున వృషోత్సర్గమును చేయక, గయాశ్రాద్ధము చేసిననూ ప్రతిసంవత్సరమూ తద్దినము పెట్టిననూ పుణ్యతీర్థములు సేవించిననూ మహాలయము పెట్టిననూ పితరులకు తృప్తిలేదు. గయాశ్రాద్ధమును, వృషోత్సర్జమును సమానమని విద్వామ్సులు చెప్పిరి, కనుక, కార్తికపున్నమి నాడు వృషోత్సర్జనము సుఖమునిచ్చును.

    యఃకుర్యాత్కార్తికేమాసి సర్వధర్మాధికం ఫలం
    ఋణత్రయాద్విముచ్యేత కిమన్యైర్బహుభాషణైః!!
    యోధాత్రీఫలదానంతు పౌర్ణమ్యాంచసదక్షిణం
    కురుతె నృపశార్దూల సార్వభౌమోభవేద్ధృవమ్!!
    యంకుర్యాద్దీపదానంచ పౌర్ణమ్యాం కార్తికేనఘ
    సర్వపాపవినిర్ముక్తో తతో యాంతి పరాంగతిమ్!!
    కర్మణామనసావాచా పాపంయస్సమ్యగాచరేత్
    తస్యపాపానినశ్యంతి కార్తిక్యాందీపదానతః!!
    లింగదానం పౌర్ణమాస్యాం కార్తిక్యాంశివతుష్టయే
    ఇహసమ్యక్ఫలం ప్రాప్య సార్వభౌమోభవేద్ధ్రువమ్!!
    పాపఘ్నం పుణ్యదంప్రాహుర్లింగదానం మనీషిణః
    లింగదానమనాదృత్య యఃకుర్యాత్కార్తికవ్రతం
    వజ్రలేపోభవేత్తస్య పాపరాశిర్నసంశయః!!

    తాత్పర్యం: 

    అనేక మాటలేల? కార్తీకపున్నమినందు అన్ని పుణ్యములకంటే అధికమైన ఫలదానముచేయువాడు దేవ-పితృఋణ, ఋషిఋణ, మనుష్యఋణములనుమ్చి విముక్తినొందును. కార్తీకపూర్ణిమనాడు దక్షిణతోకూడి ధాత్రీఫలమును దానమిచ్చినవాడు సార్వభౌముడగును. కార్తీక పూర్ణిమనాడు దీపదానమాచరించినవారు విగతపాపులై పరమపదమునొందెదరు. కార్తీకమాసమమ్దు దీపదానమాచరించువాని మనోవాక్కాయములచేత చేసిన పాపములు నశించును. కార్తీకపున్నమి నాడు లింగదానమాచరించువాడు ఈ జన్మమునందు అనేక భోగములననుభవించి ఉత్తరజన్మమందు సార్వభౌముడగును. లింగదానము వలన పాపములు శమించి, పుణ్యము గలుగును, కార్తీకమాసమందు లింగదానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రమూ కరుగవు.

    అనంతఫదంప్రోక్తం దుర్లభం కార్తికవ్రతం
    పరాన్నంపితృశేషంచ నిషిద్ధస్యచ భక్షణం
    శ్రాద్ధాన్నం తిలదానం చ కార్తికేవం చ వర్జయేత్!!
    గణాన్నంవృషలస్యాన్నం దేవలాన్నమసంస్కృతం
    వ్రాత్యాన్నంవిధవాన్నంచ కార్తికేషడ్వివర్జయేత్!!
    అమాయాం పౌర్ణమాస్యాంచ ప్రత్యబ్దేభానువాసరే
    సోమసూర్యోపరాగేచ ఊర్జేననిశిభోజనమ్!!
    ఏకదశ్యామహోరాత్రం వ్యతీపాతేచ వైధృతౌ
    నిసిద్ధదివసేరాజన్ గృహీయః కార్తికవ్రతే!!
    విష్ణోర్దినస్యయత్నేన పూర్వోత్తరదినద్వయే
    మాసనక్తవ్రతాధీనో నకుర్యాన్నిశిభోజనమ్
    నిషిద్ధదివసేప్రోక్తం ఛాయానక్తంమహర్షిభిః
    నక్తవ్రతఫలంతేన న నక్తంనిశిభోజనమ్!!
    సర్వపుణ్యప్రదెరాజన్ కార్తికేమాసియఃపుమాన్
    నిషిద్ధదివసేచాన్నం భోజనంకురుతేయది
    తస్యపాపస్యవిస్తారం కథం తేప్రబ్రవీమ్యహమ్!!

    తాత్పర్యం:

    కార్తీకవ్రతము అనంత ఫలప్రదము, సామాన్యముగా దొరకనిది కనుక కార్తీకమాసమునందు పరాన్నము భుజించుట, పితృశేషము తినకూడని వస్తువులు తినుట, శ్రాద్ధాన్నము సేవించుట, తిలదానము గ్రహించుట ఈ ఐదూ విడువవలెను. కార్తీకమాసమమ్దు సంఘాన్నము, శూద్రాన్నము, దేవతార్చకుల అన్నము, అపరిశుద్ధాన్నము, కర్మలను విడువుమని చెప్పువాని అన్నము, విధవాన్నమును భుజించరాదు. కార్తీకమాసమందు అమావాస్యయందు, పున్నమియందు పితృదినమందు ఆదివారమందు సూర్యచంద్ర గ్రహణములందు రాత్రిభోజనము నిషిద్ధము. కార్తీకమాసమందు ఏకాదశినాడు రాత్రింబగళ్ళు, వ్యతీపాత వైధృతి యోగాది నిషిద్ధ దినములందు రాత్రి భోజనము చేయరాదు. మాస నక్తవ్రతము ఆచరించిన వాడు ఈ ఏకాదశికి పూర్వోత్తరదినములందును రాత్రిభుజించరాదు. అప్పుడు ఛాయానక్తభోజనము చేయవలెను కానీ రాత్రిభోజనము చేయరాదు. ఛాయానక్తమే రాత్రిభోజన ఫలమిచ్చును. కనుక రాత్రిభోజనముగూడ దినములందు కార్తీకవ్రతము చేయువాడు ఛాయానక్తమునే గ్రహింపవలెను ఛాయానక్తము అనగా సాయంత్రము తనశరీరమునకు రెండింతలు నీడ వచ్చినప్పుడు భోజనము చేయుట. యిదినిషిద్ధదినములలో గృహస్థులకు, ఎల్లప్పుడు యతి-విధవలకు హితము. సమస్త పుణ్యములనిచ్చు ఈ కార్తీకమాసమందు నిషిద్ధదినములందు భుజించువారి పాపములు అనంతములగును.తస్మాద్విచార్యయత్నేన కార్తికవ్రతమాచరేత్
    తైలాభ్యంగందివాస్వాపం తథావైకాంస్యభోజనం
    మఠాన్నిద్రాంగృహేస్తానం నిషిద్ధేనిశిభోజనం
    వేదశాస్త్రవినిమ్దాంచ కార్తికేసప్తవర్జయేత్!!
    ఉష్ణోదకేనకర్తవ్యం స్నానంయత్రైవకార్తికే
    స్నానంతత్సురయాప్రోక్తం నిశ్చితంబ్రహ్మణాపురా
    పటుర్భూత్వాగృహేస్నానం యః కుర్యాదుష్ణవారిణా!!
    నదీస్నానం తు కర్తవ్యం తులాసంస్థేదివాకరే
    కార్తికేమాసిరాజేంద్ర ఉత్తమంతంప్రచక్షతే!!
    తటాకకూపకుల్యానాం జలేవాస్నానమాచరేత్
    వినాగంగావినాగోదాం వినాతద్వత్సరిద్వరాం
    తటాకకూపకుల్యానాం సుగంగామభివాదయేత్!!
    సంప్రాప్యకార్తికంమాసం స్నానం యోనసమాచరేత్
    సగచ్చేన్నరకంఘోరం చాండాలీం యోనిమాప్నుయాత్!!
    గంగాదిసర్వనదీశ్చ స్మృత్వాస్నానం సమాచరేత్
    తతోభివాదనంకుర్యాత్సూర్యమండలగ్ం హరిమ్
    కృత్వావిష్ణుకథాందివ్యాం విప్రైస్సార్థంగృహవ్రజేత్!!

    తాత్పర్యం:

     కావున, విచారణచేసి ప్రయత్నపూర్వకముగా కార్తీక వ్రతమును ఆచరించవలెను, కార్తీకమాసమందు తైలాభ్యంగనము, పగలు నిద్ర, కంచుపాత్రలో భోజనము, మఠములలో నిద్ర, ఇంట్లో స్నానము, నిషిద్ధ దినములందు భోజనము వేదశాస్త్రనింద కూడదు. కార్తీకమాసములో శరీర సామర్థ్యము కొరకు ఇంటిలో వేడినీటి స్నానము చేయుట కల్లుతో స్నానమాచరించుట యని బ్రహ్మ చెప్పెను, శరీరపటుత్వము / ఆరోగ్యము సరి లేనివారు వేడినీటితో స్నానము చేయవచ్చు. తులయందు సూర్యుడుండగా కార్తీకమందు నదీస్నానమే ముఖ్యము. ఒకవేళ నది దగ్గరలో లేకున్న చెరువు, కాలువ, బావులందు స్నానము చేయవచ్చు. అప్పుడు గంగా ప్రార్థన చేసి స్నానము చేయవలెను, గంగా గోదావరి మహానదులలో స్నానము చేయునప్పుడు ప్రార్థన అవసరంలేదు. గంగా గోదావరి మొదలైన నదుల సన్నిధిలో లేనప్పుడు తటాక, కూపోదక స్నానము కర్తవ్యము. *కార్తీకమాసమందు ప్రాతస్స్నానమాచరించనివాడు నరకమందు యాతనలను అనుభవించి ఆ తరవాత ఛండాలుడై పుట్టును*. గంగాది సమస్తనదులను స్మరించి స్నానము చేసి సూర్యమండల గతుడైన ఆ శ్రీహరిని ధ్యానించి హరిచరిత్రను విని ఇంటికెళ్లవలెను.

    దినాంతె సర్వకర్మాణి సమాప్యవిధినానృప
    పాదౌప్రక్షాళ్యచాచమ్య పూజాస్థానం ప్రవేశయేత్
    పూజయేదీశ్వరంతత్ర షోడశైరుపచారకైః
    పీఠస్థంపూజయేచ్చంభుం కల్పోక్తవిధినాఽనఘ
    పంచామృతవిధానేన ఫలతోయైఃకుశోదకైః
    స్నాపయేత్పుణ్యసూక్తైశ్చ భక్త్యాగౌరీపతింప్రభుమ్!!
    తతశ్చావాహయేద్దేవం శంకరం పరమేశ్వరం
    వృషధ్వజాయధ్యానంచ పాద్యంగౌరీప్రియాయచ
    అర్ఘ్యంలోకేశ్వరాయేతి రుద్రాయాచమనీయకం
    స్నానంగంగాధరాయేతి వస్త్రమాశాంబరాయచ
    జగన్నాధాయోపవీతం గంధం కపాలధారిణే
    అక్షతానీశ్వరాయేతి పుష్ఫంపూర్ణగుణాత్మనె
    ధూమ్రాక్షాయేతి ధూపంవై తేజోరూపాయదీపకం
    లోకరక్షాయనైవేద్యం తాంబూలం లోకసాక్షిణే
    ప్రదక్షిణంభవాయేతి నమస్కారం కపాలినే!!

    తాత్పర్యం:

    పగలు చేయవలసిన వ్యాపారాదులు ఇతర పనులు చేసి, సాయంకాలము తిరిగి స్న్నము చేసి ఆచమించి పూజాస్థానమందు పీఠముపై శంకరుని ఉంచి, పంచామృతములతోనూ, ఫలోదకముతోనూ, కుశోదకముతోనూ మహాస్నానము చేయించి షోడశోపచారములతో పూజించవలెను.శంకరుని ఆవాహన చేసి
    అ) వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి
    ఆ) గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి
    ఇ) లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి
    ఈ) రుద్రాయ ఆచమనీయం సమర్పయామి
    ఉ) గంగాధరాయ స్నానం సమర్పయామి
    ఊ) ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి
    ఋ) జగన్నాధాయ ఉపవీతం సమర్పయామి
    ౠ) కపాలధారిణే గంధం సమర్పయామి
    ఎ)ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి
    ఏ) పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి
    ఐ) ధూమ్రాక్షాయ ధూపం సమర్పయామి
    ఒ) తేజోరూపాయ దీపం సమర్పయామి
    ఓ) లోకరక్షాయ నైవేద్యం సమర్పయామి
    ఔ) లోకసాక్షిణే తాంబూలం సమర్పయామి
    అం) భవాయ ప్రదక్షిణం సమర్పయామి
    అః) కపాలినేనమః నమస్కారం సమర్పయామి
    అని ఈ ప్రకారంగా షోడశోపచారముల చేత శంకరుని పూజింపవలెను.

    ఏతైర్యోనామభిర్భక్త్యా పూజయేద్గిరిజాపతిం
    శంభోర్నామసహస్రేణ మాసమేకంనిరంతరం
    పూజాం తేచార్పయేదర్ఘ్యం మాసనక్తవ్రతేనృప
    *//పార్వతీకాంతదేవేశ పద్మజార్చ్యాంఘ్రిపంకజ*
    *అర్ఘ్యం గృహాణదైత్యారె దత్తచేదముమాపతే//*
    అర్చయేచ్ఛంకరంభక్త్యా యస్సధన్యోనసంశయః!!

    తాత్పర్యం:

    పైన చెప్పిన శంకరనామములచే పూజించి ఈ నెలయంతా శివ సహస్రనామములచేత నిత్యము పూజించి పూజావసానమందు ఈ పైన చెప్పిన శ్లోకరూప మంత్రము (” పార్వతీకాంత… ముమాపతే… “) తో అర్ఘ్యము యివ్వవలెను. ఇలా అర్ఘ్యమునిచ్చినవాడు ధన్యుడై ముక్తుడగును. అనుమానము లేదు.తథావిత్తానుసారేణ దీపమాలార్పణం నృప
    దత్వాదానంతువిప్రేభ్యో విత్తశాఠ్యంనకారయేత్!!
    ఏవంవిప్రవరైస్సార్థం నక్తంయఃకార్తికవ్రతీ
    కురుతేనృపశార్దూల తస్యపుణ్యఫలం శ్రుణు
    అగ్నిష్టోమసహస్రాణి వాజపేయశతానిచ
    అశ్వమేధసహస్రాణాం ఫలం ప్రాప్నోత్యసంశయః!!
    మాసనక్తంచయఃకుర్యాదిత్యేవంవిధినానఘ
    పాపమూలోద్ఘాటనంచ తమాహుర్నారదాదయః!!
    మాసనక్తం మహత్పుణ్యం సర్వపాపవినాశనం
    సర్వపుణ్యప్రదంనౄణాం కార్తికేనాత్రసంశయః!!
    యఃకార్తికేచతుర్ధశ్యాం పితౄనుద్ధిశ్యభక్తితః
    బ్రాహ్మణంభోజయేద్దేవంప్రీణంతిపితరోఽఖిలాః!!
    యఃకార్తికేసితేపక్షే చతుర్దశ్యాంనరేశ్వర
    ఔరసఃపితృభక్తోయస్తిలైస్సంగతర్పయేజ్జలే
    ప్రీణంతిపితరస్సర్వే పితృలోకంగతాఅపి!!

    తాత్పర్యం:

    తన శక్తికొలది దీపమాలలను సమర్పించి శక్తివంచనలేక బ్రాహ్మణులకు దానమివ్వవలెను. ఈప్రకారము కార్తీకమాసమంతయు బ్రాహ్మణులతో గూడిన నక్తవ్రతమును చేయువాడు వేయి సోమయాగములు నూరు వాజపేయయాగములు వేయి అశ్వమేధయాగములు చేసిన ఫలము బొందును. కార్తీకా మాసములో ఈ ప్రకారము మాసనక్తవ్రతము ఆచరించువాడు పాపములను సమూలముగా పరిహరించుకొనునని నారదాదులు చెప్పిరి. కార్తీకమందు మాస నక్తవ్రతము వలన పుణ్యమధికమగును, సమస్తపాపములు నశించును ఇందులో సందేహములే లేవు. కార్తీకమాసమందు చతుర్దశి పితృదేవతలప్రీతికొరకు బ్రాహ్మణునకు భోజనము పెట్టిన ఎడల పితరులు తృప్తిపొందెదరు. కార్తికమాసమమ్దు శుక్ల చతుర్దశియమ్దు ఔరసపుత్రుడు తిలతర్పణమాచరించినచో పితృలోకవాసులైన పితరులు తృప్తిపొందెదరు.

    యఃకుర్యాత్ఫలదానంతు చతుర్ధశ్యాంతుకార్తికే
    సతస్యసంతి తేర్హానిర్జాయతేనాత్రసంశయః!!
    యఃకుర్యాత్తిలదానంతుచతుర్దశ్యాంతుకార్తికే
    ఉపోష్యశంకరంపూజ్య సకైలాసేశ్వరోభవేత్!!
    సర్వపాపప్రశమనం పుణ్యదం కార్తికవ్రతమ్
    యఃకుర్యాత్సోపిపాపేభ్యో విముక్తోమృతమశ్నుతే!!
    ఇదంపవిత్రంపరమమ్ అధ్యాయం యశ్శ్రుణోత్యతః
    ప్రాయశ్చిత్తంపరంప్రాహుః పాపానాంనాత్రసంశయః!!

    తాత్పర్యం:

    కార్తీకమాసమందు చతుర్దశి నాడు ఫలదాన మాచరించువాని సంతతికి విచ్ఛేదము కలుగదు సందేహములేదు. కార్తీకమాసమందు చతుర్దశినాడు ఉపవాసమాచరించి శంకరుని ఆరాధించి తిలదానమాచరించినవాడు కైలాసమునకు ప్రభువగును. సమస్తపాపములను పోగొట్టునదీ, సమస్తపుణ్యములను వృద్ధిపరచునది ఐన కార్తీకవ్రతమును చేయువాడు పాపములు నశించి మోక్షమునొందును. పవిత్రమైన ఈ అధ్యాయమును భక్తితో వినువారు సమస్తపాతకములకు ప్రాయశ్చిత్తము చేసుకొన్నవారగుదురు.

    ఇతి శ్రీ స్కాందపురాణే కార్తికమాహాత్మ్యే చతుర్దశోధ్యాయస్సమాప్తః

    ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి పదునాల్గవ అధ్యాయము సమాప్తము.

