Home

  • Karthika Puranam Day16 Adhyayam

    Karthika Puranam 16th Day Parayanam Visit www.stotraveda.com
    Karthika Puranam 16th Day Parayanam

    Karthika Puranam Day16 Adhyayam Story

    పద హరో రోజు పారాయణం-కార్తీక పురాణం 16వ అధ్యాయం

    Karthika Puranam 16th Day Parayanam -Karthika Puranam Day16 Adhyayam

    కార్తీకపురాణం – 16వ రోజు పారాయణము

    స్తంభ దీపప్రశంస

    వశిష్టుడు చెబుతున్నాడు-

    “ఓ రాజా! కార్తిక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికర మైన మాసము. ఆ మాసముందు స్నాన, దాన , వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి వున్నా దానము చేయరో , అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెలదినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు.

    ఆవిధముగానే నెలరోజులలో ఏ ఒక్కరోజూ విడువకుండ, తులసికోట వద్ద గాని – భగవంతుని సన్నిధినగాని దీపారాధన చేసిన యెడల సమస్త పాపములు నశించుటయే గాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ద పౌర్ణమి రోజున నదీస్నానమాచరించి, భగవంతుని సన్నీధియందు ధూపదీపనైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు, నారికేళ ఫలదానము జేసిన యెడల – చిరకాలమునుండి సంతతిలేనివారికి పుత్ర సంతానము కలుగును.
    సంతానము వున్న వారు చేసినచో సంతాన నష్టము జరుగదు . పుట్టిన బిడ్డలు చిరంజీవులై యు౦దురు. ఈ మాసములో ద్వజస్తంభమునందు ఆకాశ దీపమునుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశదీపముగాని, స్తంభదీపము గాని వుంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశర్యములు కలిగి , వారి జీవితము ఆనందదాయకమగును . 

    ఆకాశ దీపము పెట్టువారు శాలిధాన్యంగాని, నువ్వులుగాని ప్రమిద అడుగును పోసిదీపముంచవలమును. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారును, లేక దీ పం పెట్టువారి పరిహసమడు వారును చుంచు జన్మ మెత్తుదురు ఇందులకొక కథ కలదు చెప్పెదను వినుము.

    దీపస్తంభము విప్రుడ గుట:

    ఋషులలో అగ్రగణ్యుడన పేరొందిన మతంగ మహాముని ఒక చోట అశ్రమాన్నిఏర్పరచుకొని, దానికి దగ్గరలో నొక విష్ణుమందిరాన్నికూడా నిర్మించుకొని, నిత్యమూ పూజలు చేయుచుండెను. కార్తీక మాసములో ఆ యాశ్రమము చుట్టు ప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయద్వారాల పై దీపములు వెలిగించి, కడు భక్తీ తో శ్రీ హరిని పూజించి వెళ్ళుచుండెడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్దుడు తక్కిన మునులని జూచి 

    ” ఓ సిద్దులారా! కార్తిక మాసములో హరి హరాదుల ప్రితికోరకు స్తంభదీపము నుంచిన చో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకూ తెలిసిన విషయమే కదా! రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి . హరి హరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికెదురుగా ఒక స్త౦భము పాతి,దాని పై దీపమును పెట్టుదము. కావున మన మందరము అడవికి వెళ్లి నిడుపాటి స్తంభ ము తోడ్కుని వత్తము, రండు ” అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామి కెదురుగా పాతిరి. దానిపై శాలిధాన్యముంచి ఆవును నేతితి నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపము వెలిగించిరి . పిమ్మట వారందరూ కూర్చోండి పురాణ పఠనము చేయుచుండగా ఫళ ఫళ మును శబ్దము వినిపించి, అటుచూడగా వారు పాతిన స్తంభము ముక్క లై పడి, దీపము ఆరిపోయి చెల్లచెదురై పడి యుండెను . 

    ఆ దృశ్యము చూచి వారందరు ఆశ్చర్యము తో నిలబడి యుండిరి. అంతలో ఆ స్తంభమునుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని జూచి ” ఓయీ నీవేవడవు? నీవీ స్తంభమునుండి యేలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి” అని ప్రశ్నించిరి. అంత, ఆ పురుషుడు వారందరకు నమస్కరించి ” పుణ్యాత్ములారా! నేను క్రిందటి జన్మమందు బ్రహ్మణుడను . ఒక జమిందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్భుద్దులలవడుటచే వేదములు చదువక శ్రీ హరిని పూజింపక, దానధర్మాలు చేయక మెలగితిని. నేను నా పరి వారముతో కూర్చుండి యున్న సమయమున నే విప్రుడయినా వచ్చినన్ను ఆశ్రయించిన నేను అతనిచే నా కళ్ళు కడిగించి, ఆ నీళ్ళు నెత్తి మీద వేసుకోమని చెప్పి, నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను. నేను వున్నతాసనముపై కూర్చుండి అతిధులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను.స్త్రీ లను , పసిపిల్లలను హీనముగా చూచుచుండడి వాడెను. అందరును నా చేష్టలకు భయపడువారే కాని, నన్నే వరును మందలింపలేకపోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దులేక పోయెడిది.దాన ధర్మములుమెట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గడనై , పాపినై అవసాన దశలో చనిపోయి ఘోరనరకములు అనుభవించి, లక్ష జన్మలముందు కుక్క నై, పది వేల జన్మలు కాకినై, ఐదు వేల జన్మలు తొండనై, ఐదు వేల జన్మలు పేడ పురుగునై, తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను జేసిన పాపములను పోగొట్టుకొన లేక పోతిని. ఇన్నాళ్ళు మీ దయ వలన స్తంభముగా నున్న నేను నరరూప మెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నాకర్మలన్నియు మీకు తెలియచేసితిని. నన్ను మన్ని౦పు ” డని వేడుకొనెను.

    ఆ మాటలాలకించిన, మునులందరు నమితాశ్చర్య మొంది ” ఆహా! కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అది యునుగాక, కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు, రాళ్ళూ, స్త౦భములు కూడా మన కండ్ల యెదుట ముక్తినొందుచున్నవి. వీటన్ని౦టి కన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీప ముంచిన మునుజునకు వైకుంట ప్రాప్తి తప్పక సిద్ధించును. అందులననే యీ స్త౦భమునకు ముక్తి కలిగిన” దని మునులు అనుకోనుచుండగా, ఆ పురుషుడా మాటలాలకించి” ముని పుంగవులారా! నాకు ముక్తి కలుగు మార్గమేదైనా గలదా? ఈ జగంబున నెల్లరుకు నెటుల కర్మ బంధము కలుగును? అది నశి౦చుటెట్లు? నా యీ సంశయము బాపు”డని ప్రార్ధించెను. అక్కడ వున్న మునిశ్వరుల౦దరును తమలో ఒకడగు అంగీరసమునితో ” స్వామి! మీరే అతని సంశయమును తీర్చ గల సమర్ధులు గాన, వివరించు”డని కోరిరి. అంత నా౦గీర సుడిట్లు చెప్పు చున్నాడు.

    ఇట్లు స్కాంద పురాణా ౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి

    షోడ శా ధ్యాయము – పద హరో రోజు పారాయణము సమాప్తం.

  • Karthika Puranam Day1 Adhyayam

    Karthika Puranam First Day Parayanam Visit www.stotraveda.com
    Karthika Puranam First Day Parayanam

    Karthika Puranam Day1 Adhyayam Story

    మొదటిరోజు పారాయణం- కార్తీక పురాణం 1వ అధ్యాయం
    Karthika Puranam First Day Parayanam – Karthika Puranam Day1 Adhyayam

    శ్రీ విఘ్నశ్వర ప్రార్థన:

    శ్లో ” వాగీశాద్యా స్సుమనస స్సర్వార్థానా ముపక్రమే !
    యంనత్వా కృతకృత్యాస్స్యు స్తంనమామి గజాననమ్ !!

    శౌనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట:

    శ్రీమదనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టియందలి-శిష్టేష్ట విశిష్టమైన శ్రీ నైమిశారణ్యమునకు సత్రేష్టి దర్శనార్థియై విచ్చేసిన సూతమహర్షిని సత్కరించి, సంతుష్టుని చేసి, స్థానికులైన శౌనకాది ఋషులాయనాను పరివేష్టించినవారై – ‘సకల పురాణగాథా ఖనీ! సూతమునీ! కలికల్మష నాశకమూ – కైవల్యదాయకమూ అయిన కార్తీకమాస మహాత్మ్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయు’మని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాసశిష్యుడైన నూతర్షి -“శౌనకాదులారా! మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహాత్వ్యాన్ని – అష్టాదశ పురాణములలోని స్కాంద, పద్మ పురాణములు రెండింటా కూడా వక్కాణించి యున్నారు. బుషి రాజైన శ్రీ వశిష్ఠుల వారిచే, రాజర్షియైన జనకునకు స్కాంద పురాణములోనూ, హేలావిలాస బాలమణియైన సత్యభామకు, లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణపరమాత్మచే పద్మపురాణములోనూ ఈ కార్తీక మహాత్వ్యము సవిస్తరముగా చెప్పబడినది. మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము. కావున – ప్రతి రోజూ నిత్యపారాయణగా – ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసికొందాము. ముందుగా స్కాందపురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహాత్వ్యాన్ని వినిపిస్తాను – వినండి’ అంటూ చెప్పసాగాడు.

    జనకుడు వశిష్ఠుని కార్తీకవ్రత ధర్మములడుగుట:

    పూర్వమొకసారి సిద్దాశ్రమములో జరుగుతున్నా యాగానికవసరమైన ద్రవ్యార్థియైన వశిష్ట మహర్షి, జనకమహారాజు యింటికి వెళ్లాడు. జనకునిచే యుక్త మర్యాదలు నందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి – ‘హే బ్రహ్మర్షీ! మీ యాగానికెంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా యిస్తాను. కాని సర్వపాపహరమైన ధర్మసూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరములోని సర్వమాసముల కంటెను కార్తీకమాస మత్యంత మహిమాన్వితమైనదనీ, తద్ర్వతాచరణము సమస్త ధర్మాలకన్నా శ్రేష్ఠతరమైనదనీ చెబుతూ వుంటారు గదా! ఆ నెలకంతటి ప్రాముఖ్యమెలా కలిగింది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మమే విధంగా అయింది” అని అడుగగా – మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు, జ్ఞాన హాసమును చేసతూ, యిలా ప్రవంచినాడు.