  • Karthika Puranam Day13 Adhyayam

    Karthika Puranam Day13 Adhyayam Visit www.stotraveda.com
    Karthika Puranam Day13 Adhyayam

    Karthika puranam Day 13 Adhyayam Story

    పదమూడో రోజు పారాయణం-కార్తీక పురాణం 13 వ అధ్యాయం

    Karthika Puranam 13th Day Parayanam

    Karthika Puranam Day 13th Adhyayam- కార్తీకపురాణం – 13వ రోజు పారాయణము

    కన్యాదాన ఫలం, సువీరచరిత్రము

    తిరిగి వశిష్టుడు జనకుడితో ఇలా అంటున్నాడు ”ఓ మహారాజా! కార్తీకమాసంలో ఇంకా విధిగా చేయాల్సిన ధర్మాలు చాలా ఉన్నాయి. వాటిని వివరిస్తాను విను… కార్తీకమాసంలో నదీస్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుడి కుమారుడికి ఉపనయనం చేయడం మరింత ముఖ్యం. ఒకవేళ ఉపనయనానికి అయ్యే ఖర్చు అంతా భరించే శక్తిలేనప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాలు, సంభావనలతో తృప్తిపరిచినా ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఓ పేద బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేసినట్లయితే… ఎంతటి మహాపాపాలైనా తొలగిపోతాయి. ఎన్ని బావులు, చెరువులు తవ్వించినా… పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేస్తే వచ్చే ఫలితానికి సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీకమాసంలో భక్తిశ్రద్ధలతో కన్యాదానం చేసినట్లయితే… తను తరించడమే కాకుండా… తన పితృదేవతలను కూడా తరింపజేసినవారవుతారు. ఇందుకు ఒక వృత్తాంతముంది. చెబుతాను విను…” అని ఇలా చెప్పసాగాడు…

    సువీర చరితం:

    పూర్వం వంగ దేశంలో గొప్ప పరాక్రమ వంతుడు, శూరుడు అయిన ”సువిరు”డను ఒక రాజు ఉండేవాడు. అతనికి రుపవతి అయిన భార్య ఉంది. ఒకసారి అతను శత్రురాజులచే పరాజితుడయ్యాడు. దీంతో అతను భార్యతో కలిసి అరణ్యానికి పారిపోయి, ధన హీనుడై, నర్మదానదీ తీరంలో పర్ణశాల నిర్మించుకుని, కందమూలాలు భక్షిస్తూగడపసాగాడు. కొన్నాళ్లకు అతని భార్య ఒక బాలికను కన్నది. ఆ బిడ్డను అతి గారాబంతో పెంచుచుండేవారు. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు లేకపోయినా… శుక్లపక్ష చంద్రుడి మాదిరిగా రోజురోజూ అభివృద్ధి కాసాగింది. అతిగారాబంతో పెరగసాగింది. అలా రోజులుగడుస్తుండగా… ఆ బాలిక యవ్వనవతియైంది. ఒక దినాన వానప్రస్తుడి కుమారుడు ఆ బాలికను చూసి, అందచందాలకు పరవశుడై, తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు. అందుకా రాజు ”ఓ మునిపుత్రా…! ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రాలు అనుభవిస్తున్నాను. మా కష్టాలు తీరేందుకు కొంత ధనమిచ్చినట్లయితే… నా బిడ్డనిచ్చి పెండ్లి చేస్తానని చెప్పాడు. దాంతో ఆ మునిపుత్రుడు చేతిలో పైసా లేకున్నా… బాలికపై ఉన్న మక్కువతో కుబేరుడిని గురించి ఘోర తపస్సు చేశాడు. కుబేరుడిని మెప్పించి, ధన పాత్ర సంపాదించాడు. రాజు ఆ పాత్రను తీసుకుని, సంతోషించి, తన కుమార్తెను ముని కుమారుడికిచ్చి పెళ్లి చేశాడు. నూతన దంతపతులిద్దరినీ అత్తవారింటికి పంపాడు.

    అలా మునికుమారుడు తన భార్యను వెంటబెట్టుకుని, తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, నమస్కరించి, జరిగిన సంగతిని చెప్పాడు. తన భార్యతో కలిసి సుఖంగా జీవించసాగాడు. అయితే సువీరుడు మునికుమారుడిచ్చిన పాత్రను తీసుకుని, స్వేచ్ఛగా ఖర్చుచేస్తూ… భార్యతో సుఖంగా ఉండసాగాడు. కొంతకాలానికి అతనికి మరో బాలిక జన్మించింది. ఆమెకు కూడా యుక్తవయసు రాగానే, ఎవరికైనా ధనానికి అమ్మాలనే ఆశతో ఎదురుచూడసాగాడు.
    ఒక సాధువు తపతీ నదీ తీరం నుంచి నర్మదా నదీ తీరానికి స్నానార్థం వస్తుండగా… దారిలో ఉన్న సువీరుడిని కలుసుకున్నాడు… ”ఓయీ! నీవెవరు? నీ ముఖ వర్చస్సు చూస్తే రాజవంశంలో పుట్టినవాడిలా ఉన్నావు. ఈ అడవిలో ఏం చేస్తున్నావు? భార్యాపిల్లలతో ఇక్కడ జీవించడానికి కారణమేమిటి?”అని ప్రశ్నించాడు. దానికి సువీరుడిలా చెబుతున్నాడు… ”ఓ మహానుభావా! నేను వంగదేశాన్ని పరిపాలించేవాడిని. నా పేరు సువీరుడు. నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించడంతో భార్యాసమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రం కంటే కష్టమేది ఉండదు. పుత్రశోకం కంటే దు:ఖం ఉండదు. అలాగే భార్యావియోగం కంటే సంతాపం వేరొకటి లేదు. అందువల్ల రాజ్యభ్రష్టుడనైనా… ఈ కారడవిలో ఉన్నంతలో సంతృప్తి పొందుతూ కుటుంబ సమేతంగా బతుకుతున్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు. అందులో మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకు ఇచ్చి, వాడి వద్ద కొంత దానం తీసుకున్నాను. దాంతో ఇప్పటి వరకు కాలక్షేపం చేస్తున్నాను” అని చెప్పగా… ”ఓ రాజా! నీవు ఎంతటి దరిద్రుడవైనా… ధర్మ సూక్షం ఆలోచించకుండా కన్యను అమ్ముకున్నావు. కన్య విక్రయం మహాపాతకం. కన్యను విక్రయించువాడు అసి పత్రవానమనే నరకాన్ని అనుభవిస్తాడు. ఆ ద్రవ్యాలతో చేసే వ్రతం ఫలించదు. కన్య విక్రయం చేసేవారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపిస్తారు. అలాగే కన్యను ధనమిచ్చి కొని, పెండ్లాడిన వారి గృహస్థధర్మాలు వ్యర్థమగుటయేకాకుండా, అతను మహా నరకం అనుభవిస్తాడు. కన్యను విక్రయించేవారికి ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి రాబోయే కార్తీక మాసంలో రెండో కుమార్తెకు శక్తికొలదీ బంగారు ఆభరణాలతో అలంకరించి, సదాచార సంపన్నుడికి, ధర్మబుద్ధిగలవాడికి కన్యాదానం చేయి. అట్లు చేసినట్లయితే గంగాస్నానం, అశ్వమేథయాగ ఫలాలను పొందుతావు. మొదటి కన్యను అమ్మిన పాప ఫలాన్ని తొలగించుకున్న వాడివవుతావు” అని రాజుకు హితోపదేశం చేశాడు.

    అందుకారాజు చిరునవ్వుతో… ”ఓ మునివర్యా! దేహసుఖం కంటే దానధర్మాలతో వచ్చిన ఫలం ఎక్కువా? తాను బతికుండగానే భార్యాబిడ్డలు, సిరిసంపదలతో సుఖంగా ఉండకుండా, చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతం ఉన్న అవకాశాలను చేతులారా జార విడుచుకోమంటారా? ధనం, బంగారం కలవాడే ప్రస్తుతం లోకంలో రాణించగలడు. కానీ, ముక్కుమూసుకుని, నోరుమూసుకుని, బక్కచిక్కి శల్యమైనవాడిని లోకం గుర్తిస్తుందా? గౌరవిస్తుందా? ఐహిక సుఖాలే గొప్పసుఖాలు. కాబట్టి నా రెండో బిడ్డను నేనడిగతినంత ధనం ఇచ్చే వారికే ఇచ్చి పెండ్లిచేస్తాను. కానీ, కన్యాదానం మాత్రం చేయను” అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలకు ఆ సన్యాసి ఆశ్చర్యపడి, తన దారిన తాను వెళ్లిపోయాడు. మరికొన్ని రోజులకు సువీరుడు చనిపోయాడు. వెంటనే యమ భటులు వచ్చి, అతన్ని తీసుకుపోయిరి. యమలోకంలో అసిపత్రవనం అనే నరకంలో పారేశారు. అక్కడ అనేక విధాలుగా బాధించారు. సువీరుడికి పూర్వికుడైన శ్రుతుకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజల్ని పాలించి, ధర్మాత్ముడై మృతిచెంది, స్వర్గాన్ని పొందాడు. అయితే ఆయన వంశజుడైన సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల శ్రుతుకీర్తి కూడా స్వర్గం నుంచి నరకానికి వచ్చాడు. అంతట శ్రుతకీర్తి ”నేను ఒకరికి ఉపకారం చేశానే తప్ప అపకారమెన్నడూ చేయలేదు. దానధర్మాలు, యజ్ఞయాగాదులు చేశాను. అయినా.. నాకు ఈ దుర్గతి ఎలా?” అని నిండు కొలువులో యమధర్మ రాజును ప్రశ్నించాడు.

    వినయంగా ఇలా చెబుతున్నాడు… ”ప్రభూ… నీవు సర్వజ్ఞుడవు. ధర్మమూర్తివి. బుద్ధిశాలివి. ప్రాణకోటిని తరతమ తారతమ్య బేధాలు లేకుండా సమానంగా చూస్తావు. నేనెన్నడూ పాపం చేయలేదు. అయితే నన్ను స్వర్గం నుంచి ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారు? కారణమేమిటి?” అని ప్రశ్నించాడు. దానికి యమధర్మరాజు శ్రుతకీర్తిని చూచి ”ఓయీ… నీవు న్యాయమూర్తివి. ధర్మజ్ఞుడవే. నీవు ఎలాంటి దూరాచారం చేయలేదు. అయినా… నీ వంశీయుడైన సువీరుడు తన జేష్ఠ పుత్రికను అమ్ముకొన్నాడు. కన్యను అమ్ముకునే వారు, వారి పూర్వికులు ఎంతటి పుణ్యవంతులైనా… నరకాలను అనుభవించక తప్పదు. నీచజన్మలు ఎత్తవలసి ఉంటుంది. నీవు పుణ్యాత్ముడవే. అయితే నీకో మార్గం చెబుతాను. నీకు మానవ శరీరాన్ని ఇస్తాను. నీ వంశీయుడైన సువీరుడికి ఇంకో కుమార్తె ఉన్నది. ఆమె నర్మదానదీ తీరంలో తల్లివద్దే పెరుగుతున్నది. అక్కడకు పోయి, ఆ కన్యను వేద పండితుడు, శీలవంతుడికి కార్తీక మాసంలో సాలంకృతంగా కన్యాదానం చేయి. నీవు, మీవాళ్లు ఆ పుణ్యఫలంతో స్వర్గానికి వెళ్తారు” అని చెప్పాడు. ”పుత్రికాసంతానం లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానంచేసినా, విధిగా ఆంబోతుకు వివాహం చేసినా కన్యాదాన ఫలం వస్తుంది. కావున నీవు భూలోకానికి వెళ్లి నేను చెప్పినట్లు చేయి. ఆ కార్యం కారణంగా పితృగణమంతా తరిస్తారు” అని యముడు సెలవిచ్చెను.

    శ్రుతకీర్తి యముడికి నమస్కరించి సెలవు తీసుకుని, నర్మదా నదీతీరంలో ఒక పర్ణకుటీరంలో నివసిస్తున్న సువీరుడి భార్యను, కుమార్తెను చూచి, సంతోషపడి, ఆమెతో అసలు విషయం చెప్పి, కార్తీక మాసంలో సువీరుడి కూతురిని కన్యాదానం చేశాడు. ఆ వెంటనే సువీరుడు, శ్రుతకీర్తి, వారి పూర్వీకులు పాపవిముక్తులై, స్వర్గలోకాన్ని చేరారు.

    ”ఓ జనకమహారాజా! కార్తీకంలో కన్యాదానానికి అంతటి శక్తి ఉంది. అత్యంత పుణ్యఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కార్తీకమాసంలో కన్యాదానం చేసేవాడు విష్ణుసాన్నిధ్యాన్ని పొందుతాడు” అని వివరించాడు.ఇతి శ్రీ స్కాంధపురాణాంతర్గత, వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య: త్రయోదశాధ్యాయ సమాప్త:

    Karthika Puranam Day 13th Adhyayam -పదమూడో రోజు పారాయణం సమాప్తము.

    మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం

    Karthika Puranam Day 13th Adhyayam – Slokas Format:

    అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే త్రయోదశోధ్యాయః

    శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం

    వసిష్ఠఉవాచ

    అధేధానీంప్రవక్షెహం ధర్మాన్కార్తిక సమ్భవాన్

    ప్రశస్తాత్మాసవైభూప తథాచావశ్యకాంచ్ఛ్రుణు!!

    తాత్పర్యం:

    వసిష్ఠుడు మరల చెప్పనారింభిచెను ”  ఓ రాజా, కార్తీక మాసములో చేయదగిన ధర్మములను చెప్పదను  “స్వఛ్ఛమైన మనసుతో ” వినుము ఆధర్మములన్నీ ఆవశ్యము ఆచరించవలసినవి” 

    సంసారభయభీతస్య పాపభీరోర్నరస్యచ

    కార్తికేమాసియత్ప్రోక్తం మత్పిత్రావిధినాపురా

    సత్యంబ్రవీమికర్తవ్యాన్ నోచేత్పాపసంభవేన్నృప!!

    కన్యాదానంతులాస్నానం శిష్టపుత్రోపనాయనం

    విద్యావస్త్రాన్నదానాని ఊర్జెశస్తానిభూపతే!!

    విత్తహీనస్య విప్రస్య సూనోశ్చావ్యుపనాయనం

    సదక్షిణంసంభారం ఊర్జెదత్వానరోనఘ

    తస్యపాపానినశ్యంతి కృతానిబహుళాన్యపి!!

    జపేనైకేనగాయత్ర్యా ద్రవ్యదాతుఃఫలంశ్రుణు

    అగమ్యాగమనాదీని హత్వాదీనిసహస్రశః

    తథాన్యాన్యుగ్రపాపాని భస్మసాద్యాంతిభూమిప!!

    గాయత్రీం దేవ దేవస్య పూజాస్వాధ్యాయనార్పణం

    ఏతేషామధికం పుణ్యం మయావక్తుంనశక్యతె!!

    తాత్పర్యం:

    రాజా! కార్తీక ధర్మములు మాతండ్రియైన బ్రహ్మచే నాకు చెప్పబడినవి, అవి అన్నీ నీకు తెలిపెదను. అన్నియు ఆచరించదగినవే, అవి చేయని పక్షంలో పాపము సంభవిమ్చును. ఇది నిజము, సంసార సముద్రమునుంచి ఊరట కోరుకునేవారు నరకాది భయము గలవారు ఈ ధర్మములను తప్పక చేయవలెను. కార్తీకమాసములో కన్యాదానము ప్రాతస్స్నానము శిష్టుడైన బ్రాహ్మణపుత్రునికుపనయనము చేయించుట విద్యాదానము వస్థ్రధానము అన్నదానము యివి ముఖ్యము. కార్తీకమాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణపుత్రునకు ఉపనయనముచేయించి దక్షిణ యిచ్చిన యెడల అనేక జన్మార్జిత పాపములు నశించును. తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆవటువుచే చేయబడిన గాయత్రి జపఫలమువలన పంచమహాపాతకములు బూదియగును. గాయత్రీజపము, దేవతార్చన, వేదగానము, వీటిఫలము చెప్పుటకు నాకు శక్యముగాదు.

    తటాకాయుతనిర్మాణం అశ్వత్థారోపణంశతం

    కోటయఃకూపవాపీనాం క్రమాన్నందనపాలనాత్

    బ్రహ్మప్రతిష్ఠాపుణ్యస్య కలాంనార్హంతిషోడశీమ్!!

    మాఘ్యాంవై మాధవేమాసి చోత్తమంమౌంజిబంధనమ్

    కారయిష్యంతిరాజన్ దానందత్వాతుకార్తికే!!

    సాధుభ్యశ్శ్రోత్రియేభ్యశ్చ బ్రాహ్మణేభ్యోయథావిధి

    తథాతేషాంసుతానాంచ ప్రకుర్యాన్మౌంజిబంధనం

    తేనానంతఫలంప్రాహుఃర్మునయోధర్మవిత్తమాః!!

    తథాతేషాంవిధానంచ కార్తికేమాసిధర్మవిత్

    కుర్యాత్తస్యఫలంవక్తుం కశ్శక్తోదివివాభువి!!

    సోపితీర్థానుగమనం దేవబ్రాహ్మణతర్పణమ్

    యంకర్మకురుతెవాపి ద్రవ్యదాతుఃఫలంలభేత్!!

    మౌంజీవివాహమేకస్య యఃకుర్యాన్మేదినీపతే

    దత్వార్థం కార్తికేమాసి తదనంతఫలంస్మృతమ్!!

    కన్యాదానంతు కార్తిక్యాం యణుర్యాద్భక్తితోఽనఘ

    స్వయంపాపైర్వినిర్ముక్తః పితౄణాం బ్రహ్మణః పదమ్!!

    తాత్పర్యం:

    పదివేల చెరువులు తవ్వించిన పుణ్యము, వంద రావి చెట్లు పెట్టించిన పుణ్యము, నూతులు, దిగుడుబావులు వందుకు పైగా తవ్వించు పుణ్యము, వంద తోటలు పెంచుపుణ్యము ఒక బ్రాహ్మణునకుపనయనము చేయించిన పుణ్యములో పదియారవ వంతుకు కూడ సరిపోవు.  కార్తీక మాసందుపనయన దానము చేసి తరవాత మాఘమాసమునకానీ, వైశాఖమునకానీ ఉపనయనము చేయించవలెను. సాధువులు శ్రోత్రియులు ఐన బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించినచో అనంతఫలముగలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి. ఆ ఉపనయనమున సంకల్పము కార్తీకమాసమందు చేయవలెను, అలా చేసినచో కలిగెడి ఫలము చెప్పుటకు భూమిపై, స్వర్గంలో ఎవరికీ సామర్థ్యము లేదు. పరద్రవ్యము వలన తీర్థయాత్ర, దేవబ్రాహ్మణులతృప్తిపరచుట చేసిన ఎడల ఆ పుణ్యము ద్రవ్య దాతకే చెందును. కార్తీకమాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణునకుపనయనము వివాహము చేయించిన అనంతఫలము కలుగును. కార్తీకమాసమందు కన్యాదాన మాచరించేవారు తాను పాపవిముక్తుడగును, తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తికలుగించినవాడగును.

    అత్రైవోదాహరంతీమం పురావృత్తం మహీపతే

    తచ్ఛ్రుణుస్సబ్రవీమ్యేవం భక్త్యామైధిలసాదరమ్!!

    దావరేబాహుజఃకశ్చిద్దురాత్మావంగదేశగః

    సోపినామ్నాసువీరేతి బహుశౌర్యపరాక్రమః

    రాజ్ఞన్తస్యమహీపాల భార్యాబాలమృగేక్షణా!!

    సోపికాలాత్తుదాయాదై ర్నిర్జితోవనమావిశత్

    అర్థాంగ్యాభార్యయాసాకం విచరన్ గహనేవనే

    దుఃఖేనమహతాయుక్తో నిర్థనశ్చ మహీపతిః!!

    తత్రసాగుర్విణీతస్య భార్యావన్యఫలాశనా

    నిర్మలేనర్మదాతీరే పర్ణశాలాం మహీపతి

    తతః కాలేప్రసూతాసా కన్యకాంతత్రసుందరీమ్!!

    సమరక్షయత్తతోరాజా పూర్వసౌపమనుస్మరన్

    వృద్ధింగతారాజకన్యా సుకృతేన పురాకృతా

    రూపలావణ్యసంపన్నా నయనోత్సవకారిణీ!!

    తాత్పర్యం:

    ఓ రాజా! ఈ విషయమై పురాతన కథ ఒకటిగలదు చెప్పెదను సావధానముగా వినుము. ద్వాపరయుగంలో వంగదేశమునందు దుష్టుడైన సువీరుడను ఒక క్షత్రియుడుండెడివాడు. వానికి జింకకన్నులు చూపుల వంటి చూపుగల ఒక స్త్రీ అతనికి భార్యగానుండెను. ఆ రాజు కొంతకాలమునకు దైవయోగమున దాయాదులచేత జయింపబడి రాజ్యభ్రష్టుడై భార్యను తీసుకొని అరణ్యమునందు జీవించుచు చాలా దుఃఖమునొందెను. ఆ అరణ్యమునందు రాజు భార్యయు కందమూలాదులను భక్షించుచు కాలమును గడుపుచుండెను. ఆ విధముగా జీవనము చేస్తుండగా ఆమె గర్భవతియయ్యెను. నర్మదాతీరమందు రాజు పర్ణశాల నిర్మించి వారు ఉండసాగెను, ఆ పర్ణశాలయందు ఆ సుందరి ఒక కూతురిని కనెను. రాజు అరణ్యనివాసము, వనములో దొరుకు ఆహారము ఆసమయంలో సంతానసంభవము కలుగగా సంతాన పోషణకు ద్రవ్యము లేకపోవడం అన్నీ తలచుకుని తన పురాకృతమైన పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను. కొంకాలమునకు పూర్వపుణ్యవశము చేటా ఆ బాలిక వృద్దినొంది సౌందర్యముతోనూ లావణ్యముతోనూ అలరారి చూచువారికి నేత్రానందము కలిగించుచునదాయెను.

    అష్టవర్షాంమనోరమ్యాం దృష్ట్వాకశ్చిన్మునేస్సుతః

    వివాహార్థంమతించక్రే సువీరంసమయాచత!!

    తతోవాచతతస్సోపి దరిద్రోహంమునేస్సుత

    ద్రవ్యం దేహియధోద్ధిష్టం ఉద్వాహంయదికాంక్షసే!!

    ఇతి భూపవచశ్శ్రుత్వా కన్యాసంసక్తమానసః

    మునిసూనురువాచేదం రాజానం మిధిలేశ్వర!!

    దాస్యామిద్రవిణభూరి రాజన్ తేహంతపోబలాత్

    తేనతెరాజ్యసౌఖ్యాని భవిష్యంతి న సంశయః

    ఇతిశ్రుత్వావనెరాజా ఓమిత్యాహముదాన్వితః!!

    తపశ్చచారతత్తీరే మునిసూనురుదారధీః

    తత్రరాజన్బలాద్ద్రవ్యం సమాకర్ష్యహ్యతంద్రితః

    తత్సర్వమర్థంనృపతేః ప్రదదేమునిపుత్త్రకః!!

    గృహీత్వార్థంవసూన్ రాజా హర్షాల్లబ్ధమనీరధః

    వివాహమకరోత్కన్యాం మునేస్తాపసజన్మనః

    స్వగృహ్యోక్తవిధానేన కన్యాముద్వాహద్వనేః!!

    తాత్పర్యం:

    ఆచిన్నదానికి యుక్త వయస్సు వచ్చినది, మనస్సుకు బహురమ్యముగా ఉన్నది, యిట్లున్న కన్యకనుచూసి ఒక మునికుమారుడు సువీరా నీకూతురుని నాకిచ్చి వివాహము చేయుమని యాచించెను. ఆ మాటవిని ఆ రాజు, నాకూతురిని మునికుమారునికా అని ఆలోచించి, నేను దరిద్రుడను కాబట్టి నేను కోరినంత ధనమిచ్చిన నా కన్యకామణిని నీకిస్తానని చెప్పెను. ఈ మాటవిని ఆకన్యయందు కోరికతో ఆ ముని కుమారుడు సరేయని ఒప్పుకొనెను.  ఓ రాజా నేను తపస్సు చేసి సంపాదిమ్చి బహుద్రవ్యమును నీకిచ్చెదను దానితో నీవు సుఖముగానుండు అని చెప్పి ఆవిధముగానే చేసెను. తరవాత ఆ ముని కుమారుడు నర్మదా తీరమున తపమాచరిమ్చి బహుద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును రాజునకిచ్చెను. ఆ రాజు ఆ ధనమంతయు గ్రహించి ఆనందించి తన కూతురిని ఆ మునికుమారునకిచ్చి తన గృహ్యసూత్రప్రకారముగ పెండ్లి చేసెను.

    సవోఢాసాపితత్పార్శ్వం జగామమనుజేశ్వర

    కన్యాద్రవ్యేణనిత్యం వై హ్యభూత్సోదరపోషకః!!

    పునస్సువీరభార్యాసా ప్రజజ్ఞేకన్యకాంతథా

    ద్వితీయాంతనుజాందృష్ట్వా పునర్లబ్ద్వాముదాన్వితః

    ఇతఃవరంయధేష్టంమె ద్రవ్యంభూరిభవిష్యతి!!

    ఏవం విచిమ్త్యమానేతు పుణ్యేనమహతానృప

    అజఆమయతిఃకశ్చిత్స్నానార్థం నర్మదాంప్రతి

    పర్ణశాలాంకణీభూపం సభార్యమవలోకయత్!!

    తమువాచకృపాసింధుర్యతిఃకౌండిన్యగోత్రజః

    కిమర్థమత్రకాంతారేకోభవాన్ వదసాంవ్రతమ్!!

    ఏవంబ్రువంతమాహేదం భూపాలంకరుణానిధిం

    రాజాహంవంగదేశీయ స్సువీర యితివిశ్రుతః

    రాజ్యార్థం తైశ్చదాయాదైర్నిర్జితోస్మివనంగతః!!

    తాత్పర్యం:

    ఆ కన్యయు వివాహముకాగానే భర్తవద్దకు చేరెను. రాజు కన్యావిక్రయద్రవ్యముతో తాను తన భార్యయు సుఖముగా జీవించుచుండిరి. రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కనెను. రాజు దానిని చూచి సంతోషించి ఈ సారి కన్యను విక్రయించి చాలా ద్రవ్యమును పొందెఅదని తలచి దానితో ఆజన్మాంతము గడచునని భావించెను. రాజట్లు తలచగా పూర్వపుణ్యవశముచేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదానదికి వచ్చి పర్ణశాలయందున్న రాజును, భార్యను వారి కూతురుని చూచెను. కౌండిన్యసగోత్రుడైన ఆ ముని దయతో వారిని జూచి ఓయీ నీవెవ్వరవు ఈ అరణ్యమున ఏమిజేయుచున్నావు అని అడిగెను. యతి ఇట్లడిగిన మాటవిని రాజు చెప్పుచున్నాడు, అయ్యా నేను వంగదేశమును పాలించుచున్న రాజును నాపేరు సువీరుడు నాదాయాదులు రాజ్యకాంక్ష చేత నన్ను జయించి నారాజ్యమును అపహరించిరి నేని ఈ వనమును చేరి నివసించుచున్నాను.

    నదారిద్ర్యసమందుఃఖం నశోకఃపుత్రమారణాత్

    నచవ్యధానుగమినేన వియోగః ప్రియావహాత్

    తస్మాత్తేనై వదుఃఖేన వదవాసంకృతం మయా

    శాకమూలఫలాద్యైశ్చ కృతాహారోస్మికాననే!!

    కాంతారేస్మిన్తతోజాతా పర్ణగారేతుకన్యకా

    తాంప్రాప్తయౌవ్వనాందృష్ట్వా కస్మైవిప్రసుతాయచ

    తస్మాద్భూరిధనం విప్ర గృహీతం యన్మయానఘ

    నివసామిసుఖంత్వస్మిన్ కిమత్రశ్శోతుమిచ్చసి!!

    ఇతిభూపవచశ్శ్రుత్వా పునరాహయతిస్తదా

    మూఢవత్కురుషేరాజన్ మహాపాతకసమ్చయమ్!!

    కన్యాద్రవ్యేణయోజీవే దసిపత్రంసగచ్ఛతి

    దేవాన్ ఋషీన్ పితౄన్ క్వాపి కన్యాద్రవ్యేణతర్పయేత్

    శాపందాస్యంతి తేసర్వే జన్మజన్మస్యపుత్రతామ్!!

    యఃకన్యాద్రవ్యకలుషాం గృహీత్వావృత్తిమాశ్రయేత్

    సోశ్నీయాత్సర్వపాపాని రైరవం నరకం వ్రజేత్!!

    సర్వేషామేవపాపానాం ప్రాయశ్చిత్తంవిదుర్భుధాః

    కన్యావిక్రయశీలస్య ప్రాయశ్చిత్తంనచోదితమ్!!

    తాత్పర్యం:

    దారిద్ర్యముతో సమానమైన దుఃఖము పుత్రమృతితో సమానమైన శోకము భార్యావియోగముతో సమానమైన వియోగదుఃఖము లేవు కాబట్టి ఆ దుఃఖముతో శాకమూల ఫలాదులు భుజింపుచూ ఈ వనమందు నివాసము చేయుచు కాలము గడుపుచున్నాను. ఈ అరణ్యమమ్దు పర్ణశాలలో నాకు కుమార్తెపుట్టినది, దానిని యౌవ్వనము రాగానే ఒక మునికుమారునికి బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహము చేసి ఆ ద్రవ్యముతో సుఖముగా జీవించుచున్నాను. ఇలా రాజు చెప్పగా విని ఆ యతి ’ రాజా! ఎంత పని చేసితివి మూఢుని వలె పాతకములను సంపాదిమ్చుకొంటివికదా! కన్యాద్రవ్యముచేత జీవించువాడు యమలోకమున అసిపత్రవనమనునరకమందు నివసిమ్చును. కన్యాద్రవ్యముచేత దేవఋషి పితరులను తృప్తిచేయుచున్నవానికి వారి ప్రతిజన్మమునందు ఇతనికి పుత్రులు కలుగరని శాపమునిత్తురు. కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆవృత్తివల్ల జీవనము చేయుపాపాత్ముడు రౌరవనరకమును బొందును. సమస్తమైన పాతకములకు ప్రాయశ్చిత్తము చెప్పబడియున్ననూ కన్యావిక్రయపాపమునకు ప్రాయశ్చిత్తము ఎక్కడా చెప్పబడలేదు.

    కార్తికే శుక్లపక్షేతు ద్వితీయాంకన్యకాంతవ

    కన్యాదానం కురుష్వత్వం సహిరణ్యోదకేనచ!!

    విజ్ఞాయతేజోయుక్తాయ శుభశీలాయధర్మిణే

    కన్యాదానంతుయఃకుర్యాత్కార్రిక్యామ్చశుభేదినే

    గంగాదిసర్వతీర్థేషు స్నానదానేనయత్ఫలం!!

    అశ్వమేధాదభిర్యాగై రుక్తదక్షిణసంయుతైః

    యత్ఫలంజాయతేరాజన్ తత్ఫలంసోపిగచ్చతి!!

    ఇత్యేవంగదితంశ్రుత్వా రాజారాజకులేశ్వర

    యతింధర్మార్థతత్వజ్ఞం బాహుజఃకృపణోబ్రవీత్!!

    కుతోలోకఃకుతోధర్మః కుతోదానం కుతఃఫలః

    సుఖభోగైర్వినావిప్రదేహేస్మిన్ సుఖకాంక్షిణీ

    పుత్రదారాదయస్సర్వేవాసోలంకరణానిచ

    గృహక్షేత్రాణిసర్వాణి దేహాద్యాధర్మసాధనం

    ద్వితీయాం మేదుహితరం యోద్రవ్యమ్ భూరిదాస్యతి

    తస్యదాస్యేన సందేహః విప్రగచ్ఛయథాసుఖమ్!!

    తాత్పర్యం:

    కాబట్టి, ఈ కార్తీక మాసమమ్దు శుక్లపక్షమందు ఈ రెండవ కూతురును కన్యాదానపూర్వకముగా వివాహము జరిపించుము. కార్తికమాసమందు చేసెడి విద్యాతేజశ్శీలయుక్తుడైన వరునకు కన్యాదానం చేసినవాడు గంగాది సమస్తతీర్థములందు స్నానదానములు చేసెడివాడు పొందెడి ఫలము యధోదక్షిణసమేతముగా అశ్వమేధాది యాగములు చేసినవాడు పొందెడి ఫలము బొందును. అని ఈ విధముగా ఆ యతి చెప్పినది విని రాజు ఆ సకలధర్మవేత్తయైన ఆ మునితో యిట్లనెను. బ్రాహ్మణుడా ఇదేమిమాట పుత్రదారాదులు గృహక్షేత్రాదులు వాసోలంకారములున్నందుకు దేహమును సుఖబెట్టి భోగింపవలె, కానీ ధర్మమనగా ఏమిటి? పుణ్యలోకమేమిటి, పాపలోకమేమిటి? ఏదో విధంగా ధనం సంపాదించి భోగించుట ముఖ్యము. నా యీ రెండవ కూతురును పూర్తిగా ద్రవ్యమిచ్చినవానికి యిచ్చి ఆ ద్రవ్యముతో సుఖ భోగములననుభవించుచూ జీవించెదను. నీకెందుకు నీ దారిని నీవు పొమ్ము.

    తతోయయౌనర్మదాయాం స్నానార్థంనృపపుంగవ

    నృపస్యాస్యగతేకాలే కాంతారేమరణుగతః!!

    ఆయయుర్యమదూతాశ్చపాశైరాబధ్యపాపినం

    యమానుగాదక్షిణాశాంతతోజగ్ముర్యధాగతమ్!!

    తత్రతంసమ్యగాలోక్యయమస్తామ్రారుణేక్షణః

    నరకేషువిచిత్రేషు బబాధరవినంధనః

    తథాసిపత్రెఘోరేచ పితృభిస్సహపాతయత్!!

    సువీరస్యాస్వయెకశ్చిచ్చృతకీర్తిర్మహీపతిః

    సర్వధర్మాంశ్చ కారాసౌతధాక్రతుశతానిచ

    ప్రచకారస్వకంరాజ్యం ధర్మేణమిధిలేశ్వర

    పశ్చాత్స్వర్గంసమాసాద్య సేవ్యమానస్సురేశ్చరై!!

    సువీరః కర్మశేషేణ పితృభిర్నరకంగతః

    తత్రవ్యచింతయద్ధుఃఖాద్యాతనాహేతుమాత్మనః

    పూర్వపుణ్యప్రభావేన యమంప్రాహాతినిర్భయః

    తాత్పర్యం:

    ఆమాటవిని యతి స్నానము కొరకు నర్మదానదికి వెళ్ళిపోయెను, తరవాత కొంతకాలమునకు ఆ అడవిలో సువీరుడు చనిపోయెను. అంత యమదూతలు పాశములతో సహా వచ్చి రాజునుగట్టి యమలోకమునకు తీసుకుపోయిరి. అక్కడ యముడు వానిని జూచి కళ్ళెర్రజేసి అనేక నరకములందు యాతనలను బొందించి అసిపత్రమనందు రాజును రాజుపితరులను గూడ పడవేసెను. (అసిపత్రవనము = కత్తులే ఆకులుగాగల దట్టమైన అడవి). ఈ సువీరుని వంశమందు శ్రుతకీర్తియనే వాడొకడు సమస్త ధర్మములను చేసి వందయాగములన్ చేసి ధర్మముగా రాజ్యపాలనము చేఇస్ స్వర్గముబోయి యొంద్రాదులచేత కీర్తింపబడెను. ఈ శ్రుతికీర్తి సువీరుని పాతకవిశేషముల చేత స్వర్గమునుంచి తాను నరకమందు బడి యమయాతనలను పొందుచు ఒకనాడు ఇదేమి అన్యాయము పుణ్యము చేసిన నన్ను యమలోకమునందుంచినారేమని విచారించుకుని ధైర్యముతో ఆయమునితో ఇట్లనెను.

    వాక్యంమెశ్రుణుసర్వజ్ఞ ధర్మరాజమహామతే

    పాపలేశవిహీనస్య కిమియందుర్గతిర్మమ

    సర్వధర్మావృధాయాంతి ప్రోక్తాఃపూర్వమహర్షిభిః

    దివ్యంవిహాయనరకాగమనంచనసాంప్రతమ్!!

    తాత్పర్యం:

    సర్వమును తెలిసిన ధర్మరాజా! నామనవి వినుమయ్యా,, ఎంతమాత్రము పాపము చేయని నాకు ఈ నరకమెట్లు సంభవించినది. అయ్యో మహా ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్ని పాటించిననూ వృధాయయ్యేఖాడ, స్వర్గమందున్న నాకు నరకమెట్లు కలిగినది?

    ఇతిశ్రుత్వాయమఃప్రాహశ్రుతకీర్తి సహామతిం

    అస్తికశ్చిద్దురాచారో వంశజస్తుతవాద్యవై!!

    సోపినామ్నానువిరేతి కన్యాద్వవ్యేణజీవితం

    తేనపాపేనపితరః పుణ్యలోకంగతా అపి

    దివశ్చ్యుతాభవంతీహ దుష్టయోనిషుభూతలే!!

    ద్వితీయాతనుజాతస్య వర్ధతేమాతృసన్నిధౌ

    పర్ణాగారెనృపశ్రేష్ఠ నర్మదాయాస్తటేవనే!!

    మత్ప్రసాదాద్భువంగచ్ఛ దేహేనానేనచానఘ

    తత్రతిష్ఠంతిమునయస్తేషామేతన్నివేదయ

    కన్యాంతాంశ్రుతశీలాయ కార్తికేమాసిభక్తితః 

    కన్యాదానంకురుష్వత్వమ్ సహిరణ్యోదకేనచ!!