    వశిష్ట ప్రవచనము:

    “జనక మహారాజా! పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనేగాని, సత్వశుద్ధి కలుగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీవంటి వారికి మాత్రమే యిటువంటి పుణ్యప్రదమైనదీ, వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలనూ అణచివేసేదీ అయిన – కార్తీక మహాత్వ్యమును వినాలచే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో వుంచుకుని నీవడిగిన సంగతులను చెబుతాను, విను. ఓ విదేహా! కార్తీకమాసములో సూర్యుడు తులాసంక్రమణములో నుండగా – సహృదయతతో ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలనిస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులాసంక్రమణాదిగా గాని, శుద్ధి పాడ్యమి నుంచి గాని ప్రారంభించాలి. ముందుగా..

    శ్లో” “సర్వపాప హరంపుణ్యం వ్రతం కార్తీక సంభవం
    నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే “

    “ఓ దామోదరా! నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయుము’ అని నమస్కార పూర్వకముగా సంకల్పించుకొని, కార్తీక స్నానమారంభించాలి. కార్తీకమందలి సూర్యోదయవేళ కావేరీనదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవికాదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాల యందునా చేరుతుంది. వాపీకూప తాటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి వుంటాడు. బ్రాహ్మణుడయిన వాడు కార్తీక మాసములో నదికి వెళ్ళి హరి ధ్యానయుతుడై, కాళ్ళూ-చేతులూ కడుగుకొని, ఆచమించి, శుద్డాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానము చేయాలి. పిదప దేవతలకు, బుషులకు పితరులకు తర్పణాలను వదలాలి. అనంతరం అఘమర్షణ మంత్రజపంతో, బొటనవ్రేలి కొనతో నీటిని కెలికి, మూడు దోసెళ్ళ నీళ్ళను గట్టుమీదకు జిమ్మి, తీరము చేరాలి. చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి. దీనినే యక్షతర్పణమంటారు. అనంతరం ఒళ్లు తుడుచుకుని, పొడివి-మడివి-తెల్లనియైన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీచందనంతో 12 ఊర్థ్వపుండ్రాలను ధరించి, సంధ్యావందన గాయత్రీ జపాలనాచరించాలి. ఆ తరువాయిని – ఔపాసనము చేసి, బ్రహ్మయజ్ఞ మాచరించి, తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ-చక్రధారియైన విష్ణువును – సాలగ్రామ మందు నుంచి సభక్తిగా షోడశోపచారాలతోనూ పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణ పఠనమునుగాని, శ్రవణమును గాని ఆచరించినవాడై, స్వగృహాన్ని చేరి, దేవతార్చన, వైశ్య దేవాదులను చేసి – భోజనమును చేసి, ఆచమించి పునః పురాణ కాలక్షేపమును చేయాలి.

    సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలనన్నిటినీ విరమించుకుని- శివాలయములోగాని, విష్ణ్వాలయములోగాని యథాశక్తి దీపాలను బెట్టి అక్కడి స్వామినారాధించి, భక్ష్యభోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో వారిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసము పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు. ప్రస్తుత పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. వర్ణాశ్రమ లింగవయోభేద రహితముగా యీ వ్రతాన్ని యెవరాచరించినా సరే వాళ్లు మోక్షార్హులు కావడం నిస్సంశయము. జనకరాజా! తనకు తానుగా యీ వ్రతాన్ని ఆచరించలేకపోయినా – ఇతరులు చేస్తుండగా చూసి, అసూయరహితుడై ఆనందించే వానికి – ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణుకృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి.

    ప్రథమ అధ్యాయం సంపూర్ణము.

  • Karthika Puranam కార్తీక పురాణం

    Karthika Puranam కార్తీక పురాణం Visit www.stotraveda.com
    Karthika Puranam కార్తీక పురాణం

    Suta Maharshi came to Naimisharanyam, he was greeted by Shaunakadi, pleased and asked to bless us by listening to the auspicious Kartikamasa Mahatmya. Sutarhi Shanakadu, the essayist who forgave their wish! Bhagavan Vedavyasa Maharshi, our Guru, emphasized this greatness of Karthika – both in the Skanda and Padma Puranas in the Ashtadasha Puranas.

    This Karthika Mahatmya is narrated in detail by the great Sage Sri Vashisht, in the Skanda Purana for the Rajarshi Janakamaharaju, in the Skanda Purana for the Helavilasa Balamani, and in the Padma Purana for the Leelamanusha idol, Sri Krishnaparamatma. Due to our luck, the month of Karthika starts from today. So – as a daily recitation every day – let’s listen to Karthika Purana throughout this month. First I will listen to the great Karthika Mahatmya in the Skanda Purana – listen ‘

    Read Karthika Purana in Telugu..

    సంపూర్ణ కార్తీక మహాపురాణము

    పూర్వం నైమిశారణ్యమునకు సూతమహర్షి రాగా ఆయనను శౌనకాది మునులు

    సత్కరించి, సంతుష్టుని చేసి, కైవల్యదాయకము అయిన కార్తీకమాస మహాత్మ్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయుమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాసశిష్యుడైన సూతర్హి శానకాదులారా! మా గురువుగా రైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహాత్మ్యాన్ని – అష్టాదశ పురాణములలోని స్కాంద, పద్మ పురాణములు రెండింటా కూడా వక్కాణించి వున్నారు. ఋషి రాజైన శ్రీ వశిష్ఠుల వారిచే, రాజర్షియైన జనకునకు స్కాంద పురాణములోనూ, హేలావిలాస బాలామణియైన సత్యభామకు, లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణపరమాత్మ చే పద్మ పురాణములోనూ ఈ కార్తీక మహాత్మ్యము సవిస్తరముగా చెప్పబడినది. మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము. కావున – ప్రతి రోజూ నిత్య పారాయణగా – ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసికొందాము. ముందుగా స్కాందపురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపిస్తాను – వినండి’ అంటూ చెప్పసాగాడు

    జనకుడు వశిష్ఠుని కార్తీక ప్రత ధర్మములడుగుట:

    పూర్వమొకసారి సిద్ధాశ్రమములో జరుగుతున్నా యాగానికవసరమైన ద్రవ్యార్థియైన వశిష్ఠ మహర్షి జనకమహారాజు ఇంటికి వెళ్లాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి – ‘హే బ్రహ్మర్షీ! మీ యగానికెంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కాని సర్వపాపహరమైన ధర్మసూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరములోని సర్వమాసముల కంటెను కార్తీకమాసం అత్యంత మహఇమాన హిమాన్వితమైనదనీ, తద్క్వతాచరణము సమస్త ధర్మాల కన్నా శ్రేష్ఠతరమైనదనీ చెబుతూ వుంటారు గదా! ఆ నెలకు అంతటి ప్రాముఖ్యమెలా కలిగింది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మమే విధంగా అయింది’ అని అడుగగా –

    మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు, జ్ఞాన హాసమును చేసతూ, ఇలా ప్రవంచినాడు.

    Karthika Puranam Day1 Adhyayam Story

    Karthika Puranam Day2 Adhyayam Story

    Karthika puranam Day3 Adhyayam Story

    Karthika puranam Day4 Adhyayam Story

    Karthika puranam Day5 Adhyayam Story

    Karthika puranam Day6 Adhyayam Story

    Karthika puranam Day7 Adhyayam Story

    Karthika puranam Day8 Adhyayam Story

    Karthika puranam Day9 Adhyayam Story

    Karthika puranam Day10 Adhyayam Story

    Karthika puranam Day11 Adhyayam Story

    Karthika puranam Day12 Adhyayam Story

    Karthika puranam Day13 Adhyayam Story

    Karthika puranam Day14 Adhyayam Story

    Karthika puranam Day15 Adhyayam Story

    Karthika Puranam Day16 Adhyayam Story

    Karthika Puranam Day17 Adhyayam Story

    Karthika Puranam Day18 Adhyayam Story

    Karthika Puranam Day19 Adhyayam Story

    Karthika Puranam Day20 Adhyayam Story

    Karthika Puranam Day21 Adhyayam Story

    Karthika Puranam Day22 Adhyayam Story

    Karthika Puranam Day23 Adhyayam Story

    Karthika Puranam Day24 Adhyayam Story 

    Karthika Puranam Day25 Adhyayam Story 

    Karthika Puranam Day26 Adhyayam Story 

    Karthika Puranam Day27 Adhyayam Story 

    Karthika Puranam Day28 Adhyayam Story 

    Karthika Puranam Day29 Adhyayam Story 

    Karthika Puranam Day30 Adhyayam Story 

    Tithi Tithi Devta and Puja Phalam (Benefits)
    Karthika Suddha Padyami Lord Shiva Tejas (Glory)
    Karthika Suddha Vidiya Lord Vishnu Santhi (Peace of mind)
    Karthika suddha Tadiya Shakti Aishwarya Prapthi (Wealth)
    Karthika Suddha Chavithi Naga devatas / Lord Subrahmanyeswara Ayush and Arogya Prapthi (Longevity and Health)
    Karthika Suddha Panchami Lord Subrahmanyeswara Karya siddhi (Success in work)
    Karthika Suddha Shasthi Lord Subrahmanyeswara Santhana prapthi (Children)
    Karthika Suddha Sapthami Lord Surya (Sun) Tejas and Arogya (Glory and Health)
    Karthika Suddha Ashtami Goddess Durga Sankata nivarana (Relief from Miseries)
    Karthika Suddha Navami Pithru devatas Kutumba soukhyam (Happy family)
    Karthika Suddha Dasami Lord Ganesh /
    Gajendra moksha parayana for Lord Vishnu Relief from Obstacles
    Karthika Suddha Ekadashi Lord Shiva Karya siddhi (Success in work)
    Karthika Suddha Dwadashi Lord Vishnu Dhana Dhanya vriddhi
    (Wealth and Good life)
    Karthika Suddha Trayodashi Lord Vishnu Tejas (Glory)
    Karthika Suddha Chaturdashi Lord Kala Bhairava Akala Mruthyu Haranam (Relief from sudden Deaths)
    Karthika Suddha Pournami Lord Shiva / Lord Krishna Moksha
    Karthika Bahula Pdyami Lord Agni (Fire) Tejas (Glory)
    Karthika Bahula Vidiya Ashwani devatas (Two Doctors of Gods) Arogya (Health)
    Karthika Bahula Tadiya Gauri (Parvathi) Soubhagya (Good for Husband and Children)
    Karthika Bahula Chavithi Lord Ganesh Kutumba Saukhyam (Gives happy family life)
    Karthika Bahula Panchami Lord Subrahmanyeswara Vijaya (Victory)
    Karthika Bahula Shasthi Lord Subrahmanyeswara Santhana Vriddhi (Children)
    Karthika Bahula Sapthami Lord Surya Ayush and Arogya (Longevity and Health)
    Karthika Bahula Ashtami Ashta Lakshmi Santhi (Peace)
    Karthika Bahula Navami Goddess Durga Karya siddhi (Success everywhere)
    Karthika Bahula Dasami Ashta Dikpalakas (Indra, Agni, Yama, Nirruthi, Varuna, Vayu, Kubera, Eeshana[Shiva]) Keerthi (Fame)
    Karthika Bahula Ekadashi Kubera Dhana Prapthi (Money)
    Karthika Bahula Dwadashi Lord Vishnu Yoga Prapthi (Eternal unity)
    Karthika Bahula Trayodashi Lord Yama Vyadhi Nivarana (Relief from severe diseases)
    Karthika Bahula Chaturdashi Mruthyunjaya (A form of Lord Shiva) Arogya (Relief from diseases and Healthy body and mind)
    Karthika Bahula Amavasya Pithru Devathas Mano Dhairyam (Mental stability)

    కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు:
    1వ రోజు:
    నిషిద్ధములు : ఉల్లి , ఉసిరి , చద్ది , ఎంగిలి , చల్లని వస్తువులు
    దానములు : నెయ్యి , బంగారం
    పూజించాల్సిన దైవము : స్వథా అగ్ని
    జపించాల్సిన మంత్రము : ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా
    ఫలితము : తేజోవర్ధనము

    2వ రోజు:
    నిషిద్ధములు : తరగబడిన వస్తువులు
    దానములు :కలువపూలు , నూనె , ఉప్పు
    పూజించాల్సిన దైవము : బ్రహ్మ
    జపించాల్సిన మంత్రము : ఓం గీష్పతయే – విరించియే స్వాహా
    ఫలితము : మనః స్థిమితము

    3వ రోజు:

    నిషిద్ధములు : ఉప్పు కలిసినవి , ఉసిరి
    దానములు : ఉప్పు
    పూజించాల్సిన దైవము : పార్వతి
    జపించాల్సిన మంత్రము : ఓం పార్వత్యై – పరమేశ్వర్యై స్వాహా
    ఫలితము : శక్తి, సౌభాగ్యము

    4వ రోజు:
    నిషిద్ధములు : వంకాయ , ఉసిరి
    దానములు : నూనె , పెసరపప్పు
    పూజించాల్సిన దైవము :-విఘ్నేశ్వరుడు
    జపించాల్సిన మంత్రము : ఓం గం గణపతయే స్వాహా
    ఫలితము : సద్బుద్ధి , కార్యసిద్ధి

    5వ రోజు:
    నిషిద్ధములు : పులుపుతో కూడినవి
    దానములు : స్వయంపాకం , విసనకర్ర
    పూజించాల్సిన దైవము : ఆదిశేషుడు
    జపించాల్సిన మంత్రము : (మంత్రం అలభ్యం , ప్రాణాయామం చేయాలి)
    ఫలితము : కీర్తి

    6వ రోజు:
    నిషిద్ధములు : ఇష్టమైనవి , ఉసిరి
    దానములు : చిమ్మిలి
    పూజించాల్సిన దైవము : సుబ్రహ్మణ్యేశ్వరుడు
    జపించాల్సిన మంత్రము : ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా
    ఫలితము : సర్వసిద్ధి, సత్సంతానం , జ్ఞానలబ్ధి

    7వ రోజు:
    నిషిద్ధములు : పంటితో తినే వస్తువులు, ఉసిరి
    దానములు : పట్టుబట్టలు , గోధుమలు , బంగారం
    పూజించాల్సిన దైవము : సూర్యుడు
    జపించాల్సిన మంత్రము : ఓం. భాం. భానవే స్వాహా
    ఫలితము : తేజస్సు, ఆరోగ్యం

    8 వ రోజు:

    నిషిద్ధములు : ఉల్లి , ఉసిరి , మద్యం , మాంసం
    దానములు : తోచినవి – యథాశక్తి
    పూజించాల్సిన దైవము : దుర్గ
    జపించాల్సిన మంత్రము : ఓం – చాముండాయై విచ్చే – స్వాహా
    ఫలితము : ధైర్యం, విజయం

    9వ రోజు:
    నిషిద్ధములు : నూనెతో కూడిన వస్తువులు , ఉసిరి
    దానములు : మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు
    పూజించాల్సిన దైవము : అష్టవసువులు – పితృ దేవతలు
    జపించాల్సిన మంత్రము : ఓం అమృతాయ స్వాహా – పితృదేవతాభ్యో నమః
    ఫలితము : ఆత్మరక్షణ, సంతాన రక్షణ

    10వ రోజు:
    నిషిద్ధములు : గుమ్మడికాయ , నూనె , ఉసిరి
    దానములు : గుమ్మడికాయ , స్వయంపాకం , నూనె
    పూజించాల్సిన దైవము : దిగ్గజాలు
    జపించాల్సిన మంత్రము : ఓం మహామదేభాయ స్వాహా
    ఫలితము : యశస్సు – ధనలబ్ధి

    11వ రోజు:
    నిషిద్ధములు : పులుపు , ఉసిరి
    దానములు : వీభూదిపండ్లు , దక్షిణ
    పూజించాల్సిన దైవము : శివుడు
    జపించాల్సిన మంత్రము : ఓం రుద్రాయస్వాహా , ఓం నమశ్శివాయ
    ఫలితము : ధనప్రాప్తి , పదవీలబ్ధి

    12వ రోజు:
    నిషిద్ధములు : ఉప్పు , పులుపు , కారం , ఉసిరి
    దానములు : పరిమళద్రవ్యాలు , స్వయంపాకం , రాగి , దక్షిణ
    పూజించాల్సిన దైవము : భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు
    జపించాల్సిన మంత్రము : ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా
    ఫలితము : బంధవిముక్తి , జ్ఞానం , ధన ధాన్యాలు

    13వ రోజు:
    నిషిద్ధములు : రాత్రి భోజనం , ఉసిరి
    దానములు : మల్లె , జాజి వగైరా పూవులు , వనభోజనం
    పూజించాల్సిన దైవము : మన్మధుడు
    జపించాల్సిన మంత్రము : ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా
    ఫలితము : వీర్యవృద్ధి, సౌదర్యం

    14వ రోజు:

    నిషిద్ధములు : ఇష్టమైన వస్తువులు , ఉసిరి
    దానములు : నువ్వులు , ఇనుము , దున్నపోతు లేదా గేదె
    పూజించాల్సిన దైవము : యముడు
    జపించాల్సిన మంత్రము : ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా
    ఫలితము : అకాలమృత్యువులు తొలగుట

    15వ రోజు:
    నిషిద్ధములు : తరగబడిన వస్తువులు
    దానములు : కలువపూలు , నూనె , ఉప్పు
    జపించవలసిన మంత్రం : ‘ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః’

    16వ రోజు:
    నిషిద్ధములు : ఉల్లి , ఉసిరి , చద్ది ,ఎంగిలి , చల్ల
    దానములు : నెయ్యి , సమిధలు , దక్షిణ , బంగారం
    పూజించాల్సిన దైవము :- స్వాహా అగ్ని జపించాల్సిన
    మంత్రము : ఓం స్వాహాపతయే జాతవేదసే నమః
    ఫలితము : వర్చస్సు , తేజస్సు , పవిత్రత

    17వ రోజు:

    నిషిద్ధములు : ఉల్లి , ఉసిరి , చద్ది , ఎంగిలి , చల్ల మరియు తరిగిన వస్తువులు
    దానములు : ఔషధాలు , ధనం
    పూజించాల్సిన దైవము : అశ్వినీ దేవతలు
    జపించాల్సిన మంత్రము : ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా
    ఫలితము : సర్వవ్యాధీనివారణం ఆరోగ్యం

    18వ రోజు:
    నిషిద్ధములు : ఉసిరి
    దానములు : పులిహార , అట్లు , బెల్లం
    పూజించాల్సిన దైవము : గౌరి
    జపించాల్సిన మంత్రము : ఓం గగగగ గౌర్త్యె స్వాహా
    ఫలితము : అఖండ సౌభాగ్య ప్రాప్తి

    19వ రోజు:
    నిషిద్ధములు : నెయ్యి , నూనె , మద్యం , మాంసం , మైధునం , ఉసిరి
    దానములు : నువ్వులు , కుడుములు
    పూజించాల్సిన దైవము : వినాయకుడు
    జపించాల్సిన మంత్రము : ఓం గం గణపతయే స్వాహా
    ఫలితము : విజయం , సర్వవిఘ్న నాశనం

    20వ రోజు:
    నిషిద్ధములు : పాలుతప్ప – తక్కినవి
    దానములు : గో , భూ , సువర్ణ దానాలు
    పూజించాల్సిన దైవము : నాగేంద్రుడు
    జపించాల్సిన మంత్రము : ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం
    ఫలితము : గర్భదోష పరిహరణం, సంతానసిద్ధి

    21వ రోజు:
    నిషిద్ధములు : ఉల్లి , ఉసిరి , ఉప్పు , పులుపు , కారం
    దానములు : యథాశక్తి సమస్త దానాలూ
    పూజించాల్సిన దైవము : కుమారస్వామి
    జపించాల్సిన మంత్రము : ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా
    ఫలితము : సత్సంతానసిద్ధి , జ్ఞానం , దిగ్విజయం

    22వ రోజు:
    నిషిద్ధములు : పంటికి పనిచెప్పే పదార్ధాలు , ఉసిరి
    దానములు : బంగారం , గోధుమలు , పట్టుబట్టలు
    పూజించాల్సిన దైవము : సూర్యుడు
    జపించాల్సిన మంత్రము : ఓం సూం – సౌరయే స్వాహా , ఓం భాం – భాస్కరాయ స్వాహా
    ఫలితము : ఆయురారోగ్య తేజో బుద్ధులు.