    సర్వాభరణసంపన్నాం యః కన్యాంకార్తికేనఘ

    ప్రయచ్ఛతివిధానేన సోపిలోకేశ్వరోభవేత్!!

    తాత్పర్యం:

    శ్రుతకీర్తి మాటలు విన్న సమవర్తి చెప్పెను, ’ ఓ శ్రుతకీర్తీ, నీవన్నమాట సత్యమే, కానీ నీ వంశస్థుడైన సువీరుడనువాడొకడు దురాచారుడై కన్యాద్రవ్యముచేత జీవించినాడు. ఆపాపము చేత వాని పితరులైన మీరు స్వర్గస్తులైనను నరకమందు పడిపోయిరి. ఆ తరవాత భూమియందు దుష్టయోనులందు జన్మించెదరు. శ్రుతకీర్తీ! ఆ సువీరునికి రెండవ కుమార్తె నర్మదా తీరంలో తల్లితో కలిసి పర్ణశాలయందున్నది, ఆమెకింకనూ వివాహము జరుగలేదు. కాబట్టి నీవు నాప్రభావము వలన ఈ దేహముతో అక్కడికి పోయి అక్కడనున్న మునులతో ఈ మాటను చెప్పి ఆకన్యను యోగ్యుడైన వరునకుయిచ్చి కార్తీకమాసమున కన్యాదాన విధానముగా పెండ్లి చేయుము. కార్తీక మాసమందు సర్వాలంకారయుక్తయైన కన్యను వరునకిచ్చువాడు లోకాధిపతియగును. 

    యతికన్యానజాయేత మౌల్యంవాయఃప్రయచ్ఛతి

    దాతుర్గోమిధునం మౌల్యం కన్యాదానంతదుచ్యతె

    కన్యాదానఫలంతస్య భవిష్యతినసంశయః!!

    కురుత్వం ద్రాక్చవిప్రేభ్యః కన్యామూల్యమ్విధానతః

    ప్రీణమ్తిపితరస్సర్వే ధర్మేణానేనసంతతమ్!!

    శ్రుతకీర్తిస్తధేత్యుక్త్వా యమంనత్వాగృహంగతః

    నర్మదాతీరసంస్థాంచ కన్యాంకనకభూషణాం

    కన్యదానంతుకార్తిక్యాం చకారాసౌనృపోత్తమః

    కార్తికేశుక్లపక్షేతు విధినేశ్వరతుష్టయే!!

    తేనపుణ్యప్రభావేన సువీరో యమపాశతః

    విముక్తస్స్వర్గమాసాద్య సుఖేనపరిమోదతే!!

    తథైవదశవిప్రేభ్యః కన్యామూల్యందదావసౌ

    ప్రయాంతి పితరస్సర్వే పుణ్యలోకం మహీపతే

    పాపానియానిచోగ్రాణి విలయంయాంతితత్క్షణాత్

    తతస్స్వర్గగతోరాజా శ్రుతకీర్తిర్యథాగతమ్!!

    యస్తస్మాత్కార్తికేమాసి కన్యాదానం కరిష్యతి

    హత్యాదిపాతకై స్సర్వై ర్విముక్తోనాత్రసంశయః!!

    వాణ్యానాసులభంయేపి వివాహార్థం నగేశ్వర

    సహియంయేప్రకుర్వంతి తేషాంపుణ్యమనంతకమ్!!

    యఃకార్తికేప్రనిష్ఠో విధినాతత్సమాచరేత్

    సయాతివిష్ణుసాయుజ్యం సత్యంసత్యంమయోదితం

    నాచరేద్యదిమూఢాత్మా రౌరవమ్తుసమశ్నుతె!!

    తాత్పర్యం:

    అట్లు కన్యాదానము చేయుటకు సంతానము లేనివాడు ఒక బ్రాహ్మణునకు ధనమిచ్చిన ఆ ధనదాతయూ లోకాధిపతియగును, కన్యలు లేనివాడు రెండు పాడియావులనిచ్చి కన్యను తీసుకుని వరునకు యిచ్చి వివాహము చేసినయెడల కన్యాదాన ఫలమునొందును. కాబట్టినీవు వెంటనే పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యము యిమ్ము దానిచేత నీపితరులందరు తృప్తినొంది నిత్యము సుఖముపొందుదురు.  శ్రుతకీర్తి యముని మాటవిని అట్లేయని యమునకు వందనమాచరించి నర్మదాతీరమందున్న కన్యకు సువర్ణాభ్హరణభూషితగా చేసి కార్తీకశుక్లపక్షమునందు ఈశ్వరప్రీతిగా విధ్యుక్తముగా కన్యాదానము చేసెను. ఆపుణ్యమహిమచేత సువీరుడు యమపాశవిముక్తుడై స్వర్గమునకుపోయి సుఖముగాయుండెను. తరవాత శ్రుతకీర్తి పదిమంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును యిచ్చెను దానిచేత వాని పితరులందరు విగతపాపులై స్వర్గమునకు పొయిరి. తానూ యథాగతముగా స్వర్గమును చేరెను. కాబట్టి కార్తీకమాసమున కన్యాదాన మాచరించేవాడు విగతపాపుడగును అందులో సందేహము లేదు. కన్యామూల్యమును యివ్వలేనివాడు మాటతోనైనా వివాహ సహాయమును చేసిన వాని పుణ్యమునకు అంతములేదు. కార్తీకమాసమందు కార్తీకవ్రతమాచరిమ్చువాడు విష్ణుసాయుజ్యమును పొందును. ఇది నిజము, నామాటనమ్ముము ఈ విధముగా కార్తీకవ్రతమాచరించనివారు రౌరవాది నరకములను బొందుదురు.

    ఇతి శ్రీ స్కాందపురాణే కార్తికమాహాత్మ్యే త్రయోదశోధ్యాయస్సమాప్తః

    ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి

    పదమూడవ అధ్యాయము సమాప్తము

  • Karthika Puranam Day18 Adhyayam

    Karthika Puranam Day18 Adhyayam Visit www.stotraveda.com
    Karthika Puranam Day18 Adhyayam

    Karthika Puranam Day18 Adhyayam Story

    పద్దెనిమిదో రోజు పారాయణం-కార్తీక పురాణం 18వ అధ్యాయం

    Karthika Puranam 18th Day Parayanam

    కార్తీకపురాణం – 18వ రోజు పారాయణము

    సత్కర్మానుష్టాన ఫల ప్రభావము 

    “ఓ మునిచంద్రా! మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి – గురువు – అన్న – దైవము సమస్తము మీరే, నా పూర్వ పుణ్య ఫలితమువలనే కదా మీబోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహా పాపినయి మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునైయుండగా, తమ కృపవలననే నాకు మోక్షము కలిగినది కదా! మీ దర్శన భాగ్యము లేని యెడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున వుండవలసినదే కదా! అట్టి! నేనెక్కడ! మీ దర్శన భాగ్యమెక్కడ! నాకు సద్గతి యెక్కడ? పూణ్యఫలప్రదాయియగు యీ కార్తీకమాసమెక్కడ! పాపాత్ముడనగు నేనెక్కడ? ఈ విష్ణ్యాలయమందు ప్రవేశించుటెక్కడ? యివి యన్నియును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన, నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలయునో, దాని ఫలమెట్టిదో విశదీకరింపు”డని ప్రార్ధించెను.

    “ఓ ధనలోభా! నీ వడిగిన ప్రశ్నలన్నియు మంచివే. అవి అందరికి వుపయోగార్ధమైనట్టివి కాన, వివరించెదను. శ్రద్దగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని, సకల శస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ నాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మొనరించిన జ్ఞానము కలుగును. మానవుడే, జాతివాడో, యెటువంటి కర్మలు ఆచరించావలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక, సత్కర్మల నచారించినను వ్యర్ధమగును. అటులనే కార్తీకమాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖమాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగాను అనగా నీ మూడు మాసముల యందయిననూ తప్పక నదిలో ప్రాతః కాల స్నానము చేయవలెను. అటుల స్నానము లాచరించి దేవర్చన చేసిన యెడల తప్పక వైకుంట ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందు, స్నానము చేయవచ్చును. ప్రాతఃకాలమున స్నానము చేసిన మనుజుడు సంద్యావందనం సూర్యనమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించరించిన వారికీ చతుర్విధ పురుషార్ధములు సిద్దించును. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగ గోదావరి నదులకు సమాన తీర్ధములు, బ్రాహ్మణులకు సమానమైన జాతీయు, భార్యతో సరితూగు సుఖమునూ, ధర్మముతో సమానమైన మిత్రుడనూ, శ్రీ హరితో సమానమైన దేవుడునూ లేడని తెలుసుకోనుడు. కార్తీక మాసమందు విధ్యుక్తధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు”. అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడిటుల ప్రశ్నించెను.

    “ఓ మునిశ్రేష్టా! చాతుర్మాస్యవ్రతమని చెప్పితిరే! ఏ కారణం చేత దానిని నాచరించవలెను? ఇదివరకెవ్వరయిన నీ వ్రతమును ఆచరించియున్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి? విధానమెట్టిది? సవిస్తర౦గా విశదికరింపు”డని కోరెను. అందులకు ఆంగీరసుడిటుల చెప్పెను.

    “ఓయీ! వినుము. చతుర్మాస్యవ్రతమనగా శ్రీమహావిష్ణువు మహాలక్షితో ఆషాడ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీకశుద్ధ ఏకాదశినాడు నిద్రనుండి లేచును. ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాడ శుద్ధ ఏకాదశి ‘శయన ఏకాదశి’ అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ‘ఉత్థాన ఏకాదశి’ అనియు, ఈ వ్రతమునకు, చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ నాలుగు మాసములలో శ్రీ హరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును. ఈ సంగతి శ్రీమహావిష్ణువు వలన తెలిసికొంటిని కాన, ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను”.

    తొల్లి కృతయుగంబున వైకుంఠ మందు గరుడ గంధర్వాది దేవతలచేత, వేదములచేత సేవింపబడుచున్న శ్రీ మన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి యుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రు౦డును, చతుర్బాహు౦డును, కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీ మన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడియుండెను. అంత శ్రీ హరి నారదుని గాంచి ఏమియు తెలియనివానివలె మందహాసముతో నిట్లనెను. “నారదా! నీవు క్షేమమే గదా! త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్టానములు యెట్టి విఘ్నములు లేక సాగుచున్నావా? మానవులందరు ధించవారికి విధించబడిన ధర్మముల నాచరించుచున్నారా? ప్రపంచమున నే అరిష్టములు లేక యున్నవి కదా?” అని కుశలప్రశ్నలడిగెను. అంత నారదుడు శ్రీహరికీ ఆదిలక్ష్మికీ నమస్కరించి “ఓ దేవా! ఈ జగంబున నీ వెరుగని విషయమున లేవియునూ లేవు అయినను నన్ను వచింపుమనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు – మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తులగుదురో యెరుగ లేకున్నాను. కొందరు భుజించ కూడదనిన పదార్దములు భుజించుచున్నారు. కొందరు పుణ్య వ్రతములు చేయుచు, అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరి కొందరు అహంకార సహితులుగా, పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల నొనర్చి రక్షింపు”మని ప్రార్ధించెను. జగన్నాటక సూత్రధారుడయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడగంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి, ముసలి బ్రాహ్మణరూపంతో ఒంటరిగా తిరుగుచుండెను.

    ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలి వాడని యెగతాళి చేయుచుండిరి. కొందరు “యీ ముసలి వానితో మనకేమి పని”యని ఊరకు౦డిరి. కొందరు గర్విష్టులైరి మరి కొందరు కామార్తులై శ్రీహరిని కన్నేతియైనను చూడకుండిరి. వీరందిరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి “వీరినెట్లు తరింపజేతునా?”యని అలోచించుచు, ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ, చక్ర, గదా, పద్మ, కౌస్తుభ, వనమాలాద్యలంకారయుతుడై నిజరూపమును ధరించి, లక్ష్మి దేవితోడను, భక్తులతోడను ముని జన ప్రీతికరమగు నైమిశారణ్యమునకు వెడలెను.

    ఆ వనమందు తపస్సు చేసుకోనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదెంచిన సచ్చిదానంద స్వరుపుడగు శ్రీమన్నారయణుని దర్శించి భక్తి శ్రద్దలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు నా లక్ష్మినారాయణులనిట్లు స్తోత్రము గావించిరి.

    *శ్లో|| శాంతకారం! భజగాశయనం! పద్మనాభం! సురేశం!*
    *విశ్వాకారం! గగనసదృశం! మేఘవర్ణం శుభాంగం! |*
    *లక్ష్మికాంతం! కమలనయనం! యోగిహృద్ద్యానగమ్యం!*
    *వందేవిష్ణుం! భవభయహారం! సర్వలోకైకనాథం ||*

    *శ్లో|| లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీ రంగదామేశ్వరీం*
    *దాసి భూత సమస్త దేవా వనితాం* *లోకైకదీపంకురాం |*
    *శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర* *గంగాధరాం*
    *త్వాం త్రైలోక్య కుటుంబినీ౦ సరసిజాం వందే ముకుంద ప్రియం||*

    ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి

    అష్టాదశాధ్యాయము – పద్దెనిమిదో రోజు పారాయణము సమాప్తం.

  • Karthika Puranam Day17 Adhyayam

    Karthika Puranam Day17 Adhyayam Visit www.stotraveda.com
    Karthika Puranam Day17 Adhyayam

    Karthika Puranam Day 17 Adhyayam Story

    పదిహేడవ రోజు పారాయణం- కార్తీక పురాణం 17వ అధ్యాయం

    Karthika Puranam 17th Day Parayanam-

    Karthika Puranam Day17 Adhyayam Parayanam Story – కార్తీకపురాణం – 17వ రోజు పారాయణము

    అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము

    ఓ మునిశ్రేష్ఠులారా! ఓ ధనలోభీ! నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము.

    కర్మవలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున, శరీరోత్పతికి కర్మ కారణముగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక, కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సుక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మసంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ‘ఆత్మ’యనగా యీ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది – అని అంగీరసుడు చెప్పగా

    “ఓ మునీఒద్రా! నేనింత వరకు యీ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక, యింకను వివరముగా చెప్పబడిన వాక్యార్ధజ్ఞానమునకు పాదార్దజ్ఞానము కారణమగుచుండును. కాన, ‘అహంబ్రహ్మ’ యను వ్యక్యార్ధమును గురించి నాకు తెలియజెయండి”యని ధనలోభుడు కోరెను.

    అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియె – ఈ దేహము అంత:కరణవృత్తికి సాక్షియే, ‘నేను – నాది’ అని చెప్పబడు జీవత్మాయే ‘అహం’ అను శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మా ‘న:’ అను శబ్దము. ఆత్మకు షుటాదులవలె శరిరమునకు లేదు. ఆ యాత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ది సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువాని వ్యాపారమునుందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా వున్నదై యెల్లప్పుడు నొకేరీతిని ప్రకాశించుచు నుండునదే “ఆత్మ” యనబడను. “నేను” అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించునవియేగాక, యిట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందునూ “నేను”, “నాది” అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించు కొనుము.

    ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శరీర, ఇంద్రియాలు దేని నాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే, అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరే౦ద్రియాల సంబంధము లేక గాఢనిద్రపోయి, మేల్కొన్న తర్వాత ‘నేను సుఖనిద్రపోతిని, సుఖింగావుంది’ అనుకోనునదియే ఆత్మ.

    దీపము గాజుబుడ్డిలో వుండి ఆ గాజును, ప్రకాశింపజేయునటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింప చేయుచున్నది. ఆత్మ పతమాత్మ స్వరూపమగుట వలన, దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే ‘పరమాత్మ’ యని గ్రహింపుము. ‘తత్వమసి’ మొదలైన వాక్యములందలి ‘త్వం’ అను పదమునుకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం ‘తట్ అనుపదమునకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్ధము “తత్త్వమసి” అనేది జీవాత్మ పరమాత్మల యేకత్వమును భోదించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలి వేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అదియే “ఆత్మ దేహలక్షణములుండుట – జన్మించుట – పెరుగుట – క్షీణి౦చుట – చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరుపించబడియున్నదో అదియే “ఆత్మ”. ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే యని యే విధముగా గ్రహింతుమో, అటులనే ఒక దేహాంతర్యామి యగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము.

    జీవులచే కర్మ ఫలమనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు, జీవులా కర్మ ఫలమను భవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తుగలవాడై గురుశుశ్రూష నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును. మంచిపనులు తలచిన చిత్తశుద్దియు, దానివలన భక్తిజ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు – అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి యిట్లనెను.

    స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి

    సప్తదశాధ్యాయము – పదిహేడవ రోజు పారాయణ సమాప్తము

  • Karthika Puranam Day12 Adhyayam

    Karthika Puranam Day12 Adhyayam Visit www.stotraveda.com
    Karthika Puranam Day12 Adhyayam

    Karthika puranam Day12 Adhyayam Story

    పన్నెండవ రోజు పారాయణం-కార్తీక పురాణం 12 వ అధ్యాయం

    Karthika Puranam 12th Day Parayanam

    Karthika Puranam Day12 Adhyayam- కార్తీకపురాణం – 12వ రోజు పారాయణము

    ద్వాదశి ప్రశంస, సాలగ్రామదాన మహిమ

    వశిష్టుడు తిరిగి ఇలా చెబుతున్నాడు… ”ఓ జనక మహారాజా! కార్తీక మాసంలో కార్తీక సోమవారం, కార్తీక ద్వాదశి, సాలగ్రామ మహిమలను గురించి వివరిస్తాను విను…” అని ఈ విధంగా చెప్పసాగాడు.

    ”కార్తిక సోమవారం రోజు పొద్దున్నే నిద్రలేచి, రోజువారీ విధులు నిర్వర్తించుకుని, నదికి వెళ్లి, స్నానం చేయాలి. ఆ తర్వాత శక్తికొద్దీ బ్రాహ్మణులకు దానమిచ్చి, ఆరోజంతా ఉపవాసముండాలి. సాయంకాలం శివాలయానికి గానీ, విష్ణువాలయానికి గానీ వెళ్లి, పూజించాలి. నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం భుజించాలి. ఈ విధంగా చేసేవారికి సకల సంపదలు కలగడమే కాకుండా, మోక్షం లభిస్తుంది.

    కార్తిక మాసంలో శనిత్రయోదశి గనక వస్తే… ఆ వ్రతం ఆచరిస్తే నూరు రెట్ల ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశిరోజున పూర్తిగా ఉపవాసం ఉండి, ఆ రాత్రి విష్ణువాలయానికి వెళ్లి, శ్రీహరిని మనసారా ధ్యానించి, ఆయన సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి, మర్నాడు బ్రాహ్మణ సమారాధన చేసినట్లయితే.. కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. ఈ విధంగా చేసినవారు సూర్యగ్రహణ సమయంలో గంగానదిలో స్నానం చేసినట్లయితే… కోటి మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినదానికంటే అధిక ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశినాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుంచి లేస్తాడు కాబట్టి, ఆ రోజు విష్ణువుకు అమిత ఇష్టమైన రోజు. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి, ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి, దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చినట్లయితే… ఆ ఆవు శరీరంలో ఎన్ని రోమాలున్నాయ… అన్నేళ్లు వారు ఇంద్రలోక ప్రాప్తి పొందగలరు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమిరోజున కంచుపాత్రలో ఆవునేతిని పోసి, దీపముంచిన వారు పూర్వజన్మలో చేసిన సకల పాపాలను పోగొట్టుకుంటారు. ద్వాదశిరోజు యజ్ఞోపవీతాలను దక్షిణతో బ్రాహ్మణుడికి దానమిచ్చినవారు ఇహపర లోకాల్లో సుఖాలను పొందగలరు. ద్వాదశిరోజున బంగారు తులసి చెట్టును, సాలగ్రామాన్ని బ్రాహ్మణుడికి దానమిచ్చిన నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగుతుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ ఉంది. చెబుతాను… శ్రద్ధగా ఆలకించు….” అని ఇలా చెప్పసాగాడు.

    సాలగ్రామ దాన మహిమ:

    పూర్వము అఖండ గోదావరి నదీ తీరంలోని ఒక గ్రామంలో ఒక వైశ్యుడు నివసించేవాడు. వాడు దురాశపరుడై, నిత్యం డబ్బుగురించి ఆలోచించేవాడు. తాను అనుభవించకుండా, ఇతరులకు పెట్టకుండా, బీదలకు అన్నదానం, ధర్మాలు చేయకుండా, ఎప్పుడూ పర నిందలతో కాలం గడిపేవాడు. తానే గొప్ప శ్రీమంతుడినని విర్రవీగుచుండేవాడు. పరుల ధనం ఎలా అపహరించాలా? అనే ఆలోచనలతోనే కాలం గడిపేవాడు.

    అతడొకరోజు తన గ్రామానికి దగ్గర్లో ఉన్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడికి తన వద్ద ఉన్న ధనాన్ని పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాడు. మరి కొంత కాలానికి తన సొమ్ము అడగగా… ఆ బ్రాహ్మణుడు ”అయ్యా! మీకు రావాల్సిన మొత్తాన్ని నెలరోజుల్లో ఇస్తాను. మీ రుణం తీర్చుకుంటాను. ఈ జన్మలో కాకున్నా… వచ్చే జన్మలో ఒక జంతువుగా పుట్టి అయినా… మీ రుణం తీర్చుకుంటాను” అని వేడుకొన్నాడు. దానికి ఆ వైశ్యుడు ”అలా వీల్లేదు. ఇప్పుడు నా సొమ్ము నాకిచ్చేయి. లేకపోతే నీ తలను నరికి ఇవ్వు” అని ఆవేశం కొద్దీ వెనకా ముందూ వెనకా ఆలోచించకుండా కత్తితో ఆ బ్రాహ్మణుడి కుత్తుకను కోశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుని చనిపోయాడు. దాంతో ఆ వైశ్యుడు భయపడి, అక్కడే ఉన్న రాజభటులు పట్టుకుంటారని భయపడి తన గ్రామానికి పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహాపాతకం కాబట్టి, అప్పటి నుంచి ఆ వైశ్యుడికి బ్రహ్మహత్యాపాపం ఆవహించింది. కుష్టువ్యాధి కలిగి నానా బాధలు పడుతూ కొన్నాళ్లకు చనిపోయాడు. వెంటనే యమదూతలు అతన్ని తీసుకుపోయి, రౌరవాది నరక కూపాల్లో పారేశారు.

    ఆ వైశ్యుడికి ఒక కొడుకున్నాడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరుకు తగ్గట్లుగానే తండ్రి సంపాదించిన ధనాన్ని దాన ధర్మాలకు వెచ్చించేవాడు. పుణ్యకార్యాలు ఆచరించేవాడు. నీడ కోసం చెట్లు నాటించడం, బావులు, చెరువులు తవ్వించడం చేశాడు. సకల జనులను సంతోషపెడుతూ మంచి కీర్తిని సంపాదించాడు. ఇలా ఉండగా… కొంతకాలానికి త్రిలోక సంచారి అయిన నారదుడు యమలోకాన్ని దర్శించి, భూలోకంలో ధర్మవీరుడి ఇంటికి వెళ్లాడు. ధర్మవీరుడు నారదమహర్షిని సాదరంగా ఆహ్వానించి, అర్ఘ్య పాద్యాదులు అర్పించాడు. చేతులు జోడించి ”ఓ మహానుభావా…! నా పుణ్యం కొద్ది నాకు మీ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలది నేను ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించండి” అని వేడుకొన్నాడు. అంతట నారదుడు చిరునవ్వు నవ్వుతూ… ”ఓ ధర్మవీరా! నేను నీకొక హితోపదేశం చేయాలని వచ్చాను. శ్రీ మహావిష్ణువుకు కార్తీకమాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన రోజు. ఆరోజున స్నాన, దాన, జపాదులు ఏవి చేసినా… అత్యంత ఫలం కలుగుతాయి. నాలుగు జాతులలో ఏ జాతివారైనా… స్త్రీ పురుషులనే బేదం లేకుండా… దొంగ అయినా, దొర అయినా, పతివ్రత అయినా, వ్యభిచారిణి అయినా… కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులా రాశిలో ఉండగా… నిష్టతో ఉపవాసముండాలి.

    సాలగ్రామదానం చేయాలి. అలా చేసినవారు తండ్రి రుణం తీర్చుకుంటారు. ఈ వ్రతం వల్ల కిందటి జన్మ, ఈ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి. నీ తండ్రి యమలోకంలో మహానరక బాధలు అనుభవిస్తున్నాడు. అతన్ని ఉద్దరించేందుకు నీవు సాలగ్రామదానం చేయక తప్పదు.” అని చెప్పాడు. అంతట ధర్మవీరుడు నారదమహామునితో… ”మునివర్యా! నేను గోదానం, భూదానం, హిరణ్యదానం మొదలగు మహాదానాలన్నీ చేశాను. అలాంటి దానాలు చేసినా నా తండ్రి మోక్షాన్ని పొందకుండా నరకానికి వెళ్లినప్పుడు… ఈ సాలగ్రామ దానం చేస్తే ఆయన ఎలా ఉద్దరింపబడతాడు?” అని చెప్పాడు. అతని అవివేకానికి విచారించిన నారదుడు ఇలా చెబుతున్నాడు ”ఓ వైశ్యుడా! సాలగ్రామం శిలామాత్రమే అనుకుంటున్నావా? అది శిలకాదు. శ్రీహరి రూపం. అన్ని దానాల్లో సాలగ్రామదానం వల్ల కలిగే ఫలం గొప్పది. నీ తండ్రి నరక బాధ నుంచి విముక్తి పొందాలంటే ఈ దానం తప్పదు. మరో మార్గం లేదు” అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

    ధర్మవీరుడు ధనబలంతో సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలానికి అతను చనిపోయాడు. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టడం వల్ల అతను ఏడు జన్మలు పులిగా, మూడు జన్మలు కోతిగా, అయిదు జన్మలు ఎద్దుగా పుట్టి, పది జన్మలు స్త్రీగా పుట్టాడు. ఆ తర్వాత పది జన్మలు పందిగా జన్మించాడు. ఆ తర్వాత ఓ పేదబ్రాహ్మణుడి ఇంట్లో స్త్రీగా పుట్టాడు. ఆమె యవ్వనవతి అవ్వగానే… ఓ విధ్వంసుడికి ఇచ్చి పెండ్లి చేశారు. పెళ్లయిన కొంతకాలానికే ఆమె భర్త చనిపోయాడు. చిన్నతనంలోనే ఆమెకు అష్టకష్టాలు సంభవించాయి.

    తల్లిదండ్రులు, బంధువులు ఆమెను చూసి దు:ఖించసాగారు. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందుకు కలిగిందో తెలుసుకునేందుకు తన దివ్యదృష్టిని ఉపయోగించాడు. ఆ తర్వాత ఆమెతో సాలగ్రామ దానం చేయించాడు. ”నాకు బాలవైదవ్యం కారణమైన పూర్వజన్మ పాపాం నశించుగాక” అని సాలగ్రామ దానఫలాన్ని ధారబోయించాడు. ఆ రోజు కార్తీక సోమవారం కావడం వల్ల దాని ఫలంతో ఆమె భర్త పునర్జీవించాడు. పిదప ఆ నూతన దంపతులు చిరకాలం అన్యోన్యంగా మెలిగారు. ఆ తర్వాతి జన్మలో ఆమె మరో బ్రాహ్మడి ఇంట్లో కుమారుడిగా జన్మించాడు. నిత్యం సాలగ్రామ దానం చేస్తూ ముక్తిని పొందాడు.

    ”కాబట్టి ఓ జనక మహారాజా! శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసినట్లయితే… ఆ ఫలితం ఇంత అని చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఆ సాలగ్రామ దానాన్ని నిత్యం ఆచరిస్తూ ఉండు” అని సెలవిచ్చాడు.

    ఇది స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి పన్నెండవ అధ్యాయము

    Karthika Puranam Day12 Adhyayam – పన్నెండవ రోజు పారాయణము సమాప్తము.

    Karthika Puranam Day12 Adhyayam- Slokas Format:

    అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే ద్వాదశోధ్యాయః
    శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం

    వసిష్ఠ ఉవాచ:
    కార్తిక్యామిందువారస్య మహాత్మ్యం శ్రుణు భూపతే
    తస్మాచ్చతగుణంతస్మిన్ వ్రతం సౌరిత్రయోదశీ!!
    సహస్రగుణితంతస్మా త్కార్తికేమాసి పౌర్ణిమా
    తయా లక్షగుణం ప్రోక్తం మాసస్య ప్రతిపద్దినం!!
    తస్మాత్కోటి గుణం రాజన్ అంతిమైకాదశీంవిదుః
    తస్మాదనంతగుణితం కార్తికే ద్వాదశీదినమ్!!

    తాత్పర్యం: 

    ఆ వసిష్ఠుడు తిరిగి ఇలా కొనసాగించెను ” ఓ రాజా, కార్తీకమాస సోమవార మహాత్మ్యము వినుము, సోమవారముకంటె శనిత్రయోదశీ నూరు రెట్లు, శనిత్రయోదశికంటే కార్తిక పున్నమి వెయ్యిరెట్లు ఫలము, పూర్ణమి కంటె శుక్ల పాడ్యమి లక్ష గుణము అధికము, శుక్ల పాడ్యమి కన్నా బహుళ ఏకాదశి కోటిగుణకము, అంతిమ ఏకాదశి కన్ననూ ద్వాదశి అనంత గుణఫలోపేతము, (పౌర్ణిమాంత మాసముననుసరించు ఔత్తరాహికులు (ఉత్తరభారతీయులు) శుక్ల ఏకాదశినే అంతిమ ఏకాదశిగా గణింతురు, ఆ దినమునే అంబరీషుని చరిత్రను గ్రహింతురు)

    అంతిమైకాదశీం మోహాదుపోష్యయదిమందిరె
    గీతవాద్యపురాణైశ్చ కుర్యాజ్జాగరణం నరః
    ససర్వపాపనిర్ముక్తో విష్ణులోకేవసేచ్చిరమ్!!
    తథాపరదినెప్రాప్తె పారణం బ్రాహ్మణైస్సహ
    యః కార్తికేమాసి రాజన్ స సాయుజ్యం లభేద్ధరేః!!
    కార్తికేయశ్చద్వాదశ్యాం అన్నదానం మహాత్మనే
    యః కుర్యాద్రాజశార్దూల సర్వసంపద్వివర్ధతె!!
    గంగాతీరెరవిగ్రస్తే కోటి బ్రాహ్మణభోజనాత్
    యత్ఫలం లభతేజంతుః తత్ఫలం ద్వాదశీం విదుః!!
    ఉపరాగ సహస్రాణి వ్యతీపాతాయుతానిచ
    అమాలక్షంతుద్వాదశ్యాః కళాం నార్హంతీషోడశీమ్!!

    తాత్పర్యం:

    మోహముతోనైనగానీ, ఈ అంతిమ ఏకాదశి ఉపవాసము చేసి, గీత వాద్య పురాణముల పఠనముల చేత జాగరణము చేయువారు సమస్త పాపములనుండి ముక్తులై విష్ణులోకమున చిరకాలముందురు. కార్తీక మాసమున యేకాదశినాడుపవాసముండి, ద్వాదశినాడు బ్రాహ్మణులతో కూడి పారాణము చేసెడివాడు సాయుజ్యముక్తినొందగలడు. కార్తీక మాసమందు ద్వాదశీ తిథినాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధినొందును. సూర్యగ్రహణదినమునందు గంగా తీరమున కోటిబ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశీ తిథినాడు ఒక బ్రాహ్మణునకు అన్నము పెట్టిన లభిస్తుంది. వేయి గ్రహణములు, పదివేల వ్యతీపాతయోగములు లక్ష అమావాస్యలు కలిసిన ఈ కార్తీక ద్వాదశిలో పదహారవ వంతుకూడా కాజాలవు.

    అనేక తిథియస్సంతి సదాసత్పుణ్యదాయకా
    తాసామనంతగుణితా ద్వాదశీ విష్ణువల్లభా!!
    కార్తికే శుక్లపక్షేతు ద్వాదశీ హరిబోధినీ!
    తన్యామేకస్య విప్రస్య అస్యదానం కరోతియః
    ససర్వసౌఖ్యం లభతే పశ్చాద్విష్ణుపురేనృప!!
    కార్తికే మాసిద్వాదశ్యాం దధ్యన్నం దానముత్తమం
    యః కుర్యాత్సోపిధర్మేభ్యో హ్యధికం ఫలముచ్యతె!!
    నారీ వా పురుషో వా పి కార్తిక్యాం ద్వాదశీదినే
    స్వర్ణశృంగీం రౌప్యఖురాం సవత్సాంసుపయస్వినీం!!
    గామభ్యర్చ్యవిధానేన దానంయః కురుతేనఘ
    యావతీరోమసంఖ్యాస్యా త్తావత్స్వర్గాధిపోభవేత్!!
    ద్వాదశ్యాం కార్తికేమాసి వస్త్రదానం కరోతియః
    భక్త్యాప్రయత్నతోరాజన్ పాపైః పూర్వార్జితైరసి
    విముచ్యవిష్ణుభవనం యాతివాస్త్యత్రసంశయః!!

    తాత్పర్యం:

    పుణ్యమునిచ్చే తిథులనేకము కానీ, ద్వాదశి హరి ప్రియము, కాబట్టి ఇతర తిథులన్నిటింకటె అధికఫలప్రదము. కార్తీక శుక్ల ద్వాదశినాడు , ఏకాదశి రాత్రి యామముండగనే పాలసముద్రములో శయనించిన శ్రీహరి నిద్రలేచును. కాబట్టి ఆ ద్వాదశి హరిబోధిని అని పిలువబడును. ఆ ద్వాదశినాడు ఒక బ్రాహ్మణునకైన అన్నదానమాచరించువారు ఈలోకంలో భోగాలనుభవిమ్చి అంతములో ఆహరిని పొందెదరు. కార్తీక మాసములో ద్వాదశినాడు పెరుగన్నము దానము చేసిన వారికి సమస్త ధర్మములను ఆచరించడం కంటే అధిక ఫలము లభిస్తుంది. స్త్రీపురుష బేధములేకుండా కార్తీక శుద్ధ ద్వాదశినాడు పాలిచ్చెడి ఆవుకు బంగారపు కొమ్మును వెండి డెక్కలు చేయిమ్చిపెట్టి పూజించి దూడతో గూడ గోదానమిచ్చిన ఆగోవుకెన్ని వేల వెంట్రుకలుండునో అన్ని వేల యేండ్లు స్వర్గవాసము చేయుదురు. కార్తీక మాసములో ద్వాదశినాడు భక్తితో వస్త్రదానమాచరిమ్చువారు పూర్వజన్మార్జిత పాపములను నశింపజేసుకుని వైకుంఠలోకమునకు పోవును, ఇందులో ఎటువంటి సందేహము లేదు.

    ద్వాదశ్యాం కార్తికేమాసి పౌర్ణమ్యాంప్రతిపద్ధినే
    యోదీపదానంకురుతె సకాంస్యంచఘృతాదికం
    కోటిజన్మార్జితంపాపం తత్క్షణేవిశ్యతి!!
    ఫలంయజ్ఞోపవీతంచ స తాంబూలం సదక్షిణం
    ద్వాదశ్యాంయేప్రకుర్వంతి తత్ఫలం శ్రుణుభూమిప!!
    భుంక్తే హవిపులాన్ భోగాన్ స్వర్గేప్యం తెతుదుర్లభాన్
    పశ్చాద్విష్ణుపురంప్రాప్య మోదతేవిష్ణువచ్చిరమ్!!
    సువర్ణతులసీదానం ద్వాదశ్యాం కార్తికే నృప
    సాలగ్రామంసమభ్యర్చ్య శ్రోత్రియాయకుటింబినే
    దానంయః కురుతే భక్త్యా తన్యపుణ్య ఫలంశ్రుణూ!!
    చతుస్సాగరపర్యంతం భూదానాద్యత్ఫలంవిదుః
    తత్ఫలంసమవాప్నోతి ద్వాదశ్యాంకార్తికస్య్చ!!
    అత్రైవోదాహరంతీమ మితిహాసంపురాతనం
    శ్రుణ్వతోసర్వపాపఘ్నమ్ తత్సమాసేనమెశ్రుణు!!

    తాత్పర్యం:

    కార్తీక మాసమందు ద్వాదశి యందు పూర్ణిమయందు పాడ్యమియందు గానీ పంచపాత్రలో ఆవునెయ్యినుంచి దీపము వెలిగించి దానమిచ్చువారికి కోటిజన్మలలో చేయబడీన పాతకములు నశించును. కార్తిక ద్వాదశినాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణను ఇచ్చువాడు ఈ లోకమునందు అనేక భోగములనుపొంది అంతమన వైకుంఠమందు విష్ణువుతోకూడి చిరకాలముండును. కార్తిక ద్వాదశినాడు బంగారపు తులసీ వృక్షమును సాలగ్రామమును దానము చేయువాడు పొందెడి ఫలము చెప్పెదను వినుము. కార్తిక ద్వాదశినాడు పూర్వోక్తదానము చేసినవాడు నాలుగుసముద్రముల మధ్యనున్న భూమినంతయు దానమిచ్చువాడు పొందెడి ఫలము పొందును. ఈ విషయందు ఒక కథ గలదు చెప్పెదను వినుము. ఈ కథ చదివిన విన్నవారికి సమస్త పాతకములు నశించును.

    వైశ్యః కశ్చిద్దురాచారః గోదావర్యాస్తటేశుభే
    స్వయంచాపి నభుంజీత దానంవానాణుమాత్రకమ్!!
    నోపకారంకృతంతేన యస్యకస్యాపి దేహినః
    పరనిందాపరోనిత్యం పరద్రవ్యేషులాలసః!!
    కస్యచిద్ధ్విజముఖ్యస్య ఋణం దత్వాధికంధనం
    తద్గృహీతంసమాయాతో విస్రంగ్రామాంతరేస్థితం
    సమపృచ్ఛతదావైశ్యో ఋణం దేహీతిభూసురమ్!!
    సవిప్రవర్యస్తచ్ఛ్రుత్వా విచార్యోవాచతంనృప
    ద్రవ్యం దాస్యామిమాసాంతే యేనకేనాపికర్మణా
    అతస్థ్సిత్వాఋణంసర్వం గృహీత్వాగంతుమర్హసి!!
    యోజీవతిఋణీనిత్యం నిరయంకల్పమశ్నుతె
    పశ్చాత్తస్యసుతోభూత్వా తత్సర్వంప్రతిదాస్యతి!!

    తాత్పర్యం:

    గోదావరీతీరమమ్దు దురాచారవంతుడైన ఒక వైశ్యుడు గలడు. అతడు కొంచెముకూడా దానము చేసెడివాడు కాడు, ధనమును తానూ అనుభవించెడివాడు కాడు. వాడు ఎవరికీ ఉపకారము చేసెడివాడుకాడు, ఎప్పుడూ పరనింద చేస్తూ, పరద్రవ్యంపై ఆసక్తి కలిగినవాడూ. ఆ వ్యక్తి ఒక బ్రాహ్మణునకు అధికముగా అప్పిచ్చి ఆ ఋణమును తిరిగి పొందడం కొరకు ఆతని ఊరికి వెళ్ళి అతడు గ్రామాంతరంలో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళి ఆ బ్రాహ్మణుని అప్పు తిరిగిమ్మని అడిగెను. ఆ బ్రాహ్మణుడామాట విని ఓ వైశ్యుడా ఈ నెల చివర నీసొమ్మంతయు ఏదోఒక విధముగ తిరిగిచ్చెదను కావున కొంచెము నిదానింపుమని కోరెను. ఋణమును తీసుకొని తిరిగి ఆ సొమ్ము యివ్వనివాడు నరకమందు యాతనలనుబొంది తిరిగి ఆ ఋణదాతకు కొడుకై పుట్టి వాని సొమ్మును యివ్వవలసి యుండును.

    ఏవముక్తెద్విజెవైశ్యః కోపాదారక్తలోచనః
    మూఢాద్యదేహిమెద్రవ్యంనోచేత్ఖడ్గేనతాడయే!!
    ఆకృష్యకేశానాదాయ దుష్టాత్మాపావధీరయం
    తేనాశుపతితంభూమౌవిప్రంపాదావతాడయత్!!
    కోపావేశేనపాపాత్మా విప్రం వేదాంతపారగం
    ఖడ్గేనైవాహనత్తూర్ణం హరిస్తుహరిణంయథా
    మమారతేనమాతేన బ్రాహ్మణోబంధువత్సలః!!
    సతుద్రావతోవేగాత్ భయాద్రాజ్ఞోమహీపతే
    పునర్గృహంప్రవిశ్యాఽసౌ బ్రహ్మఘ్నోనిరపత్రవః
    ఆయురంతరితేకాలే మరణం సముపాగతః!!

    తాత్పర్యం:

    బ్రాహ్మణుడిట్లు చెప్పిన మాటను విని ఆ వైశ్యుడు కోపముచేత కళ్ళెర్రజేసి ఓరీ మూఢ బ్రాహ్మణుడా నాధనము నాకిప్పుడే యిమ్ము లేకున్న ఈకత్తితో నిన్ను నరికెదనని దుర్మార్గబుద్ధితో ఆవేదాంతవేత్తయైన బ్రాహ్మణుని జుట్టుపట్టి లాగి క్రింద పడవేసి పాపబుద్దికలవాడైన ఆ వైశ్యుడు తనకాలితో తన్ని కత్తితో కొట్టెను. ఆ బ్రాహ్మణుడు సింహముచేత దెబ్బతిన్న జింకవలె గిలగిలలాడి మృతినొందెను. ఆ తరవాత ఆ వైశ్యుడు రాజదండనమునకు భయపడి అక్కడనుండి పారిపోయి బ్రాహ్మణుని చంపితినన్న సిగ్గులేక సుఖ్గముగా ఇంటనుండి కొంతకాలమునకు మృతినొందెను.

    ఆయయుర్యమదూతాశ్చ పాశహస్తాభయంకరాః
    కరాళవదనా రాజన్ కృష్ణరాత్రిసమప్రభాః!!
    పాశైరాబధ్యతం వైశ్యం యయుర్యమనికేతనం
    తస్మింస్తే రైరవేఘోరే విససర్జుర్యమాజ్ఞయా!!
    తస్యసూనుర్మహీపాల ధర్మవీరేతివిశ్రుతః
    పిత్రార్జితధనం భూరి సదాధర్మపరాయణః!!
    కూపోద్యానతటాకాది సేతు బంధనకారకః
    వివాహోపనయౌకర్తా యజ్ఞ కేష్వతిలాలసః!!
    అన్నదానపరోనిత్యమాతురాణాంద్విజనమనాం
    సర్వేషామపివర్ణానాం క్షుధార్తానాంమహీపతే!!

    తాత్పర్యం:

    భయంకరముఖములుకలిగి అమావాస్య రాత్రి సమానమైన కాంతి కలవారు భయంకరులగు యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆ వైశ్యుని యమపాశములచే బంధిమ్చి యమలోకమునకొ తీసుకొనిపోయి అక్కడ భయంకరమైన రౌరవమనే నరకమమ్దు యమాజ్ఞ మీదట బాధించుచుండిరి. రౌరవమనగా రురుమృగపు కొమ్ములచే బాధించెడి నరక నగరము. ఆ వైశ్యును పుత్రుడు ధర్మపరాయణుడు తండ్రిపోయిన పిమ్మట తండ్రి సంపాదించిన ధనమంతయూ నూతులు, చెరువులు తవ్వించి, ఏరులకు, నదీపాయలకు వంతెనల నిర్మాణము చేసి ఉపనయనములు, వివాహములకు యజ్ఞయాగాదులకు నిత్యమూ బ్రాహ్మణులకు ఆకొన్నవారికి అన్నదానము చేయుచు అన్నిజాతులవారికి ఆకలిగలిగిన వారికి అన్నమ్ పెట్టుచు నిత్యము ధర్మము చేయుచుండెడివాడు.

    తస్యచాంతరితేకాలే గృహేతత్పుణ్యయోగతః
    నారదఃపర్యటన్ సగాయన్ విష్ణుకీర్తనం
    వణిగ్విష్ణ్వర్చనేకాలే ప్రనృత్యన్ పులకాంకితః
    *గోవిందనారాయణ కృష్ణవిష్ణో అనంత వైకుంఠ నివాసమూర్తే*
    *శ్రీవత్సవిశ్వంభర దేవ దేవ సమస్త దేవేశనమోనమస్తే!!*

    నృత్యంతమేవంగృహమాగతం వణిక్సమస్త సంతోషపయోధిమగ్నః
    సనామ పాదైమునయె మహాత్మనెహ్యానంద బాష్పోన్నయనస్సదండవత్!!

    తాత్పర్యం:

    ఇంట్లుండగా, ఒకనాడు ఆ ధర్మవీరుడు హరిని గూర్చి పూజచేయుచుండగా ఆ సమయంలో మహాత్ముడైన నారదమహాముని సమస్తలోకములందు తిరిగుచు ఆనాడు యమలోకమునుంచి బయలుదేరి తనవీణాతంత్రులను మీటుతీ రోమాంచితుడై
    *గోవిందా – నారాయణా*
    *కృష్ణ – విష్ణో – అనంతా*
    *వైకుంఠ – శ్రీ – నివాసా*
    *శ్రీవత్సభూషా – విశ్వంభరా – దేవేశా*
    నమస్తే, నమస్తే నమోనమః, అంటూ గానము చేస్తూ వచ్చెను, ఇలా హరికీర్తనము చేయుచూ వచ్చిన నారదుని చూసి ఆ వైశ్యకుమారుడు ఆనంద సాగరంలో డోలలాడుతూ కన్నులవెంట నీరుకారగా మునిపాదములకు సాష్టాంగ నమస్కారము చేసెను.

    తంపాదపద్మానమిత దయాళుర్మునిస్తదాతంపరిరభ్యహర్షితః
    సప్రాహవైశ్యః పురతః కృతాంజలిః తం విష్ణుమర్ఘ్యాదిభిరర్చ్య తం నృప
    భవదాగమనంమహ్యం మునెహ్యత్యంతదుర్లభం
    యతార్జితం మయాపూర్వంధర్మమార్గముపాగతం
    యన్మయాచరితంత్వద్య ఫలితం తవ దర్శనాత్
    సేవాం విధాస్యేవిప్రేంద్ర ప్రాపయెప్రణయేనచ

    తాత్పర్యం:

    ఆ నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్య పుత్రుని ప్రీతితో లేవనెత్తి కౌగిలించుకొనెను. ఆ తరవాత వైశ్యుడు నారదమునీశ్వరుని ముందర అంజలిఘటించినవాడై అర్ఘ్యాదులచేత పూజించి. హే నారదమహర్షీ! మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము. నేను పూర్వపుణ్యమేదియో చేసియుందునేమో మీరు దర్శనమిచ్చినారు. కాబట్టి నాపూర్వపుణ్యమిప్పుడు ఫలించినది. మీకు దాసుడనైన నేనేమి చేయవలెనో తెల్పుము చేసెదను అని అనెగా..

    ఇతితస్యవచశ్శ్రుత్వా మందస్మేరముఖాంబుజః
    ఉవాచధర్మవీరమ్తమ్ నారదోభగవాన్మునిః
    *నారదః:*
    ధర్మవీరాద్య మేవాక్యం సావధానమనాశ్శ్రుణు
    కార్తికస్యతుమాసస్య ద్వాదశీ హరివల్లభా
    స్నానదానాదికతస్య సదానంతఫలంవిదుః

    ఆఢ్యకోవాదరిద్రోవా యతిర్వానస్థఏవవా
    బ్రాహ్మణక్షత్రియోవాపి వైశ్యశూద్రోపివాసతీ
    సాలగ్రామశిలాదానం యేకుర్వంతిప్రయత్నతః
    తులాసంస్థెదినకరెద్వాదశ్యామర్కికేదినే
    తేనపాపానినశ్యంతి జన్మాంతరకృతానిచ!!
    ధర్మరాజాలయేవైశ్యం పితాతవమృతంగతః
    రైరవాఖ్యేమహాఘోరే పచ్యతెనరకాగ్నినా
    తస్యపాపవిషుద్ధ్యర్థం ద్వాదశ్యాంకార్తికస్యచ
    సాలగ్రామశిలాదానం కురుత్వంమావిలంబితమ్!!

    తాత్పర్యం:

    వైశ్యుడిలా అన్నమాటలనువిని ఆ నారదముని చిరునవ్వుతోకూడిన ప్రశాంతముఖముతో యిట్లనెను ’ఓ ధర్మవీరా నామాట జాగ్రత్తగా వినుము కార్తీక ద్వాదశినాడు విష్ణుమూర్తికి ప్రియమైనది గనుక ఆరోజున చేసిన స్నానదానాదికములంనంత ఫలప్రదములు. సూర్యుడు తులారాశియందుండగా కార్తీకమాసమందు ద్వాదశితిథినాడు ధనికుడు, పేదవాడు, సన్యాసి-వానప్రస్థుడు-గృహస్థు, బ్రాహ్మణుడు-క్షత్రియుడు-వైశ్యుడు-శూద్రుడు, స్త్రీ-పురుషులు అని బేధములేక సాలగ్రామ దానము ఆచరించి జన్మాంతర కృతపాపములను నశింపజేసుకుందురు. ఓ ధర్మవీరా! విను, నీతండ్రి చనిపోయి యమలోకమమ్దు రౌరవాది బాధలనొందుచున్నాడు. అతని పాపశుద్ధికొరకు కార్తిక ద్వాదశినాడు శీఘ్రముగా సాలగ్రామ శిలాదానము చేయుము.

    మునెస్తస్యవచశ్రుత్వా వైశ్యః ప్రాహమునింనృప
    గోభూతిలహిరణ్యాది దానానాంయత్ఫలంమునే
    నాసీత్తత్ఫలతోముక్తి శ్శిలాదానేనకింభవేత్
    శిలాదానం వృధామన్యే నభోజ్యం స చ భక్షణం
    నాతః కార్యమ్ మయావిప్ర శిలాదానం చనీచవత్
    బహుధాబోధ్యంతం వైశ్యం మునిరంతరధీయత
    నకుర్యాద్యధిమూఢాత్మా బోధితోబ్రహ్మసూనునా
    సోపి కాలాంతరేతీతె గతాసురభవన్నృప
    మహద్వచనమజ్ఞేన హ్యతిక్రమణదోషతః
    సాలగ్రామశిలాదాన మనాదృత్య మహీపతే
    తేనదోషేణసంజాతో వ్యాఘ్రయోనై త్రిజన్మమ
    త్రివారంమర్కటత్వమ్చ పంచవారం వృషస్యచ
    దశవారం పునస్త్రీత్వం గతభర్తృత్వమంజసా!!

    తాత్పర్యం:

    నారదమునీశ్వరుడిట్లు చెప్పిన మాటలు విని ఆ వైశ్యుడిట్లనెను, మునీంద్రా గోదానము, భూదానము, తిలాదానము సువర్ణ దానము మొదలైన మహాదానములచేత దొరకని ముక్తి శిలాదానమువలన ఎలా కలుగుతుంది. శిలాదానము వృధాగా చేయడమెమ్దుకు అది భోజ్యమూకాదు, భక్షణమూకాదు కనుక ఈ రాతిని దానము చేయను. అనెను. నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడు మూఢుడై సాలగ్రామ దానము చేయుటకు సమ్మతించలేదు. అంత నారదుడంతర్థానమయ్యెను. ఆ తరవాత కొంతకాలమునకు ఆ ధర్మవీరుడు మృతినొంది మహాత్ములమాట వినని దోష్ము వలన నరకబాధలనుభవించి, తరవాత మూడు జన్మలు పులిగానూ, మూడు జన్మలు కోతిగా, అనంతరము ఐదు జన్మలు ఎద్దుగా, ఆ తరవాత పది సార్లు స్త్రీజన్మయెత్తి వైధవ్యమును పొందెను.

    జన్మనైకాదశెరాజన్ యాచకస్యసుతాభవత్
    తాందృష్ట్వావిప్రశార్దూల స్సురూపాంప్రాప్తయౌవనాం
    సమానకులగోత్రాయవివాహమకరోత్పితా
    మృతంజామాతరందృష్ట్వా నవోఢాంతనయాంపితా
    ఆయయుర్బాందవాస్సర్వే దుఃఖాదాకులితేంద్రియాః
    యాచకోపి విచార్యేదం దివ్యదృష్ట్యాతయాకృతం
    పూర్వజన్మనిరాజేంద్ర సుకృతందుష్కృతం ద్విజః
    విజ్ఞాయాహాధసర్వేభ్యః బంధుభ్యోరాజసత్తమ

    తాత్పర్యం:

    ఇట్లు పదిజన్మలు గడిచిన పిమ్మట పదకొండవ జన్మమున యాచకునకు కుమార్తెగా జన్మించెను . ఆ తరువాత కొంతకాలమునకు యౌవనము రాగానే తండ్రితగిన వరునకిచ్చి వివాహము చేసెను. కొంతకాలమునకు అల్లుడు మృతిచెందగా ఆ అల్లుని బంధువులందరు వచ్చి చూచి అట్టిబాల్యవైధవ్యమునకు చాల దుఃఖించిరి. యాచకుడు దివ్యదృష్టితో చూచినవాడై ఆచిన్నదాని బాల్యవైధవ్యమునకు కారణమును తెలుసుకొని బంధువులందరికిని కుమార్తెయొక్క పూర్వపుణ్యపాపమును తెలిపెను.

    తస్యాఃపాపవిశుద్ధ్యర్థం పితాతంముక్తికారణం
    జన్మాంతరార్జితాఘౌఘ నాశహేతుంసుఖప్రదం
    సాలగ్రామశిలాదానం కార్తిక్యామిమ్దువాసరే
    విప్రంవేదాంతనిరతం సమభ్యర్చ్యవిధానతః
    పుణ్యంపాపవిశుధ్యర్థం దాపయామాసభూసురః
    పతిరుజ్జీవితస్తేన సుఖేనభువిదంపతీ
    స్థిత్వాకాలేసమాయాతి దివంగత్వానుభూయచ
    నపుర్భవమభ్యేత్య స్థిత్వాసుతపసోభవత్
    పూర్వార్జితేపుణ్యేన తస్యజ్ఞానోదయోభవత్
    వర్షె వర్షెచసుకృతం కార్తిక్యామిందువాసరే
    సాలగ్రామశిలాదానం తేనముక్తిమవాపసః

    తాత్పర్యం:

    ఇట్లు చెప్పి తన కూతురుయొక్క పూర్వ పాపములనాశనము కొరకు సమర్థమగు సాలగ్రామ దానమును కార్తీక మాసమున సోమవారమునందు వేదాంతవేత్తయైన బ్రాహ్మణునకు దానము జేసెను. ఆసాలగ్రామ శిలాదానము చేత కూతురు భర్త తిరిగి జీవించెను, ఆ తరవాత దంపతులిద్దరూ సుఖముగా చిరకాలముండి స్వర్గమునకుబోయి అందు బహుకాలమానందముతో యుండి తిరిగి భూమియందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యము చేటా జ్ఞానమును పొందెను. ప్రతి సంవత్సరమూ కార్తీక సోమవారమునందు సాలగ్రామ శిలాదానమాచరించి ఆపుణ్యముతో మోక్షసామ్రాజ్యపదవిని పొందెను.

    రౌరవేదుఃఖితస్యాపి ముక్తిరాసీచ్చతత్పితుః
    తస్మాద్రాజేంద్రయత్నేన కార్తికేకమలాపతే
    సాలగ్రామశిలాదానం తుష్ట్యర్థంనాత్ససంశయః
    కోటిజన్మనుయత్పాపం సంచితం పాపిభిస్సదా
    తత్పాపనాశహేతుర్వై కార్తికేహరిబోధినీ
    సర్వపాపప్రశమనం ప్రాయశ్చిత్తంజగత్త్రయే
    సాలగ్రామశిలాదానా త్పరంనాస్తినసంశయః

    తాత్పర్యం:

    రౌరవ నరకమందున్నవాని తండ్రియగు వైశ్యుడు ఆ సాలగ్రామ దాన మహిమచేతముక్తుడాయెను, కాబట్టి జనకరాజా కార్తీకమందు సాలగ్రామదానముచేత హరిసంతోషించును ఇందులో అనుమానమక్కరలేదు. పాపకర్ములు కోటిజన్మలలో చేసిన పాతకములు కార్తీక శుక్ల ఏకాదశ్యుపవాస ద్వాదశీదానాదులచేత నశించును. కార్తీకమాసమునందు సాలగ్రామ దానమువలన సమస్త పాతకములు నశిమ్చును ఇదియే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము. ఇంతకంటె వేరు ప్రాయశ్చిత్తములేదు యిందులో అనుమానము లేదు.

    ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమాహాత్మ్యే ద్వాదశోధ్యాహస్సమాప్తః
    ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి

    Karthika Puranam 12th Day Parayanam-పన్నెండవ అధ్యాయము సమాప్తము.

  • Karthika Puranam Day2 Adhyayam

    Karthika Puranam Second Day Parayanam Visit www.stotraveda.com
    Karthika Puranam Second Day Parayanam

    Karthika Puranam Day2 Adhyayam Story

    ద్వితీయాధ్యాయము

    రెండవ రోజు  పారాయణం- కార్తీకపురాణం 2 వ రోజు అధ్యాయం

    Karthika Puranam Second Day Parayanam- Karthika Puranam Day2 Adhyayam

    కార్తీక సోమవార వ్రతము

    వశిష్ట ఉవాచ: 

    హే జనక మహారాజా! వినినంత మాత్రముచేతనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వపాపాలనూ హరింపచేసే కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్దగా విను సుమా! అందునా, ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీకమాసంలో వచ్చే ఏ సోమవారము నాడయినా సరే – స్నాన, జపాదులను ఆచరించిన వాడు వెయ్యి అశ్వమేథాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రతవిధి ఆరురకాలుగా ఉంది. 1. ఉపవాసము 2. ఏకభక్తము 3. నక్తము 4. అయాచితము 5. స్నానము 6. తిలదానము1. ఉపవాసము:
    శక్తిగలవారు కార్తీక సోమవారంనాడు పగలంతా అభోజనము (ఉపవాసము)తో గడిపి, సాయంకాలమున శివాభిషేకం చేసి, నక్షత్ర దర్శనానంతరమున తులసితీర్ధము మాత్రమే సేవించాలి.

    2. ఏకభక్తము:
    సాధ్యం కాని వాళ్లు ఉదయం స్నానదానజపాలను యథావిధిగా చేసికొని – మధ్యాహ్నమున భోజనము చేసి , రాత్రి భోజనానికి బదులు శైవతీర్ధమో, తులసీ తీర్ధమో మాత్రమే తీసుకోవాలి.

    3. నక్తము:
    పగలంతా ఉపవసించి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనమునకు గాని, ఉపాహారమును గాని స్వీకరించాలి.

    4. అయాచితము:
    భోజనానికై తాము ప్రయత్నించకుండా యెవరైనా – వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం ‘అయాచితము’.

    5. స్నానము:
    పై వాటికి వేటికీ శక్తి లేనివాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికిన్నీ చాలును.


    6. తిలదానము:
    మంత్ర జపవిధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారము నాడు నువ్వులను దానము చేసినా సరిపోతుంది.

    పై ‘ఆరు’ పద్దతులలో దేవి నాచరించినా కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది. కానీ, తెలుసుండి కూడా ఏ ఒక్కదానినీ ఆచరించనివాళ్ళు యెనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని ఆర్షవాక్యము. ఈ వ్రతాచరణము వలన అనాథలూ, స్త్రీలు కూడా విష్ణు సాయుజ్యమును పొందుతారు. కార్తీక మాసములో వచ్చేప్రతి సోమవారము నాడూ కూడా పగలు వుపవసించి, రాత్రి నక్షత్ర దర్శనానంతరము మాత్రమే భోజనము చేస్తూ – ఆ రోజంతా భగవద్ద్యానములో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివసాయుజ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమకచమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలిసికోవాలి. ఈ సోమవార వ్రతఫలాన్ని వివరించే ఒక యితిహాసాన్ని చెబుతాను విను.

    నిష్ఠురి కథ:
    పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి ‘నిష్ఠురి’ అనే కూతురుండేది. పుష్టిగానూ, అందంగానూ, అత్యంత విలాసంగానూ వుండే యీమెకు గుణాలు మాత్రం శిష్ఠమైనవి అబ్బలేదు. దుష్టగుణ భూయిష్ఠమై, గయ్యాళిగానూ, కాముకురాలుగానూ చరించే ఈ ‘నిష్ఠురి’ని ఆమె గుణాలరీత్యా ‘కర్కశ’ అని కూడా పిలుస్తూ వుండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశను సౌరాష్ట్ర బ్రహ్మణుడయిన మిత్రశర్మ అనేవానికిచ్చి, తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడూ, సరసుడూ మాత్రమేకాక సహృదయుడు కూడా కావడం వలన – కర్కశ ఆడినది ఆటగా, పాడినది పాటగా కొనసాగజొచ్సింది. పైగా ఆమె ప్రతిరోజూ తన భర్తను తిడుతూ, కొడుతూ వుండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక, భార్యను పరత్యజించడం తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన వలన – మిత్రశర్మ, కర్కశ పెట్టె కఠిన హింసలనన్నిటినీ భరిస్తూనే వుండేవాడు గాని, యేనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె యెందరో పరపురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకుని, భర్తను – అత్త మామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకానొకనాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ ‘నీ ముగుడు బ్రతికి వుండటం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం” అని రెచ్చగోట్టడంతో – కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రితుడై వున్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి, ఆ శవాన్ని తానే మోసుకునిపోయి ఒక పాడుబడిన సూతిలోనికి విసిరివేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమెకామె విటులబలం యెక్కువ కావడంచేత, అత్తమామలామెనేమీ అనలేక, తామే ఇల్లు వదిలి పారిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్కశ కన్నుమిన్నుగానని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కము పెట్టుకొని – ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులకు తార్చి, తద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది. దాని బలం తగ్గింది. యవ్వనం తొలగింది. శరీరంలోని రక్తం పలచబడటంతో ‘కర్కశ’ జబ్బు పడింది. అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని, అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తిలాంటి మేను పుళ్ళుపడిపోయింది. జిగీబిగీ తగ్గిన కర్కశ వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ ఆమెనసహ్యించుకోసాగారు. తుదకు అక్రమపతులకే గాని సుతులకు నోచుకుని ఆ నిష్ఠుర, తినడానికి తిండి, ఉండేందుకింత ఇల్లూ, వంటినిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనదై, సుఖవ్రణాలతో నడివీధినపడి మరణించింది. కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కుకూడా లేకపోయింది. యమదూతలా జీవిని పాశబద్ధను చేసి, నరకానికి తీసుకువెళ్ళారు. యముడామెకు దుర్భరమైన శిక్షలను విధించాడు.

    భర్తద్రోహికి భయంకర నరకం:

    భర్తను విస్మరించి పరపురుషుల నాలింగనము చేసుకున్న పాపానికి – ఆమె చేత మండుతున్న యినుపస్తంభాన్ని కౌగిలింపచేశాడు. భర్త తలను బ్రద్ధలు కొట్టినందుకు – ముండ్ల గదలతో ఆమె తల చిట్లేటట్లు మోదించాడు. భర్తను దూషించినందుకు కొట్టినందుకు, తన్నినందుకు, దాని పాదాలను పట్టుకుని, కఠినశిలలపై వేసి బాదించాడు. సీసమును గాచి చెవులలో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపాడు. ఆమె పాపాలకు గాను ఆమె ముందరి పదితరాల వారూ, తదుపరి పది తరాలవారూ – ఆమెతో కలిసి మొత్తం 21 తరాల వాళ్ళూ కుంభీపాకములో కుమిలిపోసాగారు. నరకానుభవము తర్వాత ఆమె పదిహేనుసార్లు భూమిపై కుక్కగా జన్మించినది. పదిహేనవ పర్యాయమున కళింగ దేశములో కుక్కగా పుట్టి, ఒకానొక బ్రాహ్మణ గృహములో వుంటూ వుండేది.

    సోమవార వ్రతఫలముచే కుక్క కైలాసమందుట:
    ఇలా వుండగా, ఒక కార్తీక సోమవారము నాడా బ్రాహ్మణుడు పగలు ఉపవాసముండి, శివాభిషేకాదులను నిర్వర్తించి, నక్షత్ర దర్శనానంతరము, నక్త స్వీకారానికి సిద్దపడి, ఇంటి బయలులో బలిని విడిచి పెట్టాడు. ఆనాడంతా ఆహారము దొరకక పస్తు పడివున్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించినది. బలి భోజనము వలన దానికి పూర్వస్మతి కలిగి – ” ఓ విప్రుడా ! రక్షింపు’ మని కుయ్యి పెట్టినది. దాని అరుపులు విని వచ్చిన విప్రుడు – కుక్క మాటలాడటాన్ని గమనించి విస్తుపోతూనే – “ఏమి తప్పు చేశావు?” నిన్ను నేనెలా రక్షించగలను?” అని అడిగాడు.అందుకా కుక్క ‘ఓ బ్రహ్మణుడా! పూర్వజన్మలో నేనొక విప్ర వనితను. కామముతో కండ్లు మూసుకుపోయి, జారత్వానికి ఒడిగట్టి, భర్త హత్యకూ, వర్ణసంకరానికి కారకురాలినైన పతితను. ఆయా పాపాల కనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలననుభవించి ఈ భూమిపై ఇప్పటికి 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది – ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పురాజన్మలెందుకు గుర్తుకువచ్చాయో అర్ధము కావడంలేదు. దయచేసి విశదపరుచుమని కోరినది.

    బ్రహ్మణుడు సర్వాన్నీ జ్ఞానదృష్టి చేత తెలుసుకుని ‘శునకమా! ఈ కార్తీక సోమవారమునాడు ప్రదోషవేళ వరకు పస్తుపడి వుండి – నాచే విడువబడిన బలిభక్షణమును చేయుట వలననే నీకీ పూర్వజన్మ జ్ఞానము కలిగిన’దని చెప్పాడు. ఆపై నా జాగిలము ‘కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా! నాకు మోక్షమెలా సిద్దించునో ఆనతీయుమని కోరినమీదట, దయాళువైన ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో – ఒక సోమవారం వాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా, ఆ క్షణమే ఆ కుక్క తన శునకదేహాన్ని పరిత్యజించి – దివ్య స్త్రీ శరీరిణియై – ప్రకాశమానహార వస్త్ర విభూషితయై, పితృదేవతా సమన్వితయై కైలాసమునకు చేరినది. కాబట్టి ఓ జనక మహారాజా! నిస్సంశయ నిశ్రేయసదాయియైన యీ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు’ అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు.

    నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, చద్ది. ఎంగిలి. చల్లని వస్తువులు
    దానములు :- నెయ్యి, బంగారం
    పూజించాల్సిన దైవము :- స్వథా అగ్ని
    జపించాల్సిన మంత్రము :- ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా
    ఫలితము :- తేజోవర్ధనము

    ద్వితీయోధ్యాయ స్సమాప్తః

  • Karthika Puranam Day15 Adhyayam

    Karthika Puranam 15th Day Parayanam Visit www.stotraveda.com
    Karthika Puranam 15th Day Parayanam

    Karthika Puranam Day15 Adhyayam Story

    పదిహేనవ రోజు పారాయణం-కార్తీక పురాణం 15వ అధ్యాయం

    Karthika Puranam 15th Day Parayanam- Karthika Puranam Day15 Adhyayam

    కార్తీకపురాణం – 15వ రోజు పారాయణము
    దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వ జన్మస్మృతితో నరరూపమందుట

    అంతట జనక మహారాజుతో వశిష్ట మహాముని – జనకా ! కార్తీక మహత్యము గురించి యెంత వివరించిననూ పూర్తి కానేరదు. కాని, మరి యొక యితిహసము తెలియ చెప్పెదను సావధానుడ వై ఆలకింపు – మని ఇట్లు చెప్పెను.
    ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట, లేక, వినుట, సాయంత్రము దేవతా దర్శనము – చేయలేనివారు కాల సూత్రమనెడి నరకముబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికీ అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యము యిచ్చిన యెడల, విశేష ఫలము పొందగలరు. ఈవిధముగా నెలరోజులు విడువక చేసిన యెడల, అట్టి వారు దేవదుందుభులు మ్రోగు చుండగా విమాన మెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెలరోజులు చేయలేనివారు కార్తీక శుద్ధత్రయోదశి, చతుర్దశి, పూర్ణిమరోజులందైనా నిష్టతో పూజలు చేసి ఆవునేతితో దీపమునుంచవలెను.
    ఈ మహా కార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్ర ముదీపముంచిన యెడల మరుజన్మలో బ్రాహణుడుగా జన్మించును. ఇతరులు వుంచిన దీపము మెగ ద్రోసి వృద్దిచేసిన యెడల, లేక , ఆరిపోయిను దీపమును వెలిగించినా అట్టి వారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు. విను – మని వశిస్టులవారు యిట్లు చెప్పుచునారు.


    సరస్వతి నదీ తీరమున శిధిలమైన దేవాలయమొకటి కలదు. కర్మనిష్టుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగి పుంగవుడు అ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము జేయు తలంపురాగా ఆ పాడుబడి యున్న దేవాలయమును శ్రుభముగా వూడ్చి, నీళ్లతో కడిగి, బొట్లు పెట్టి, ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి , దూదితో వత్తులు జేసి, పండ్రెండు దీపములుంచి, స్వామిని పూజించుచు, నిష్టతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభమునుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి, నలుమూలలు వెదకి, తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయియున్న వత్తిని తిని వలసినదేనని అనుకోని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపమువద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురూ వచ్చెను. అది కార్తీక మాసమగుటవలనను, శివాలయములో ఆరిపోయిన వత్తి యీ యెలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దానిరూపము మారి మానవ రూపములో నిలబడెను. ధ్యాన నిష్టలో వున్న యోగిపుంగవుడు తన కన్నులను తెరచిచూడ గా, ప్రక్క నొక మానవుడు నిలబడి యుండుటను గమనించి “ఓయీ!నీ వెవ్వడవు? ఎందుకిట్లు నిలబడి యుంటివి? అని ప్రశ్నించ గా” ఆర్యా ! నేను మూషికమును, రాత్రి నేను ఆహారమును వెదుకుకొంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి యిక్కడ కూడా ఏమి దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నోటకరిచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి వుండగ, నా అదృష్టముకొలదీ ఆ వత్తి వేలుగుటచే నాపాపములు పోయినుందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తి తిని. కాని, ఓ మహానుభావా! నేను యెందుకీ మూషిక జన్మమెత్త వలసివచ్చేనో – దానికి గల కారణమేమిటో విశ దీ కరింపు ” మని కోరెను.

    అంత యోగీ శ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టి చే సర్వము తెలుసుకొని ” ఓయీ! క్రిందటి జన్మలో నీవు బ్రాహణుడువు. నిన్ను బాహ్లీకుడని పిలిచెడివారు. నీవు జైన మత వంశానికి చెందిన వాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయంచేస్తూ, ధనాశాపరుడవై దేవపూజలు, నిత్యకర్మములు మరచి, నీచుల సహవాసము వలన నిషిద్దాన్నము తినుచూ, మంచివారలను, యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్ద చింత గలవాడవై ఆడ పిల్లలను అమ్ము వృత్తి చేస్తూ, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడ బెట్టుచు, సమస్త తినుబండారములను కడుచౌకగా కొని, తిరిగి వాటిని యెక్కువ ధరకు అమ్మి, అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక యిత రులకు యివ్యక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత యెలుక జన్మ మెత్తి వెనుకటి జన్మ పాపమును భవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వ జన్మ ప్రాప్తించింది. కాన, నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యుందు పాతి పెట్టిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్దంచుకొని మోక్షము పొందు ” మని అతనికి నీతులు చెప్పి పంపించెను.

    పదిహేనవ రోజు పారాయణము సమాప్తము.

  • Tripura Bhairavi Kavacham

    Trilokya Bhairavi Kavacham- Tripura Bhairavi Kavacham Visit www.stotraveda.com
    Trilokya Bhairavi Kavacham | Tripura Bhairavi Kavacham 

    Trilokya Bhairavi Kavacham- Tripura Bhairavi Kavacham:

    Tripura Bhairavi Kavacham

    Bhairavi is the fifth of the ten Mahavidya Goddesses. Bhairavi is a fierce and terrifying aspect of the Goddess and in nature hardly indistinguishable from Kali. Goddess Bhairavi is the consort of the Bhairava which is the fierce manifestation of Lord Shiva associated with the annihilation.

    Goddess Bhairavi has four arms and she holds a book and rosary in two arms. She makes fear-dispelling and boon-conferring gestures with remaining two arms and these gestures are known as Abhaya and Varada Mudra respectively. She sits over a lotus flower.

    Bhairavi is seen mainly as the Chandi in the Durga Saptashati who slays Chanda and Munda.

    Please take a moment to spread this valuable treasure of our Sanatana Dharma among your relatives and friends.We are helping for Encourage others to chant vedic chants,shlokas/slokas and mantras properly.

    Bhairavi Yantra:
    Bhairavi Yantra along with its Mool Mantra is considered very effective medium to fulfil Bhairavi Sadhana.