    23వ రోజు:
    నిషిద్ధములు : ఉసిరి , తులసి
    దానములు : మంగళ ద్రవ్యాలు
    పూజించాల్సిన దైవము : అష్టమాతృకలు
    జపించాల్సిన మంత్రము : ఓం శ్రీమాత్రే నమః , అష్టమాతృ కాయ స్వాహా
    ఫలితము : మాతృరక్షణం , వశీకరణం

    24వ రోజు:
    నిషిద్ధములు : మద్యమాంస మైధునాలు , ఉసిరి
    దానములు : ఎర్రచీర , ఎర్ర రవికెలగుడ్డ , ఎర్రగాజులు , ఎర్రపువ్వులు
    పూజించాల్సిన దైవము : శ్రీ దుర్గ

    జపించాల్సిన మంత్రము : ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా
    ఫలితము : శక్తిసామర్ధ్యాలు , ధైర్యం , కార్య విజయం

    25వ రోజు:
    నిషిద్ధములు : పులుపు , చారు – వగయిరా ద్రవపదార్ధాలు
    దానములు : యథాశక్తి
    పూజించాల్సిన దైవము : దిక్వాలకులు
    జపించాల్సిన మంత్రము : ఓం ఈశావాస్యాయ స్వాహా
    ఫలితము : అఖండకీర్తి , పదవీప్రాప్తి

    26వ రోజు:
    నిషిద్ధములు : సమస్త పదార్ధాలు
    దానములు : నిలవవుండే సరుకులు
    పూజించాల్సిన దైవము : కుబేరుడు
    జపించాల్సిన మంత్రము : ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా
    ఫలితము : ధనలబ్ది , లాటరీవిజయం , సిరిసంపదలభివృద్ధి

    27వ రోజు:
    నిషిద్ధములు : ఉల్లి , ఉసిరి , వంకాయ
    దానములు : ఉసిరి , వెండి , బంగారం , ధనం , దీపాలు
    పూజించాల్సిన దైవము : కార్తీక దామోదరుడు
    జపించాల్సిన మంత్రము : ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా
    ఫలితము : మహాయోగం , రాజభోగం , మోక్షసిద్ధి

    28వ రోజు:
    నిషిద్ధములు : ఉల్లి , ఉసిరి , సొర , గుమ్మడి , వంకాయ
    దానములు : నువ్వులు , ఉసిరి
    పూజించాల్సిన దైవము : ధర్ముడు
    జపించాల్సిన మంత్రము : ఓం ధర్మాయ , కర్మనాశాయ స్వాహా
    ఫలితము : దీర్ఘకాల వ్యాధీహరణం

    29వ రోజు:
    నిషిద్ధములు : పగటి ఆహారం , ఉసిరి
    దానములు : శివలింగం , వీభూది పండు , దక్షిణ , బంగారం
    పూజించాల్సిన దైవము : శివుడు (మృత్యుంజయుడు)
    జపించాల్సిన మంత్రము : ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ,
    ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్
    ఫలితము : అకాలమృత్యుహరణం , ఆయుర్వృద్ధి , ఆరోగ్యం , ఐశ్వర్యం

    30వ రోజు:
    నిషిద్ధములు : పగటి ఆహారం , ఉసిరి
    దానములు : నువ్వులు , తర్పణలు , ఉసిరి
    పూజించాల్సిన దైవము : సర్వదేవతలు , పితృ దేవతలు
    జపించాల్సిన మంత్రము : ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యోనమః
    ఫలితము : ఆత్మస్థయిర్యం , కుటుంబక్షేమం.

  • Karthika Puranam Day4 Adhyayam

    Karthika Puranam Day4 Adhyayam Story Visit www.stotraveda.com
    Karthika Puranam Day4 Adhyayam Story

    Karthika Puranam Day4 Adhyayam Story

    నాల్గవ రోజు పారాయణం- కార్తీక పురాణం 4వ అధ్యాయం

    Karthika Puranam 4th Day Parayanam –

    కార్తీకపురాణం – 4 వ రోజు పారాయణము

    దీపారాధన మహిమ
    ఈ విధముగా వశిష్టుడు కార్తిక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొ౦దెదరని చెప్పుచుండగా జనకుడు ‘మహితపస్విత ! తమరు తెలియజేయు యితిహాసములు వినిన కొలది తనివి తిరకున్నది. కార్తీక మాసము ముఖ్యముఘ యేమేమి చేయవలయునో, యెవరి నుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు’ అని కోరగా వశిష్టుల వారు యిట్లు చెప్పదొడగిరి.

    జనకా! కార్తీక మాసమందు సర్వ సత్కార్యములనూ చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము దీని వలన మిగుల ఫలము నొ౦ద వచ్చును. సూర్యాస్తమయ మందు, అనగా, సంధ్య చీకటి పడు సమయమున శివకేశవులు సన్నిధినిగాని ప్రాకారంబున౦దు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంట ప్రాప్తి నొ౦దుదురు. కార్తిక మాసమందు హరి హరాదులు సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, విప్ప నూనెతో గాని, యేది దొరకనప్పుడు అముదముతో గాని దీపము వెలిగించి వుంచవలెను. దీపారాధన యే నూనెతో చేసిననూ మిగుల పుణ్యత్ములుగాను, భక్తి పరులగాను నగుటయేగాక అష్టైశ్వర్యములూ కలిగి శివ సన్నిధి కేగుదురు. ఇందు కొక కథ గలదు, వినుము.

    శతృజిత్ కథ:
    పూర్వము పాంచాల దేశమును పాలించు చున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి, తుదకు విసుగుజెంది తీరమున నిష్ఠతో తపమాచరించు చుం డగా నచ్చుటకు పికెదుడను ఇడీముని పుంగవుడు వచ్చి ‘ పాంచాల రాజా! నివెందుల కింత తపమాచరించు చున్నావు? ని కోరిక యేమి?’ యని ప్రశ్ని౦చగా, ‘ ఋషిపుంగవా! నాకు అష్ఠ యిశ్వర్యములు, రాజ్యము, సంపదావున్ననూ, నావ౦శము నిల్పుటకు పుత్ర సంతానము లేక, కృంగి కృశించి యీ తీర్ధ స్థానమున తపమాచరించు చున్నాను’ అని చెప్పెను. అంత మునిపున్గావుడు’ ఓయీ! కార్తిక మాసమున శివ సన్నిధిని శివ దేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన యెడల ని కోరిక నేర వేరగలదు ‘ యని చెప్పి వెడలిపోయెను.

    వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తి కై అతి భక్తి తో శివాలయమున కార్తిక మాసము నెలరొజులూ దీపారాధన చేయించి, దన ధర్మాలతో నియమను సారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు ప౦చిపెట్టుచు , విడువకుండా నెలదినములూ అటుల చేసెను. తత్పుణ్య కార్యమువలన నా రాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభ ముర్తుమున నొక కుమారుని గనెను. రాజ కుటు౦బికులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రో త్సవములు చేయించి, బ్రాహ్మణులకు దానధర్ములు జేసి, ఆ బాలునకు ‘ శత్రుజి’ యని నామకరణ ము చేయించి అమిత గరబముతో పెంచుచు౦డిరి. కార్తిక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తిక మాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను.

    రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్థ మనుడగుచు సకల శాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని, యవ్వనమునము రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లితండ్రుల గారాబము చేతను తన కంటి కింపగు స్రీలకు బలత్కరించుచు,యెదిరించిన వారిని దండి౦చుచు తన కమావా౦ఛా తిర్చుకోను చుండెను.

    తల్లితండ్రులు కూడా, తమకు లేక లేక కలిగిన కుమారుని యెడల చూచి చూడనట్లు – విని విననట్లు వుండిరి. శత్రుజి ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుదున ని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటుల తిరుగుచుండగా నొక దినమున నొక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ భార్య మిగుల రూపవతి. ఆమె అందచందములను వ ర్ణి౦ చుట మన్మదునకై ననూ శక్యము గాదు. అట్టి స్రీ క౦టపడగానే రాజకుమారుని మతి మందగించి కోయ్యబోమ్మవలె నిశ్చే ష్టుడై కమవికరముతో నామెను సమీపించి తన కమవా౦ఛ తెలియచేసేను. ఆమె కూడా నాతని సౌదర్యానికి ముద్దురాలై కులము, శిలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొనిపొయి భోగములను భావించెను.ఇట్లుఒకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత వారు ప్రతి దినము నర్ద రాత్రివేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసు కొనుచు తమ కామవా౦చ తీర్చు కొనుచు౦డిరి. ఇటుల కొంత కాలం జరిగెను. ఎటులనో యీ సంగతి ఆమె మగనికి తెలిసి, పసిగట్టి, బార్యనూ, రాజకుమారుని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచు౦డెను.

    ఇట్లుండగా కార్తిక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమును కలుసుకొనవలెనని నిర్ణయి౦చుకొని, యెవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి యెటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలు దేరి గర్భ గుడిలో దాగి యుండెను. అ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాడాలింగన మొనర్చు కొను సమయమున ‘ చీకటిగా వున్నది, దీపము౦డిన బాగుండును గదా,’ యని రాకుమారుడనగా, ఆమె తన పైట చెంగును చించి అక్కడ నున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగెంచెను. తర్వాత వారిరువురూ మహానందముతో రతి క్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా, అదే యదనుగా నామె భర్త, తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భర్యనూ, ఆ రాజకుమారున ఖండించి తనుకూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తిక శుద్ధ పౌర్ణమి, సోమవారమగుట వలనను, ఆ రోజు ముగ్గురునూ చనిపోవుట వలననూ శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకునూ – యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడకు వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు ‘ ఓ దూతలార! నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు ? కామా౦ధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన అ వ్యభిచారుల కొరకు శివ దూతలు విమానములో వచ్చుటేల? చిత్రముగా నున్నదే! అని ప్రశ్నించెను . అంత యమకింకరులు ‘ ఓ బాపడ!ఎ వరెంతటి నీచులైననూ, యీ పవిత్ర దినమున, అంగ, కార్తిక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివునిసన్నిదిన దీపం వేలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నియును నశి౦ఛిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు శివధూతలు వచ్చినారు’ అని చెప్పగా- యీ సంభాషణ మంతయు వినుచున్న రాజకుమారుడు ‘ అల యెన్నటికిని జరగనివ్వను. తప్పొప్పులు యెలాగునున్నపటికి మేము ముగ్గురమునూ ఒకే సమయములో ఒక స్థలములో మరణి౦చితిమి. కనుక ఆ ఫలము మా యందరికి వర్తి౦చ వలసినదే ‘ అని, తాము చేసిన దీపారాధన ఫలములో కొంత అ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమన మెక్కించి శివ సాన్నిద్యమునకు జేర్చిరి.

    వింటివా రాజా ! శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు పాపములు పోవుటయేగాక, కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన, కార్తిక మాసములో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్య మొ౦దుదురు.

    ఇట్లు స్కాంద పురాణా౦తర్గత త వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్యమందలి

    నాలుగో అధ్యయము- నాల్గవ రోజు పారాయణము సమాప్తం

    మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం

  • Eka Vimsati Devi Stuti Sloka

    Eka Vimsati Devi Stuti Sloka Visit www.stotraveda.com
    Eka Vimsati Devi Stuti Sloka

    Eka Vimsati Devi Stuti Sloka

    Durga Devi Stuti:

    Yaa Devi Sarva-Bhutessu Vishnumaayeti Shabditaa |
    Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai Namo Namah ||

    Meaning:
    I bow again and again to the Goddess ,To that Devi Who in All Beings is Called Vishnumaya,Salutations to Her, Salutations to Her, Salutations to Her, Salutations again and again.

    Yaa Devi Sarva-Bhutessu Chetanety-Abhidhiiyate |
    Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai Namo Namah ||

    Meaning:
    To that Devi Who in All Beings is Reflected as Consciousness,
    Salutations to Her, Salutations to Her, Salutations to Her, Salutations again and again.

    Yaa Devi Sarva-Bhutessu Buddhi-Ruupenna Samsthitaa |
    Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai Namo Namah ||

    Meaning:
    To that Devi Who in All Beings is Abiding in the Form of Intelligence,
    Salutations to Her, Salutations to Her, Salutations to Her, Salutations again and again.

    Yaa Devi Sarva-Bhutessu Nidra-Ruupenna Samsthitaa |
    Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai Namo Namah ||

    Meaning:
    To that Devi Who in All Beings is Abiding in the Form of Sleep,
    Salutations to Her, Salutations to Her, Salutations to Her, Salutations again and again.

    Yaa Devi Sarva-Bhutessu Kssudhaa-Ruupenna Samsthitaa |
    Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai Namo Namah ||

    Meaning:
    To that Devi Who in All Beings is Abiding in the Form of Hunger,
    Salutations to Her, Salutations to Her, Salutations to Her, Salutations again and again.

    Yaa Devi Sarva-Bhutessu Chaayaa-Ruupenna Samsthitaa |
    Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai Namo Namah ||

    Meaning:
    To that Devi Who in All Beings is Abiding in the Form of Shadow (of Higher Self),
    Salutations to Her, Salutations to Her, Salutations to Her, Salutations again and again.

    Yaa Devi Sarva-Bhutessu Shakti-Ruupenna Samsthitaa |
    Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai Namo Namah ||

    Meaning:
    To that Devi Who in All Beings is Abiding in the Form of Power,
    Salutations to Her, Salutations to Her, Salutations to Her, Salutations again and again.

    Yaa Devi Sarva-Bhutessu Trshnnaa-Ruupenna Samsthitaa |
    Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai Namo Namah ||

    Meaning:
    To that Devi Who in All Beings is Abiding in the Form of Thirst,
    Salutations to Her, Salutations to Her, Salutations to Her, Salutations again and again.

    Yaa Devi Sarva-Bhutessu Kshaanti-Ruupenna Samsthitaa |
    Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai Namo Namah ||

    Meaning:
    To that Devi Who in All Beings is Abiding in the Form of Forbearance,
    Salutations to Her, Salutations to Her, Salutations to Her, Salutations again and again.

    Yaa Devi Sarva-Bhutessu Jaati-Ruupenna Samsthitaa |
    Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai Namo Namah ||

    Meaning:
    To that Devi Who in All Beings is Abiding in the Form of Genus (Original Cause of Everything),
    Salutations to Her, Salutations to Her, Salutations to Her, Salutations again and again.

    Yaa Devi Sarva-Bhutessu Lajjaa-Ruupenna Samsthitaa |
    Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai Namo Namah ||

    Meaning:
    To that Devi Who in All Beings is Abiding in the Form of Modesty,
    Salutations to Her, Salutations to Her, Salutations to Her, Salutations again and again.

    Yaa Devi Sarva-Bhutessu Shaanti-Ruupenna Samsthitaa |
    Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai Namo Namah ||

    Meaning:
    To that Devi Who in All Beings is Abiding in the Form of Peace,
    Salutations to Her, Salutations to Her, Salutations to Her, Salutations again and again.

    Yaa Devi Sarva-Bhutessu Shraddhaa-Ruupenna Samsthitaa |
    Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai Namo Namah ||

    Meaning:
    To that Devi Who in All Beings is Abiding in the Form of Faith,
    Salutations to Her, Salutations to Her, Salutations to Her, Salutations again and again.

    Yaa Devii Sarva-Bhutessu Kaanti-Ruupenna Samsthitaa |
    Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai Namo Namah ||

    Meaning:
    To that Devi Who in All Beings is Abiding in the Form of Loveliness and Beauty,
    Salutations to Her, Salutations to Her, Salutations to Her, Salutations again and again.

    Yaa Devi Sarva-Bhutessu Lakshmii-Ruupenna Samsthitaa |
    Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai Namo Namah ||

    Meaning:
    To that Devi Who in All Beings is Abiding in the Form of Good Fortune,
    Salutations to Her, Salutations to Her, Salutations to Her, Salutations again and again.

    Yaa Devi Sarva-Bhutessu Vrtti-Ruupenna Samsthitaa |
    Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai Namo Namah ||

    Meaning:
    To that Devi Who in All Beings is Abiding in the Form of Activity,
    Salutations to Her, Salutations to Her, Salutations to Her, Salutations again and again.

    Yaa Devi Sarva-Bhutessu Smrti-Ruupenna Samsthitaa |
    Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai Namo Namah ||

    Meaning:
    To that Devi Who in All Beings is Abiding in the Form of Memory,
    Salutations to Her, Salutations to Her, Salutations to Her, Salutations again and again.

    Yaa Devi Sarva-Bhutessu Dayaa-Ruupenna Samsthitaa |
    Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai Namo Namah ||

    Meaning:
    To that Devi Who in All Beings is Abiding in the Form of Kindness,
    Salutations to Her, Salutations to Her, Salutations to Her, Salutations again and again.

    Yaa Devi Sarva-Bhutessu Tushtti-Ruupenna Samsthitaa |
    Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai Namo Namah ||

    Meaning:
    To that Devi Who in All Beings is Abiding in the Form of Contentment,
    Salutations to Her, Salutations to Her, Salutations to Her, Salutations again and again.

    Yaa Devi Sarva-Bhutessu Maatr-Ruupenna Samsthitaa |
    Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai Namo Namah ||

    Meaning:
    To that Devi Who in All Beings is Abiding in the Form of Mother,
    Salutations to Her, Salutations to Her, Salutations to Her, Salutations again and again.

    Yaa Devi Sarva-Bhutessu Bhraanti-Ruupenna Samsthitaa |
    Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai Namo Namah ||

    Meaning:
    To that Devi Who in All Beings is Abiding in the Form of Delusion,
    Salutations to Her, Salutations to Her, Salutations to Her, Salutations again and again.

    Indriyaannaam-Adhisstthaatrii Bhutaanaam Ca-Akhilessu |
    Yaa Bhuutessu Satatam Tasyai Vyaapti-Devyai Namo Namah ||

    Meaning:
    (Salutations) To that Devi Who Governs the Faculty of Senses of Beings in All the Worlds,
    Salutations to Her Who is the Devi Who Always Pervades all Beings.

    Citi-Ruupenna Yaa Krtsnam-Etad-Vyaapya Sthitaa Jagat |
    Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai Namo Namah ||

    Meaning:
    (Salutations to Her) Who in the Form of Consciousness Pervades This Universe and Abides in It,
    Salutations to Her, Salutations to Her, Salutations to Her, Salutations again and again.

    Eka Vimsati Devi Stuti Sloka in Telugu:

    ఏకవింశతి దేవిస్తుతి

    యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా |
    నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౬ ||


    యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే |
    నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౭ ||

    యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా |
    నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౮ ||

    యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా |
    నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౯ ||

    యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా |
    నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౦ ||

    యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా |
    నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౧ ||

    యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా |
    నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౨ ||

    యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా |
    నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౩ ||

    యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా |
    నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౪ ||

    యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా |
    నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౫ ||

    యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా |
    నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౬ ||

    యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా |
    నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౭ ||

    యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా |
    నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౮ ||

    యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా |
    నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౯ ||

    యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా |
    నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౦ ||

    యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా |
    నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౧ ||

    యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా |
    నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౨ ||

    యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా |
    నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౩ ||

    యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా |
    నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౪ ||

    యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా |
    నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౫ ||

    యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా |
    నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౬ ||

    ఇంద్రియాణామధిష్ఠాత్రీ భూతానాం చాఖిలేషు యా |
    భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దేవ్యై నమో నమః || ౨౭ ||

    చితిరూపేణ యా కృత్స్నమేతద్ వ్యాప్య స్థితా జగత్ |
    నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౮ ||

  • Durga Devi Aarti Songs Lyrics

    Durga Devi Aarti Songs Lyrics Visit www.stotraveda.com
    Durga Devi Aarti Songs Lyrics

    Durga Devi Aarti Songs Lyrics

    Durga Devi Aarti Songs Lyrics/ Durga Maa Aarti Lyrics in English:

    Durga Devi Aarti

    ॥ Aarti Shri Amba Ji ॥

    Jai Ambe Gauri,Maiya Jai Shyama Gauri।
    Tumako Nishidina Dhyawata,Hari Brahma Shivari॥

    Jai Ambe Gauri

    Manga Sindura Virajata,Tiko Mrigamada Ko।
    Ujjavala Se Dou Naina,Chandravadana Niko॥Jai Ambe Gauri

    Kanaka Samana Kalewara,Raktambara Rajai।
    Raktapushpa Gala Mala,Kanthana Para Sajai॥

    Jai Ambe Gauri

    Kehari Vahana Rajata,Khadga Khapparadhari।
    Sura-Nara-Muni-Jana Sevata,Tinake Dukhahari॥

    Jai Ambe Gauri

    Kanana Kundala Shobhita,Nasagre Moti।
    Kotika Chandra Diwakara,Sama Rajata Jyoti॥

    Jai Ambe Gauri

    Shumbha-Nishumbha Bidare,Mahishasura Ghati।
    Dhumra Vilochana Naina,Nishidina Madamati॥

    Jai Ambe Gauri

    Chanda-Munda Sanhare,Shonita Bija Hare।
    Madhu-Kaitabha Dou Mare,Sura Bhayahina Kare॥