    Bhairavi Moola Mantra:
    ॐ ह्रीं भैरवी कलौं ह्रीं स्वाहा॥
    Om Hreem Bhairavi Kalaum Hreem Svaha॥

    Bhairavi Gayatri Mantra:

    ॐ त्रिपुरायै विद्महे महाभैरव्यै धीमहि तन्नो देवी प्रचोदयात्॥

    Om Tripurayai Vidmahe Mahabhairavyai Dhimahi Tanno Devi Prachodayat॥

    Ashtakshari Tripura Bhairavi Mantra (8 Syllables Mantra):
    हसैं हसकरीं हसैं॥
    Hasaim Hasakarim Hasaim॥

    Tryakshari Bhairavi Mantra (3 Syllables Mantra):

    ह्स्त्रैं ह्स्क्ल्रीं ह्स्त्रौंः॥

    Hstraim Hsklreem Hstraumh॥

    Shmashan Bhairavi Mantra:

    श्मशान भैरवि नररुधिरास्थि – वसाभक्षिणि सिद्धिं मे देहि मम मनोरथान् पूरय हुं फट् स्वाहा॥

    Shmashana Bhairavi Nararudhirasthi – Vasabhakshini Siddhim Me Dehi

    Mama Manorathan Puraya Hum Phat Svaha॥

    Tripura Bhairavi Kavacham-Trilokya Bhairavi Kavacham in Telugu:

    శ్రీ త్రిపురభైరవీ కవచం

    శ్రీపార్వత్యువాచ –

    దేవదేవ మహాదేవ సర్వశాస్త్రవిశారద |
    కృపాం కురు జగన్నాథ ధర్మజ్ఞోసి మహామతే || ౧ ||

    భైరవీ యా పురా ప్రోక్తా విద్యా త్రిపురపూర్వికా |
    తస్యాస్తు కవచం దివ్యం మహ్యం కథయ తత్త్వతః || ౨ ||

    తస్యాస్తు వచనం శ్రుత్వా జగాద జగదీశ్వరః |
    అద్భుతం కవచం దేవ్యా భైరవ్యా దివ్యరూపి వై || ౩ ||

    ఈశ్వర ఉవాచ –

    కథయామి మహావిద్యాకవచం సర్వదుర్లభమ్ |
    శృణుష్వ త్వం చ విధినా శ్రుత్వా గోప్యం తవాపి తత్ || ౪ ||

    యస్యాః ప్రసాదాత్సకలం బిభర్మి భువనత్రయమ్ |
    యస్యాః సర్వం సముత్పన్నం యస్యామద్యాపి తిష్ఠతి || ౫ ||

    మాతా పితా జగద్ధన్యా జగద్బ్రహ్మస్వరూపిణీ |
    సిద్ధిదాత్రీ చ సిద్ధాస్స్యాదసిద్ధా దుష్టజంతుషు || ౬ ||

    సర్వభూతప్రియంకరీ సర్వభూతస్వరూపిణీ | [*హితంకర్త్రీ*]
    కకారీ పాతు మాం దేవీ కామినీ కామదాయినీ || ౭ ||

    ఏకారీ పాతు మాం దేవీ మూలాధారస్వరూపిణీ |
    ఈకారీ పాతు మాం దేవీ భూరిసర్వసుఖప్రదా || ౮ ||

    లకారీ పాతు మాం దేవీ ఇంద్రాణీవరవల్లభా |
    హ్రీంకారీ పాతు మాం దేవీ సర్వదా శంభుసుందరీ || ౯ ||

    ఏతైర్వర్ణైర్మహామాయా శాంభవీ పాతు మస్తకమ్ |
    కకారీ పాతు మాం దేవీ శర్వాణీ హరగేహినీ || ౧౦ ||

    మకారీ పాతు మాం దేవీ సర్వపాపప్రణాశినీ |
    కకారీ పాతు మాం దేవీ కామరూపధరా సదా || ౧౧ ||

    కాకారీ పాతు మాం దేవీ శంబరారిప్రియా సదా |
    పకారీ పాతు మాం దేవీ ధరాధరణిరూపధృక్ || ౧౨ ||

    హ్రీంకారీ పాతు మాం దేవీ ఆకారార్ధశరీరిణీ |
    ఏతైర్వర్ణైర్మహామాయా కామరాహుప్రియాఽవతు || ౧౩ ||

    మకారః పాతు మాం దేవీ సావిత్రీ సర్వదాయినీ |
    కకారః పాతు సర్వత్ర కలాంబా సర్వరూపిణీ || ౧౪ ||

    లకారః పాతు మాం దేవీ లక్ష్మీః సర్వసులక్షణా |
    ఓం హ్రీం మాం పాతు సర్వత్ర దేవీ త్రిభువనేశ్వరీ || ౧౫ ||

    ఏతైర్వర్ణైర్మహామాయా పాతు శక్తిస్వరూపిణీ |
    వాగ్భవా మస్తకం పాతు వదనం కామరాజితా || ౧౬ ||

    శక్తిస్వరూపిణీ పాతు హృదయం యంత్రసిద్ధిదా |
    సుందరీ సర్వదా పాతు సుందరీ పరిరక్షతు || ౧౭ ||

    రక్తవర్ణా సదా పాతు సుందరీ సర్వదాయినీ |
    నానాలంకారసంయుక్తా సుందరీ పాతు సర్వదా || ౧౮ ||

    సర్వాంగసుందరీ పాతు సర్వత్ర శివదాయినీ |
    జగదాహ్లాదజననీ శంభురూపా చ మాం సదా || ౧౯ ||

    సర్వమంత్రమయీ పాతు సర్వసౌభాగ్యదాయినీ |
    సర్వలక్ష్మీమయీ దేవీ పరమానందదాయినీ || ౨౦ ||

    పాతు మాం సర్వదా దేవీ నానాశంఖనిధిః శివా |
    పాతు పద్మనిధిర్దేవీ సర్వదా శివదాయినీ || ౨౧ ||

    పాతు మాం దక్షిణామూర్తి ఋషిః సర్వత్ర మస్తకే |
    పంక్తిశ్ఛందః స్వరూపా తు ముఖే పాతు సురేశ్వరీ || ౨౨ ||

    గంధాష్టకాత్మికా పాతు హృదయం శంకరీ సదా |
    సర్వసంమోహినీ పాతు పాతు సంక్షోభిణీ సదా || ౨౩ ||

    సర్వసిద్ధిప్రదా పాతు సర్వాకర్షణకారిణీ |
    క్షోభిణీ సర్వదా పాతు వశినీ సర్వదావతు || ౨౪ ||

    ఆకర్షిణీ సదా పాతు సదా సంమోహినీ తథా |
    రతిదేవీ సదా పాతు భగాంగా సర్వదావతు || ౨౫ ||

    మాహేశ్వరీ సదా పాతు కౌమారీ సర్వదావతు |
    సర్వాహ్లాదనకారీ మాం పాతు సర్వవశంకరీ || ౨౬ ||

    క్షేమంకరీ సదా పాతు సర్వాంగం సుందరీ తథా |
    సర్వాంగం యువతీ సర్వం సర్వసౌభాగ్యదాయినీ || ౨౭ ||

    వాగ్దేవీ సర్వదా పాతు వాణీ మాం సర్వదావతు |
    వశినీ సర్వదా పాతు మహాసిద్ధిప్రదావతు || ౨౮ ||

    సర్వవిద్రావిణీ పాతు గణనాథా సదావతు |
    దుర్గాదేవీ సదా పాతు వటుకః సర్వదావతు || ౨౯ ||

    క్షేత్రపాలః సదా పాతు పాతు చాఽపరశాంతిదా |
    అనంతః సర్వదా పాతు వరాహః సర్వదావతు || ౩౦ ||

    పృథివీ సర్వదా పాతు స్వర్ణసింహాసనస్తథా |
    రక్తామృతశ్చ సతతం పాతు మాం సర్వకాలతః || ౩౧ ||

    సుధార్ణవః సదా పాతు కల్పవృక్షః సదావతు |

    శ్వేతచ్ఛత్రం సదా పాతు రత్నదీపః సదావతు || ౩౨ ||

    సతతం నందనోద్యానం పాతు మాం సర్వసిద్ధయే |
    దిక్పాలాః సర్వదా పాంతు ద్వంద్వౌఘాః సకలాస్తథా || ౩౩ ||

    వాహనాని సదా పాంతు సర్వదాఽస్త్రాణి పాంతు మాం |
    శస్త్రాణి సర్వదా పాంతు యోగిన్యః పాంతు సర్వదా || ౩౪ ||

    సిద్ధాః పాంతు సదా దేవీ సర్వసిద్ధిప్రదావతు |
    సర్వాంగసుందరీ దేవీ సర్వదావతు మాం తథా || ౩౫ ||

    ఆనందరూపిణీ దేవీ చిత్స్వరూపా చిదాత్మికా |
    సర్వదా సుందరీ పాతు సుందరీ భవసుందరీ || ౩౬ ||

    పృథగ్దేవాలయే ఘోరే సంకటే దుర్గమే గిరౌ |
    అరణ్యే ప్రాంతరే వాఽపి పాతు మాం సుందరీ సదా || ౩౭ ||

    ఇదం కవచమిత్యుక్తం మంత్రోద్ధారశ్చ పార్వతి |
    యః పఠేత్ప్రయతో భూత్వా త్రిసంధ్యం నియతః శుచిః || ౩౮ ||

    తస్య సర్వార్థసిద్ధిః స్యాద్యద్యన్మనసి వర్తతే |
    గోరోచనాకుంకుమేన రక్తచందనకేన వా || ౩౯ ||

    స్వయంభూకుసుమైశ్శుక్లైః భూమిపుత్రే శనౌ సురే |
    శ్మశానే ప్రాంతరే వాపి శూన్యాగారే శివాలయే || ౪౦ ||

    స్వశక్త్యా గురుణా యంత్రం పూజయిత్వా కుమారికాం |
    తన్మనుం పూజయిత్వా చ గురుపంక్తిం తథైవ చ || ౪౧ ||

    దేవ్యై బలిం నివేద్యాథ నరమార్జారసూకరైః |
    నకులైర్మహిషైర్మేషైః పూజయిత్వా విధానతః || ౪౨ ||

    ధృత్వా సువర్ణమధ్యస్థం కంఠే వా దక్షిణే భుజే |
    సుతిథౌ శుభనక్షత్రే సూర్యస్యోదయనే తథా || ౪౩ ||

    ధారయిత్వా చ కవచం సర్వసిద్ధిం లభేన్నరః |
    కవచస్య చ మాహాత్మ్యం నాహం వర్షశతైరపి || ౪౪ ||

    శక్నోమి తు మహేశాని వక్తుం తస్య ఫలం తు యత్ |
    న దుర్భిక్షఫలం తత్ర న శత్రోః పీడనం తథా || ౪౫ ||

    సర్వవిఘ్నప్రశమనం సర్వవ్యాధివినాశనమ్ |
    సర్వరక్షాకరం జంతోశ్చతుర్వర్గఫలప్రదమ్ || ౪౬ ||

    యత్ర కుత్ర న వక్తవ్యం న దాతవ్యం కదాచన |
    మంత్రప్రాప్య విధానేన పూజయేత్సతతం సుధీః || ౪౭ ||

    తత్రాపి దుర్లభం మన్యే కవచం దేవరూపిణమ్ |
    గురోః ప్రసాదమాసాద్య విద్యాం ప్రాప్య సుగోపితామ్ || ౪౮ ||

    తత్రాపి కవచం దివ్యం దుర్లభం భువనత్రయే |
    శ్లోకం వా స్తవమేకం వా యః పఠేత్ప్రయతః శుచిః || ౪౯ ||

    తస్య సర్వార్థసిద్ధిః స్యాచ్ఛంకరేణ ప్రభాషితమ్ |
    గురుర్దేవో హరః సాక్షాత్పత్నీ తస్య చ పార్వతీ || ౫౦ ||

    అభేదేన యజేద్యస్తు తస్య సిద్ధిరదూరతః || ౫౧ ||
    ఇతి శ్రీరుద్రయామళే భైరవభైరవీసంవాదే శ్రీ త్రిపురభైరవీ కవచమ్ ||

    Tripura Bhairavi Kavacham in Sanskrit/Devanagari/Hindi:

    भैरवीकवचम् अथवा त्रैलोक्यविजय भैरवी कवचम्

    श्रीगणेशाय नमः ।
    श्रीदेव्युवाच ।

    भैरव्याः सकला विद्याः श्रुताश्चाधिगता मया ।
    साम्प्रतं श्रोतुमिच्छामि कवचं यत्पुरोदितम् ॥ १॥

    त्रैलोक्यविजयं नाम शस्त्रास्त्रविनिवारणम् ।
    त्वत्तः परतरो नाथ कः कृपां कर्तुमर्हति ॥ २॥

    ईश्वर उवाच ।

    श्रुणु पार्वति वक्ष्यामि सुन्दरि प्राणवल्लभे ।
    त्रैलोक्यविजयं नाम शस्त्रास्त्रविनिवारकम् ॥ ३॥

    पठित्वा धारयित्वेदं त्रैलोक्यविजयी भवेत् ।
    जघान सकलान्दैत्यान् यधृत्वा मधुसूदनः ॥ ४॥

    ब्रह्मा सृष्टिं वितनुते यधृत्वाभीष्टदायकम् ।
    धनाधिपः कुबेरोऽपि वासवस्त्रिदशेश्वरः ॥ ५॥

    यस्य प्रसादादीशोऽहं त्रैलोक्यविजयी विभुः ।
    न देयं परशिष्येभ्योऽसाधकेभ्यः कदाचन ॥ ६॥

    पुत्रेभ्यः किमथान्येभ्यो दद्याच्चेन्मृत्युमाप्नुयात् ।
    ऋषिस्तु कवचस्यास्य दक्षिणामूर्तिरेव च ॥ ७॥

    विराट् छन्दो जगद्धात्री देवता बालभैरवी ।
    धर्मार्थकाममोक्षेषु विनियोगः प्रकीर्तितः ॥ ८॥

    अधरो बिन्दुमानाद्यः कामः शक्तिशशीयुतः ।
    भृगुर्मनुस्वरयुतः सर्गो बीजत्रयात्मकः ॥ ९॥

    बालैषा मे शिरः पातु बिन्दुनादयुतापि सा ।
    भालं पातु कुमारीशा सर्गहीना कुमारिका ॥ १०॥

    दृशौ पातु च वाग्बीजं कर्णयुग्मं सदावतु ।
    कामबीजं सदा पातु घ्राणयुग्मं परावतु ॥ ११॥

    सरस्वतीप्रदा बाला जिह्वां पातु शुचिप्रभा ।
    हस्रैं कण्ठं हसकलरी स्कन्धौ पातु हस्रौ भुजौ ॥ १२॥

    पञ्चमी भैरवी पातु करौ हसैं सदावतु ।
    हृदयं हसकलीं वक्षः पातु हसौ स्तनौ मम ॥ १३॥

    पातु सा भैरवी देवी चैतन्यरूपिणी मम ।
    हस्रैं पातु सदा पार्श्वयुग्मं हसकलरीं सदा ॥ १४॥

    कुक्षिं पातु हसौर्मध्ये भैरवी भुवि दुर्लभा ।
    ऐंईंओंवं मध्यदेशं बीजविद्या सदावतु ॥ १५॥

    हस्रैं पृष्ठं सदा पातु नाभिं हसकलह्रीं सदा ।
    पातु हसौं करौ पातु षट्कूटा भैरवी मम ॥ १६॥

    सहस्रैं सक्थिनी पातु सहसकलरीं सदावतु ।
    गुह्यदेशं हस्रौ पातु जनुनी भैरवी मम ॥ १७॥

    सम्पत्प्रदा सदा पातु हैं जङ्घे हसक्लीं पदौ ।
    पातु हंसौः सर्वदेहं भैरवी सर्वदावतु ॥ १८॥

    हसैं मामवतु प्राच्यां हरक्लीं पावकेऽवतु ।
    हसौं मे दक्षिणे पातु भैरवी चक्रसंस्थिता ॥ १९॥

    ह्रीं क्लीं ल्वें मां सदा पातु निऋत्यां चक्रभैरवी ।
    क्रीं क्रीं क्रीं पातु वायव्ये हूँ हूँ पातु सदोत्तरे ॥ २०॥

    ह्रीं ह्रीं पातु सदैशान्ये दक्षिणे कालिकावतु ।
    ऊर्ध्वं प्रागुक्तबीजानि रक्षन्तु मामधःस्थले ॥ २१॥

    दिग्विदिक्षु स्वाहा पातु कालिका खड्गधारिणी ।
    ॐ ह्रीं स्त्रीं हूँ फट् सा तारा सर्वत्र मां सदावतु ॥ २२॥

    सङ्ग्रामे कानने दुर्गे तोये तरङ्गदुस्तरे ।
    खड्गकर्त्रिधरा सोग्रा सदा मां परिरक्षतु ॥ २३॥

    इति ते कथितं देवि सारात्सारतरं महत् ।
    त्रैलोक्यविजयं नाम कवचं परमाद्भुतम् ॥ २४॥

    यः पठेत्प्रयतो भूत्वा पूजायाः फलमाप्नुयात् ।
    स्पर्धामूद्धूय भवने लक्ष्मीर्वाणी वसेत्ततः ॥ २५॥

    यः शत्रुभीतो रणकातरो वा भीतो वने वा सलिलालये वा ।
    वादे सभायां प्रतिवादिनो वा रक्षःप्रकोपाद् ग्रहसकुलाद्वा ॥ २६॥

    प्रचण्डदण्डाक्षमनाच्च भीतो गुरोः प्रकोपादपि कृच्छ्रसाध्यात् ।
    अभ्यर्च्य देवीं प्रपठेत्रिसन्ध्यं स स्यान्महेशप्रतिमो जयी च ॥ २७॥

    त्रैलोक्यविजयं नाम कवचं मन्मुखोदितम् ।
    विलिख्य भूर्जगुटिकां स्वर्णस्थां धारयेद्यदि ॥ २८॥

    कण्ठे वा दक्षिणे बाहौ त्रैलोक्यविजयी भवेत् ।
    तद्गात्रं प्राप्य शस्त्राणि भवन्ति कुसुमानि च ॥ २९॥

    लक्ष्मीः सरस्वती तस्य निवसेद्भवने मुखे ।
    एतत्कवचमज्ञात्वा यो जपेद्भैरवीं पराम् ।
    बालां वा प्रजपेद्विद्वान्दरिद्रो मृत्युमाप्नुयात् ॥ ३०॥

    ॥ इति श्रीरुद्रयामले देवीश्वरसंवादे त्रैलोक्यविजयं नाम
    भैरवी कवचं समाप्तम् ॥

    Tripura Bhairavi Kavacham in English:

    || bhairavIkavacham ||

    shri Ganeshaya namah |

    shridevyuvAcha|

    bhairavyah sakala vidyah shrutashchadhigata maya |
    sampratam shrotumichchami kavacham yatpuroditam || 1||

    trailokyavijayam nama shastrastravinivaranam |
    tvattah parataro natha kah krripam kartumarhati || 2||

    Ishvara uvAcha|

    shrunu parvati vakshyami sundari pranavallabhe |
    trailokyavijayam nama shastrastravinivarakam || 3||

    pathitva dharayitvedam trailokyavijayi bhavet |
    jaghana sakalandaityan yadhrritva madhusudanah || 4||

    brahma srrishtim vitanute yadhrritvabhishtadayakam |
    dhanadhipah kuberoapi vasavastridasheshvarah || 5||

    yasya prasadadIshoaham trailokyavijayi vibhuh |
    na deyam parashishyebhyoasadhakebhyah kadachana || 6||

    putrebhyah kimathanyebhyo dadyachchenmrrityumapnuyat |
    rrishistu kavachasyasya dakshinamurtireva cha || 7||

    virat chando jagaddhatri devata balabhairavi |
    dharmarthakamamoksheshu viniyogah prakirtitah || 8||

    adharo bindumanadyah kamah shaktishashiyutah |

    Benefits of Tripura Bhairavi Kavacham:

    Tripura Bhairavi kavach protects from these effects:

    Protects from accident
    Protects from Trauma
    Protects from Heart-attack & Stroke
    Protects from immature death
    Protects from Najar Dosh/Drishti
    Protects from bad and harmful influences
    Guiding us on the spiritual path
    Defend her devotee against all kinds of harmful threat
    Protects from negative energies