    Jai Ambe Gauri

    Brahmani RudraniTuma Kamala Rani।
    Agama-Nigama-Bakhani,Tuma Shiva Patarani॥

    Jai Ambe Gauri

    Chausatha Yogini Mangala Gavata,Nritya Karata Bhairun।
    Bajata Tala Mridanga,Aru Bajata Damaru॥

    Jai Ambe Gauri

    Tuma Hi Jaga Ki Mata,Tuma Hi Ho Bharata।
    Bhaktana Ki Dukha Harata,Sukha Sampatti Karata॥

    Jai Ambe Gauri

    Bhuja Chara Ati Shobhita,Vara-Mudra Dhari।
    Manavanchhita Phala Pavata,Sevata Nara-Nari॥

    Jai Ambe Gauri

    Kanchana Thala Virajata,Agara Kapura Bati।
    Shrimalaketu Mein Rajata,Koti Ratana Jyoti॥

    Jai Ambe Gauri

    Shri Ambeji Ki Aarti,Jo Koi Nara Gavai।
    Kahata Shivananda Swami,Sukha Sampatti Pavai॥

    Jai Ambe Gauri

    Durga Devi Aarti Songs Lyrics/ Durga Ma Aarti Lyrics in Sanskrit/Devanagari/Hindi:

    जय अम्बे गौरी, मैया जय श्यामा गौरी ।
    तुमको निशदिन ध्यावत, हरि ब्रह्मा शिवरी ॥ॐ जय अम्बे गौरी॥

    मांग सिंदूर विराजत, टीको मृगमद को ।
    उज्ज्वल से दोउ नैना, चंद्रवदन नीको ॥

    ॐ जय अम्बे गौरी॥

    कनक समान कलेवर, रक्ताम्बर राजै ।
    रक्तपुष्प गल माला, कंठन पर साजै ॥

    ॐ जय अम्बे गौरी॥

    केहरि वाहन राजत, खड्ग खप्पर धारी ।
    सुर-नर-मुनिजन सेवत, तिनके दुखहारी ॥

    ॐ जय अम्बे गौरी॥


    कानन कुण्डल शोभित, नासाग्रे मोती ।
    कोटिक चंद्र दिवाकर, सम राजत ज्योती ॥

    ॐ जय अम्बे गौरी॥

    शुंभ-निशुंभ बिदारे, महिषासुर घाती ।
    धूम्र विलोचन नैना, निशदिन मदमाती ॥

    ॐ जय अम्बे गौरी॥

    चण्ड-मुण्ड संहारे, शोणित बीज हरे ।
    मधु-कैटभ दोउ मारे, सुर भयहीन करे ॥

    ॐ जय अम्बे गौरी॥

    ब्रह्माणी, रूद्राणी, तुम कमला रानी ।
    आगम निगम बखानी, तुम शिव पटरानी ॥

    ॐ जय अम्बे गौरी॥

    चौंसठ योगिनी मंगल गावत, नृत्य करत भैरों ।
    बाजत ताल मृदंगा, अरू बाजत डमरू ॥

    ॐ जय अम्बे गौरी॥

    तुम ही जग की माता, तुम ही हो भरता,
    भक्तन की दुख हरता । सुख संपति करता ॥

    ॐ जय अम्बे गौरी॥

    भुजा चार अति शोभित, खडग खप्पर धारी ।
    मनवांछित फल पावत, सेवत नर नारी ॥

    ॐ जय अम्बे गौरी॥

    कंचन थाल विराजत, अगर कपूर बाती ।
    श्रीमालकेतु में राजत, कोटि रतन ज्योती ॥

    ॐ जय अम्बे गौरी॥

    श्री अंबेजी की आरति, जो कोइ नर गावे ।
    कहत शिवानंद स्वामी, सुख-संपति पावे ॥

    ॐ जय अम्बे गौरी॥

    जय अम्बे गौरी, मैया जय श्यामा गौरी ।

    Durga Devi Harathi Patalu/Songs in Telugu:

    Durga Devi Aarti Songs Lyrics in Telugu-  శ్రీ దేవీ మంగళాష్టకము

    శ్రీ విద్యా శివనామభాగనిలయా కామేశ్వరీ సుందరీ
    సూక్ష్మస్థూలదశావిశేషిత జగద్రూపేణ విద్యోతినీ
    స్వాంశీభూత సమస్తభూత హృదయాకాశ స్వరూపా శివా
    లోకాతీత ఏదాశ్రయా శివసతీ కుర్యా త్సదా మంగళమ్‌ 1

    దుర్గా భర్గమనోహరా సురనరైః సంసేవ్యమావా సదా
    దైత్యానాం సువినాశినీ చ మహతాం సాక్షాత్‌ ఫలాదాయినీ
    స్వప్నేదర్శనదాయినీ పరముదం సంధాయినీ శాంకరీ
    పాపఘ్నీ శుభకారిణీ సుముదితా కుర్యా త్సదా మంగళమ్‌ 2

    బాలా ఙాలార్కవర్ణాడ్యా సౌవర్ణాంవరధారిణీ
    చండికా లోకకల్యాణీ కుర్యాన్మే మంగళం సదా 3

    కాళికా భీకరాళారా కలిదోష నివారిణీ
    కామ్యప్రదాయినీశైవీ కుర్యాన్మే మంగళం సదా 4

    హిమవత్పుత్రికా గౌరీ కైలాసాద్రి విహారిణీ
    పార్వతీ శివవామాంగీ కుర్యాన్మే మంగళం సదా 5

    వాణీ వీణాగానలోలా విధిపత్నీ స్మితాననా
    జ్ఞానముద్రాంకితకరా కుర్యాన్మే మంగళం సదా 6

    మహాలక్ష్మీః ప్రసన్నాస్యా ధనధాన్య వివర్ధినీ
    వైష్టవీ పద్మజా దేవీ కుర్యాన్మే మంగళం సదా 7

    శుంభుప్రియా చంద్రరేఖా సంశోభిత లలాటకా
    నానారూప ధరాచైకా కుర్యాన్మే మంగళం సదా 8

    మంగళాష్టక మేతద్ది పఠతాం శృణ్వతాం సదా
    దద్యాద్దేవీ శుభం శీఘ్ర మాయురారోగ్యభాగ్యకమ్‌ 9

  • Lalitha Devi Mangala Harathi

    Devi Mahatmyam Mangala Harathi Stotram | Lalitha Devi Mangala Harathi Visit www.stotraveda.com
    Devi Mahatmyam Mangala Harathi Stotram | Lalitha Devi Mangala Harathi

    Devi Mahatmyam Mangala Harathi Stotram 

    Lalitha Devi Mangala Harathi in Telugu:
    – Devi Mahatmyam Mangala Harathi Stotram -Navadurga Harathulu 

    Devi Mahatmyam Mangala Harathi Stotram 

    శ్రీ చక్ర పుర మందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకిదె నీరాజనం
    బంగారుతల్లికిదె నీరాజనం

    బంగారు హారాలు సింగారమొలకించు అంబికా హృదయకు నీరాజనం
    బంగారుతల్లికిదె నీరాజనం

    శ్రీ గౌరి శ్రీమాత శ్రీమహారాఙ్ఞి శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం
    బంగారుతల్లికిదె నీరాజనం

    కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కవకంబు కాసులతో నీరాజనం
    బంగారుతల్లికిదె నీరాజనం

    పాశాంకుశ పుష్ప బాణచాపధరికి పరమ పావనమైన నీరాజనం
    బంగారుతల్లికిదె నీరాజనం

    కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసె కల్యాణ సూత్రమ్ము నీరాజనం
    బంగారుతల్లికిదె నీరాజనం

    చిరునవ్వు లొలికించు శ్రీదేవి అధరాన శతకో టి నక్షత్ర నీరాజనం
    బంగారుతల్లికిదె నీరాజనం

    కలువరేకుల వంటి కన్నుల తల్లి శ్రీరాజరాజేశ్వరికి నీరాజనం
    బంగారుతల్లికిదె నీరాజనం

    ముదమార మోమున ముచ్చటగ దరియించు కస్తూరి కుంకుమకు నీరాజనం
    బంగారుతల్లికిదె నీరాజనం

    చంద్రవంకనికిదె నీరాజనం

    శుక్రవారమునాడు శుభములొసగే తల్లి శ్రీ మహాలక్ష్మి కిదె నీరాజనం
    బంగారుతల్లికిదె నీరాజనం

    ముగ్గురమ్మలకును మూలమగు పెద్దమ్మ ముత్యాలతో నిత్య నీరాజనం
    బంగారుతల్లికిదె నీరాజనం

    శృంగేరి పీఠాన సుందరాకారిణి సౌందర్యలహరికిదె నీరాజనం
    బంగారుతల్లికిదె నీరాజనం

    సకల హృదయాలలో బుద్ధిప్రేరణ జేయు తల్లి గాయత్రికిదె నీరాజనం
    బంగారుతల్లికిదె నీరాజనం

    దాన నరసింహుని దయతోడ రక్షించు దయగల తల్లికిదె నీరాజనం
    ఆత్మార్పణతో నిత్య నీరాజనం

    శ్రీ చక్ర పుర మందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకిదె నీరాజనం
    బంగారుతల్లికిదె నీరాజనం

    Lalitha Devi Mangala Harathi-Devi Mahatmyam Mangala Harathi Stotram Lyrics in English:

    sri cakra pura mandu sthiramaina sri lalita pasidi padalakide nirajanam
    bangarutallikide nirajanam

    bangaru haralu singaramolakincu ambika hrdayaku nirajanam
    bangarutallikide nirajanam

    sri gauri srimata srimaharanni sri simhasanesvariki nirajanam
    bangarutallikide nirajanam

    kalpataruvai mammu kapadu karamulaku kavakambu kasulato nirajanam
    bangarutallikide nirajanam

    pasankusa puspa banacapadhariki parama pavanamaina nirajanam
    bangarutallikide nirajanam

    kanti kiranalato kaliki medalo merise kalyana sutrammu nirajanam
    bangarutallikide nirajanam

    cirunavvu lolikincu sridevi adharana satako ṭi naksatra nirajanam
    bangarutallikide nirajanam

    kaluvarekula vanṭi kannula talli srirajarajesvariki nirajanam
    bangarutallikide nirajanam

    mudamara momuna muccaṭaga dariyincu kasturi kunkumaku nirajanam
    bangarutallikide nirajanam

    candravankanikide nirajanam

    sukravaramunadu subhamulosage talli sri mahalaksmi kide nirajanam
    bangarutallikide nirajanam

    muggurammalakunu mulamagu peddamma mutyalato nitya nirajanam
    bangarutallikide nirajanam

    srngeri piṭhana sundarakarini saundaryalaharikide nirajanam
    bangarutallikide nirajanam

    sakala hrdayalalo buddhiprerana jeyu talli gayatrikide nirajanam
    bangarutallikide nirajanam

    dana narasimhuni dayatoda raksincu dayagala tallikide nirajanam
    atmarpanato nitya nirajanam

    sri cakra pura mandu sthiramaina sri lalita pasidi padalakide nirajanam
    bangarutallikide nirajanam

    Lalitha Devi Mangala Harathi-Devi Mahatmyam Mangala Harathi Stotram Lyrics in Hindi/Sanskrit/Devanagari:


    श्री चक्र पुर मन्दु स्थिरमैन श्री ललित पसिडि पादालकिदे नीराजनं
    बङ्गारुतल्लिकिदे नीराजनं

    बङ्गारु हारालु सिङ्गारमोलकिञ्चु अम्बिका हृदयकु नीराजनं
    बङ्गारुतल्लिकिदे नीराजनं

    श्री गौरि श्रीमात श्रीमहाराज्ञि श्री सिंहासनेश्वरिकि नीराजनं
    बङ्गारुतल्लिकिदे नीराजनं

    कल्पतरुवै मम्मु कापाडु करमुलकु कवकम्बु कासुलतो नीराजनं
    बङ्गारुतल्लिकिदे नीराजनं

    पाशाङ्कुश पुष्प बाणचापधरिकि परम पावनमैन नीराजनं
    बङ्गारुतल्लिकिदे नीराजनं

    कान्ति किरणालतो कलिकि मेडलो मेरिसे कल्याण सूत्रम्मु नीराजनं
    बङ्गारुतल्लिकिदे नीराजनं

    चिरुनव्वु लोलिकिञ्चु श्रीदेवि अधरान शतको टि नक्षत्र नीराजनं
    बङ्गारुतल्लिकिदे नीराजनं

    कलुवरेकुल वण्टि कन्नुल तल्लि श्रीराजराजेश्वरिकि नीराजनं
    बङ्गारुतल्लिकिदे नीराजनं

    मुदमार मोमुन मुच्चटग दरियिञ्चु कस्तूरि कुङ्कुमकु नीराजनं
    बङ्गारुतल्लिकिदे नीराजनं

    चन्द्रवङ्कनिकिदे नीराजनं

    शुक्रवारमुनाडु शुभमुलोसगे तल्लि श्री महालक्ष्मि किदे नीराजनं
    बङ्गारुतल्लिकिदे नीराजनं

    मुग्गुरम्मलकुनु मूलमगु पेद्दम्म मुत्यालतो नित्य नीराजनं
    बङ्गारुतल्लिकिदे नीराजनं

    शृङ्गेरि पीठान सुन्दराकारिणि सौन्दर्यलहरिकिदे नीराजनं
    बङ्गारुतल्लिकिदे नीराजनं

    सकल हृदयाललो बुद्धिप्रेरण जेयु तल्लि गायत्रिकिदे नीराजनं
    बङ्गारुतल्लिकिदे नीराजनं

    दान नरसिंहुनि दयतोड रक्षिञ्चु दयगल तल्लिकिदे नीराजनं
    आत्मार्पणतो नित्य नीराजनं

    श्री चक्र पुर मन्दु स्थिरमैन श्री ललित पसिडि पादालकिदे नीराजनं

    बङ्गारुतल्लिकिदे नीराजनं

  • Karthika Puranam Day23 Adhyayam

    Karthika Puranam 23rd Day Parayanam Visit www.stotraveda.com
    Karthika Puranam 23rd Day Parayanam

    Karthika Puranam Day23 Adhyayam Story

    ఇరవైమూడో రోజు పారాయణం-కార్తీక పురాణం 23వ అధ్యాయం

    Karthika Puranam 23rd Day Parayanam- Karthika Puranam Day23 Adhyayam

    కార్తీకపురాణం – 23వ రోజు పారాయణము
    శ్రీ రంగక్షేత్రమున పురంజయుడు ముక్తినొందుట

    అగస్త్యుడు మరల అత్రిమహర్షిని గాంచి “ఓ మునిపుంగవా! విజయమందిన పురంజయుడు యేమిచేసెనో వివరింపు”మని యడుగగా అత్రిమహాముని యిట్లు చెప్పిరి – కు౦భసంభవా! పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము, శత్రుశేషము వుండకూడదని తెలిసి, తన శత్రురాజుల నందరినీ ఓడించి నిరాటకంముగా తన రాజ్యమును యేలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావమువలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షాతత్పరుడు, నిత్యాన్నదాత, భక్తప్రియవాది, తేజోవంతుడు, వేదవేదా౦గవేత్తయై యుండను. మరియు అనేక శత్రువులను జయించి దశదిశలా తన యఖ౦డ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై, విష్ణు సేవాధురంధరుడై, కార్తీకవ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కుడా జయించినవాడై యుండెను. ఇన్ని యేల? అతడిప్పుడు విష్ణుభక్తాగ్రేసరుడు, సదాచారసత్పురుషులలో వుత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తిలేదు. ఏ దేశమున, యే కాలమున, యే క్షేత్రమున యే విధముగా శ్రీ హరిని పూజించిన కృతార్దుడనగుదునా? యని విచారించుచుండగా ఒకానొకనాడు అశరీరవాణి “పురంజయా! కావేరీతీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీవచటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు” అని పలికెను.

    అంతట పురంజయుడు ఆ యశిరీరవాణి వాక్యములు విని, రాజ్యభారమును మంత్రులకు అప్పగించి, సపరివారముగా బయలుదేరి మార్గమధ్యముననున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్యనదులలో స్నానము చేయుచు, శ్రీరంగమును జేరుకొనెను. అక్కడ కావేరీనది రెండుపాయలై ప్రవహించుచుండగా మధ్యనున్నశ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవళించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశమొంది, చేతులు జోడించి, “దామోదరా! గోవిందా! గోపాలా! హరే! కృష్ణా! వాసుదేవా! అనంతా! అచ్యుతా! ముకుందా! పురాణపురుషా! హృషికేశా! ద్రౌపదీమాన సంరక్షకా! దీనజన భక్తపోషా! ప్రహ్లాదవరదా! గరుడధ్వజా ! కరివరదా! పాహిమాం! పాహమాం! రక్షమాం రక్షమాం! దాసోహం పరమాత్మ దాసోహం” యని విష్ణు సోత్త్రమును పఠించి, కార్తీక మాసమంతయు శ్రీ రంగమునందే గడిపి తదుపరి సపరి వారముగా అయోధ్యకు బయలుదేరును. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల, మహిమవలన అతని రాజ్యమందలి జనులందరూ సిరిసంపదలతో, పాడిపంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండిరి.

    అయోధ్యానగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహాగోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్యా నగరమందలి వీరులు యుద్దనేర్పరులై, రాజనీతి గలవారై, వైరిగర్భ నిర్బేదకులై, నిరంతరము విజయశశీలురై, అప్రమత్తులై యుండిరి. ఆ నగర మందలి అంగనామణులు హంసగజగామినులూ, పద్మ పత్రాయత లోచనులూనై విపుల శోణీత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మద్యత్వము; సింహకుచపీనత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతికలిగి యుండిరి.

    ఆ నగర మందలి వెలయాండ్రు నృత్యగీత సంగీతాది కళావిశారదలై, ప్రౌఢలై, వయోగుణ రూప లావణ్య సంపన్నలై, సదా మోహన హాసాలంకృత ముఖిశోభితలై యుండిరి. ఆ పట్టణకులాంగనలు పతిశుశ్రూషా పారాయణలై సద్గుణాలంకార భూషితలై చిద్విలాస హసోల్లాస పులకాంకిత శరీరలై యుండిరి.

    పురంజయుడు శ్రీరంగక్షేత్రమున కార్తీకమాస వ్రతమాచరించి సతీసమేతుడై యింటికి సుఖముగా జేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్యతూర్య ధ్వనులతో యెదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంత:పురమును ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయుణుడై రాజ్యపాలన మొనర్చుచు, కొంతకాలము గడిపి వృద్దాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వాదులుకొని, తన కుమారునికి రాజ్యభారమువప్పిగించి పట్టాభిషిక్తుని చేసి తాను వాన ప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకేగెను. అతడా వానప్రస్థాశ్రమమందు కూడా యేటేటా విధివిధానముగ కార్తీక వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునుకు పోయెను. కావున, ఓ యగస్త్యా! కార్తీకవ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి, చదివినపుడు వినువారికి కూడా వైకుంఠప్రాప్తి కలుగును.

    స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీకమహత్మ్య మందలి

    త్రయోవింశోధ్యాయము – ఇరవైమూడో రోజు పారాయణము సమాప్తము.

  • Karthika Puranam Day22 Adhyayam

    Karthika Puranam Day22 Adhyayam Story Visit www.stotraveda.com
    Karthika Puranam Day22 Adhyayam Story

    Karthika Puranam Day22 Adhyayam Story

    ఇరవై రెండవో రోజు పారాయణం-కార్తీక పురాణం 22వ అధ్యాయం
    Karthika Puranam 22nd Day Parayanam

    కార్తీకపురాణం – 22వ రోజు పారాయణము

    పురంజయుడు కార్తీక పౌర్ణమీ వ్రతము చేయుట

    మరల అత్రి మహాముని అగస్త్యునకిట్లు చెప్పదొడగెను.పురంజయుడు వశిష్టుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి, శ్రీహరిని గానముచేసి, సాష్టాంగ నమస్కారము చేసి, సూర్యోదయముకాగానే నదికిపోయి, స్నానమాచరించి తన గృహమున కరిగెను. అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ద బ్రాహ్మణుడు – మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమిపించి “రాజా! విచారింపకుము నీవు వెంటనే చెల్లాచెదురైయున్న నీ సైన్యమును కూడాదీసుకొని, యుద్ద సన్నద్ధుడై శత్రురాజులతో పోరు సల్పుము, నీ రాజ్యము నీకు దక్కును”, అని దీవించి అదృశ్యుడయ్యెను. “ఈతడెవరో మహాను భావునివలె నున్నాదు, అని, ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధసన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోథముతో నున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి. అదియును గాక, శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా!

    ఆ యుద్దములో కా౦భోజాది భూపాలురు ఓడిపోయి “పురంజయా రక్షింపుము రక్షింపు”మని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులయిన వారికి శత్రుభయము కలుగుతుందా! విషం త్రాగినాను అమృతమే యగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని యివ్వగా ‘శ్రీ హరి’ అని ప్రార్ధించి త్రాగగా అమృతమైనది గదా! శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు వున్నంత వరకును ధృవుడు చిరంజీవియే గదా!

    హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరచును. కార్తీకమాసమంతయు నదీ స్నానమొనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారధన చేసినచో సర్వవిపత్తులును పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి యే జాతి వారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును. వేదాధ్యయన మొనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠానతత్పరుడైన వైష్ణవోత్తముని హృదయపద్మమున భగవంతుడు౦డును. సంసారసాగర ముత్తరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహాఋషులు – మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తినొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడుచుండును. ఎవరికైనను శక్తి లేని యెడల వారు తమ ద్రవ్యమును వెచ్చించియైనను మరి యొకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు, భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదాసంపదలనొసంగి కాపాడుచుండెను.

    శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, వెయ్యి సూర్యభగవానుల తేజస్సు గలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, పద్నాలుగు లోకములను తన కుక్షియందిడుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీమహావిష్ణువునకు అతిప్రియమైన కార్తీక మాసవ్రతమును భక్తి శ్రద్దలతో ఎవరు చేయుదురో వారి యింట శ్రీమహావిష్ణువు లక్ష్మి సమేతుడై వెలయగలడు. ఆ యిల్లు సిరిసంపదలతో కలకలలాడును. కార్తీకమాసములో శుచియై పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము.

    ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీకమహాత్మ్య మందలి

    ద్వావి౦శోధ్యాయము – ఇరవై రెండవో రోజు పారాయణము సమాప్తము.

  • Karthika Puranam Day11 Adhyayam

    Karthika Puranam Day11 Adhyayam Visit www.stotraveda.com
    Karthika Puranam Day11 Adhyayam

    Karthika Puranam Day11 Adhyayam Story

    పదకొండొవ రోజు పారాయణం-కార్తీక పురాణం 11వ అధ్యాయం

    Karthika Puranam 11th Day Parayanam- Karthika Puranam Day11 Adhyayam

    కార్తీకపురాణం – 11వ రోజు పారాయణముమంథరుడు – పురాణ మహిమ

    తిరిగి వశిష్టుడు ఇలా చెబుతున్నారు… ”ఓ జనక మహారాజా! ఈ కార్తిక మాస వ్రతం మహత్యాన్ని గురించి ఎన్నో ఉదాహరణలు చెప్పాను. ఇంకా దీని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. ఈ నెలలో విష్ణుదేవుడిని అవిసె పూలతో పూజించినట్లయితే.. చాంద్రాయణ వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది. విష్ణు అర్చన తర్వాత పురాణ పఠనం చేసినా, చేయించినా, విన్నా, వినిపించినా… అలాంటి వారు వైకుంఠాన్ని పొందుతారు. దీన్ని గురించిన మరో ఇతిహాసాన్ని చెబుతాను. సావధానంగా విను… అని ఇలా చెప్పసాగారు…

    పూర్వము కళింగ రాజ్యంలో మంధరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఇతరుల ఇళ్లలో వంటలు చేస్తూ, అక్కడే భోజనం చేస్తూ, మద్యమాంసాలను సేవిస్తూ… తక్కువ జాతి సాంగత్యంలో గడపసాగాడు. ఆ కారణంగా స్నాన, జప, దీపారాధనలను పాటించకుండా, దురాచారుడిగా తయారయ్యాడు. అయితే… ఆయన భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతవంతురాలు, భర్త ఎంతటి దుర్మార్గుడైనా, పతియే ప్రత్యక్ష దైవమనే ధర్మాన్ని పాటించేది. విసుగు చెందక సకల ఉపచారాలు చేసేది. పతివ్రతాధర్మాన్ని నిర్వర్తిస్తుండేది.

    మంథరుడు ఇతరుల ఇళ్లలో వంటలు చేస్తూ, ఆదాయం సరిపోక వర్తకం కూడా చేయసాగాడు. అఖరికి దానివల్ల కూడా పొట్టగడవకపోవడంతో దొగతనాలు చేయడం ఆరంభించాడు. దారికాచి బాటసారుల్ని బెదిరించి, వారిదగ్గర ఉన్న ధనం, వస్తువులను అపహరించి జీవించసాగాడు.

    ఒక రోజు ఒక బ్రాహ్మణుడు అడవిదారిలో పోతుండగా… అతన్ని భయపెట్టి, కొంత ధనాన్ని అపహరించాడు. ఆ సమయంలో ఇద్దరిమధ్యా ముష్టియుద్ధం జరిగింది. అంతలో అక్కడకు ఇంకో కిరాతకుడు వచ్చి, ధనాశతో వారిద్దరినీ చంపేసి, ధనాన్ని తీసుకెళ్లాడు. అంతలో అక్కడ ఒక గుహ నుంచి పులి గాండ్రించుకుంటూ కిరాతకుడిపైన పడింది. కిరాతకుడు దాన్ని కూడా వధించాడు. అయితే పులి చావడానికి ముందు పంజాతో బలంగా కొట్టిన దెబ్బ ప్రభావం వల్ల కొంతసేపటికి తీవ్ర రక్తస్రావంతో అతనుకూడా చనిపోయాడు. కొద్దిక్షణాల వ్యవధిలో చనిపోయిన బ్రాహ్మడు, మంథరుడు, కిరాతకుడు నరకానికి వెళ్లారు. హత్యల కారణంగా వారంతా నరకంలో నానావిధాలైన శిక్షలను అనుభవించారు.

    మంధరుడు చనిపోయిన రోజు నుంచి అతని భార్య నిత్యం హరినామ స్మరణం చేస్తూ సదాచారవర్తినిగా భర్తను తలచుకుంటూ కాలం గడిపింది. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక రుషి రాగా… ఆమె గౌరవంగా అర్ఘ్యపాద్యాలను పూజించి ”స్వామీ! నేను దీనురాలను, నాకు భర్తగానీ, సంతతిగానీ లేదు. నేను సదా హరి నామాన్ని స్మరిస్తూ జీవిస్తున్నాను. నాకు మోక్షం లభించే మార్గం చూపండి” అని ప్రార్థించింది. ఆమె వినమ్రత, ఆచారాలకు సంతసించిన ఆ రుషి ”అమ్మా… ఈరోజు కార్తీక పౌర్ణమి. చాలా పవిత్రమైనది. ఈ రోజును వృథాచేయకు. ఈ రాత్రి దేవాలయంలో పురాణాలు చదువుతారు. నేను చమురుతీసుకుని వస్తాను. నువ్వు ప్రమిదలు, వత్తులు తీసుకుని రా. దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలితాన్ని నీవు అందుకుంటావు” అని చెప్పారు. దానికి ఆమె సంతసించి, వెంటనే దేవాలయానికి వెళ్లి శుభ్రం చేసి, గోమయంతో అలికి, ముగ్గులు పెట్టి, తానే స్వయంగా వత్తి చేసి, రెండు వత్తులు వేసి, రుషి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి, దీపారాధన చేసింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లి తనకు కనిపించిన వారిని ”ఈ రోజు ఆలయంలో జరిగే పురాణ పఠనానికి తప్పకుండా రావాలి” అని ఆహ్వానించింది. ఆమె కూడా రాత్రి పురాణం విన్నది. ఆ తర్వాత కొంతకాలం విష్ణునామస్మరణతో జీవించి, మరణించింది.

    ఆమె పుణ్యాత్మురాలవ్వడం వల్ల విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠానికి తీసుకెళ్లారు. అయితే ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వల్ల కొంచెం దోషం కలిగింది. కొద్ది నిమిషాలు నరకంలో గడపాల్సి వచ్చింది. దీంతో మార్గమధ్యంలో యమలోకానికి తీసుకెళ్లారు. అక్కడ నరకంలో మరో ముగ్గురితో కలిసి బాధపడుతున్న భర్తను చూసి ఒక్క క్షణం దు:ఖించింది. విష్ణుదూతలతో ” ఓ విష్ణుదూతలారా! నా భర్త, ఆయనతోపాటు మరో ముగ్గురు నరకబాధలు అనుభవిస్తున్నారు. వారిని ఉద్దరించడమెలా?” అని కోరగా… విష్ణుదూతలు ఇలా చెబుతున్నారు.. ”అమ్మా.. నీ భర్త బ్రాహ్మణుడై కూడా స్నానసంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండోవ్యక్తి కూడా బ్రాహ్మనుడే అయినా… ధనాశతో ప్రాణమిత్రుడిని చంపి ధనం అపహరించాడు. మూడోవాడు పులిజన్మను పూర్తిచేసుకున్నవాడు కాగా… నాలుగో కిరాతకుడు. అతను అంతకు ముందు జన్మలో బ్రాహ్మణుడే” అని చెప్పారు. అతను అనేక అత్యాచారాలు చేసి, ద్వాదశిరోజున మధుమాంసాలను భక్షించి పాతకుడయ్యాడు. అందుకే వీరంతా నరకబాధలు పడుతున్నారని చెప్పారు.

    విష్ణుదూతలు చెప్పినది విని ఆమె దు:ఖించి ”ఓ పుణ్యాత్ములారా! నా భర్తతోపాటు మిగతా ముగ్గురిని కూడా ఉద్దరించే మార్గముందా?” అని ప్రార్థించింది. దీంతో విష్ణుదూతలు ”అమ్మా! కార్తీక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తి చేసిన పుణ్యఫలాన్ని ధారపోస్తే వారు నరక బాధల నుంచి విముక్తులవుతారు” అని చెప్పారు. దీంతో ఆమె అదేవిధంగా తన పుణ్యఫలాన్ని ధారపోసింది. దీంతో వారంతా ఆమెతో కలిసి మిగతా నలుగురూ వైకుంఠానికి విమానమెక్కి విష్ణుదూతలతో బయలుదేరారు.

    ”ఓ జనక మహారాజా! చూశావా? కార్తీకమాసంలో పురాణాలు వినడం, దీపం వెలిగించడం వంటి ఫలితాలు ఎంతటి పుణ్యాన్నిస్తాయో?” అని వశిష్టులు మహారాజుకు చెప్పారు.

    ఇది స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి పదకొండొవ అధ్యాయము


    పదకొండొవ రోజు పారాయణము సమాప్తము.

    మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం